భాగ్యవంతులు
భాగ్యవంతులు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.నీలకంఠం |
---|---|
తారాగణం | ఎం.జి.రామచంద్రన్ , రాజసులోచన , ఎం.ఆర్.రాధా |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | ఉషశ్రీ |
నిర్మాణ సంస్థ | ఉషా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
భాగ్యవంతులు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం నల్లవన్ వాళ్వాన్ అనే తమిళ సినిమా.1962 మే 5 న విడుదలైన ఈ చిత్రానికి పి నీలకంఠం దర్శకత్వం వహించాడు. ఎం జి.రామచంద్రన్,రాజసులోచన, ఎం. ఆర్. రాధా, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
కథ
[మార్చు]రంగారావు భాగ్యవంతుడు. డబ్బుతో ఏమైనా కొనవచ్చనేది అతని అభిప్రాయం. అతనికి కావలసినవి రెండే.కామినీ కాంచనాలు. మధు భాగ్యవంతునితో ఎన్నికలలో పోటీచేస్తాడు. అక్రమాలను ధైర్యంగా ఎదురిస్తాడు. అతని చెల్లి శ్యామల. శ్యామలను పెళ్ళి చేసుకోవాలని రంగారావు ప్రయత్నిస్తాడు. కానీ శ్యామల అంతకుముందే పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాధవుని ప్రేమించి ఉంటుంది. రంగారావుకు శ్యామల తండ్రి ఇవ్వవలసిన బాకీని మధు చెల్లించి శ్యామల, మాధవుల పెళ్ళికి మార్గం సుగమం చేశాడు. రంగారావు నర్తకి చంద్రను వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అతని నోట సున్నం ముద్ద పెట్టి పారిపోతుంది. రంగారావు అనుచరులు ఆమెను వెన్నాడగా మధు ఆమెను కాపాడుతాడు. ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. రంగారావు కుపితుడవుతాడు. మధును ఖూనీ కేసులో ఇరికిస్తాడు. అతనిని ఆ కేసు నుండి తప్పించడానికి శ్యామల ఎంతో ఆరాటపడుతుంది. చివరకు మధు ఎన్నో వేషాలు వేసి తాను నిర్దోషినని పతాక సన్నివేశంలో నిరూపించుకుంటాడు[1].
నటి నటులు
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్ - మధు
- రాజసులోచన - చంద్ర
- ఎం.ఆర్.రాధా - రంగారావు
- ఇ.వి.సరోజ - శ్యామల
- ఎం.ఎన్.నంబియార్ - మాధవుడు
- డి.బాలసుబ్రహ్మణ్యం
- ఎస్.రామారావు
- లక్ష్మీప్రభ
- లక్ష్మీరాజ్యం
ఇతర వివరాలు
[మార్చు]- దర్శకుడు : పి.నీలకంఠం
- కథ, స్క్రీన్‌ప్లే: సి.ఎన్.అన్నాదురై
- సంగీత దర్శకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు
- మాటలు: పినిశెట్టి
- పాటలు: ఉషశ్రీ
- ఛాయాగ్రహణం: జి.దొరై
- శబ్దగ్రహణం:ఎ.కృష్ణన్
- నిర్మాణ సంస్థ : ఉషా ఫిల్మ్స్
- విడుదల తేదీ: 05-05-1962
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు ఉషశ్రీ సాహిత్యాన్ని అందించగా, ఘంటసాల సంగీతాన్ని చేకూర్చాడు.[2]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కొట్టాలి లవ్వరొక ఛాన్స్ ఈ ప్రియురాలికి ఫస్ట్‌క్లాస్ | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | ఎ. ఎం. రాజా, ఎస్. జానకి |
గులాబి అత్తరుల ఘుంఘుం అనుచున్నదా మదికైపెక్కెనా | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | పి. లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు |
చిరునగవే నీ సింగారం చిగురించెనులే మన నయగారం | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
టిక్కు టిక్కు పిల్లను చక్కనైన చుక్కను నవ్వుల పువ్వును | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | జిక్కి |
తెలుసుకోండయా జరిగేదెల్లా లోకంలోని పోకడలెల్లా | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.జమునారాణి |
మట్టిలో మణులునై పిట్టకైనా నీతివున్నది తెలిసిందా | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | పి.సుశీల |
రమ్మని సైగ చేయగా చేరిన చిన్నారీ స్నానము చేయించగా | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల |
రఘుకుల రాఘవ రాజారాం పరమదయాకరా సీతారాం | ఉషశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | ఘంటసాల వెంకటేశ్వరరావు |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (11 May 1962). "చిత్ర సమీక్ష - భాగ్యవంతులు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 23 February 2020.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 ఫిబ్రవరి 2020. Retrieved 23 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)