భానుమతి & రామకృష్ణ
భానుమతి & రామకృష్ణ | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ నాగోతి [1] |
రచన | శ్రీకాంత్ నాగోతి |
నిర్మాత | యశ్వంత్, రఘు వర్మ |
తారాగణం | నవీన్ చంద్ర సలోని లూత్రా |
ఛాయాగ్రహణం | సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు |
కూర్పు | రవికాంత్ పేరేపు |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం |
విడుదల తేదీ | 3 జూలై 2020 |
సినిమా నిడివి | 93 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భానుమతి & రామకృష్ణ 2020లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం. ఈ చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించగా యశ్వంత్, రఘు వర్మ నిర్మించారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, సలోనీ లూత్రా ముఖ్యపాత్రల్లో నటించారు. కోవిడ్ నేపథ్యంలో థియేటర్స్ మూతపడటంతో 2020, జూలై 3న 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమా విడుదలైంది.[2][3]
భానుమతి & రామకృష్ణ సినిమా పేరు మొదటగా భానుమతి రామకృష్ణగా నిర్మాతలు నిర్ణయించారు. తెలుగు సినీ నటి భానుమతి కుమారుడు ఈ సినిమా పేరుపై అభ్యంతరం తెలుపు మద్రాస్ హై కోర్ట్ లో కేసు వేశాడు, దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ సినిమా పేరు మార్చాల్సించిగా నిర్మాతలకు సూచించారు.[4][5]
కథ
[మార్చు]భానుమతి ఓ 30 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. తన జీవితంలో ప్రేమ విఫలమవ్వడంతో …ప్రేమ, రిలేషన్ పట్ల అయోమయ స్థితిలో ఉంటుంది. ఈ క్రమంలో పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ కలిగిన రామకృష్ణ (నవీన్ చంద్ర) ఉద్యోగ బదిలీపై హైదరాబాద్ లో భానుమతి చేసే సంస్థలో ఆమెకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మొదట్లో రామకృష్ణను ఇష్టపడని భానుమతి క్రమేణా అంతని ప్రేమలో పడిపోతుంది. రెండు భిన్న నేపథ్యాలు, మనస్థత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా జరిగింది అనేది ఈ సినిమా సారాంశం.
నటీనటులు/ సినిమాలో పాత్ర పేరు
[మార్చు]- నవీన్ చంద్ర - రామకృష్ణగా
- సలోని లూత్రా - భానుమతి గా
- వైవా హర్ష - బంటీ
- రాజా చెంబోలు - రామ్
- షాలిని వడ్నికట్టి - నిమిష "నిమ్మి" బోపన్న
- రవికాంత్ పేరేపు - భాను ప్రియుడిగా
- దేవయాని శర్మ - ఇషా
- అజయ్ - మనీష్
- కల్పలత - రామకృష్ణ తల్లిగా
- రాగిణి - రామకృష్ణ అత్తగా
- అప్పాజీ అంబరీష దర్భా - భాను తండ్రిగా
- జయ నాయుడు - భాను తల్లిగా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ Pecheti, Prakash (15 June 2020). "Romantic drama Bhanumathi Ramakrishna to release on July 3". Telangana Today. Retrieved 12 August 2020.
- ↑ HMTV Live (3 July 2020). "Bhanumathi and Ramakrishna Movie Review: భానుమతి & రామకృష్ణ రివ్యూ!". Archived from the original on 30 అక్టోబరు 2020. Retrieved 15 April 2021.
- ↑ Correspondent, Legal (3 July 2020). "HC orders for adding ampersand between film title Bhanumathi Ramakrishna". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 14 August 2020.
- ↑ India Today (2 July 2020). "Bhanumathi Ramakrishna undergoes title change after veteran actress's son files case" (in ఇంగ్లీష్). Archived from the original on 12 అక్టోబరు 2020. Retrieved 15 April 2021.