భారతదేశంలో ట్రాఫిక్ ప్రమాదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రహదారి రోడ్డు మీద జరిగే ప్రమాదాలు

భారతదేశంలో ట్రాఫిక్ ప్రమాదాలు (Traffic collisions in India) ప్రతి సంవత్సరం మరణాలు వాటినుంచి సంభవించే ఆస్తి నష్టం ప్రతి సంవత్సరం దేశంలో ప్రమాదాల్లో పెరుగుదల కనిపిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి ) 2021 సంవత్సర నివేదిక ప్రకారం 1,55,622 మరణాలు జరిగినవి, ఇందులో 69,240 మరణాలు ద్విచక్రవాహనాల కారణంగా సంభవించాయి.[1]

నిర్వచనం[మార్చు]

ఒక రోడ్డు ప్రమాద దృశ్యం

రోడ్డు ప్రమాదం నిర్వచిస్తే ప్రయాణ సమయంలో రోడ్డుపై వాహనంలో ప్రజలు మరణించడం లేదా గాయపడటం, వాహనాలు, వస్తువులు (ఎక్విప్ మెంట్) లేదా సరుకులు పాడైపోవడం, లేదా ఏదైనా ఇతర నష్టం జరిగినప్పుడు సంభవించే ప్రమాదం ( ఘటన) అని భావించవచ్చును.[2]

నివేదిక[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Orgainization) రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం సుమారు 1.3 మిలియన్ల మంది ప్రజల జీవితాలలో నష్టం, జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. 20 నుండి 50 మిలియన్ల మంది ప్రజలు మరణాల నుంచి బయటపడి, ప్రాణాంతకం కాని గాయాలతో బాధపడుతున్నారు, తద్వారా అంగవైకల్యానికి గురవుతున్నారు.

రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు, వారి కుటుంబాలకు, మొత్తం దేశాలకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ నష్టాలు వారికి జరిగే చికిత్సల ఖర్చులు, మరణిస్తే లేదా గాయపడిన వ్యక్తులను ఆదుకోవడానికి ఇతర మనుషుల సమయం తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. రోడ్డు ప్రమాదాల వల్ల చాలా దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో 3% నష్టపోయాయి. రోడ్డు ప్రమాదాలు, మరణాలలో ఎక్కువగా 90% మధ్య ఆదాయ దేశాలలో సంభవిస్తాయి. రోడ్డు ప్రమాదాల గాయాలు, మరణాలలో ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా, యూరోపియన్ ప్రాంతంలో అత్యల్పంగా ఉంది. అధిక-ఆదాయ దేశాలలో కూడా, తక్కువ సామాజిక ఆర్థిక ఉన్న ప్రజలు రహదారుల ప్రమాదాలలో అవకాశం ఎక్కువగా ఉంది.[3]

2021 రోడ్డు ప్రమాదాలు[మార్చు]

భారతదేశంలో 2001-2010 సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన, గాయపడిన వ్యక్తులు

2021 సంవత్సరములో భారతదేశం అంతటా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.55 లక్షల మందికి పైగా మరణించారు. ప్రతిరోజూ సగటున 426 మంది వ్యక్తుల మరణం లేదా ప్రతి గంటకు 18 మంది మరణిస్తున్నారు. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4.03 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 'యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా- 2021' దానిలో (హెడ్) ఉంది. మరణాల రేటులో ప్రతి వెయ్యి వాహనాలకు 2021 (0.53), 2020 మరణాల రేటు (0.45), మరణాల రేటు 2019 (0.52) కంటే ఎక్కువగా ఉంది, కానీ 2018 (0.56), 2017 (0.59) కంటే తక్కువగా ఉంది. ఎన్ సి ఆర్ బి - 2021 నివేదికలో భారతదేశ ప్రజలకు చేసిన సూచనల్లో  ప్రయాణికులకు సూచనలలో మోటారుసైకిళ్ల వంటి ప్రైవేట్ రవాణా విధానాల కంటే బస్సుల వంటి ప్రజా రవాణా సురక్షితమైనదని సూచించింది. రోడ్డు ప్రమాదాల్లో మొత్తం మరణాల్లో 44.5 శాతం ద్విచక్రవాహనాలు, 15.1 శాతం కార్లు, 9.4 శాతం ట్రక్కులు లేదా లారీలు, 3 శాతం బస్సులు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను గమనిస్తే ఎక్కువ భాగం (59.7 శాతం) అతివేగం వల్ల సంభవించాయి.[4]

ప్రమాదాల సంఖ్య[మార్చు]

భారతదేశ రోడ్డు ప్రమాదాల సంఖ్యను చూస్తే తమిళనాడులో 2021 సంవత్సరం 57,090, (2020 సంవత్సరంలో 46,443) ట్రాఫిక్ ప్రమాద కేసులలో గరిష్ఠ పెరుగుదల నమోదైంది, తరువాత మధ్యప్రదేశ్ 2021 సంవత్సరంలో 49,493 (2020 సంవత్సరంలో 43,360), ఉత్తర ప్రదేశ్ 2021 సంవత్సరంలో 36,509 (2020 సం వత్సరంలో30,593), మహారాష్ట్ర 2021 సంవత్సరంలో 30,080 (2020 సంవత్సరంలో 24,908 ), ప్రమాదాలు ఉన్నాయి .ఈ ట్రాఫిక్ ప్రమాదాల ఫలితంగా 2021 సంవత్సరంలో 3,73,884 మంది గాయపడగా, 1,73,860 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 24,711 మరణాలు, తమిళనాడు రాష్ట్రంలో 16,685 మరణాలు, మహారాష్ట్రలో 16,446 మరణాలు దేశంలో ట్రాఫిక్ ప్రమాదాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.[5]

తెలుగు రాష్ట్రాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో 2021 సంవత్సర రోడ్డు ప్రమాదాలు 2020 సంవత్సరం కంటే పెరిగింది. 2021లో 19248 ప్రమాదాలు జరిగితే, 2020 సంవత్సరంలో 16898 ప్రమాదాల సంఖ్య ఉంది. ఇదే విధంగా మరణాల సంఖ్య పరిశీలిస్తే 2021 సంవత్సరంలో 6690 కాగా, 2020 సంవత్సర మరణాల సంఖ్య 6033 గా ఉన్నది[6].

2021 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 23,313 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, అనంతపురంలో అత్యధికంగా 4,051 ప్రమాదాలు నమోదయ్యాయి, ఇందులో 62 మంది మరణించారు. ప్రమాదాలకు కారణం అతివేగం, డ్రైవర్ల నిద్ర లేమి వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా (3,476), చిత్తూరు (3,347), కర్నూలు (2,587), కడప (2,089), ప్రకాశం (2,011), తూర్పు గోదావరి (1,803), గుంటూరు (1,605), శ్రీకాకుళం (1,574), నెల్లూరు (426), విశాఖపట్నం (426) ఉన్నాయి.   ప్రమాదాల్లో ఎక్కువ మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని డేటా వెల్లడించింది. జాతీయ రహదారులపై అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల మధ్య చాలా ప్రమాదాలు జరిగాయి, రాష్ట్రంలో రోజుకు సగటున 64 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.[7]

కారణాలు[మార్చు]

రోడ్డు ప్రమాదాలకు కొన్ని కింది కారణాలను చెప్పవచ్చును.[8].

రోడ్డు ప్రమాదాలకు కారణాలను పరిశీలిస్తే అవి ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం నడిపే వ్యక్తులు పరధ్యానం, నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చూడబడతాయి. అందువల్ల, జాగ్రత్తగా వాహనం నడిపి తద్వారా సురక్షితంగా ఉండవచ్చని అనిపించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఇతరుల నిర్లక్ష్యం సమస్యను కలిగిస్తుంది.

2. విపరీతమైన వాతావరణం

మానవ తప్పిదాలతో పాటు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదాల అవకాశాలను పెంచుతాయి. దట్టమైన పొగమంచు, అధిక వర్షం, భారీ గాలులు మొదలైనవి, డ్రైవింగ్ ని మరింత కష్టతరం చేస్తాయి, డ్రైవర్ లు అదనపు జాగ్రత్త వహించనట్లయితే ఇది భయంకరమైన ప్రమాదాలకు దారితీస్తుంది.

3. మెకానికల్ వైఫల్యాలు

లోపభూయిష్టమైన కారును నడపడం అనేది భారీ భద్రతా ప్రమాదం. లూజ్ బ్రేకులు, పాత టైర్లు వంటి క్లిష్టమైన సమస్యలు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచుతాయి. అందువల్ల, ఆన్ టైమ్ వేహికల్ మెయింటెనెన్స్ ని ధ్రువీకరించడం అనేది ఎంతో ముఖ్యం.

199 దేశాలలో, రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

వాహన పరిస్థితులు, రోడ్డు వాతావరణం, మానవ తప్పిదాల ఆధారంగా, 2019 లో రోడ్డు ప్రమాద మరణాల రేటును ప్రభుత్వం ఈ క్రింది విధంగా గమనించింది.

  • ఓవర్ స్పీడ్ తో మరణాల సంఖ్య 67.30%
  • రాంగ్ సైడ్ డ్రైవింగ్ తో మరణాల సంఖ్య 6.10%
  • డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లను ఉపయోగించడంతో మరణాల సంఖ్య 3.30%
  • డ్రంకెన్ డ్రైవ్ తో మరణాల సంఖ్య 3.50%
  • 30% మరణాల సంఖ్య రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం
  • 14% మరణాల సంఖ్య డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం
  • 10 సంవత్సరాల కంటే పాత వాహనాలతో మరణాల సంఖ్య 41%
  • గ్రామీణ ప్రమాదాల మరణాల సంఖ్య 67.10%
  • పట్టణ ప్రమాదాల మరణాల సంఖ్య 32.90%

మూలాలు[మార్చు]

  1. "Rear guard action: on car accident-related deaths". The Hindu (in Indian English). 2022-09-05. ISSN 0971-751X. Retrieved 2022-09-13.
  2. "Road accident Definition". Law Insider (in ఇంగ్లీష్). Retrieved 2022-09-13.
  3. "Road traffic injuries". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2022-09-13.
  4. "Road Accidents Killed 1.55 Lakh In India In 2021, Highest Ever: Report". NDTV.com. Retrieved 2022-09-13.
  5. "NCRB report: Deaths in road accidents up by 17%". The Indian Express (in ఇంగ్లీష్). 2022-08-30. Retrieved 2022-09-13.
  6. Jan 1, TNN / Updated:; 2022; Ist, 09:09. "Road Accidents In T See A Jump This Year | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-13. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. "Overspeeding, dozing to blame for road accidents in Andhra Pradesh". newindianexpress.com/. 31 January 2022. Retrieved 12 September 2022.
  8. "Causes of Road Accidents in India - Why Do Accidents Occur?". AckoDrive (in ఇంగ్లీష్). 2022-04-14. Archived from the original on 2022-09-13. Retrieved 2022-09-13.