Jump to content

భాగవతము-సాంఖ్యము

వికీపీడియా నుండి
బైనరీ సిస్టమ్

మహాభాగవతము - సాంఖ్యము

అవతారిక

[మార్చు]

సాంఖ్యము

[మార్చు]

భాగవతము - సాంఖ్యము ఎందుకు అంటే? అసలు ఇదేమిటి అంటే? ఎలా చెప్పను, ఏం చెప్పను. ఐనా ప్రయత్నిస్తాను. –
v భాగవతము నకు మూలం తత్వశాస్త్రం, వేదాంతం.
v ఈ సాంఖ్యం అనే పదం వేదాంతం లోది కాదు. గణితం లోని సంఖ్య లకి సంబంధించింది.
v మరి రెండింటికి సంభంధ మేమి టంటారా.
ü తత్వశాస్త్రనికి మూల మైన పూర్ణ మంటే -శూన్యం- & పూర్తిగా అంతా నదే నైన -అనంతం-. ఈ రెంటి మధ్యదే వేదాంతం.
ü గణిత శాస్త్రానికి మూలం శూన్యం, Zero & అనంతం, Infinity. ఈరెంటి మధ్య దే గణితం.
ü భాగవతంలో 12 స్కందము లున్నాయి. 1 - అద్వైత ము, 2 - ద్వైతము. అంటే ఒక రకమైన “Binary system”
ü “Binary system” మే కదా గణితంలో కూడా అతి మౌలికమూ, ప్రాథమికము.
ü తత్వం లేని, లేదా అక్కరలేని శాస్త్రం లేదు. గణికం లేని లేదా అక్కర లేని శాస్త్రం కూడా లేదు.
ü అందుకే రెంటికీ వున్నద వినాభావ సంబంధము.
v మరి ఎందుకు - అంటే:

గణితానికి మూలమైన సంఖ్యలను, భాగవతములో చూచుట

v మరి ఎలా అంటే:

వైయాకరణ సాంఖ్యములు

[మార్చు]

a) వృత్తముల వారీ సాంఖ్యములు.
a) సంధులు
b) సమాసములు
c) అలంకారములు

వ్యవహారిక సాంఖ్యములు

[మార్చు]

i. క్రృతి కర్తలు నలుగురు రచనల సాంఖ్యము.
ii. అక్షరముల వారీ సాంఖ్యములు
a. ప్రథమ అక్షరములు
iii. పదములు వారీ సాంఖ్యములు
b. ప్రథమ పదములు
iv. విషయము / సందర్భము సాంఖ్యములు
v. సంఖ్యా వాచకముల సాంఖ్యము.
vi. నామ వాచకముల (పేర్లు) సాంఖ్యములు

ప్రవేశిక

[మార్చు]

Ø భాగవత సంస్కృత మూలము నకు కృతికర్త - ఒకడు - వ్యాసభగవానులు.
Ø భాగవతమునకు శృతికర్త - ఒకడు - శుకుడు. శ్రోత - ఒకడు - పరీక్షిన్మహారాజు.
Ø భాగవతములో హరి చరిత్రను ద్వాదశ లింగము లకు ప్రతీకగ 12 స్కందములలో హరి హర అభేధ్య నిరూపణ నిమిత్తము చెప్పబడినద నుకోవచ్చు. లేదా ద్వాదశ రాశులకు ప్రతీకగ చెప్పబడినది కావచ్చు

మొత్తం పద్యగద్యాలు = 9010
పోతన గారివి = 7948 గంగవ గారివి = 352
సింగయ గారివి = 530 నారయ గారివి = 180

Ø ఆంధ్రీకరించిన వారు - నలుగురు (4).
o (1) బమ్మెర పోతన మఱియు (2) బొప్పరాజు గంగనార్యుడు, (3) ఏర్చూరి సింగయ, (4) వెరిగందల నారయ.
o వాసి లోను, రాసి లోను అత్యధికంగా రచించిన వారు సహజంగానే పోతన గారే.అందుకే పోతన భాగవత మనబడుచున్నది
o ఇద్దరు “ఇష్ట దేవతా వందనము, కవిస్తుతి, స్వప్న వృత్తాంతము, కవి వంశ వర్ణనము, షష్ట్యంతములు”తో తమ రచన ప్రారంభంచారు. వీరిలో (1) పోతన గారు గ్రంథ ప్రారంభంలో, (2) సింగయ గారు షష్టస్కంధారంభంలోను.
o ఒక్కరే (నారయ గారు) తాము వ్రాసిన స్కంధమలో పోతన గారి శిష్యులమని గర్వంగా విరచితం (స్కంధం చివరిలోని గద్యం) లో చెప్పుకొన్నారు.

మొత్తం పద్యగద్యాలు = 9010
10వ స్కందములోవి = 3135 5వ స్కందములోవి = 352

Ø పన్నిండింటిలో రెండు స్కంధాలు రెండు భాగాలు (పూర్వభాగం మఱియు ఉత్తరభాగం) గా విడదీయ బడ్డాయి. వానిలో (1) దశమస్కంధ మయితే పెద్దది కనుక రెండు భాగలను కొంటే (2) పంచమ స్కంధం ఎందుకు రెండు భాగాలు చేయబడినదో తెలియదు.
o పోతన భాగవత రచనలో ఇతర కవులు చేతులు కలుపుటకు కారణము నిశ్ఛయించబడలేదు కాని, మూడు విధములైన అభిప్రాయములున్నవి.
o పోతన గారే రచనా సౌకర్యార్థం ఇలా నిశ్ఛయించుట.
o సర్వజ్ఞ సింగమనీడు చేత భూమిలో పాతి పెట్టబడుట వలన క్రిమిదష్టమౌట.
o పోతన గారి పూజామందిరములో కాలప్రభావము వలన క్రిమిదష్టమౌట.
§ క్రమిదష్టమౌటకు అవకాశము లున్నవి. కాని ఇక్కడొక విచిత్ర ప్రశ్న-- 5,6,11,12 స్కందాలే ఎందుకు క్రిమిదష్టం కావలె? రెండు బాగాలుగా (మొదటి 6, రెండవ 6 స్కందాలు) 2 కట్టలు కలిపి కట్టబడుట వలననా? అట్లైన సమతౌల్య ముండునా (రాశిలో 1వ కట్ట కంటే 2వదాని కంటే 40 శాతం ఎక్కువ కదా (3731, 5279 పద్యగద్యాలు) ? అప్పటికి ఈవిధముగా కట్టే గ్రంథ సంగ్రాహక పద్ధతుందా, లేక వస్రములో మూటగా కట్టెడి వారా? యాదృచ్ఛకమా?
Ø దశమ స్కంధం (రెండు భాగాలు కలిసి) 3135 పద్యగద్యాలతో అన్నిటికంటే పెద్దది. మొత్తం (9010) పద్యగద్యాలలో సుమారు మూడవ వంతు.
Ø తృతీయస్కంధం 1055 పద్యగద్యాలతో రెండవ స్థానంల లోవుంది
Ø ద్వాదశ స్కంధం 54 పద్యగద్యాలతో అన్నిటికంటే చిన్నది. మొత్తం వృత్తాలలో సుమారు ఇరవైయ్యో వంతు.
Ø ఏకాదశ స్కంధం 126 పద్యగద్యాలతో రెండవ చిన్నది.
Ø పండ్రెండు స్కందాలు పంచమ, దశమ స్కందాల ఉత్తర భాగాలతో సహా (మొత్తం 14) అన్నీ పవిత్రమైన “శ్రీ” అనే అక్షరము తోనే ప్రారంభింప బడ్డాయి, వి మొత్తానికి శ్రీకర మార్గం చూపటానికేమో.
Ø పండ్రెండు స్కందాలు పంచమ, దశమ స్కందాల ఉత్తర భాగాలతో సహా (మొత్తం 14) అన్నింటిలో గద్య రూపంలో ప్రతి స్కందము, ప్రతి భాగము ఆఖరున కవి ఇది తన విరచితమని తెల్పుటకు పదునాల్గు పర్యాయములు వాడబడినవి. పదునాల్గింటిలోను అన్నీ -ఇది- అన్న పదంతో మొదలు పెట్టబడ్డాయి, ఇది (ఈ భాగవతం) అదే (తత్) అనా.
Ø 2 వచనములు పక్కపక్కన - పదవ పూర్వ భాగములో ‘అక్రూరుడు ధృతరాష్ట్రునితో హితోపదేశముగా సంభాషించుట అనే సంధర్భములో’ వచనము (“ఇట్టి” అనే పదంతో ప్రారంభించినది, వ-1522) వెంటనే మళ్ళా వచనము (“అంత” అనే పదంతో ప్రారంభించినది, వ-1523) వ్రాయబడింది.
Ø అధ్వైతాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి ఒక రకమైన బైనరీ అంతర్లీనంగా రచింపబడినదా ఆనిపిస్తోంది ఈక్రింది వివరాలు చూస్తుంటే

భాగవతము లో ఒక రకమైన బైనరీ (binary system) లో రచన

[మార్చు]

Þ ఇందు రెండు రకముల రూపములలో రచనలు చేయబడ్డాయి. అవి (1) చంధోసహితం, (2) చంధోరహితం.
Þ (1) చంధోసహితం రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1) పద్య రూపం, (2) దండక రూపం
Þ (1) పద్య రూపంలో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి
Þ (1) పద్యాలు, (2) శ్లోకము
Þ (2) శ్లోకము రూపములో - ఒకటే రచింప బడినది - అది సింగయ కృత షష్ఠ స్కందములో రచింపబడింది.
Þ 1) పద్యాలు రూపంలో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి.
Þ (1) నాల్గుపాదాలపద్యాలు, (2) నాల్గుపాదాలద్వయంపద్యాలు
Þ (1) నాల్గుపాదాల పద్యాలు - మొత్తం 28 వృత్తాలలో రచింపబడ్డాయి.
Þ (2) నాల్గుపాదాలద్వయంపద్యాలు రూపం (అ) సీసపద్య రూపంలో రచింప బడ్డాయి.
Þ (అ) సీసపద్యాలు రూపంలో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1) సీసము, (2) సర్వలఘు సీసము.
Þ (1) సీసపద్యాలు రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1) ఆటవెలదితో సీసపద్యాలు, (2) తేటగీతితో సీసపద్యాలు.
Þ (2) సర్వలఘుసీసము రూపంలో నారయ కృత ఏకాదశ స్కందములో ఒక పద్యము గలదు.
Þ దండక రూపంలో రెండు రచింపబడినవి. అవి (1) తృతీయ స్కందములో (శ్రీనాథ దండకము) ను, (2) దశమ స్కంద పూర్వ భాగములో (శ్రీమానినీమానసచోరుని దండకము) ను రచింపబడ్డాయి.
Þ చందోరహిత రూపంలో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1) వచనములు గాను, (2) గద్యములు గాను.
Þ వచనము లను రెండు రకములుగా వాడబడ్డాయి. అవి (1) రెండు పద్యాలకు మధ్య అనుసంధానంగాను, (2) విషయ వ్యాప్తి దృష్ట్యా వివరించుటకు.

వైయాకరణ సాంఖ్యములు.

[మార్చు]

వృత్తములు ఆనగా

[మార్చు]
పోతన భాగవతములో వాడిన పద్యములు 28
1. సర్వలఘు సీసము. 2. సీసము (పద్యం) (ఆటవెలదితో) 3. సీసము (తేటగీతితో) 4. ఉత్పలమాల
5. చంపకమాల 6. శార్దూలము 7. మత్తేభము 8. మత్తకోకిల
9. తరలము 10. భుజంగప్రయాతము 11. పంచచామరము 12. స్రగ్దర
13. మహా స్రగ్దర 14. స్రగ్విణి 15. మాలిని 16. మానినీ
17. మంగళమహశ్రీ 18. లయగ్రాహి 19. లయవిభాతి 20. ఇంద్రవ్రజము
21. ఉత్సాహవృత్తము 22. ఉపేంద్రవ్రజము 23. కంద 24. కవిరాజ విరాజితము
25. తోటకము 26. వనమయూరము 27. ఆటవెలది 28. తేటగీతి.
,
29. వచనము 30. గద్యము 31. దండకము 31. శ్లోకము
33. (సీస పద్యాల క్రింద వాడిన) ఆటవెలది 34 (సీస పద్యాల క్రింద వాడిన) తేటగీతి

ఈ ముప్పది నాల్గింటిని 'వృత్తములు'గా తీసుకొనబడింది.

వృత్తముల సాంఖ్యము

[మార్చు]

వృత్తముల విభజన వివరము

[మార్చు]

పోతన భాగవతములోని వివిధ వృత్తములు, రచనాప్రక్రియల వివరములు:

వృత్తముల విభజన వివరము
వివరము మొత్తం వివరము మొత్తం వివరము మొత్తం
మొత్తం వృత్తలు 10058 పద్య గద్యలు 9011 సీసపద్యాల క్రిందవి 1047
పద్యగద్యలు 9011 చందోరహితాలు 2694 చందోసహితాలు 6317
చందోరహితాలు 2694 గద్యము 14 వచనము 2680
చందోసహితాలు 6317 దండకము 2 పద్యము 6315
పద్యాలు 3615 చతుష్పాద ద్వయాలు 1048 చతుష్పాదులు 5267
చతుష్పాద ద్వయాలు 1048 సర్వలఘుసీసము 1 సీసము 1047
సీసములు 1047 సీసము (తే. తో.) 776 సీసము (ఆ. తో.) 271
చతుష్పాదులు 5267 శ్లోకము 1 చతుష్పాద పద్యాలు 5266
చతుష్పాద పద్యాలు = 5266
వృత్త పద్యాలు 1927 జాతులు 2634 ఉపజాతులు 705

వృత్తములు స్కందములు వారీ పద్యముల సంఖ్య

[మార్చు]

పోతన భాగవతము లోని విషయమును ప్రధానముగ వివిధ వృత్తములలో, గద్యము మొదలగు రూపములలో ఆంధ్రీకరింప బడ్డాయి. వీనిని క్లుప్తముగ వృత్తములుగ తీసికొని ఏ స్కందములో ఏవి ఎన్ని ఉన్నవో ఈక్రింది విధముగ క్రోడీకరించ వచ్చు.

వృత్తములు - స్కందములు
క్ర. సం. వృత్తము స్కందం.
1 2 3 4 5అ 5ఆ 6 7 8 9 10పూ 10ఉ 11 12 మొత్తము
1 మొత్తం వృత్తాలు 577 335 1193 1151 210 196 605 531 837 803 1946 1482 136 56 10058
2 గద్యము 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 14
3 వచనము 147 82 246 314 56 51 108 163 235 284 533 394 47 21 2680
3 దండకము 0 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 2
4 సర్వలఘుసీసము 0 0 0 0 0 0 0 0 0 0 0 1 0 0 1
5 సీసం (ఆ.తో) 25 11 1 0 4 17 25 20 43 21 89 15 0 0 271
6 సీసం (తే.తో) 22 36 137 175 22 11 50 28 50 45 65 124 9 2 776
7 శ్లోకము 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1
8 ఉత్పలమాల 50 10 52 19 5 3 49 36 12 28 123 82 3 1 473
9 చంపకమాల 16 19 116 87 7 4 32 9 5 16 36 137 2 3 489
10 శార్దూలము 29 7 1 1 1 0 10 49 33 23 116 20 0 0 290
11 మత్తేభము 56 41 70 34 9 1 10 34 69 47 132 77 2 2 584
12 మత్తకోకిల 6 0 1 0 0 1 4 3 6 3 11 4 1 0 40
13 తరలము 2 1 3 2 1 0 5 0 0 3 6 0 0 0 23
14 భుజంగప్రయాతము 1 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 1
15 పంచచామరము 0 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 1
16 స్రగ్దర 0 0 0 0 0 0 1 0 0 0 0 2 0 0 3
17 మహాస్రగ్దర 0 0 0 0 0 0 1 0 0 0 0 1 0 0 2
18 స్రగ్వి ణి 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1
19 మాలిని 1 1 1 1 1 0 0 1 1 0 1 1 1 1 11
20 మనినీ 0 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 1
21 మంగళమహశ్రీ 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1
22 లయగ్రాహి 0 0 0 0 0 0 3 0 0 0 2 1 0 0 6
23 లయవిభాతి 0 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 1
24 కంద 148 68 342 284 44 50 147 116 217 186 578 373 49 19 2621
25 ఇంద్రవ్రజము 0 0 0 0 0 0 1 0 0 1 2 0 0 0 4
26 ఉపేంద్రవ్రజము 0 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 1
27 ఉత్సాహవృత్తము 0 0 0 0 0 0 1 0 0 0 0 2 0 0 3
28 కవిరాజ విరాజితము 0 0 0 1 0 0 0 0 0 0 0 2 0 0 3
29 వనమయూరము 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1
30 తోటకము 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1
31 ఆటవెలది 22 6 3 6 27 28 32 22 66 73 86 34 2 0 407
32 తేటగీతి 4 5 80 51 6 1 46 1 7 5 7 72 8 4 298
మొత్తం పద్యగద్యాలు 530 288 1055 976 184 168 530 483 744 737 1792 1343 126 54 9011
సీసము క్రింది పద్యాలు:-
33 అటవెలది 25 11 1 0 4 17 25 20 43 21 89 15 0 0 271
234 తేటగీతి 22 36 137 175 22 11 50 28 50 45 65 124 10 2 776

సంధులు

[మార్చు]

సమాసములు

[మార్చు]

అలంకారములు

[మార్చు]

వ్యవహారిక సాంఖ్యములు.

[మార్చు]

కృతి కర్తలు నలుగురు రచనల సాంఖ్యము

[మార్చు]

పోతన గారి భాగవతంలో మొత్తం 9010 పద్యగద్యాలున్నాయి. ఇందులో 1062 పద్యగద్యాలు గంగన, సింగయ, నారయ ల 5, 6, 11+12 స్కందాల లోవి మిగతా 7948 పోతనగారివి

అక్షరముల వారీ సాంఖ్యములు

[మార్చు]

ప్రధమాక్షరము - స్కందములు వారీ పద్యముల సంఖ్య

[మార్చు]

సహజ కవి పోతనామాత్యులు వారి భాగవతం మధురాతి మధురం, లలిత లావణ్య భరితం, పంచదార తేనెలలో ఘంటం ముంచి వ్రాసేడేమో మరి, మహాకవి కరుణశ్రీ గారు అన్నట్లు. ఆ మథుర ప్రవాహములో పద్య, గద్యాలకి ప్రథమాక్షర గౌరవము దక్కించుకున్న వాటి వివరములు చూద్దాము.

• "శ్రీ"కి - పోతనామాత్యులు భాగవతములో ప్రథమ పద్యమునకు ప్రథమాక్షరము కాగల గౌరవమిచ్చారు, సమస్తలోకాలకి శ్రీకరమౌగాక యనేమో.
• అందుకే వేమో ప్రతి స్కందములోకూడా ప్రథమ పద్యమునకు ప్రథమాక్షరముగా "శ్రీ" నే వాడబడింది.
• అర్థసహస్రాధిక పునరుక్తి పొందిన ప్రథమా క్షరముల యొక్క వివరములు :-
అ - 1905 సార్లు, ఇ - 585 సార్లు, మ - 528 సార్లు వాడబడినవి.
• ప్రథమాక్షరముగా పునరుక్తి కానివి :-
“ఔ, ఠ, ణ, క్ష” లు.
వాటిని 9 (ఔ, క్ష లు), 6 (ఠ) 10పూ (ఱ) స్కందములలో ఒకేఒక పద్యమునకు ప్రథమాక్షరముగా వాడబడినవి.
• ప్రథమాక్షరముగా వాడబడని అక్షరములు :- “ట, ణ, ఞ” లు.

పదములు వారీ సాంఖ్యములు

[మార్చు]

ప్రథమ పదములు

[మార్చు]

పదాలే భాషకి పునాదులు, అలంకారాలు, అన్నీ. భాషంటేనే పదాలన వచ్చు. పోతనామాత్యులవారు సహజ కవీంద్రులు. వారు కవిత్వాన్నే కాదు అక్షరాల్ని, పదాల్ని కూడా ఎలా కావాలంటే అలా ఆడించ గలరు. పదాలకి లలీళలావణ్యాన్ని అద్దగలరు, తియ్యతియ్యని తేనెలలో ముంచి రుచిచూపగలరు. 4015 వృత్తాలకి వాడిన ప్రథమ పదాలు పునరావృత్తి కాలేదు. 439 వృత్తాలకి రెండు సార్లు ప్రథమ పదాలు పునరావృత్త యినాయి. అన్ని స్కందములలోను కలిపి, 100 కన్నా ఎక్కువ వృత్తాలు ఏఏ పదాలతో అల్లేరో, ఏ స్చందంలో ఎక్కువగ ఏ పదాన్ని ఎన్ని సార్లు వాదారో చూద్దాము.

ప్రథమ పదం వృత్తాలు స్కందం ప్రథమ పదం వృత్తాలు స్కందం ప్రథమ పదం వృత్తాలు
అని 624 స్కదం 1 అని 46 స్కందం 7 అని 41
ఇట్లు 368 స్కందం 2 మఱియు 17 స్కందం 8 అని 54
మఱియు 234 స్కందం 3 అని 59 స్కందం 9 అని 60
అంత 203 స్కందం 4 అని 66 స్కందం 10/ఉ అని 95
అనిన 186 స్కందం 5/ఉ మఱియు 18 స్కందం 10/పూ అని 159
177 స్కందం 5/పూ మఱియు 16 స్కందం 11 అనిన 9
హరి 109 స్కందం 6 ఇట్లు 27 స్కందం 12 అనిన 4
మొత్తం అని 624

ఇంకా వివరాలకు ఈ క్రింది లింకులో చూదవచ్చు:

*http://spreadsheets.google.com/pub?key=pdAISo-QbCFDrGy5llPbrew&output=html[permanent dead link].

సంఖ్యా వాచకముల సాంఖ్యము

[మార్చు]

సంఖ్యావాచక పదములు ఎన్ని, ఎలా వాడబడ్డాయి వివరించేది సంఖ్యా వాచకముల సాంఖ్యము.

సంఖ్యావాచక పదములను ప్రథమపదంగ వాడిన పద్యగద్యాలు

[మార్చు]

147 సార్లు సంఖ్యావాచక పదములు, వృత్తాలకి ప్రథమపదంగ వాడబడ్డాయి. దశమ స్కందం పూర్వభాగములో అన్నిటికంటే ఎక్కువగ 32 సార్లు వాడబడ్డాయి. అన్నిటికంటే ఎక్కువగ 37 సార్లు కంద పద్యాలకి వాడబడ్డాయి. సంఖ్యావాచక పదములను ఏ స్కందంలో ఎన్ని వృత్తాలకి ప్రథమపదంగ నున్నవో యీ క్రింది పట్టికలో చూపబడ్డాయి:

సంఖ్యావాచక ప్రథమ పదము గల వృత్తాలు
స్కందం వృత్తాలు స్కందం వృత్తాలు
ప్రథమ 10 ద్వితీయ 2
తృతీయ 14 చతుర్థ 11
పంచమ పూర్వభాగం 0 పంచమ ఉత్తరభాగం 2
షష్ట 11 సప్తమ 10
అష్టమ 19 నవమ 18
దశమ పూర్వభాగం 32 దశమ ఉత్తరభాగం 14
ఏకాదశ 2 ద్వాదశ 2
మొత్తం 147

మరిన్ని వివరాలకి యీ క్రింద లింకులో చూడండి.
http://spreadsheets.google.com/pub?key=pdAISo-QbCFAuCiUWulRXFg[permanent dead link]

నామ వాచకముల (పేర్లు) సాంఖ్యములు

[మార్చు]

విషయము / అధ్యాయము

[మార్చు]
  • నూట పదహారు పద్యాలు

తెలుగువారికి నూటపదహార్లు పవిత్రమైనవే, ప్రాముఖ్యమైనవి. శ్రీ రాముల వారు భాగవతమును ఆంధ్రీకరించమని ఆదేశం ప్రసాదించగ తాను చేపట్టినట్లు పోతనా మాత్యులు వారు స్వయంగ ప్రకటించారు, అందుకేనేమో ద్వితీయ స్చందంలో "శ్రీమన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము", నవమ స్చందంలో "శ్రీరామ చరిత్ర" లకు నూట పదహారు {116} వృత్తములను వాడి నారు.
అత్యధికంగ 238 వృత్తాలు తృతీయ స్కందం "విదురమైత్రేయ సంవాదము"కి వాడారు.తరువాత 183 చతుర్థ స్కందంలో "పురంజనోపాఖ్యానము"కి, 157 షష్ట స్కందంలో "విష్ణుదూత యమదూతల సంవాదము"కి వాడారు.ఈ క్రింది పట్టికలో ఏ స్కందంలో అత్యధికంగ ఎన్ని వృత్తాలు ఏ విషయం / అధ్యాయంకి వాడారో ఇవ్వబడ్డాయి:

స్కందం విషయము / అధ్యాయము మొత్తం వృత్తాలు
స్కందం 1 అర్జునుండు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణంబు దెల్పుట 44
స్కందం 2 శ్రీమన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము 116
స్కందం 3 విదురమైత్రేయ సంవాదము 238
స్కందం 4 పురంజనోపాఖ్యానము 183
స్కందం 5/పూ భగవంతుండగు నారాయణుండు ఋషభావతార మెత్తుట 59
స్కందం 5/ఉ శుకయోగి యుపదేశమునఁ దెల్పు భూగోళనిర్ణయము 73
స్కందం 6 విష్ణుదూత యమదూతల సంవాదము 157
స్కందం 7 హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసిచుట 105
స్కందం 8 గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము 144
స్కందం 9 శ్రీరామ చరిత్ర 116
స్కందం 10/పూ బ్రహ్మ గోవత్సములను గోప బాలుకులను నంతర్థానంబు సేయుట 125
స్కందం 10/ఉ సాల్వుండు శివ ప్రసాదంబున సౌభక విమానంబు వడసి ద్వారకాపురి పై దండెత్తుట 88
స్కందం 11 వసుదేవునకు నారదుండు పురాతనంబగు విదేహర్షభ సంవాదంబుఁ దెలుపుట 60
స్కందం 12 శుకయోగి పరీక్షిత్తునకు భావి కాల గతులఁ జెప్పుట 17
అన్ని స్కందాలు విదురమైత్రేయ సంవాదము 238

ఇంకా వివరాలకి ఈ క్రింది లింకులో చూడవచ్చు:

మూలాలు

[మార్చు]

అ) తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ప్రచురణ 'పోతన భాగవతము'

బయటి లింకులు

[మార్చు]