భారజలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాధారణ నీటి అణువులో హైడ్రోజన్ పరమాణువుల స్థానంలో డ్యుటీరియం పరమాణువులను ఉంచితే భారజలం అణువు అవుతుంది. రసాయనికంగా దీనిని డ్యుటీరియం ఆక్సైడ్ అని పిలుస్తారు. సాధారణ నీటిలో ప్రతి 6000 భాగాలలో 1 భాగం భారజలం ఉంటుంది.

భౌతిక ధర్మాలు (సాధారణ జలంతో పోలిక)[మార్చు]

లక్షణం D2O (భారజలం) H2O (సాధారణ జలం)
ఘనీభవన స్థానం (°C) 3.82 0.0
భాష్పీభవన స్థానం (°C) 101.4 100.0
సాంద్రత (at 20°C, g/mL) 1.1056 0.9982
అత్యధిక సాంద్రత ఉండే ఉష్ణోగ్రత (°C) 11.6 4.0
Viscosity (at 20°C, mPa·s) 1.25 1.005
Surface tension (at 25°C, μJ) 7.193 7.197
Heat of fusion (cal/mol) 1,515 1,436
Heat of vaporisation (cal/mol) 10,864 10,515
pH (at 25°C) 7.41 (sometimes "pD") 7.00

ఉపయోగాలు[మార్చు]

  • న్యూక్లియర్ రియాక్టర్ లలో భారజలాన్ని సాధారణంగా న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారి (moderator) గా వాడతారు. యురేనియం పరమాణువుల విచ్ఛిత్తికి తక్కువ వేగంగల న్యూట్రాన్లు అవసరం. న్యూట్రాన్ లను భారజలం ద్వారా పంపి వాటి వేగాన్ని తగ్గిస్తారు.
  • సాధారణంగా భారజలాన్ని రసాయన సమ్మేళనాల చర్యా విధానాలను అధ్యయనం చేయడానికి ట్రేసర్ గా వాడతారు. ఉదా: ఏరోమాటిక్ ఎలక్ట్రోలిక్ ప్రతిక్షేపణ చర్యా విధానాలు, శరీరంలో జరిగే జీవరసాయన చర్యల అధ్యయనం మొదలైనవి.
  • భారజలం వినిమయ చర్యలలో పాల్గొనే లక్షణాన్ని కొన్ని ఫాస్ఫరస్ ఆక్సీ ఆమ్లాల నిర్మాణాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=భారజలం&oldid=3483677" నుండి వెలికితీశారు