భాను అథియా
Bhanu Athaiya | |
---|---|
![]() | |
జననం | భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ 28 ఏప్రిల్ 1929 |
మరణం | 15 అక్టోబరు 2020 Mumbai, Maharashtra, India | (వయస్సు 91)
వృత్తి | వస్త్ర రూపకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 1956–2004 |
జీవిత భాగస్వాములు | సత్యేంద్ర అతయ్య (వేరుపడ్డారు) |
పిల్లలు | 1 |
పురస్కారాలు | 1982: ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: " గాంధీ"
ఉత్తమ దుస్తుల డిజైన్ 1991: Lekin... 2002: Lagaan |
భాను అథాయ ( 28 ఏప్రిల్ 1929 – 15 అక్టోబర్ 2020) ఆమె వయసు 91. ఆమె పూర్తి పేరు భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ ఈమె ఒక భారతీయ దుస్తుల రూపకర్త. ఆమె 100 చిత్రాలకు పైగా పనిచేసింది, భారతీయ చిత్ర నిర్మాతలైన గురు దత్, యష్ చోప్రా, బి.ఆర్.చోప్రా, రాజ్ కపూర్, విజయ్ ఆనంద్, రాజ్ ఖోస్లా, అశుతోష్ గోవారికర్; అంతర్జాతీయ దర్శకులు అయిన కాన్రాడ్ రూక్స్ ఇంకా రిచర్డ్ అటెన్ బరో చిత్రాలలో పనిచేసినది.1983లో తెరకెక్కిన ‘గాంధీ’ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ఆ సినిమాకుగానూ భాను అథియా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. భారతదేశానికి తొలి ఆస్కార్ అందించిన వ్యక్తి భాను అథియా[1].
జీవిత చరిత్ర[మార్చు]
అథాయ మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించారు. అన్నాసాహెబ్, శాంతాబాయి రాజోపధేయ దంపతులకు జన్మించిన ఏడుగురు సంతానంలో ఈమె మూడవది. ఆతయ్య తండ్రి అన్నసాహెబ్ చిత్రకారుడి గా పనిచేశాడు. భాను అథాయ తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి మరణించాడు. 2012 లో మెదడులో ఓ కణతి ఏర్పడింది. గత మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు.15 అక్టోబర్ 2020 న మరణించారు[2].
జీవన ప్రగతి
'ఈవ్ స్ వీక్లీ' సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ ఫ్యాషన్ ఇలస్ట్రేటర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.
దాని ఎడిటర్ ఒక బొటిక్ ను తెరిచినప్పుడు, ఆమె వస్త్రాలను డిజైన్ చేయడానికి ప్రయత్నించమని అథాయాను అడిగింది, అందువల్ల ఆమె దుస్తులరూపకల్పనలో తన అభిరుచిని, నైపుణ్యాన్ని కనుగొన్నది. డిజైనర్ గా ఆమె సాధించిన విజయం అనతికాలంలోనే ఆమె కెరీర్ పథాలను మార్చడానికి దారితీసింది.సి.ఐ.డి.(1956) తో ప్రారంభించి గురు దత్ చిత్రాలకు దుస్తులను డిజైన్ చేయడం ద్వారా ఆమె వృత్తి జీవితం ప్రారంభమైంది. దాని తరువాత ఇతర గురు దత్ చిత్రాలతో పాటు ప్యాసా (1957), చౌధువిన్ కా చంద్ (1960), సాహిబ్ బీబీ ఔర్ గులాం (1962) , ‘గైడ్’, ‘గంగా జమున’, ‘అమ్రపాలి’, ‘వక్త్’, ‘తీస్రీ మన్జిల్’, ‘మేరా నామ్ జోకర్’, ‘చాందిని’, ‘లెకిన్’, ‘లగాన్’ సహా 100పైగా చిత్రాలలలో దుస్తుల రూపకర్త గా పని చేసినది , తన 50 ఏళ్ల కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకుంది. ఆమె ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన విజయం సాధించిన `గాంధీ` చిత్రానికిగానూ ఆమె ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా 1982లో (జాన్ మోల్లోతో భాగస్వామ్యం) అకాడమీ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ అకాడమీ అవార్డు పొందిన తొలి భారతీయురాలుగా ప్రసిద్ది చెందినది. అంతే కాక 1991 , 2002 సంవత్సరాలలో రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కూడా ఆమె గెలుచుకుంది.[3]
మూలాలు[మార్చు]
- ↑ "Bhanu Athaiya Dies: భారతదేశ తొలి ఆస్కార్ విజేత భాను అథియా కన్నుమూత". Zee News Telugu. 2020-10-16. Retrieved 2020-10-16.
- ↑ "తొలిసారి ఆస్కార్ విన్నర్ భాను అతియా కన్నుమూత". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-10-16.
- ↑ "భారత్ తొలి ఆస్కార్ విజేత భాను అథియా ఇకలేరు!". సితార. Retrieved 2020-10-16.