భారతదేశంలో అణుశక్తి
భారతదేశంలో బొగ్గు, జల, సౌర, పవన విద్యుత్తుల తర్వాత అణుశక్తి ఐదవ అతిపెద్ద విద్యుత్ వనరు. 2025 ఏప్రిల్ నాటికి, దేశంలో ఉన్న 8 అణు విద్యుత్ ప్లాంట్లలో మొత్తం 8,880 MW స్థాపిత సామర్థ్యంతో, 25 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి, .[1][2] 2024-25 ఆర్థిక సంవత్సరంలో అణుశక్తి మొత్తం 57 TWh ఉత్పత్తి చేసింది. ఇది భారతదేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 3%.[3] 8,700 మెగావాట్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యంతో మరో 11 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి.
2032 నాటికి 63 GW అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి భారతదేశం 2010 అక్టోబరులో ఒక ప్రణాళికను రూపొందించింది.[4] అయితే, 2011 ఫుకుషిమా అణు విపత్తు తరువాత, ప్రతిపాదిత అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశాలలో అనేక అణు వ్యతిరేక నిరసనలు జరిగాయి.[5] మహారాష్ట్రలోని జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు, తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. హరిపూర్ సమీపంలో ప్రతిపాదిత పెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.[5] ప్రభుత్వ పౌర అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) కూడా దాఖలైంది.[5][6]
థోరియం ఆధారిత ఇంధనాల రంగంలో భారతదేశం పురోగతి సాధిస్తోంది. దేశపు మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంలో కీలకమైన భాగమైన థోరియం. తక్కువ- సుసంపన్నమైన యురేనియంను ఉపయోగించి అణు రియాక్టర్ కోసం ఒక నమూనాను రూపొందించడానికీ, అభివృద్ధి చేయడానికీ కృషి చేస్తోంది.[7]
చరిత్ర
[మార్చు]అణు పరిశోధన తొలి అడుగులు
[మార్చు]| సంవత్సరం | ఉత్పత్తి (TWh) |
|---|---|
| 2005 | 17.6
|
| 2006 | 17.7
|
| 2007 | 17.7
|
| 2008 | 15.0
|
| 2009 | 16.8
|
| 2010 | 23.0
|
| 2011 | 32.3
|
| 2012 | 33.1
|
| 2013 | 33.1
|
| 2014 | 34.5
|
| 2015 | 38.4
|
| 2016 | 38.0
|
| 2017 | 37.4
|
| 2018 | 39.1
|
| 2019 | 45.2
|
| 2020 | 44.6
|
| 2021 | 43.9
|
| 2022 | 46.2
|
| 2023 | 48.2
|
1901 లోనే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) భారతదేశంలో పిచ్‌బ్లెండ్, యురేనియం, థోరియనైట్‌తో సహా రేడియోధార్మిక ఖనిజాల గణనీయమైన నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. అయితే, తరువాతి 50 సంవత్సరాలలో, ఆ వనరులను వాడుకునే ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి, లేదా అసలు జరగనే లేదు.[11] 1920లు, 1930లలో, భారతీయ శాస్త్రవేత్తలు ఐరోపా, అమెరికాల్లోని తమ సహచరులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. భౌతిక శాస్త్రంలో తాజా పరిణామాల గురించి వారు బాగా తెలుసుకున్నారు. 1930 లలో ఐరోపాలో అనేక మంది భారతీయ భౌతిక శాస్త్రవేత్తలు, ముఖ్యంగా దౌలత్ సింగ్ కొఠారి, మేఘనాథ్ సాహా, హోమీ జె. భాభా, ఆర్.ఎస్. కృష్ణన్ వంటి వారు అణు భౌతిక శాస్త్రంలో మార్గదర్శక పరిశోధనలు నిర్వహించారు.
1939 నాటికి, కలకత్తా విశ్వవిద్యాలయంలో పాలిట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన మేఘనాథ్ సాహా, అణు విచ్ఛిత్తి ఆవిష్కరణ ప్రాముఖ్యతను గుర్తించాడు. అణు భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. 1940 లో అతను, విశ్వవిద్యాలయ పోస్ట్-గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాల్లో అణు భౌతిక శాస్త్రాన్ని చేర్చాడు.[12] అదే సంవత్సరంలో, సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ కలకత్తా విశ్వవిద్యాలయంలో సైక్లోట్రాన్‌ను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసింది. కానీ యుద్ధానికి సంబంధించిన వివిధ ఇబ్బందుల వలన ప్రాజెక్టు ఆలస్యమైంది.[13] 1944 లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పరిశోధనా పాఠశాలను స్థాపించిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త హోమి జె. భాభా, టాటా గ్రూప్ ఛైర్మన్, తన దూరపు బంధువూ ఐన జె.ఆర్.డి. టాటాకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో "కాస్మిక్ కిరణాలు, అణు భౌతిక శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ" ప్రాథమిక భౌతిక శాస్త్ర పరిశోధనా సంస్థను స్థాపించడానికి నిధులు అభ్యర్థించాడు. మరుసటి సంవత్సరమే ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) మొదలైంది.[14]
భారతదేశంలో అణుశక్తి స్థాపన
[మార్చు]1945 ఆగస్టులో హిరోషిమాపై అణు బాంబు దాడి తర్వాత, నార్మన్ ఫెదర్, జాన్ కాక్‌క్రాఫ్ట్ వద్ద అధ్యయనం చేసి, యురేనియంకు ఉన్న భారీ శక్తి-ఉత్పత్తి సామర్థ్యాన్ని గుర్తించిన అణు భౌతిక శాస్త్రవేత్త ఆర్.ఎస్. కృష్ణన్, "అణు విస్ఫోటనాల నుండి విడుదలయ్యే అపారమైన శక్తిని యంత్రాలను నడపడానికి అందుబాటులో ఉంచినట్లయితే, అది అపారమైన పారిశ్రామిక విప్లవాన్ని తెస్తుంది" అని గమనించాడు. అయితే, శాంతియుత వినియోగం కోసం అణుశక్తిని ఉపయోగించుకోవడంలో ఉన్న ఇబ్బందులను ఆయన ఇంకా గుర్తించాడు, "...అణుశక్తిని పారిశ్రామిక ఉపయోగంలోకి తీసుకురావడానికి ముందు చాలా ఎక్కువ పరిశోధన అవసరం."[15]
1946 మార్చిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద ఉన్న బోర్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (BSIR), భారతదేశ అణుశక్తి వనరులను అన్వేషించడానికీ, వాటిని అభివృద్ధి చేయడానికీ, ఉపయోగించుకునే మార్గాలను సూచించడానికీ, ఇతర దేశాలలో ఇలాంటి సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికీ భాభా నాయకత్వంలో ఒక అణు పరిశోధన కమిటీని ఏర్పాటు చేసింది.[16] అదే సమయంలో, ట్రావెన్‌కోర్ విశ్వవిద్యాలయం లోని పరిశోధనా మండలి ట్రావెన్‌కోర్ భవిష్యత్తు పారిశ్రామిక అభివృద్ధి గురించి చర్చించడానికి సమావేశమైంది. ఇతర విషయాలతోపాటు, అణుశక్తిలో వాటి అనువర్తనాలకు సంబంధించి, విలువైన థోరియం ధాతువు అయిన మోనాజైట్, ఇల్మనైట్ వనరులను రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కౌన్సిల్ సిఫార్సులు చేసింది. ఈ ప్రాజెక్టును అఖిల భారత కార్యక్రమం ద్వారా చేపట్టవచ్చని కౌన్సిల్ సూచించింది.[16] దీని తరువాత 1947 ఏప్రిల్‌లో భాభా, CSIR డైరెక్టర్ సర్ శాంతి స్వరూప్ భట్నాగర్ లను ట్రావెన్కోర్ కు డిప్యుటేషన్ ద్వారా పంపించారు. రాజ్య దివాన్ సర్ సి.పి. రామస్వామి అయ్యర్ తో వారు సంప్రదింపులు జరిపారు.[17]
1947 ప్రారంభంలో, యురేనియం కలిగిన ఖనిజాల వనరులను గుర్తించడం, అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద యురేనియం యూనిట్‌ను స్థాపించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.[18] భారత స్వాతంత్ర్యానికి రెండు నెలల ముందు, 1947 జూన్‌లో అప్పటి భారత తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమ, సరఫరా, విద్య, ఆర్థిక మంత్రిగా ఉన్న చక్రవర్తి రాజగోపాలాచారి, అణుశక్తి పరిశోధన కోసం ఒక సలహా మండలిని ఏర్పాటు చేశాడు. భాభా అధ్యక్షతన, CSIR కింద నియమించబడిన ఈ సలహా బోర్డులో సాహా, భట్నాగర్, అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా రామన్ ప్రభావాన్ని సహ-ఆవిష్కర్త సర్ కె.ఎస్. కృష్ణన్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త దారాషా నోషెర్వాన్ వాడియా, ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ విద్యార్థి నజీర్ అహ్మద్ ఉన్నారు. ట్రావెన్‌కోర్‌లోని మోనజైట్ వనరులను ఎలా ఉత్తమంగా ఉపయోగించుకోవాలో నిర్ణయించడానికి పైన పేర్కొన్న శాస్త్రవేత్తలు, ట్రావెన్‌కోర్ ప్రభుత్వానికి చెందిన ముగ్గురు ప్రతినిధులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు.[19] భారతదేశ స్వాతంత్ర్యం, విభజన తరువాత, ట్రావెన్కోర్ కొంతకాలం స్వతంత్రంగా ప్రకటించుకుని, తీవ్రమైన చర్చల తర్వాత 1949లో కొత్త భారతదేశంలో చేరింది. అయితే అహ్మద్ పాకిస్తాన్ వెళ్లిపోయి, అక్కడ ఆ దేశ అణుశక్తి సంస్థకు నాయకత్వం వహించాడు.
1948 మార్చి 23 న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భారత పార్లమెంటులో అణుశక్తి బిల్లును ప్రవేశపెట్టాడు.[20] దాన్నే తరువాత భారత అణుశక్తి చట్టంగా ఆమోదించారు. అణు ఖనిజాల కోసం సర్వే చేయడం, పారిశ్రామిక స్థాయిలో అటువంటి ఖనిజ వనరులను అభివృద్ధి చేయడం, శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని అభివృద్ధి చేయడంతో సంబంధం ఉన్న శాస్త్రీయ, సాంకేతిక సమస్యలపై పరిశోధనలు నిర్వహించడం ఈ చట్టంలోని ముఖ్యాంశాలు. అవసరమైన సిబ్బందికి శిక్షణ, విద్య, భారతీయ ప్రయోగశాలలు, సంస్థలు విశ్వవిద్యాలయాలలో అణు శాస్త్రాలలో ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించడం వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలను ఈ చట్టం ఇచ్చింది.[14] దాదాపు అదే సమయంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఒక అణు భౌతిక శాస్త్ర సంస్థ నిర్మాణాన్ని మంజూరు చేసింది; దీనికి 1948 మే నెలలో శంకుస్థాపన చేసారు.[21] ఈ సంస్థను 1950 జనవరి 11 న ఇరీన్ జోలియట్-క్యూరీ ప్రారంభించింది.[12]
1948 జూన్ 1 నుండి అమలులోకి వచ్చేలా, అణుశక్తి పరిశోధన సలహా బోర్డు, దాని మాతృ సంస్థ CSIR తో కలిసి, కొత్త శాస్త్రీయ పరిశోధన విభాగం కిందకి చేర్చి, నేరుగా ప్రధానమంత్రి కింద ఉంచబడింది. 1948 ఆగస్టు 3 న భారత అణుశక్తి కమిషన్‌ను (AEC), శాస్త్రీయ పరిశోధన విభాగం నుండి వేరు విడదీసి, స్థాపించారు. భాభా దాని మొదటి ఛైర్మన్.[22] 1949 జనవరిలో, AEC సైద్ధాంతిక, ప్రాథమిక భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సిలబస్‌ను రూపొందించడానికి, నాణ్యత గల శిక్షణ, విద్య అందేలా చూసుకోవడానికి, తగినంత సంఖ్యలో దేశానికి అణు శాస్త్రవేత్తలను తయారు చేసేందుకూ నిర్ణయాలు తీసుకుంది.[23] అదే సంవత్సరంలో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ను అన్ని ప్రధాన అణు శాస్త్ర పరిశోధన ప్రాజెక్టులకు కేంద్రంగా CSIR నియమించింది. 1950 లో ప్రభుత్వం అందుబాటులో ఉన్న యురేనియం. బెరీలియం ఖనిజాల నిల్వలను కొనుగోలు చేస్తామని ప్రకటిస్తూ, వాటికి సంబంధించిన కొత్త కనుగోళ్ళకు ఆవిష్కరణలకూ పెద్ద మొత్తంలో బహుమతులను ప్రకటించింది.[24][25] 1954 జనవరి 3 న అణు రియాక్టర్ పరిశోధన, సాంకేతిక సంబంధిత పరిణామాలన్నింటినీ ఏకీకృతం చేయడానికి ట్రోంబేలో అణు శక్తి కమిషన్ ద్వారా అణు శక్తి సంస్థను (AEET) స్థాపించారు. ఆగస్టు 3 న అణు శక్తి కమిషన్, దాని అధీన సంస్థలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, కలకత్తా విశ్వవిద్యాలయంలోని అణు పరిశోధన సంస్థతో సహా అన్నిటినీ కొత్త అణు శక్తి విభాగానికి బదిలీ చేసి, ప్రధాన మంత్రి కార్యాలయం ప్రత్యక్ష నేతృత్వంలో ఉంచారు.[14] 1956 మేలో ట్రోంబేలో యురేనియం మెటల్ ప్లాంట్, పరిశోధన రియాక్టర్ల కోసం ఇంధన మూలక తయారీ సౌకర్యం నిర్మాణం ప్రారంభమైంది; యురేనియం ప్లాంటు ఆపరేషన్ 1959 జనవరిలో మొదలైంది.[26] AEET (భాభా మరణం తర్వాత 1967లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా పేరు మార్చారు) 1957 లో అధికారికంగా ప్రారంభించారు.[26] భారత అణు పరిశోధన పరిధి విస్తరిస్తున్నందున, 1948 నాటి అణుశక్తి చట్టాన్ని 1961లో సవరించి, కొత్త అణుశక్తి చట్టంగా ఆమోదించారు. ఇది 1962 సెప్టెంబరులో అమల్లోకి వచ్చింది.[27][28][26]
ప్రారంభ పరిశోధన రియాక్టర్లు
[మార్చు]
1955 మార్చి 15న జరిగిన అణుశక్తి కమిషన్ సమావేశంలో, ట్రోంబేలో ఒక చిన్న అణు రియాక్టర్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రియాక్టరును భవిష్యత్తులో నిర్మించబోయే రియాక్టర్ల నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికీ పరిశోధనల కోసమూ ఉపయోగిస్తారు. ఇందులో అణు భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు, వికిరణ ప్రభావాలను అధ్యయనం చేయడం, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక పరిశోధనల కోసం ఐసోటోపుల ఉత్పత్తి వంటివీ ఉంటాయి.[29] 1955 అక్టోబరులో యునైటెడ్ కింగ్‌డమ్ అటామిక్ ఎనర్జీ అథారిటీ, భారత అటామిక్ ఎనర్జీ శాఖల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారతదేశం రూపొందించబోయే స్విమ్మింగ్ పూల్ రియాక్టర్ కోసం బ్రిటన్ యురేనియం ఇంధన మూలకాలను సరఫరా చేస్తుంది.[29] ఈ ఒప్పందం "అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలను ప్రోత్సహించడంలోను, అభివృద్ధి చేయడంలోనూ వీటి మధ్య సన్నిహిత సహకారం, పరస్పర సహాయాలను" నెలకొల్పుతుంది. తరువాతి కాలంలో అధిక ఫ్లక్స్ రియాక్టర్ నిర్మాణంలో భవిష్యత్తు రూపకల్పన సహకారాన్ని అందిస్తుంది.[30] అప్సర అని పేరు పెట్టబడిన ఈ రియాక్టరు 100 x 50 x 70 గల కాంక్రీట్ భవనంలో ఉంది. ఆసియాలోనే మొట్టమొదటి అణు రియాక్టరైన అప్సర, 1956 ఆగస్టు 4న మధ్యాహ్నం 3:45 గంటలకు క్రిటికల్ స్థితికి చేరుకుంది. 1957 జనవరి 20న ప్రధాన మంత్రి నెహ్రూ దీన్ని ప్రారంభించాడు.[29][31][32]
1955 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి లూయిస్ సెయింట్ లారెంట్ నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం కొలంబో ప్రణాళిక కింద భారతదేశం కోసం NRX- రకం రియాక్టర్‌ను నిర్మించడంలో సహాయం చేయడానికి ముందుకొచ్చింది. అప్పట్లో భారతదేశం, కెనడా రెండూ దీనిలో సభ్యులుగా ఉన్నాయి. శాంతియుత అణు పరిశోధన, అభివృద్ధిలో ఈ రియాక్టరు భారతదేశానికి బాగా ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి సెయింట్ లారెంట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వం తరపున, నెహ్రూ సెప్టెంబరులో ఈ ప్రతిపాదనను అధికారికంగా అంగీకరించాడు. కొలంబో ప్లాన్ సభ్య దేశాలతో సహా గుర్తింపు పొందిన విదేశీ శాస్త్రవేత్తలకు రియాక్టర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాడు.[33][34] 1956 ఏప్రిల్ 28 న నెహ్రూ, భారతదేశంలోని కెనడియన్ హై కమిషనర్ ఎస్కాట్ రీడ్ "కెనడా-ఇండియా కొలంబో ప్లాన్ అణు రియాక్టర్ ప్రాజెక్ట్" కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, కెనడా 40 MW CIRUS రియాక్టర్‌ను కేవలం పరిశోధన ప్రయోజనాల కోసం మాత్రమే అందిస్తుంది, రియాక్టర్ ప్రారంభ తయారీ, ఇంజనీరింగ్‌తో సహా, దాని ఆపరేషన్‌లో భారతీయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో సహా సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిస్తుంది. భారతదేశం రియాక్టర్ స్థలం, ఫౌండేషన్‌ను అందిస్తుంది. రియాక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం, స్థానిక కార్మికుల ఖర్చులు, ఏవైనా షిప్పింగ్, బీమా రుసుములతో సహా అన్ని "అంతర్గత" ఖర్చులను కూడా చెల్లిస్తుంది.[35] ఒప్పందంలోని ఆర్టికల్ II ప్రకారం, భారతదేశం రియాక్టర్ సౌకర్యాలను ఇతర కొలంబో ప్లాన్ దేశాలకు అందుబాటులో ఉంచుతుంది. ఆర్టికల్ III "రియాక్టరు నుండి వచ్చే ఏవైనా ఉత్పత్తులు శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడతాయి" అని నిర్దేశించింది;[35] అయితే, ఆ సమయంలో, ఈ నిబంధనను నిర్ధారించడానికి ఎటువంటి ప్రభావవంతమైన రక్షణలు లేవు.[36][34] రియాక్టరు కోసం 21 టన్నుల భారజలాన్ని సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వంతో మరో ఒప్పందం కుదిరింది.[37] రియాక్టర్ నిర్మాణం 1956 లో తరువాత ప్రారంభమైంది. భారతీయ సాంకేతిక సిబ్బందిని శిక్షణ కోసం చాక్ రివర్‌కు పంపారు.[38] CIRUS 1960 ప్రారంభంలో పూర్తయి, 1960 జూలైలో క్రిటికల్ స్థితి సాధించిన తర్వాత, 1961 జనవరిలో ప్రారంభమైంది.[39] మూడవ పరిశోధన రియాక్టర్ అయిన జెర్లినా (జీరో ఎనర్జీ రియాక్టర్ ఫర్ లాటిస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ న్యూ అసెంబ్లీస్) నిర్మాణం 1958లో ట్రోంబేలో ప్రారంభమైంది; జెర్లినాను కూడా 1961లో ప్రారంభించారు.[40]
వాణిజ్య అణు విద్యుత్ ప్రారంభం
[మార్చు]
1955 సెప్టెంబరులో, వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం నిర్మించాలనే అంశాన్ని పార్లమెంటులో చర్చించారు.[41] సోవియట్ యూనియన్‌లోని ఓబ్నిన్స్క్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం ప్రారంభమైన కొద్దికాలానికే, సోవియట్‌లు దానిని సందర్శించడానికి అనేక మంది భారతీయ నిపుణులను ఆహ్వానించారు; అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్, భారతీయ సాంకేతిక, శాస్త్రీయ సిబ్బందికి అణుశక్తిలో శిక్షణను అందించింది.[42] 1957 ఆగస్టులో అహ్మదాబాద్‌లోని (అప్పటి బొంబాయి రాష్ట్రంలో ఉంది) గుజరాత్ చాంబరు ఆఫ్ కామర్స్ సభ్యులు తమ నగరంలో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని అభ్యర్థించారు. ఆ సమయానికి భారత ప్రభుత్వం కనీసం "విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెద్ద అణు విద్యుత్ కేంద్రాల" నిర్మాణాన్ని చురుకుగా పరిశీలిస్తోంది.[43] 1958 నవంబరు నాటికి, అణుశక్తి కమిషన్ రెండు అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని సిఫార్సు చేసింది. ఒక్కొక్కటి రెండు యూనిట్లతో 500 MW విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో, మొత్తం 1000 MW ఉత్పాదక సామర్థ్యం కోసం ప్రతిపాదించారు. అణు రియాక్టర్ల నుండి కనీసం 250 MW విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రతిపాదనను మూడవ పంచవర్ష ప్రణాళికలో (1961–1966) చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.[44]
1960 ఫిబ్రవరిలో, పశ్చిమ భారతదేశంలో మొదటి విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. రాజస్థాన్, ఢిల్లీ సమీపంలో, మద్రాస్ సమీపంలోని ప్రదేశాలను ఇందుకోసం గుర్తించారు.[45] సెప్టెంబరులో పంజాబ్ ప్రభుత్వం, తమ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం నిర్మించాలని అభ్యర్థించింది.[46] 1960 అక్టోబరు 11న, భారత ప్రభుత్వం మహారాష్ట్రలోని తారాపూర్ సమీపంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రానికి టెండర్ జారీ చేసింది. ఒక్కొక్కటి దాదాపు 150 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే రెండు రియాక్టర్లతో, 1965లో ప్రారంభించాలని ప్రతిపాదించారు.[47] 1961 ఆగస్టులో భారత, కెనడియన్ ప్రభుత్వాలు రాజస్థాన్‌లో కెనడా-భారతదేశం అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై ఉమ్మడి అధ్యయనం నిర్వహించడానికి అంగీకరించాయి. డగ్లస్ పాయింట్ వద్ద ఉన్న CANDU రియాక్టర్ ఆధారంగా ఉండే ఈ రియాక్టరు 200 MW ఉత్పత్తి చేస్తుంది.[39] ఈ సమయానికి, తారాపూర్ విద్యుత్ కేంద్రం కోసం భారతదేశం దాఖలు చేసిన గ్లోబల్ టెండర్‌కు ఏడు స్పందనలు వచ్చాయి: యునైటెడ్ స్టేట్స్ నుండి మూడు, UK నుండి రెండు, ఫ్రాన్స్, కెనడాల నుండి ఒక్కొక్కటి వచ్చాయి.[48]
రాజస్థాన్‌లో భారతదేశపు మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ RAPP-1, కోసం ఒప్పందంపై 1963లో సంతకాలయ్యాయి. ఆ తర్వాత 1966లో RAPP-2 ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ రియాక్టర్లను సైనిక కార్యక్రమానికి ఉపయోగించకుండా చూసుకోవడానికి కఠినమైన భద్రతా చర్యలు ఉన్నాయి. RAPP-1, 1972 లో పనిచేయడం ప్రారంభించింది. సాంకేతిక సమస్యల కారణంగా రియాక్టర్ సామర్థ్యాన్ని 200 మెగావాట్ల నుండి 100 మెగావాట్లకు తగ్గించాల్సి వచ్చింది. సాంకేతిక, డిజైన్ సమాచారాన్ని అటామిక్ ఎనర్జీ ఆఫ్ కెనడా లిమిటెడ్ భారతదేశానికి ఉచితంగా అందించింది. 1974 లో భారతదేశపు మొదటి అణు విస్ఫోటనం తర్వాత యునైటెడ్ స్టేట్స్, కెనడాలు తమ సహాయాన్ని నిలిపివేసాయి.
ఇండియా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్లాన్లు
[మార్చు]భారతదేశపు అణు ఇంధన సామర్థ్యాలను విస్తరించడానికీ, ఇంధన భద్రత సాధించడానికీ దేశం తలపెట్టిన వ్యూహంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (FBR) కార్యక్రమం కీలకమైన భాగం. ఈ కార్యక్రమానికి కేంద్ర భాగం తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR). ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) అభివృద్ధి చేసిన PFBR అనేది 500 మెగావాట్ల సోడియం-కూల్డ్ ఫాస్ట్ రియాక్టరు. వినియోగించుకునే దానికంటే ఎక్కువ ఫిస్సైల్ పదార్థాన్ని ఉత్పత్తి చేసేలా దీన్ని రూపొందించారు. ఇది ప్లూటోనియం-239, యురేనియం-238 ల మిశ్రమమైన మిశ్రమ ఆక్సైడ్ (MOX) ఇంధనాన్ని ఉపయోగించి యురేనియం-238 నుండి ప్లూటోనియం-239 ను ఉత్పత్తి చేయడమే దీని లక్ష్యం.
భారతదేశపు దీర్ఘకాలిక అణుశక్తి ప్రణాళికలకు ఈ సాంకేతికత కీలకమైనది. దేశంలో విస్తారంగా ఉన్న థోరియం, యురేనియం నిల్వలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుంది. వినియోగించే దానికంటే ఎక్కువ ఫిస్సైల్ పదార్థాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా PFBR, అణు ఇంధన వనరుల జీవితకాలాన్ని గణనీయంగా పొడిగించగలదు. పైగా, FBR కార్యక్రమం విజయం భారతదేశ ఇంధన భద్రత, స్థిరత్వ లక్ష్యాల సాధనకు కూడా దోహదపడుతుంది. దిగుమతి చేసుకున్న ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు ఇది మద్దతు ఇస్తుంది.
ఇటీవలి పరిణామాలు
[మార్చు]కూడంకుళం యూనిట్లు 1 & 2 విజయవంతంగా ప్రారంభించబడిన తర్వాత, 2017 జూన్‌లో రష్యాతో 5 & 6 యూనిట్ల (2 x 1000 MW) కోసం ఒక్కో మెగావాట్టుకు 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక ఒప్పందం కుదిరింది.[49][50] అంతకుముందు, 2016 అక్టోబరులో రష్యాతో 3 & 4 యూనిట్ల (2 x 1000 MW) కోసం మెగావాట్టుకు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మరొక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.[49]
అణు ఇంధన నిల్వలు
[మార్చు]భారతదేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నాయి. దేశం దాని అణు విద్యుత్ పరిశ్రమకు ఇంధనంగా యురేనియం దిగుమతులపై ఆధారపడి ఉంది. 1990ల ప్రారంభం నుండి, రష్యా భారతదేశానికి అణు ఇంధనాన్ని అందించే ప్రధాన సరఫరాదారుగా ఉంది.[51] దేశీయ యురేనియం నిల్వలు తగ్గుతున్న కారణంగా,[52] భారతదేశంలో అణు విద్యుత్ నుండి విద్యుత్ ఉత్పత్తి 2006 నుండి 2008 నాటికి 12.83% తగ్గింది.[53] 2008 సెప్టెంబరులో అణు సరఫరాదారుల బృందం (NSG) నుండి మినహాయింపు పొందిన తరువాత, అంతర్జాతీయ అణు వాణిజ్యాన్ని ప్రారంభించడానికి వీలు కలిగింది.[54] ఫ్రాన్స్,[55] యునైటెడ్ స్టేట్స్,[56] యునైటెడ్ కింగ్‌డమ్,[57] కెనడా,[58] దక్షిణ కొరియాలతో సహా అనేక ఇతర దేశాలతో పౌర అణుశక్తి సాంకేతిక సహకారాల కోసం భారతదేశం ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసింది.[59] రష్యా,[60][61] మంగోలియా,[62] కజకిస్తాన్,[63] అర్జెంటీనా, నమీబియాలతో కూడా యురేనియం సరఫరా ఒప్పందాలు చేసుకుంది.[64] నైగర్‌లో యురేనియం అన్వేషణ ఒప్పందాన్ని ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ గెలుచుకుంది.[65]
2011 మార్చిలో, భారత అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లె బెల్ట్‌లోను, కర్ణాటకలోని భీమా బేసిన్‌లోనూ పెద్ద ఎత్తున యురేనియం నిక్షేపాలను కనుగొంది. తుమ్మలపల్లె బెల్ట్ యురేనియం నిల్వలు ప్రపంచంలోని టాప్ 20 యురేనియం నిల్వల ఆవిష్కరణలలో ఒకటిగా నిలుస్తాయి. ఈ బెల్ట్‌లో ఇప్పటివరకు 44,000 టన్నుల సహజ యురేనియం కనుగొనబడింది. ఇంతకు మూడు రెట్ల నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయని అంచనా.[66][67][68] భీమా బేసిన్‌లోని సహజ యురేనియం నిక్షేపాలు తుమ్మలపల్లె బెల్ట్ కంటే చిన్నవి అయినప్పటికీ, అక్కడ సహజ యురేనియం ఖనిజం యొక్క మెరుగైన గ్రేడ్ ఉంది.
ఇటీవలి సంవత్సరాలలో, తక్కువ-గ్రేడ్ యురేనియం (92,000 టన్నులు) నిల్వలతో పోలిస్తే బీచ్ ఇసుకలో మోనాజైట్ రూపంలో పెద్ద మొత్తంలో థోరియం నిక్షేపాలు (518,000 టన్నులు) ఉండటం వల్ల భారతదేశం థోరియం ఇంధనాలపై ఆసక్తిని పెంచుకుంది.[69]
2015–19 మధ్యకాలంలో 5,000 టన్నుల యురేనియంను సరఫరా చేస్తూ కజకిస్తాన్ భారతదేశానికి అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది.[70] రాజస్థాన్‌లో, సికార్ జిల్లాలోని రోహిల్‌లో 15000 టన్నులకు పైగా యురేనియం ఖనిజ నిక్షేపాలను కనుగొన్నారు.[71]
ఇతర దేశాలతో అణు ఒప్పందాలు
[మార్చు]2016 నాటికి, భారతదేశం 14 దేశాలతో పౌర అణు ఒప్పందాలపై సంతకం చేసింది. అవి: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జపాన్, కజకిస్తాన్, మంగోలియా, నమీబియా, రష్యా, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, వియత్నాం.[72] 48 దేశాలతో కూడిన NSG, 2008 సెప్టెంబరు 6న భారతదేశానికి మినహాయింపును మంజూరు చేసింది. దీని ద్వారా ఇతర దేశాల నుండి పౌర అణు సాంకేతికతను, ఇంధనాన్నీ పొందేందుకు వీలు కల్పించింది.[73] అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT)లో భాగం కాకుండానే, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో అణ్వాయుధాల వాణిజ్యం నిర్వహించడానికి అనుమతి ఉన్న ఏకైక దేశం భారతదేశం.[74]
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగోలియా పర్యటన సందర్భంగా, భారతదేశానికి యురేనియం సరఫరా కోసం భారత, మంగోలియాలు 2009 జూన్ 15న కీలకమైన పౌర అణు ఒప్పందంపై సంతకం చేశాయి. దీనితో భారతదేశంతో పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన ప్రపంచంలో ఇది ఐదవ దేశంగా నిలిచింది. "రేడియోధార్మిక ఖనిజాలు, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకునే రంగంలో సహకార అభివృద్ధి"పై రెండు దేశాల అణుశక్తి శాఖలోని సీనియర్ అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.[75]
2009 సెప్టెంబరు 2 న భారత నమీబియాలు ఐదు ఒప్పందాలపై సంతకం చేశాయి. వాటిలో ఒకటి నమీబియా నుండి యురేనియం సరఫరా ఒప్పందం. 2009 మేలో అధ్యక్షుడు హిఫికెపున్యే పోహంబా ఐదు రోజుల భారతదేశ పర్యటన సందర్భంగా దీనిపై సంతకాలయ్యాయి. నమీబియా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకోవడంలో ఇండో-నమీబియన్ ఒప్పందం యురేనియం సరఫరా, అణు రియాక్టర్ల ఏర్పాటుకు అనుమతిస్తుంది.[64] 2009 అక్టోబరు 14 న, భారతదేశం, అర్జెంటీనాలు న్యూఢిల్లీలో పౌర అణు సహకారంపై ఒక ఒప్పందంపైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడానికి తొమ్మిది ఇతర ఒప్పందాలపైనా సంతకం చేశాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఒప్పందంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ కట్జూ, అర్జెంటీనా విదేశాంగ మంత్రి జార్జ్ తలాన సంతకం చేశారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంలో వారి వారి సామర్థ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, భారత అర్జెంటీనాలు రెండూ ఈ రంగంలో పరస్పర ప్రయోజనం కోసం శాస్త్రీయ, సాంకేతిక, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి.[76][77]
భారతదేశం, కెనడా ప్రధాన మంత్రులు 2010 జూన్ 28 న టొరంటోలో ఒక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకం చేశారు. అది అమలయ్యాక, కెనడా అణు పరిశ్రమకు భారతదేశంలో విస్తరిస్తున్న అణు మార్కెట్ అందుబాటు లోకి వస్తుంది. భారతదేశ రియాక్టర్లకు ఇంధనాన్ని కూడా అందిస్తుంది. కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ఎగుమతిదారులలో ఒకటి.[78] కెనడా వద్ద ఉన్న భారజల అణు సాంకేతికత భారతదేశం, పాకిస్తాన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, రొమేనియా, చైనాలలో పనిచేస్తున్న CANDU- రకం యూనిట్లతో విదేశాలకు విక్రయించబడుతోంది. 2012 నవంబరు 6 న భారత కెనడాలు తమ 2010 అణు ఎగుమతి ఒప్పందాన్ని ఖరారు చేశాయి. దీనితో కెనడా భారతదేశానికి యురేనియం ఎగుమతులను ప్రారంభించడానికి మార్గం సుగమమయింది.[79]
2011 ఏప్రిల్ 16 న భారతదేశం కజకిస్తాన్ అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకోవడంలో సహకారం కోసం అంతర్-ప్రభుత్వ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది ఇంధన సరఫరా, అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ, యురేనియం అన్వేషణ, ఉమ్మడి మైనింగ్, శాస్త్రీయ, పరిశోధన సమాచార మార్పిడి, రియాక్టర్ భద్రతా యంత్రాంగాలు, ఆరోగ్య సంరక్షణ కోసం రేడియేషన్ టెక్నాలజీల ఉపయోగం కోసం చట్టపరమైన చట్రాన్ని రూపొందిస్తుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్తానాను సందర్శించి, అక్కడ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. చర్చల తర్వాత, కజకిస్తాన్ అధ్యక్షుడు నజర్బాయేవ్ తన దేశం భారతదేశానికి 2100 టన్నుల యురేనియం సరఫరా చేస్తుందనీ, మరిన్ని చేయడానికి సిద్ధంగా ఉందనీ ప్రకటించారు. కజకిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు. 2009 జనవరి నుండి భారత కజకిస్తాన్‌ల మధ్య పౌర అణు సహకారం ఉంది. ఆ సంవత్సరం నజర్బాయేవ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), కజకిస్తాన్ అణు సంస్థ KazAtomProm ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం ప్రకారం, కాజ్అటమ్‌ప్రోమ్, భారత రియాక్టర్లలో ఉపయోగించే యురేనియంను సరఫరా చేస్తుంది.[80][81]
2008లో అణు సరఫరాదారుల బృందం (NSG) నుండి మినహాయింపు పొందిన తర్వాత భారతదేశంతో అణు ఒప్పందంపై సంతకం చేసిన తాజా దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 2011 జూలై 25 న భారత దక్షిణ కొరియాలు ఒక అణు ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం దక్షిణ కొరియాకు చట్టబద్ధమైన పునాది ఉన్నందున భారతదేశ అణు విస్తరణ కార్యక్రమంలో పాల్గొనడానికి, భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి బిడ్ వేయడానికి వీలు కల్పిస్తుంది.[82]
2014 లో భారత ఆస్ట్రేలియాలు భారతదేశానికి యురేనియం ఎగుమతి చేయడానికి అనుమతించే పౌర అణు ఒప్పందంపై సంతకం చేశాయి. 2014 సెప్టెంబరు 4న ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబాట్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో దీనిపై సంతకాలు జరిగాయి. ప్రపంచంలో యురేనియం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉంది. ఈ ఒప్పందం భారతదేశంలో పౌర వినియోగం కోసం శాంతియుత విద్యుత్ ఉత్పత్తికి యురేనియం సరఫరాను అనుమతిస్తుంది.[83][84]
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యుకె ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ 2015 నవంబరు 12 న పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు.[85]
రియాక్టర్ ఒప్పందాలు
[మార్చు]భారతదేశానికి అణు ఎగుమతులను అనుమతించడానికి అణు సరఫరాదారుల బృందం అంగీకరించిన తర్వాత, 2008 సెప్టెంబరు 30న భారతదేశంతో పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశం ఫ్రాన్స్.[86] 2010 డిసెంబరులో ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భారతదేశాన్ని సందర్శించినప్పుడు, ఒక్కొక్కటీ 1650 మెగావాట్ల సామర్థ్యం గల మూడవ తరం EPR రియాక్టర్లు రెండింటిని ఏర్పాటు చేయడానికి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలపై సంతకం చేసారు. ఈ రియాక్టర్లను ఫ్రెంచ్ కంపెనీ అరేవా, మహారాష్ట్రలోని జైతాపూర్ వద్ద గల ప్లాంటుకు సరఫరా చేస్తుంది. ప్రతిపాదించిన మొత్తం ఆరు రియాక్టర్లలో, ఈ ఒప్పందం మొదటి రెండింటిని సరఫరా చేస్తుంది, 25 సంవత్సరాల పాటు అణు ఇంధన సరఫరాను కూడా అందిస్తుంది.[87] భారతదేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో జపాన్ నుండి ప్రధాన భాగాలను సేకరించడంలో నియంత్రణ సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంది.[88][89]

2021 ఏప్రిల్‌లో ఫ్రెంచ్ గ్రూప్ EDF జైతాపూర్ సైట్‌లో 9.6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఆరు మూడవ తరం EPR అణు రియాక్టర్లను నిర్మించడానికి ఒక బైండింగ్ ఆఫర్‌ను ఇచ్చింది.[90]
2016 నవంబరులో జపాన్, భారతదేశంతో అణు సహకార ఒప్పందంపై సంతకం చేసింది. ఫుకుషిమా దైచి అణు విపత్తు తరువాత దేశీయంగా ఆర్డర్లు ఆగిపోయినందున, జపాన్ అణు విద్యుత్ ప్లాంట్ బిల్డర్లు దీనిని ఒక మంచి జీవనాధార అవకాశంగా భావించారు. భారతదేశం రాబోయే దశాబ్దంలో సుమారు 20 కొత్త రియాక్టర్లను నిర్మించాలని ప్రతిపాదిస్తోంది.[91]
రెండు VVER 1000 మె.వా.ల రియాక్టర్లను (నీటితో చల్లబడే, నీటితో మోడరేటయ్యే, తేలిక నీటి విద్యుత్ రియాక్టర్లు) తమిళనాడులోని కూడంకుళం వద్ద ఏర్పాటు చేయడానికి సంబంధించి రష్యాకు, భారతదేశంతో 1988 నాటి ఒప్పందం ఒకటి ఉంది.[92] 2008 లో చేసుకున్న మరో ఒప్పందం ప్రకారం, 1170 మె.వా.ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు, మూడవ తరం VVER-1200 రియాక్టర్లను అదనంగా ఏర్పాటు చేస్తారు.[93] భారతదేశం తన అణు జలాంతర్గామి కోసం అణు కర్మాగారాన్ని రూపొందించే ప్రయత్నాలకు రష్యా సహాయం చేసింది.[94] 2009 లో భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతిపై ఆంక్షలకు రష్యా అంగీకరించదని రష్యా ప్రకటించింది. 2009 డిసెంబరులో రష్యాతో సంతకం చేసిన కొత్త ఒప్పందంతో భారతదేశం సంపూర్ణ ఇంధన చక్ర సాంకేతికత లభిస్తుంది. ఇందులో మైనింగ్, రియాక్టర్లలో ఉపయోగం కోసం ఇంధనాన్ని తయారు చేయడం, ఖర్చు చేసిన ఇంధనాన్ని తిరిగి ప్రాసెస్ చేయడం వంటివి ఉన్నాయి.[95][96]
2018 అక్టోబరులో, దేశంలో 6 అణు రియాక్టర్లను నిర్మించడానికి భారత రష్యాలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని రియాక్టర్ తయారీదారు రోసాటమ్ తన మూడవ తరం VVER రియాక్టర్లను అందించనున్నట్లు పేర్కొంది. ఇది ఒక నిర్మాణాత్మకమైన ఒప్పందమేమీ కాదు, కానీ ఒక నిర్మాణాత్మక ఒప్పందం దిశగా పనిచేయడానికి కుదిరిన ఒక ఒప్పందం.[97]
అమెరికాతో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం భారతదేశం, అమెరికా నుండి 10,000 మె.వా.ల అణు విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఉద్దేశ్య లేఖను జారీ చేసింది. భారతదేశ అణు బాధ్యత చట్టం విదేశీ అణు కంపెనీలను నిరుత్సాహపరుస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్ సరఫరాదారుల నుండి ప్రమాద బాధితులు నేరుగా నష్టపరిహారాన్ని కోరే హక్కును ఇస్తుంది.
ఇది "జనరల్ ఎలక్ట్రిక్, వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ వంటి విదేశీ కంపెనీలను నిరోధించింది, ప్రైవేట్ ఆపరేటర్లకు పరిహార బాధ్యతపై మరింత స్పష్టత ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి." భారతదేశంలో 6 రష్యన్ అణు రియాక్టర్లను నిర్మించడానికి భారత రష్యాలు 2018 అక్టోబరు 5 న ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.[98]
MV రమణ విశ్లేషణ ప్రకారం, భారతదేశంలోని PHWR ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్లకు అవుతున్న ఖర్చు, బొగ్గు విద్యుత్ కేంద్రాల ధరకు దగ్గరగా ఉన్నాయి.[99]
అణు విద్యుత్ ప్రణాళికలు
[మార్చు]
2009 నాటికి భారతదేశం, తన వచ్చే 25 ఏళ్ళలో, మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో అణు విద్యుత్ వాటాను 2.8% నుండి 9%కి పెంచాలని ప్రణాళిక వేసుకుంది.[100] 2023 నాటికి భారతదేశంలో 3.1% గా ఉన్న అణు విద్యుత్ ఉత్పత్తి, బహుళ IPHWR-700, VVER-1000 రియాక్టర్ల ప్రారంభంతో ఈ వాటా పెరుగుతుందని అంచనా. 2033 నాటికి భారత్ స్మాల్ రియాక్టర్లు (BSRలు) అని కూడా పిలువబడే కనీసం 5 స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన SMRలను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుని, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (SMRలు) పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించడానికి కేంద్ర బడ్జెట్ FY26 అణుశక్తి మిషన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 జనవరి 30 నాటికి, భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 8180 మెగావాట్లు.[101]
భారత అమెరికా పౌర అణు ఒప్పందం ఆమోదం పొందడం వల్ల, రాబోయే సంవత్సరాల్లో భారత అణు విద్యుత్ పరిశ్రమ గణనీయమైన విస్తరణకు లోనవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో భారతదేశం ఇతర దేశాలతో అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానాల వాణిజ్యాన్ని నిర్వహించడానికీ, దాని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికీ వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం అమలులోకి వచ్చాక, 2020 నాటికి 25 గిగావాట్ల అదనపు అణు సామర్త్య్హం చేరి,. మొత్తం సామర్థ్యం 45 గిగావాట్లకు చేరుకుంటుంది.[102] ఇంకా, 2047 నాటికి కనీసం 100 GW అణుశక్తి లక్ష్యాన్ని సాధించడానికి అణుశక్తి చట్టం, అణు నష్టానికి పౌర బాధ్యత చట్టాన్ని సవరించాలని కేంద్ర బడ్జెట్ FY26 ప్రతిపాదించింది.
అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన నష్టాలు భారత శాసనసభ్యులను 2010 అణు బాధ్యత చట్టాన్ని అమలు చేయడానికి ప్రేరేపించాయి. ప్రమాదం జరిగినప్పుడు అణు సరఫరాదారులు, కాంట్రాక్టర్లు, ఆపరేటర్లు ఆర్థిక బాధ్యతను భరించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఈ చట్టం అణు వికిరణం, భద్రతా నిబంధనలు, అణు విద్యుత్ ప్లాంట్ల కార్యాచరణ నియంత్రణ, నిర్వహణ, రేడియేషన్-లీక్ ప్రమాదం జరిగినప్పుడు పరిహారం, విపత్తు శుభ్రపరిచే ఖర్చులు, ఆపరేటర్ బాధ్యత, సరఫరాదారు బాధ్యత వంటి కీలక అంశాలను పరిష్కరిస్తుంది.[103] 2011 ఫుకుషిమా దైచి అణు విపత్తు వంటి ప్రమాదం ఇక్కడ జరిగితే అధిక జనాభా కలిగిన భారతదేశంలో తీవ్ర ఆర్థిక పరిణామాలను కలిగిస్తుంది. 1984 యూనియన్ కార్బైడ్ భోపాల్ విపత్తు వలె, ఇది ప్రపంచంలోని అత్యంత దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా మిగిలిపోతుంది.[104]
ప్రస్తుతం IAEA భద్రతా ప్రమాణాల కింద ఉన్న తేలిక నీటి రియాక్టర్ల కోసం భారతదేశం ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఎన్‌రిచ్‌డ్ యురేనియంను ఉపయోగిస్తోంది. దాని రియాక్టర్లకు మద్దతు ఇవ్వడానికి అణు ఇంధన చక్రంలోని ఇతర అంశాలను కూడా అభివృద్ధి చేసుకుంది. దిగుమతుల నిరోధాల వల్ల అవసరమైన కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావం పడింది. భార జల రియాక్టర్ల వాడకం దేశానికి ప్రత్యేకించి ఆకర్షణీయంగా ఉంది - ఎందుకంటే దీనివలన యురేనియంను తక్కువ శుద్ధితో లేదా అస్సలు శుద్ధి చెయ్యకుండానే వాడేందుకు వీలు కలుగుతుంది. థోరియం ఇంధన చక్రం అభివృద్ధిలో కూడా భారతదేశం గొప్ప కృషి చేసింది. దేశంలో యురేనియం నిక్షేపాలు పరిమితంగా ఉండగా, థోరియం నిల్వలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకే ద్రవ్యరాశి గల థోరియం ఇంధనం, యురేనియం కంటే వందల రెట్ల శక్తిని అందించగలదు. థోరియంను సిద్ధాంతపరంగా భారీ నీటి రియాక్టర్లలో ఉపయోగించవచ్చనే వాస్తవం ఈ రెండింటి అభివృద్ధిని ముడిపెట్టింది.
ఆయుధ కార్యక్రమానికి ఉపయోగించే యురేనియంను విద్యుత్ కార్యక్రమం నుండి వేరు చేసి, స్వదేశీ నిల్వ లోని యురేనియంను ఉపయోగించారు. ఈ దేశీయ నిల్వ 80,000 నుండి 112,000 టన్నుల వరకు ఉంది (ప్రపంచ యురేనియం నిల్వలలో సుమారు 1%). భారతదేశ వాణిజ్య, సైనిక రియాక్టర్లన్నింటినీ సరఫరా చేయడానికీ, భారతదేశ అణ్వాయుధ ఆయుధశాల అవసరాలన్నింటినీ తీర్చడానికీ ఇది సరిపోతుంది. ప్రస్తుతం, భారతదేశ అణు విద్యుత్ రియాక్టర్లు సంవత్సరానికి గరిష్టంగా 478 టన్నుల యురేనియంను వాడుతున్నాయి.[105] భారతదేశం దాని అణు విద్యుత్ ఉత్పత్తిని (రియాక్టర్ బేస్) నాలుగు రెట్లు పెంచి 2020 నాటికి 20 గిగావాట్లకు చేరుకున్నప్పటికీ, అణు విద్యుత్ ఉత్పత్తికి సంవత్సరానికి 2000 టన్నుల యురేనియం మాత్రమే ఖర్చవుతుంది. భారతదేశంలో వాణిజ్యపరంగా లాభదాయకమైన నిల్వలు 80,000 నుండి 112,000 టన్నుల వరకు ఉన్నాయి,. భారతదేశ అణు విద్యుత్ రియాక్టర్లకు 40–50 సంవత్సరాల పాటు ఈ నిల్వలు సరిపోతాయి. అంటే భారతదేశపు దేశీయ విచ్ఛిత్తి పదార్థాల సరఫరా దాని వ్యూహాత్మక అణ్వాయుధ సామగ్రి అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. అంటే, భవిష్యత్తులో దేశ వ్యూహాత్మక, విద్యుత్ అవసరాలను తీర్చడానికి తగినంత యురేనియం వనరులున్నాయి.[105]

భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం తన పదవిలో ఉన్నప్పుడు, "ఇంధన స్వాతంత్ర్యం భారతదేశానికి మొదటి, అత్యున్నత ప్రాధాన్యత అనీ, భారతదేశం థోరియం ఆధారిత రియాక్టర్లను ఉపయోగించి అణు విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున వెళ్లాలనీ, థోరియం మన దేశంలో సమృద్ధిగా లభిస్తుందనీ చెప్పాడు.[106] భారతదేశంలో విస్తారమైన థోరియం నిల్వలు, చాలా పరిమితమైన యురేనియం నిల్వలూ ఉన్నాయి.[107][108]
భారతదేశ అణు కార్యక్రమపు దీర్ఘకాలిక లక్ష్యం అధునాతన భార జల థోరియం చక్రాన్ని అభివృద్ధి చేయడం. దీనిలో మొదటి దశలో సహజ యురేనియంతో ఇంధనంగా పనిచేసే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (PHWR), ప్లూటోనియంను ఉత్పత్తి చేసే తేలిక నీటి రియాక్టర్లనూ ఉపయోగిస్తారు. రెండవ దశలో ప్లూటోనియంను వాడే వేగవంతమైన న్యూట్రాన్ రియాక్టర్లను ఉపయోగిస్తారు. కోర్ చుట్టూ యురేనియం, థోరియం ఉన్న దుప్పటి ఉంటుంది, తద్వారా మరింత ప్లూటోనియం (ఆదర్శంగా అధిక-విచ్ఛిత్తి Pu) అలాగే U-233 ఉత్పత్తి అవుతాయి. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (AMD) దాదాపు 12 మిలియన్ టన్నుల మోనజైట్ వనరులను (సాధారణంగా 6-7% థోరియంతో) గుర్తించింది. 3వ దశలో, అడ్వాన్స్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (AHWR) థోరియం-ప్లూటోనియం ఇంధనాలను U-233ని ఉత్పత్తి చేసే విధంగా మండిస్తాయి. ఇది చివరికి AHWRల బ్రీడింగ్ సముదాయానికి స్వయం-స్థిరమైన ఫిస్సైల్ డ్రైవర్‌గా ఉపయోగించబడుతుంది. మూడవదశకు ప్రత్యామ్నాయంగా సాల్ట్ బ్రీడర్ రియాక్టర్లు (MSBR) ఉండవచ్చు. పెద్ద ఎత్తున ఏర్పటు చేసేందుకు దీనిద్వారా సాధ్యపడుతుందని భావిస్తున్నారు.[72]
2014 జూన్‌లో కుడంకుళం-1 భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌గా (1000 MWe) నిలిచింది.[109][110]
2021 జనవరిలో, భారత అణుశక్తి కార్యదర్శి కె.ఎన్. వ్యాస్, కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రం లోని 700-మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టరు, దేశంలో నిర్మించ తలపెట్టిన 16 యూనిట్లలో మొదటిది అని ప్రకటించారు.
అణు విద్యుత్ ప్లాంట్ల జాబితా
[మార్చు]
అణు విద్యుత్ ఉత్పత్తి
[మార్చు]దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. :[111]
| ఆర్థిక సంవత్సరం | అణు విద్యుత్తు జనరేషన్ ( GWh ) |
సామర్థ్య కారకం |
|---|---|---|
| 2008–09 | 14,921 | 50% |
| 2009–10 | 18,798 | 61% |
| 2010–11 | 26,472 | 71% |
| 2011–12 | 32,455 | 79% |
| 2012–13 | 32,863 | 80% |
| 2013–14 | 35,333 | 83% |
| 2014–15 | 37,835 | 82% |
| 2015–16 | 37,456 | 75% |
| 2016–17 | 37,674 | 80% |
| 2017–18 | 38,336 | 70% |
| 2018–19 | 37,813 | 70% |
| 2019–20 | 46,472 | 82% |
| 2020–21 | 43,029 | 81% |
| 2021–22 | 47,112 | 88% |
| 2022–23 | 45,855 | 87% |
| 2023–24 | 47,971 | 85% |
అణు వ్యతిరేక నిరసనలు
[మార్చు]2011 మార్చిలో జపాన్‌లో జరిగిన ఫుకుషిమా అణు విపత్తు తరువాత, ప్రతిపాదిత భారతీయ అణు విద్యుత్ కేంద్రాల చుట్టుపక్కల నివసించే ప్రజలు నిరసనలు ప్రారంభించారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి.[5] మహారాష్ట్రలో ఫ్రెంచ్ సహకారంతో నిర్మించిన 9,900 మెగావాట్ల జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు, తమిళనాడులోని రష్యా మద్దతుతో నిర్మించిన 2,000 మెగావాట్ల కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కూ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొదట హరిపూర్ పట్టణానికి సమీపంలో 6 రష్యన్ రియాక్టర్లతో 6,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అనుమతి నిరాకరించింది.[5][112] కానీ స్థానికుల నుండి తీవ్ర ప్రతిఘటన రావడంతో, ఈ అణు విద్యుత్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని కావలికి తరలించారు.[113] గుజరాత్‌లోని మితి విర్డి వద్ద నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్‌ను అక్కడి స్థానికులు ప్రతిఘటించడంతో, దాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని కొవ్వాడకు తరలించారు.[114]
ప్రభుత్వ పౌర అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) కూడా దాఖలైంది. "స్వతంత్ర ఏజెన్సీలు సంతృప్తికరమైన భద్రతా చర్యలు, ఖర్చు-ప్రయోజన విశ్లేషణలను పూర్తి చేసే వరకు అన్ని ప్రతిపాదిత అణు విద్యుత్ ప్లాంట్లను నిలిపివేయాలని" PIL ప్రత్యేకంగా అడిగింది.[6][115] కానీ అణు బాధ్యత అంశంపై ప్రభుత్వానికి దిశానిర్దేశం జారీ చేయడానికి తాము అణు రంగంలో నిపుణులం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.[116]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశ ఇంధన విధానం
- భారతదేశంలో విద్యుత్ రంగం
- భారతదేశంలో శక్తి
- భారతదేశంలో పునరుత్పాదక శక్తి
మూలాలు
[మార్చు]- ↑ "Kudankulam nuclear plant begins power generation". Mumbai Mirror. 22 October 2013. Retrieved 29 January 2014.
- ↑ "India Installed Capacity" (PDF). Archived from the original (PDF) on 20 May 2018. Retrieved 5 June 2018.
- ↑ "Home". Nuclear Power Corporation of India Limited. Retrieved 2022-03-08.
- ↑ "India eyeing 64,000 MW nuclear power capacity by 2032: NPCIL". The Economic Times. 11 October 2010.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 Siddharth Srivastava (27 October 2011). "India's Rising Nuclear Safety Concerns". Asia Sentinel.
- ↑ 6.0 6.1 Ranjit Devraj (25 October 2011). "Prospects Dim for India's Nuclear Power Expansion as Grassroots Uprising Spreads". Inside Climate News.
- ↑ Pham, Lisa (20 October 2009). "Considering an Alternative Fuel for Nuclear Energy". The New York Times.
- ↑ "BP Statistical Review of World Energy June 2017" (PDF). BP. Retrieved 1 March 2018.
- ↑ "BP Statistical Review of World Energy" (in ఇంగ్లీష్). BP. Retrieved 5 January 2020.
- ↑ "Electricity production by source".
- ↑ Srinivasan, N. R. (May 1950). "Uranium Minerals of India" (PDF). Current Science. Retrieved 25 August 2017.
- ↑ 12.0 12.1 "Saha Institute of Nuclear Physics - History". Saha Institute of Nuclear Physics. Retrieved 25 August 2017.
- ↑ "Nuclear Physics at the Calcutta University" (PDF). Current Science. May 1948. Retrieved 25 August 2017.
- ↑ 14.0 14.1 14.2 "Homi J. Bhabha (1909-1966)" (PDF). Indian National Science Academy. Retrieved 25 August 2017.
- ↑ Krishnan, R. S. (August 1945). "Atomic Energy" (PDF). Current Science. Retrieved 20 February 2017.
- ↑ 16.0 16.1 "University of Travancore - Council of Research" (PDF). Current Science. March 1946. Retrieved 25 August 2017.
- ↑ "Atomic Research - Science Notes and News" (PDF). Current Science. April 1947. Retrieved 25 August 2017.
- ↑ "Uranium Unit of the Geological Survey - Science Notes and News" (PDF). Current Science. March 1947. Retrieved 26 August 2017.
- ↑ "Atomic Energy Research - Science Notes and News" (PDF). Current Science. June 1947. Retrieved 25 August 2017.
- ↑ "Atomic Energy in India - Science Notes and News" (PDF). Current Science. April 1948. Retrieved 25 August 2017.
- ↑ "Nuclear Physics at the Calcutta University - Science Notes and News" (PDF). Current Science. May 1948. Retrieved 2 September 2017.
- ↑ "Department of Scientific Research - Science Notes and News" (PDF). Current Science. August 1948. Retrieved 25 August 2017.
- ↑ "Atomic Energy Commission - Science Notes and News" (PDF). Current Science. March 1949. Retrieved 3 September 2017.
- ↑ "Government to Purchase Uranium Stocks - Science Notes and News" (PDF). Current Science. August 1950. Retrieved 3 September 2017.
- ↑ "Rewards for Discovery of Uranium and Beryl Ores - Science Notes and News" (PDF). Current Science. May 1950. Retrieved 3 September 2017.
- ↑ 26.0 26.1 26.2 Lal, Sham, ed. (1978). The Times of India Directory & Year Book, Including Who's Who: 1978. Times of India Press. pp. 149–153.
- ↑ "Rajya Sabha Debates (1961) - Proposal to amend the Atomic Energy Act" (PDF). Government of India. 13 December 1961. Retrieved 22 June 2018.
- ↑ "Rajya Sabha Debates (1962) - THE ATOMIC ENERGY BILL, 1962" (PDF). Government of India. 30 August 1962. Retrieved 22 June 2018.
- ↑ 29.0 29.1 29.2 "India's First Atomic Reactor - Science Notes and News" (PDF). Current Science. August 1956. Retrieved 3 September 2017.
- ↑ "Agreement with U.K. on Atomic Energy" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ "Research Reactors in BARC:Bhabha Atomic Research Centre(BARC), Department of Atomic Energy,Government of India". barc.gov.in.
- ↑ "Apsara Research Reactor". Archived from the original on 19 April 2015. Retrieved 12 April 2015.
- ↑ "Canadian Offer of Atomic Reactor" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ 34.0 34.1 Fuhrmann, Matthew (24 July 2012). Atomic Assistance: How "Atoms for Peace" Programmes Cause Nuclear Insecurity. Texas: Cornell University Press. pp. 93–95. ISBN 978-0801478116.
- ↑ 35.0 35.1 "Agreement on the Canada-India Colombo Plan Atomic Reactor Project" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ Exporting Disaster ~ The Cost of Selling CANDU Reactors (3). Ccnr.org. Retrieved on 6 December 2013.
- ↑ "Atomic Research for Peaceful Uses" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ "Canada-India Colombo Plan Atomic Reactor" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ 39.0 39.1 "Nuclear Power Station Survey: Canada-India Joint Survey" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ "Atomic Research for Asian Welfare" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ "Rajya Sabha Debates (1955) - Atomic Power Station" (PDF). Government of India. 7 September 1955. Retrieved 21 June 2018.
- ↑ "Rajya Sabha Debates (1955) - Indian Experts' Visit to Russian Atomic Plant" (PDF). Government of India. 28 September 1955. Retrieved 21 June 2018.
- ↑ "Rajya Sabha Debates (1957) - Setting up of an Atomic Reactor at Ahmedabad" (PDF). Government of India. 12 September 1957. Retrieved 21 June 2018.
- ↑ "Rajya Sabha Debates (1958) - Atomic Power Stations to be set up in India" (PDF). Government of India. 27 November 1958. Retrieved 22 June 2018.
- ↑ "Atomic Power Stations" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ "Rajya Sabha Debates (1963) - Installation of Atomic Power Station in Punjab" (PDF). Government of India. 23 April 1963. Retrieved 2 July 2018.
- ↑ "India's First Atomic Power Station - Global Tenders Invited" (PDF). Press Information Bureau of India - Archive. Archived (PDF) from the original on 8 August 2017.
- ↑ "Rajya Sabha Debates (1962) - Tarapur Atomic Power Project" (PDF). Government of India. 16 August 1962. Retrieved 22 June 2018.
- ↑ 49.0 49.1 "Units 5, 6 at Kudankulam nuclear power plant to cost Rs 50000-crore". The Times of India. 2 June 2017. Retrieved 1 July 2017.
- ↑ "Recalling Kudankulam's Bumpy Ride as Reactor 2 Comes On". Retrieved 31 July 2017.
- ↑ "Russia fulfills promise, supplies uranium to India". The Indian Express. Indian Express Limited. Archived from the original on 19 February 2009. Retrieved 22 August 2010.
- ↑ "Uranium shortage holding back India's nuclear power drive - Corporate News". livemint.com. 30 June 2008. Retrieved 22 August 2010.
- ↑ "Ministry of Power". Powermin.gov.in. Archived from the original on 18 March 2011. Retrieved 22 August 2010.
- ↑ "news.outlookindia.com". Outlook India. Archived from the original on 22 September 2008. Retrieved 22 August 2010.
- ↑ "India, France agree on civil nuclear cooperation". Rediff.com. Retrieved 22 August 2010.
- ↑ "Bush signs India-US nuclear deal into law - Home". livemint.com. 9 October 2008. Retrieved 22 August 2010.
- ↑ "UK, India sign civil nuclear accord". Reuters. 13 February 2010. Retrieved 22 August 2010.
- ↑ "Canada, India reach nuclear deal". Montreal Gazette. 29 November 2009. Retrieved 22 August 2010.[permanent dead link]
- ↑ "India, South Korea ink civil nuclear deal". The Times of India. 25 July 2011. Archived from the original on 5 November 2012.
- ↑ "India to get 510 tonnes of uranium from Kazakhstan, Russia". Hindu Business Line. Archived from the original on 8 December 2010. Retrieved 22 October 2010.
- ↑ "South Asia | Russia agrees India nuclear deal". BBC News. 11 February 2009. Retrieved 22 August 2010.
- ↑ "India, Kazakhstan sign nuclear pact". The Financial Express. 16 September 2009.
- ↑ Sanjay Dutta (23 January 2009). "Kazakh nuclear, oil deals hang in balance". The Times of India. Retrieved 22 August 2010.
- ↑ 64.0 64.1 "India, Namibia sign uranium supply deal". Republikein Online. 2 September 2009. Archived from the original on 22 July 2011. Retrieved 21 August 2011.
- ↑ "Indian firm acquires uranium mining rights in Niger | Uranium, Niger, Company, Bajla, Government". taurianresources.co.in. Archived from the original on 11 May 2011. Retrieved 22 December 2010.
- ↑ Subramanian, T. S. (20 March 2011). "Massive uranium deposits found in Andhra Pradesh". The Hindu. Chennai, India. Archived from the original on 24 October 2012. Retrieved 8 August 2016.
- ↑ Thakur, Monami (19 July 2011). "Massive uranium deposits found in Andhra Pradesh". International Business Times. USA.
- ↑ Bedi, Rahul (19 July 2011). "Largest uranium reserves found in India". The Daily Telegraph. New Delhi, India. Archived from the original on 12 January 2022.
- ↑ "Thorium fuel cycle — Potential benefits and challenges" (PDF). International Atomic Energy Agency. Retrieved 24 March 2025.
- ↑ Laskar, Rezaul H (25 April 2019). "'We may scale up supply of uranium to India': Kazakhstan ambassador Bulat Sarsenbayev". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 27 April 2019.
- ↑ "Over 15000 tonnes of uranium ore deposits in Rajasthan". The Economic Times. 27 July 2022.
- ↑ 72.0 72.1 "Nuclear Power in India". world-nuclear.org. Retrieved 4 May 2017.
- ↑ "Dateline Vienna: Thirty words that saved the day". Siddharth Varadarajan. 8 September 2008. Retrieved 1 October 2012.
- ↑ "AFP: India energized by nuclear pacts". 1 October 2008. Archived from the original on 20 May 2011. Retrieved 2 October 2008.
- ↑ Bureau (15 September 2009). "India signs civil nuclear deal with Mongolia". The Financial Express. Retrieved 13 August 2011.
{{cite news}}:|last=has generic name (help) - ↑ Chatterjee, Amit Kumar (30 October 2009). "Argentina -India's seventh nuclear destination". Institute of Peace and Conflict Studies. Retrieved 21 August 2011.
- ↑ "India signs N-pact with Argentina". OneIndia (online). 14 October 2009. Archived from the original on 13 అక్టోబరు 2012. Retrieved 21 August 2011.
- ↑ Sinha, Mohnish (6 April 2010). "Indo-Canada Nuclear Accord". IndiaStand. Archived from the original on 26 July 2011. Retrieved 21 August 2011.
- ↑ "India and Canada finalise conditions of nuclear deal". BBC News. 6 November 2012. Retrieved 18 November 2012.
- ↑ "India, Kazakhstan ink civil nuclear cooperation deal". The Times of India. 17 April 2011. Archived from the original on 22 September 2012. Retrieved 21 August 2011.
- ↑ "India, Kazakh ink nuke and oil pacts". The Indian Express. 16 April 2009. Retrieved 21 August 2011.
- ↑ Sriniwas, Laxman (26 July 2011). "India & South Korea Sign Civil Nuclear Agreement". Asian Scientist (online). Retrieved 21 August 2011.
- ↑ "India and Australia seal nuclear deal, Abbott meets Modi". The Times of India. Retrieved 6 September 2014.
- ↑ "Australia to power India's energy market as Tony Abbott settles terms for uranium trade". The Sydney Morning Herald. 4 September 2014. Retrieved 6 September 2014.
- ↑ "India signs civil nuclear agreement with Britain". The Times of India. 12 November 2015.
- ↑ Samanta, Pranab Dhal (1 October 2008). "India, France ink nuclear deal, first after NSG waiver". The Indian Express. Retrieved 21 August 2011.
- ↑ Yep, Eric; Jagota, Mukesh (6 December 2010). "Areva and NPCIL Sign Nuclear Agreement". The Wall Street Journal - Business (online). Archived from the original on 30 November 2012. Retrieved 21 August 2011.
- ↑ Makarand Gadgil (29 November 2011). "Jaitapur nuclear plant work may not start before 2014". livemint.com. The Wall Street Journal. Retrieved 29 November 2011.
- ↑ Yadav, Kamal (2024-08-05). "India ready to add 21 new nuclear reactors to meet its growing power demands". TechArctic. Archived from the original on 2024-12-07. Retrieved 2025-05-05.
- ↑ "France's EDF makes binding offer to build six nuclear EPR reactors in India Reuters". Reuters.
- ↑ Jonathan Soble (11 November 2016). "Japan's Nuclear Industry Finds a Lifeline in India After Foundering Elsewhere". The Japan Times. Retrieved 17 November 2016.
- ↑ George, Nirmala (21 June 1998). "Moscow Ends Atomic Power Blockade to India". The Indian Express. Retrieved 21 August 2011.
- ↑ Sasi, Anil (12 October 2008). "NPCIL to go into details with 4 reactor suppliers". The Hindu (Business Online). Retrieved 21 August 2011.
- ↑ "Russia: Nuclear Exports to India". NTI. 2010. Archived from the original on 10 May 2011. Retrieved 21 August 2011.
- ↑ "India, Russia sign nuclear deal". The Times of India. 7 December 2009. Archived from the original on 22 September 2012. Retrieved 21 August 2011.
- ↑ Bagchi, Indrani (20 August 2011). "Keep your word, we will keep ours, India tells NSG (pg 1)". The Times of India. Archived from the original on 22 September 2012. Retrieved 21 August 2011.
- ↑ "Russia signs pact for six nuclear reactors on new site in India" (in ఇంగ్లీష్). Reuters. 5 October 2018. Retrieved 28 March 2019.
- ↑ "Russia signs pact for six nuclear reactors on new site in India" (in ఇంగ్లీష్). Reuters. 5 October 2018. Retrieved 28 March 2019.
- ↑ "iei-asia.org". iei-asia.org.
- ↑ "Slowdown not to affect India's nuclear plans". Business Standard. 21 January 2009. Retrieved 21 August 2011.
- ↑ "India's Installed Nuclear Power Capacity to Triple by 2031-32: Union Minister Dr. Jitendra Singh". pib.gov.in. Archived from the original on 2025-01-29. Retrieved 2025-05-02.
- ↑ "At G-8, Singh, Bush reaffirm commitment to nuclear deal". livemint.com. 10 July 2008. Retrieved 22 August 2010.
- ↑ "Lessons from Japan for India on Nuclear Energy". The Diplomat. 13 December 2013.
- ↑ "India ratifies, at last, a nuclear deal with the IAEA". The Economist. 28 June 2014.
- ↑ 105.0 105.1 Tellis, Ashley J. "Atoms for War? U.S.-Indian Civilian Nuclear Cooperation and India's Nuclear Arsenal" (PDF). Carnegie Endowment for International Peace. Retrieved 24 March 2025.
- ↑ "Thorium Reactors Integral To Indian Energy Independence". The Energy Daily. 8 May 2007.
- ↑ Rahman, Maseeh (1 November 2011). "How Homi Bhabha's vision turned India into a nuclear R&D leader". The Guardian. Mumbai. Retrieved 20 March 2012.
- ↑ "A future energy giant? India's thorium-based nuclear plans". Physorg.com. 1 October 2010. Retrieved 20 March 2012.
- ↑ "Performance Audit Report on Kudankulam Nuclear Power Project, Units I and II" (PDF). Archived from the original (PDF) on 31 డిసెంబరు 2017. Retrieved 29 December 2017.
- ↑ "Kudankulam Unit-1 hits full capacity at 1,000 MWe". The Indian Express. 8 June 2014. Retrieved 19 June 2014.
- ↑ "Nuclear Power Generation". Retrieved 29 October 2019.
- ↑ Harvey, Fiona (8 March 2012). "Dramatic fall in new nuclear power stations after Fukushima". The Guardian. London.
- ↑ "Andhra Pradesh to get another nuclear plant". Deccan Chronicle (in ఇంగ్లీష్). 22 September 2018. Retrieved 1 October 2018.
- ↑ "Gujarat's Mithivirdi nuclear power plant to be shifted to Andhra Pradesh due to delay in land acquisition -". Firstpost. 2 June 2017. Retrieved 1 October 2018.
- ↑ Siddharth Srivastava (27 October 2011). "India's Rising Nuclear Safety Concerns". Asia Sentinel. Archived from the original on 4 October 2013. Retrieved 29 October 2011.
- ↑ "SC steers clear of PIL on N-liability". The Times of India. 6 December 2011. Archived from the original on 21 October 2012.