Jump to content

భవనీలే బైండ్ల వారి కళలు

వికీపీడియా నుండి
ముఖ్యంగా తెలంగాణా జానపద కళారూపాలలో శసివ మతాన్ని ప్రబోధించే, శక్తి స్వరూపాన్ని ఆరాధించేవి, గ్రామ దేవతల్ని పూజించేవీ ఎన్నో ఉన్నాయి. తెలంగాణాలో రేణుకా ఎల్లమ్మ, మూహురమ్మ, పోశమ్మ, బతకమ్మ, మహంహాళీ, అంకమ్మ మొదలైన ఎందస్రో దేవతలు ఒంటింటా వాడవాడలా ఉన్నారు. ఆ దేవతల్ని ఎంతగానో పూజిస్తారు. ఆదేవతలకు సంబంధించిన కథలనీ, గాథల్నీ గ్రామ గ్రామానా ఒక్కు కథలు చెప్పే వారూ, బైండ్లవారూ, గొల్లసుద్దులు చెప్పేవారూ, ఎందరో కనిపిస్తూ వుంటారు. ఈ నాటికీ ఆ కథలూ, కళారూపాలూ నిలిచి వున్నాయంటే చారిత్రకంగా వాటి ప్రాముఖ్యం ఎటువంటిదో ఊహించవచ్చును. ఇలా కథలు చెప్పే వారిలో బవనీలనీ, బైనీడి వారనీ, బఈండ్ల వారనీ రకరకాల పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ బైండ్ల వారు హరిజనులైన పూజారులు. అయితే బననీలు కాకతీయ చకరవర్తుల కాలం నాటికే ప్రాముఖ్యం వహించి నట్లు క్రీడాభిరామంలో వున్న ఈ క్రింది ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చును. ఈ వుదాహరణను కాకతీయుల కళావిన్యాసం శీర్షికలో చర్చించిన మాచల్దేవి క్రీడాబి రామ శీర్షికలో ఉదహరించ బడిందే. అది ఇది.

బవనీల ప్రసక్తి

[మార్చు]

వాద్యవైఖరి కడు నెరవాది యనగ
ఏకవీరామహాదేవి ఎదుట నిల్చి
ల్పోరశురాముని కథ లెల్ల ప్రౌడి పాడె
చారుతర కీర్తి బవనీల చక్రవర్తి.

అని అనడాన్ని బట్టి బవనీలు ఈ రకమైన కథలు చెప్పడంలో ఎంతటి ప్రఖ్యాతి వహించారో తెలుసు కోవచ్చును. వీర శైవ మతస్థులకు వినోదాన్ని కల్పించే వీరిని బైండ్ల వారంటారు. కులాల వారీగా, మతాల వారీగా అచాఅర్యులూ, కళాకారులూ వున్నట్లు వీరు కూడా కేవలం శైవ మతస్థులకే వినోద ప్రదర్శన లిస్తారు. వీరు శైవ మతస్థుల ఇళ్లలో పెళ్ళి మొదలైన శుభకార్యాలలోనూ, చావు మొదలైన దుర్దినాలలోనూ కథలను చెపుతారు. అయితే పెళ్ళికీ, చావుకీ పేరు వేరుగా వాయిద్యాలు వాయిస్తారు.

జమిడికయే, జముకు

[మార్చు]
జమిడికను వాయిస్తున్న కళాకారులు

బైండ్లవారు ఉపయోగించే వాయిద్యం జమిడిక. దీనినే కాలక్రమాన జిమిలిక, జముకుగా పిలుస్తున్నారు. నేటి జముకును చూసిన వారందరికీ జమిడిక ఎలా వుంటుందో ఊహించవచ్చు. కథకుడు మధ్యలో వుండి కథాగానం చేస్తూ వుంటే ప్రక్కన నున్న వంతలు జిమిడికల్ని వాయిస్తూ వుంటారు. ఈ జమిడికలు కొన్ని ఇత్తడితోనూ, మరికొన్ని కర్రతోనూ తయారు చేసుకుంటారు. జమిడిక వాయిద్యం నేటి జముఇకుల నాదం లాంటిదే. జుకజుం జుకజుం అని నినాదాన్నిస్తాయి. పాట వరుస ననుసరించి, ఈ వాయిద్ల్య మారుతూ వుంటుంది. సన్ని వేశాన్ని బట్టి ఉధృతంగా వాయిస్తారు. అయితే బైండ్ల వారి కథల బాణీలకూ, జముకుల కథల బాణీకీ చాల వ్యత్యాస ముంటుంది. బైండ్ల వారు తెలంగాణాలో ప్రాముఖ్యం వహిస్తే జముకులవారు తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో ప్రాముఖ్యం వహిస్తున్నారు. జముకుల కథల వివరాలను ఆ శీర్షికలో వివరంగా వివరించ బడింది.

జమిడిక గొప్పతనం మీద మంచి వ్యాసం https://thummedaa.blogspot.com/2023/04/blog-post_27.html

ప్రారంభం 13 వ శతాబ్దంలో:

[మార్చు]

ఎల్లమ్మ కథా గాన ప్రచారం 13 వ శతాబ్దంలోనే ప్రారంభ మైంది. నాటి నుంచి ఈ నాటి వరకూ తెలంగాణా జిల్లాలలో రేణుకా, ఎల్లమ్మ కథలు విరివిగా సాగుతూనే ఉన్నాయి. ఇక ఎల్లమ్మ గుడులు తెలంగాణాలో ఎక్కడ చూచినా కోకొల్లలు. ఎల్లమ్మను ఇంత శ్రద్ధగా వారు కొలుస్తూన్నారంటే, ఆ కథల పట్ల ప్రజలలో వున్న భక్తి శ్రద్ధలను అర్థం చేసుకోవచ్చు. ఆయా రాజుల పారిపాలనా కాలంలో మారిని చారిత్రిక పరిస్థితుల దృష్ట్యా, రేణుకా ఎల్లమ్మ కథా గానం, ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ప్రవేశించి, తెలంగాణా సరిహద్దుల దాటి మహారాష్ట్రకు వెళ్ళిన బయిండ్ల వారు, ఎల్లమ్మ కథలను గానం చేస్తూ కర్ణాటకకు కూడా వ్వాపింప చేశారు. ఈనాటికీ కర్ణాటకలో రేణుకా దేవాలయాలున్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే ఉత్సవాలలో అవేశంతో ఆలయం చుట్టు పరుగెత్తుతూ రేణుకాదేవిని పూజిస్తారు.

ముఖ్యంగా పల్లెల్లో వచ్చే కలరా, మశూచికం, పొంగు, ఆటలమ్మ మొదలైన వ్వాధులకు ఈ దేవతలే కారణంగా పూజిస్తారు. ఒకో ప్రాంతంలో ఒకో రకమైన దేవతల్ని అలాగే పూజిస్తారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గంగాణమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ఎర్ర మారెమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ, మొదలైన దేవతలను పైన ఉదహరించిన వ్వాధులు సంక్రమించినప్పుడు ఆదేవతల్ని నీచ దేవతలుగా ఎంచి, వాటిని సంతృప్తి పర్చటానికి, కొలువులను కొలుస్తారు. ఆ దేవతల పుట్టు పూర్వోత్తరాలను ఆ వుత్సవాల సందర్భంలో కథా గానం చేసే వారు. ఆ కథా గానం చేసే వారే పూజారులుగా వుండేవారు. ఆ పూజారులు బైండ్ల వారూ వారుండేవారు......

;రేణుకా మహాత్యం:

[మార్చు]

జమదగ్ని మహాముని ఆజ్ఞ ననుసరించి కుమాడైన పరశురాముడు తల్లి యైన రేణుకను వధించిన తీరునూ, ఆ కథ యొక్క పూర్వా పరాలనూ, వదానంతరం రేణుక యొక్క మహాత్య గాథలనూ ఉత్తేజంగా బైండ్ల వారు చెపుతారు. రేణుక చేసిన త్యాగానికి ముగ్ధులై రేణుకను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఎల్లమ్మను ఆరాధించే భక్తులు, వారి ఆడ పిల్లలను ఎల్లమ్మ పేరు మీద జోగితలుగా అర్పిస్తారు. ఆమెను బసివిగా అని పిలుస్తారు. ఆ అమ్మాయి ఊరందరి సొత్తు. ప్రతిఫలాపేక్ష లేకుండా అందరి కామ వాంఛలనూ తీరుస్తుంది. ఆ సాంప్రదాయం ఈ నాటికి తెలంగాణాలో కొనసాగుతూనే ఉంది.

ఎల్లమ్మ

[మార్చు]

ఇల్లమ్మ పుట్టు పూర్వోత్తారాలను గిరించి డా: ఎల్దెండ రఘుమారెడ్డి పల్లె పదాలలో పొరజా జీవనం అనే గ్రంథంలో ( 352 వ, పేజీలో) ఉదహరించిన జానపద గేయాన్ని బట్టి ఎల్లమ్మ జన్మ వృత్తాంతం తెలుస్తన్నదని కె.వి. హనుమంత రావుగారు ఆంధ్ర ప్రభలో ఉదహరించారు.

శివుని బిడ్డవమ్మా ఎల్లమ్మ:

[మార్చు]

శివుని చిన్న బిడ్డవమ్మా ఎల్లామ్మా,
నీవు శివువెల్లి మాతవమ్మా ఎల్లమ్మా,
పుట్టలో పుట్టినావు ఎల్లమ్మా,
నీవు పుడమిపై బడ్డావమ్మ ఎల్లమ్మా.
నాగవననెచీరలమ్మ ఎల్లమ్మ నీకు.,
నీకు నెమలి కండ్ల రవికెలమ్మ ఎల్లమ్మా.

ఎదుము గల్వాలు తల్లీ ఎల్లమ్మ నీకు
ఎనుక నీకు దరిసెనమ్మ ఎల్లామ్మ
గవ్వ లాది కంకణమ్ము ఎల్లమ్మానీకు
ఘంటలాది రామమ్మా ఎల్లమ్మా
నాగుబాముల బట్టినావూ ఎల్లమ్మా నీవు
నడికట్టు వేసినావు ఎల్లమ్మా
జఱ్ఱి పోతుల బట్టినావూ ఎల్లమ్మా నీవు
జడికొప్పులు వేసినావు ఎల్లమ్మా
కాలిగజ్జెలు గల్లు మనిపిస్తే ఎల్లమ్మ నీవు.
ఓరుగల్లు తల్లడిల్లే ఎల్లమ్మా
ఓరుగంటి రాజులకు ఎల్లమ్మా నీవు
ఓంకారమడిగితివి ఎల్లమ్మా.
ఎల్లు ఎల్లు ఎల్లమ్మా ఎల్లమ్మా నీవు.
ఎల్లు నీవు ఎదురైనచో ఎల్లమ్మా
తల్లి ఎవరమ్మా, ఎల్లమ్మా|

సూచికలు

[మార్చు]

మూలం:

[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.