భారతదేశంలో అశ్లీల చిత్రాలు

వికీపీడియా నుండి
(భారతదేశంలో అశ్లీలత చిత్రాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రపంచంలోని అశ్లీల చట్టాలను చూపే మ్యాప్
  పూర్తిగా చట్టపరమైన
  పాక్షికంగా చట్టపరమైన, కొన్ని పరిమితులు లేదా అస్పష్టమైన స్థితి
  చట్టవిరుద్ధం
  డేటా అందుబాటులో లేదు

భారతదేశంలో చౌకగా స్మార్ట్‌ఫోన్లు, డేటా అందుబాటులోకి రావడంతో అశ్లీల వీడియోలు చూడటం సులభమైంది.ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ నివేదిక ప్రకారం భారత్‌లో ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారని ఆ సంస్థ చెబుతోంది.అమెరికా, బ్రిటన్‌ల తర్వాత అత్యధికంగా భారతదేశం లో చూస్తున్నారు. ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.భారతదేశంలో ఎక్కువగా మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం మంది మహిళలు అశ్లీల చిత్రాలు వీక్షిస్తున్నారని, పురుషుల 69 శాతం మంది పోర్నోగ్రఫీ చూస్తున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి.భారతదేశంలో పట్టణప్రాంతాల్లో 63 శాతం యువత అశ్లీల చిత్రాలు చూస్తున్నారు.[1]

అంతర్జాలం సర్వేలు

[మార్చు]

భారతదేశంలో ఇంటర్నెట్ పోర్నోగ్రఫీపై నిషేధం విధించడం వల్ల డేటా బ్రౌజింగ్ ఆదాయంలో 30-70% దెబ్బతింటుందని భారత కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.హర్యానా వంటి పట్టణ ప్రాంతాల్లోని యువతలో 63% మంది అశ్లీల చిత్రాలను చూస్తున్నారు.[2]74% తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా వాటిని యాక్సెస్ చేస్తున్నారని ఒక స్వీయ నివేదిక సర్వేలో తేలింది.భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ యాక్సెస్ పెరుగుతూనే ఉన్నందున, ఎక్కువ మంది వ్యక్తులు అశ్లీల చిత్రాలను ప్రైవేట్‌గా చూస్తున్నారు. [3][4][5]

చట్టబద్ధత

[మార్చు]

భారతదేశంలో పోర్నోగ్రఫీ కి సంబంధించి చట్టాల మూడు సెక్ష‌న్లు ఉన్నాయి.292,293,294 ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం 2000లోని సెక్ష‌న్ 67ఎ కూడా అశ్లీల చిత్రాల‌కు సంబంధించిన‌దే.[6]

  • 2015 జులైలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్ర‌కారం ఇంట్లో నాలుగు గోడ‌ల మ‌ధ్య పోర్న్ చూడ‌టం అనేది చ‌ట్ట‌బ‌ద్ధ‌మే తెలిపింది.ఇది నేరం కింద ప‌రిగ‌ణించ‌కూడ‌దు. కానీ ఆ వీడియోల‌ను తీయ‌డం, ప్ర‌చారం చేయ‌డం, పంపిణీ చేయ‌డం మాత్రం నేరంగా పరిగణించాలని తెలిపింది.[7] [8]
  • సెక్షన్ 292: అశ్లీలం అంటే ఏంటో వివ‌రిస్తుంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం వీటిని తయారు చేయ‌డం, డిస్ట్రిబ్యూషన్ చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష‌, రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.[9]
  • సెక్ష‌న్ 293: అశ్లీల వీడియోలు తీయ‌డం వాటిని 20 ఏళ్ల‌లోపు యువ‌త‌కు పంపిణీ చేయ‌డానికి సంబంధించిన‌ది.[10]
  • సెక్ష‌న్ 294: ప‌బ్లిగ్గా త‌మ చ‌ర్య‌లు, పాటల ద్వారా అశ్లీలాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం గురించి చెబుతోంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అశ్లీల పాట‌లు పాడ‌టం, ఉచ్ఛ‌రించ‌డం అనేది నేరంగా ప‌రిగ‌ణిస్తోంది.[11]
  • పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లల నీలి చిత్రాలు చిత్రీకరణ చేస్తే భారీ జరిమానా విధిస్తారు. అలాంటి నీలిచిత్రాలను షేర్‌ చేసినా జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు.[12]
  • సెక్ష‌న్ 67A: అశ్లీల కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ప‌బ్లిష్ చేయ‌డం, షేర్ చేయ‌డం అనేది ఈ సెక్ష‌న్‌ కింద నేరం. ఈ సెక్ష‌న్ కింద గ‌రిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 ల‌క్ష‌ల వ‌రకూ జ‌రిమానా విధిస్తారు. రెండోసారి నేరం చేస్తే ఏడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధించ‌వ‌చ్చు.[13]
  • సెక్షన్ 66-ఇ: వ్యక్తి అనుమతి లేకుండా ఆమె లేదా అతడి ప్రైవేటు భాగాల ఫోటోలు, వీడియోలను పబ్లిష్ చేసినా మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.[14]
  • ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ఇటీవల ఓ రేప్‌ కేసులో స్కూలు విద్యార్థినిపై తోటి బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పోర్న్‌ సైట్లు చూశానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతోన్న అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే నిషేధించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది.[15]

చైల్డ్‌ పోర్నోగ్రఫీని

[మార్చు]

చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి చైల్డ్‌ పోర్నోగ్రఫీ ఓ ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది.ఎన్‌సీఎంఈసీ సర్వే ప్రకారం ఆన్‌లైన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనేది అత్యంత వేగంగా పెరుగుతోందని గుర్తించింది. భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్‌ అవుతోంది.2020 నాటికి 25 వేల చైల్డ్‌ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, చిత్రాలు అప్‌లోడ్‌ అయ్యాయి.చైల్డ్‌ పోర్నోగ్రఫీని ఎవరు సెర్చ్‌ చేసినా వారిపై ఐటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 67 (బి) ప్రకారం కేసు నమోదు చేస్తారు.నేరం నిరూపణ అయితే మొదటిసారి ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.[16][17]

పోర్న్‌ హబ్‌ 2019 నివేదిక

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఏయేదేశాల వారు ఎంతెంత సమయం ఆన్‌లైన్‌లో పోర్న్‌ చూస్తూ గడిపారో వాటిలోనూ ఏ తరహావాటిని ఎక్కువగా ఇష్టపడ్డారో చెబుతూ భారీ నివేదిక విడుదల చేసింది. 2019 సంవత్సరంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతిస్థానంలో యూకే నిలవగా భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా భారతదేశం ఇదే స్థానంలో ఉంటోంది. పోర్న్‌ హబ్‌ సైట్‌ వీక్షకుల్లో 95 శాతం మంది ఆ సైట్‌ను తమ మొబైల్‌ఫోన్లలోనే చూస్తున్నారు.పోర్న్‌హబ్‌ గణాంకాల ప్రకారం మనదేశం నుంచి శుక్రవారాల్లో అతి తక్కువగా ఉండగా ఆదివారాల్లో అత్యంత ఎక్కువగా ఉంటుంది.పోర్న్‌హబ్‌ను వీక్షిస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది 18 నుంచి 24 ఏళ్లలోపు కుర్రాళ్లేనట. ఆ వయసు వారు 44 శాతం మంది ఉన్నారని పోర్న్‌హబ్‌ సర్వే తేలింది. భారతీయులు అత్యధికంగా సెర్చ్‌ చేసిన శృంగార తార’గా సన్నీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా మియా ఖలీఫా, డానీ డేనియల్స్‌ నిలిచారు.[18][19]

భారతదేశంలో నీలిచిత్రాల నిషేధం

[మార్చు]
  • 2015లో కూడా సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం సుమారు 827 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది.[20][21]
  • సుప్రీంకోర్టు 2016లో అన్ని రకాల పిల్లల అశ్లీల చిత్రాలను నిషేధించాలనీ భారత ప్రభుత్వాన్ని కోరింది.[22]

లాక్‌డౌన్ పోర్న్ వీక్షణ

[మార్చు]
  • లాక్‌డౌన్ లో ఎక్కువ మంది పోర్న్ వీడియోలనే వీక్షిస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా దేశీ పోర్న్‌ కంటెంట్‌ కోసం అనేక సైట్లతో పాటు సర్చ్ ఇంజన్లలో విపరీతంగా వెతుకుతున్నారట. ఇండియాలో దాదాపు 857 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీస్ లేదా మిర్రర్ సైట్స్ ద్వారా పోర్న్ సైట్స్‌లోకి ఎంటర్ అయ్యి వీడియోలను వీక్షిస్తున్నారు.[23][24]
  • కరోనా విపత్తు వల్ల రెండేళ్ల నుంచి ఆన్‌లైన్‌ క్లాసులకే విద్యార్థులు పాల్గొన్నారు అయితే స్మార్ట్‌ఫోన్‌ చాలా మంది ఇంటర్‌నెట్‌లో అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూడడం అలవాటు చేసుకు న్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాదిలో పిల్లలు, టీనేజర్లు ఎక్కువ సంఖ్యలో అశ్లీల వీడియో లు చూసినట్లు సైబర్‌ క్రైం అధికారులు చెప్పారు.[25][26]

సెక్స్ వర్కర్స్

[మార్చు]

భారతదేశంలో వ్యభిచారం వల్ల అశ్లీలత ప్రభావం చూపుతుంది.దేశంలోని సగానికి సగంపైగా జిల్లాల్లో ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు, వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు అని జాతీయ మహిళా కమిషన్ నివేదిక. కనీసం 378 జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొనిఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ జిల్లాల్లో అమ్మాయిలను వేశ్యావాటికలకు తరలించే సుమారు 1794 ప్రాంతాలను మహిళా కమిషన్ గుర్తించింది. అలాగే, వ్యభిచార వృత్తి సాగించే 1016 ప్రాంతాల వివరాలను కూడా తెలుసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలుప్రాంతాల నుంచి అమ్మాయిలను తరలించి అంగడిబొమ్మ లుగా చేసే దుష్కృత్యాలు కొనసాగుతున్నాయి అని జాతీయ మహిళా కమిషన్ నివేదిక పేర్కొంది. మన దేశంలోని మొత్తం మహిళా జనాభాలో 2.4 శాతం మంది వేశ్యావృత్తిలో ఉన్నారు. వీరిలో అత్యధికులు 15-35 ఏళ్ల లోపువారేనని తెలిపింది.

ఓటీటీలో అశ్లీల నిషేధం

[మార్చు]

2021 లో ఓటిటిలో అసభ్య, అశ్లీల, హింసాత్మక అంశాలకు సంబంధించిన కంటెంట్‌పై నిషేధం విధించారు. ఓటీటీలో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్‌ను వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా విభజన చేశారు.మహిళలు, చిన్నారులు, దళితులను కించపరిచేలా ఉండే అంశాలపై నిషేధం విధించారు.[27]

నమోదైన కేసులు

[మార్చు]
  • ఢిల్లీకి చెందిన జతిన్ భరద్వాజ్ అనే యువకుడు మహిళల నగ్న చిత్రాలు వీడియోలను బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడిని 2021 జూలై 23 ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.[28]
  • ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను నీలిచిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.నీలిచిత్రాలు యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చూస్తున్నాడు అతనిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి[29][30]

నీలి చిత్రాల ప్రభావం

[మార్చు]

నీలి చిత్రాలు ఎక్కువగా చూడటం వల్ల నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉంది. మొదట సున్నిత శృంగార చిత్రాలతో ప్రారంభించి అత్యంత జుగుప్సాకరమైన అశ్లీల చిత్రాల దాకా చూస్తున్నారు.వావివరసలు లేకుండా రక్తసంబంధీకుల శృంగార చిత్రాలు చూసే వారి సంఖ్య పెరిగిపోతున్నది. కొందరు హింసాత్మక, బలవంతపు,అసహజ లైంగిక వీడియోలు చూస్తున్నారు. దీనివల్ల నేర ప్రవృత్తి వైపు మళ్లే అవకాశం చాలా ఎక్కువని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.దేశంలో ఇటీవలికాలంలో అత్యాచారాలు,యువతలో హింసాప్రవృత్తి పెరిగిపోవడానికి చాలావరకూ నీలిచిత్రాల వ్యసనమే కారణమని సామాజిక అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.[31]

మూలాలు

[మార్చు]
  1. Rajak, Brajesh (2011) [2011]. Pornography Laws: XXX Must not be Tolerated (Paperback ed.). Delhi: Universal Law Co. p. 61. ISBN 978-81-7534-999-5.
  2. Verma, R. K., & Mahendra, V. S. (2004). Construction of masculinity in India: A gender and sexual health perspective. Journal of Family Welfare, 50, 71–78.
  3. Diamond, Milton; Uchiyama, Ayako (1999). "Pornography, rape, and sex crimes in Japan". International Journal of Law and Psychiatry. 22 (1): 1–22. doi:10.1016/S0160-2527(98)00035-1. PMID 10086287. Retrieved 13 October 2021.
  4. Diamond, Milton; Jozifkova, Eva; Weiss, Petr (2011). "Pornography and sex crimes in the Czech Republic". Archives of Sexual Behavior. 40 (5): 1037–1050. doi:10.1007/s10508-010-9696-y. PMID 21116701. Retrieved 13 October 2021.
  5. "పోర్న్ వెబ్‌సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?". BBC News తెలుగు. Retrieved 2021-10-26.
  6. "Section 293 in The Indian Penal Code". indiankanoon.org.
  7. "It's legal to watch porn in the privacy of your house, says SC". Hindustan Times. 2015-07-09. Retrieved 2016-12-20.
  8. "Section 292 in The Indian Penal Code". indiankanoon.org.
  9. Rajak, Brajesh (2011) [2011]. Pornography Laws: XXX Must not be Tolerated. In order to curb this Jio has blocked around 827 pornographic sites in Oct 2018 (Paperback ed.). Delhi: Universal Law Co. p. 61. ISBN 978-81-7534-999-5.
  10. అశ్లీల వీడియోలు తీయ‌డం నేరం. "293 చట్టం".{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "India Code: Section Details". www.indiacode.nic.in. Retrieved 2021-10-26.
  12. "పోక్సో చట్టం". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-26. Retrieved 2021-10-26.
  13. "India Code: Section Details". www.indiacode.nic.in. Retrieved 2021-10-26.
  14. "Section 66E of Information Technology Act: Punishment for violation of privacy". Info. Technology Law (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-09-16. Retrieved 2021-10-26.
  15. "నిషేధించినా నెట్టింట." Sakshi. 2018-11-26. Retrieved 2021-10-26.
  16. "Central Government Act: Section 67 [B] in The Information Technology Act, 2000". Indian Kanoon. Retrieved 11 July 2018.
  17. Swati Deshpande (16 February 2009). "Browsing child porn will land you in jail". The Times of India. Archived from the original on 3 January 2013. Retrieved 16 October 2009.
  18. "పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్‌లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?". BBC News తెలుగు. Retrieved 2021-10-26.
  19. "పోర్న్ చూసే భారతీయుల్లో 30% అమ్మాయిలే - MicTv.in - Telugu News". mictv.in. Archived from the original on 2021-10-26. Retrieved 2021-10-26.
  20. "India lifts porn ban after widespread outrage". BBC News. 5 August 2015. Retrieved 11 July 2018.
  21. "Ban porn sites or lose license: High Court to ISPs". India Today (in ఇంగ్లీష్). India Today. 2018-09-28. Retrieved 2019-01-02.
  22. "SC asks Centre to suggest measures to ban child pornography". Deccan Chronicle. 2016-02-27. Retrieved 2016-12-20.
  23. "'నీలి' విహారం అయ్యేనా స్వేచ్ఛ?". Sakshi. 2015-08-11. Retrieved 2021-10-26.
  24. "పిచ్చిపిచ్చిగా పోర్న్ వీడియోలు.. లాక్‌డౌన్‌లో అదే పని! దిమ్మతిరిగే ప్లేస్‌లో భారత్." Samayam Telugu. Retrieved 2021-10-26.
  25. "పోర్న్‌ పరేషాన్‌: అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తున్న విద్యార్థులు!". Sakshi. 2021-07-04. Retrieved 2021-10-26.
  26. "ప్రెస్ రివ్యూ". BBC News తెలుగు. Retrieved 2021-10-26.
  27. telugu, 10tv (2019-10-07). "స్ట్రీమింగ్ కంటెంట్‌పై సెన్సార్ : OTT ప్లాట్ ఫాంపై కఠిన నిబంధనలు?". 10TV (in telugu). Retrieved 2021-10-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  28. "Luring Women: నగ్న చిత్రాలు, వీడియోలు పంపిన నిందితుడి అరెస్ట్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.[permanent dead link]
  29. "'రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు.. రూ.9 కోట్లకు బేరం'". Sakshi. 2021-09-21. Retrieved 2021-10-26.
  30. "నీలి చిత్రాల కేసులో శిల్పా భర్త అరెస్ట్! సినిమా తీస్తానని ప్రకటించిన కంగనా!". NTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-21. Archived from the original on 2021-10-26. Retrieved 2021-10-26.
  31. "నీలి చిత్రాల ప్రభావం". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.