Jump to content

భారతదేశంలో వాతావరణ మార్పు

వికీపీడియా నుండి
సాత్పురా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం

భారతదేశంలోని వాతావరణ మార్పు దేశంపై తీవ్ర ప్రభావాలను చూపుతోంది, ఇది 2015లో వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది భారతదేశం ప్రతి సంవత్సరం 3 గిగాటన్నుల ( Gt ) CO2eq గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుంది; ప్రతి వ్యక్తికి దాదాపు రెండున్నర టన్నులు, ఇది ప్రపంచ సగటు కంటే తక్కువ.[1] ప్రపంచ జనాభాలో 17% ఉన్నప్పటికీ, దేశం 7% ప్రపంచ ఉద్గారాలను విడుదల చేస్తుంది.[2]

టిబెటన్ పీఠభూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమాలయాల్లోని హిమానీనదాలు కరిగి వెనక్కి తగ్గుతాయి. గంగ, బ్రహ్మపుత్ర, యమున తదితర ప్రధాన నదుల ప్రవాహాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ కారణం వల్లనే 2007 వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) నివేదిక సింధు నది ఎండిపోవచ్చని పేర్కొంది.[3] వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో వేడి తరంగాల తరచుదనమూ, తీవ్రత రెండూ పెరుగుతున్నాయి. అస్సాం వంటి రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు సర్వసాధారణంగా మారుతాయని అంచనా వేసారు.[4] 2021 సంవత్సరంలో మొత్తం GHG ఉద్గారాలలో 92% వాటా కలిగిన [5] దేశాలలో భారతదేశం యొక్క వాతావరణ మార్పు పనితీరు సూచిక ఎనిమిదో స్థానంలో ఉంది.

కొన్ని అంచనాల ప్రకారం, ప్రస్తుత శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో కరువుల సంఖ్య, తీవ్రత రెండూ గణనీయంగా పెరుగుతాయి.

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు

[మార్చు]
ఇతర ప్రధాన ఉద్గారాలతో పోలిస్తే భారతదేశంలో తలసరి ఉద్గారాలు తక్కువగా ఉన్నాయి, కానీ జాతీయ మొత్తం గణనీయంగా ఉంది. [6]
భారతదేశంలో CO2 ఉద్గారాలు చైనా కంటే చాలా తక్కువ కానీ చాలా త్వరగా పెరుగుతున్నాయి.
ఇతర ప్రాథమిక ప్రాంతాల కంటే భారతదేశం తలసరి కార్బన్ డయాక్సైడ్‌ను చాలా తక్కువ ఉత్పత్తి చేస్తుంది.

2023లో భారతదేశంలో, బలమైన GDP వృద్ధి, బలహీనమైన రుతుపవనాల తరువాత జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఉద్గారాలు 190 మిలియన్ టన్నులు పెరిగాయి. దీని తలసరి ఉద్గారాలు మాత్రం ప్రపంచ సగటు కంటే గణనీయంగానే తక్కువగా ఉన్నాయి. [7]

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, అందువల్ల భారతదేశంలో వాయు కాలుష్యం తగ్గించడం వల్ల ఖర్చు కంటే 4 నుండి 5 రెట్లు విలువైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒనగూడే ప్రయోజనాలతో పోలిస్తే, ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన ఉద్గారాల తగ్గింపు చర్య.[8]

పారిస్ ఒప్పందం ప్రకారం, 2030 నాటికి ఈ తీవ్రతను 33–35% తగ్గించడం కూడా ఉంది. [9] భారతదేశ వార్షిక తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.[10] 2030 నాటికి అవి 3 - 4 టన్నుల మధ్య ఉంటాయని UNEP అంచనా వేసింది. [11]

2019 లో చైనా, ప్రపంచం లోనే అత్యధికంగా 27% గ్రీన్‌హౌస్ ఉద్గారాలను (GhG) విడుదల చేసిందని అంచనా వేసారు. దాని తరువాత అమెరికా 11%, తరువాత భారతదేశం 6.6% విడుదల చేసింది.[12]

విద్యుదుత్పత్తి

[మార్చు]

2021 సెప్టెంబరు నాటికి భారతదేశం తన విద్యుత్తులో 39.8% పునరుత్పాదక ఇంధన వనరుల నుండి ఉత్పత్తి చెయ్యగా, 60.2% విద్యుత్తును శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి చేసింది. వీటిలో 51% బొగ్గు నుండి ఉత్పత్తి అవుతుంది. [13]

బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు

[మార్చు]

భారతదేశంలో బొగ్గు తవ్వకాలతో పాటు, భారతదేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో మండించడానికి దేశం, బొగ్గును [14] దిగుమతి చేసుకుంటుంది. కొత్త ప్లాంట్లు నిర్మించే అవకాశం లేదు. పాత, మురికి ప్లాంట్లను మూసివేయవచ్చు. మిగిలిన ప్లాంట్లలో ఎక్కువ బొగ్గు మండించవచ్చు. [15]

గృహ ఇంధనం

[మార్చు]

సాంప్రదాయ ఇంధనాల నుండి ద్రవీకృత పెట్రోలియం వాయువు, విద్యుత్తుకు మారడం వల్ల ఆరోగ్యం, వాతావరణ ప్రయోజనాలు లభిస్తాయి.

పరిశ్రమ

[మార్చు]

సిమెంట్, [16] ఇనుము, ఉక్కు ఉత్పత్తితో సహా పారిశ్రామిక రంగం, [17] ప్రపంచ ఉద్గారాలకు ప్రధాన కారణం. మొత్తం ఉద్గారాలలో దీనికి నాలుగో వంతు వాటా ఉంది. [18] 2000 నుండి 2014 వరకు, ఈ రంగంలో ఇంధన వినియోగం 406% పెరిగింది, [9] ఇది దాని వేగవంతమైన విస్తరణ, పెరుగుతున్న ఇంధన డిమాండునూ ప్రతిబింబిస్తుంది. 2014 నాటికి మొత్తం శక్తి వినియోగంలో ఈ పరిశ్రమ వాటా 42%.[9] ఇది పారిశ్రామిక కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ముఖ్యమైన పర్యావరణ ప్రభావాలను హైలైట్ చేస్తుంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు అయిన భారతదేశానికి, ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో 7% వాటాను ఉంది. దేశీయ డిమాండ్ పెరుగుతున్నందున, ఈ రంగం నుండి ఉద్గారాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి తక్కువ, దాదాపు సున్నా ఉద్గారాల ఉక్కు కోసం ప్రమాణాలను అమలు చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రమాణాలు భారతదేశం నికర-సున్నా ఉద్గారాలకు మారడంలోను, దాని పారిశ్రామిక రంగం యొక్క పర్యావరణ ప్రభావాలను తగ్గించడంలోనూ కీలకమైన సేకరణ, ఫైనాన్సింగ్, కార్బన్ ధర నిర్ణయ, ఉద్గారాల వ్యాపార వ్యవస్థలు వంటి ముఖ్యమైన విధానాలను సులభతరం చేస్తాయి. [19]

వ్యవసాయం

[మార్చు]

2005 - 2014 మధ్య వ్యవసాయ ఉద్గారాలు 25% పెరిగాయి, కృత్రిమ ఎరువుల వాడకంలో గణనీయమైన పెరుగుదల, పంటలను తగలబెట్టడం దీనికి కారణం. [9]

వ్యర్థాలు

[మార్చు]

2014లో 78 Mt CO <sub id="mw8A">2eq</sub> వ్యర్థాలు వెలువడ్డాయి. [17]

సహజ పర్యావరణంపై ప్రభావాలు

[మార్చు]

ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులు

[మార్చు]
భారతదేశంలో 1901 నుండి 2020 వరకు ఉష్ణోగ్రత మార్పు యొక్క దృశ్యమానత.

1901 - 2018 మధ్య, భారత్‌లో ఉష్ణోగ్రతలు 0.7 °C (1.3 °F) మేర పెరిగాయి.[20]

2022 మేలో భారతదేశం, పాకిస్తాన్‌లో తీవ్రమైన వేడిగాలులు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత 51°C కి చేరుకుంది. వాతావరణ మార్పు వల్ల అలాంటి వేడిగాలులు సంభవించే అవకాశం 100 రెట్లు ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పు లేనట్లైతే, 2010 లో సంభవించిన వాటి కంటే తీవ్రమైన వేడిగాలులు 312 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయని అంచనా. ప్రస్తుతం అవి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయని భావిస్తున్నారు.[21]

2018 అధ్యయనం ప్రకారం ఉత్తర, వాయవ్య భారతదేశంలో సమీప భవిష్యత్తులో కరువులు పెరుగుతాయని అంచనా వేసారు. ఈ శతాబ్దం చివరి నాటికి, భారతదేశంలోని చాలా ప్రాంతాలు మరింత తీవ్రమైన కరువులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

అస్సాం వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన కొండచరియలు విరిగిపడటం, వరదలూ సర్వసాధారణ మవుతాయని అంచనా.[4]

సముద్ర మట్టం పెరుగుదల

[మార్చు]
Daytime edge-on view of a small forested island amid a shallow turquoise lagoon. The dark sky blue above is streaked by thin, wispy clouds of various sizes. The lone island is evenly low-slung, no part of it reaching any substantial height whatever.
వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరగడం వల్ల లక్షద్వీప్‌లోని చిన్న లోతట్టు దీవులు మునిగిపోవచ్చు.

సముద్ర మట్టాలు పెరుగుతున్నందున బంగ్లాదేశ్‌లో ఎక్కువ భాగాన్ని ముంచెత్తుతాయని, అక్కడి నుండి వచ్చే శరణార్థుల వలన తమ రాష్ట్రాల్లో సంక్షోభం తలెత్తుతుందనీ మేఘాలయ, ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవిస్తే, బంగ్లాదేశ్, దాని సరిహద్దులో ఉన్న భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు విస్తారమైన తీరప్రాంతాన్ని కోల్పోయే అవకాశం ఉంది. : 130 

సముద్ర మట్టం పెరగడం వల్ల సుందర్బన్స్ లోని పల్లపు దీవులు మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.[22]

నీటి వనరులు

[మార్చు]
తీవ్ర వాతావరణం, వరదల వల్ల ధ్వంసమైన హుంబర్లిలోని ఒక ఇంటి చిత్రం. వాతావరణ మార్పు మరింత తీవ్రమవుతున్న కొద్దీ, భారతదేశంలోని అనేక ప్రాంతాలు మరింత తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొంటాయి, దీని వలన అతివృష్టి, అనావృష్టి రెండూ ఏర్పడతాయి.

టిబెటన్ పీఠభూమిలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా హిమాలయ హిమానీనదాలు కరిగి నీరౌతున్నాయి. గంగ, బ్రహ్మపుత్ర, యమున తదితర ప్రధాన నదుల ప్రవాహాలకు ముప్పు కలిగుతోంది. లక్షలాది మంది రైతుల జీవనోపాధి ఈ నదులపై ఆధారపడి ఉంది. [23] 2007 వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) నివేదిక ప్రకారం, సింధు నది కూడా ఇదే కారణం చేత ఎండిపోవచ్చు. [3]

పర్యావరణ వ్యవస్థలు

[మార్చు]

1998 లో జరిగిన పగడపు బ్లీచింగ్ సంఘటన వల్ల లక్షద్వీప్, అండమాన్ దీవుల రీఫ్ పర్యావరణ వ్యవస్థలలో 70% కంటే ఎక్కువ ప్రవాళ భిత్తికలు చనిపోయాయి. గ్లోబల్ వార్మింగ్ కరణంగా పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతల వల్ల, పర్యావరణ విపత్తులు కూడా సర్వసాధారణంగా మారుతున్నాయని అంచనాలున్నాయి.

ప్రజలపై ప్రభావాలు

[మార్చు]

ఆర్థిక ప్రభావాలు

[మార్చు]

భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా సామాజిక కార్బన్ ఉద్గారాలు వెలువరిస్తోంది.[24] లండన్‌కు చెందిన గ్లోబల్ థింక్ ట్యాంక్, ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం, 2100 నాటికి భారతదేశం తన GDPలో ఏటా 3–10% కోల్పోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా 2040 నాటికి దాని పేదరికం రేటు 3.5% పెరగవచ్చు. [25] [26]

తగ్గిన పంట దిగుబడి

[మార్చు]

భారతదేశంలో వాతావరణ మార్పు భారతదేశంలోని పేద సమాజాన్ని తయారుచేసే 40 కోట్లకు పైగా ప్రజలపై అసమాన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే చాలా మంది తమ ఆహారం, నివాసం, ఆదాయం కోసం సహజ వనరులపై ఆధారపడతారు. భారతదేశంలో 56% కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. మరికొందరు తీరప్రాంతాలలో జీవనోపాధి పొందుతున్నారు. [27] నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ (NICRA) అధ్యయనంలో భారత వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిశోధించారు. 2050 - 2080 మధ్య భారతదేశంలో వర్షాధార వరి దిగుబడి దాదాపు 2.5% దాకా తగ్గవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. మరోవైపు, సాగునీటి వరి దిగుబడి 2050 నాటికి 7%, 2080 నాటికి10% తగ్గుతుందని అంచనా. అంతేకాకుండా, 2100 సంవత్సరంలో గోధుమ దిగుబడి 6% నుండి 25% వరకు తగ్గుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. అదే సమయంలో మొక్కజొన్న దిగుబడి 18% నుండి 23% వరకు తగ్గుతుందని అంచనా. అయితే, శనగ పంటపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. భవిష్యత్ వాతావరణాలలో శనగ ఉత్పాదకత 23% నుండి 54% వరకు పెరుగుతుందని అంచనా. [28]

ఆరోగ్య ప్రభావాలు

[మార్చు]

సూర్యరశ్మిని ప్రతిబింబించే వాయు కాలుష్యం, బాష్పీభవనం ద్వారా గాలిని చల్లబరచే నీటిపారుదలలు 1970 నుండి వాతావరణ మార్పులను ప్రతిఘటించాయి. అయితే ఈ రెండు అంశాలు వేడిగాలుల ప్రభావాన్ని పెంచుతాయి.[29]

వేడి తరంగాలు

[మార్చు]
Visualisation of temperature of India, showing many parts of the country exceeding 40 degrees Celsius.
2022 భారతీయ ఉష్ణ తరంగం యొక్క ఉపగ్రహ విజువలైజేషన్.

వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో వడగాడుపుల తరచుదనమూ, శక్తీ రెండూ పెరుగుతున్నాయి. 2019లో ఉష్ణోగ్రత 50.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది, 36 మంది మరణించారు. 2019లో అధిక ఉష్ణోగ్రతలు 23 రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయని అంచనా వేసారు. 2015లో ఇది తొమ్మిది, 2018 లో 19 రాష్ట్రాలుగా ఉంది. వడగాడుపుల సంఖ్య పెరిగింది - పగటి ఉష్ణోగ్రతలే కాదు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. 2018, దేశంలో రికార్డు స్థాయిలో ఆరవ అత్యంత వేడి సంవత్సరం, 15 అత్యంత వేడి సంవత్సరాల్లో 11, 2004 నుండే సంభవించాయి. రాజధాని న్యూఢిల్లీలో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై, దాని ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.[30]

భారతదేశంలో, 2021 - 2050 మధ్య వడగాడుపుకు గురికావడం 8 రెట్లు పెరుగుతుందని, ఈ శతాబ్దం చివరి నాటికి 300% పెరుగుతుందని చెబుతున్నారు. 2010 నుండి 2016 వరకు వేడి తరంగాలకు గురయ్యే భారతీయుల సంఖ్య 200% పెరిగింది. వేడి గాలులు వ్యవసాయ కార్మిక ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తాయి. మధ్య, వాయవ్య భారతదేశంలో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తూర్పు తీరం, తెలంగాణ కూడా ప్రభావితమయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లో 2015 లో కనీసం 2500 మరణాలు సంభవించాయి. 2016 లో చరిత్రలో మొదటిసారిగా, కేరళలో వేడిగాలులు నమోదయ్యాయి. వడగాడుపును అంచనా వేయడంలో, తగ్గించడంలో ప్రభుత్వానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ సలహా ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తోంది.[31]

గత నాలుగు సంవత్సరాలలో భారతదేశంలో వడగాడుపుల వలన కలిగే మరణాల సంఖ్య తగ్గింది. 2015 లో 2,000 మందికి పైగా, 2017 లో 375 మంది, 2018 లో 20 మంది మరణించారు. "వేడి రోజులలో పనిచేసే సమయాన్ని తగ్గించడానికి లేదా మార్చడానికి ప్రజలను ప్రోత్సహించడం ద్వారాను, తీవ్రంగా ప్రభావితమైన జనాభాకు ఉచితంగా త్రాగునీటిని అందించడం ద్వారానూ మరణాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని అధికారులు చెబుతున్నారు". మధ్యప్రదేశ్ ప్రభుత్వం వీధులను చల్లబరచడానికి నీటిని ఉపయోగించింది. నీటి సరఫరా విషయంలో ప్రజల మధ్య జరిగిన తగాదాలు ప్రాణాంతకంగా మారడంతో, పోలీసులను నీటి ట్యాంకర్లకు కాపలాగా పెట్టారు. ఆ చర్యలకు చాలా డబ్బు, నీరు ఖర్చయ్యాయి.

వలసలపై ప్రభావాలు

[మార్చు]

ప్రపంచ ఉష్ణోగ్రతలు 2°C పెరిగితే, ముంబై, చెన్నై నగరాల లోని కొన్ని ప్రాంతాలు మునిగిపోవడం వంటి కారణాల వల్ల దాదాపు 70 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని అంచనా.[32]

2050 నాటికి భారతదేశంలో వాతావరణ సంబంధిత వలసలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసారు. వాతావరణ వైపరీత్యాల కారణంగా దాదాపు 4.5 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వలస వెళ్ళవలసి వస్తుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వలస పోతున్న వ్యక్తుల ప్రస్తుత సంఖ్య కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. "స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్-2022" నివేదిక ప్రకారం, వాతావరణ మార్పు వలన ప్రేరితమైన వలసల పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది. 2020-2021 సంవత్సరంలో 30 లక్షలకు పైగా ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ గణాంకాలు దేశంలోని వలస విధానాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పెంచుతున్నాయని నొక్కి చెబుతున్నాయి. [33]

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని గ్రామస్తులు కూడా సముద్ర మట్టాలు పెరగడం వల్ల పొరుగున పల్లంలో ఉన్న బంగ్లాదేశ్ మునిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు, అటువంటి పరిస్థితిలో అక్కడి నుండి మేఘాలయలోకి శరణార్థులు వలస వస్తారనీ, అసలే అరకొర వనరులు ఉన్న తమ రాష్ట్రంపై అది భారం మోపుతుందని వారు ఆఅందోళన చెందుతున్నారు.[34] [35]

వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2021లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది

గ్రీన్‌హౌస్ గ్యాస్ సింక్‌లు

[మార్చు]

భూ వినియోగం, భూ వినియోగ మార్పు, అటవీ సంరక్షణ వలన 2014 లో 30 కోట్ల టన్నుల CO2eq ని అవి పీల్చుకున్నాయి.[17] 2020 లో అడవులలో నిల్వ అయిన మొత్తం కార్బన్ పరిమాణం 700 కోట్ల టన్నులు. [36]

శక్తి విధానం

[మార్చు]

జాతీయ ఇంధన ప్రణాళిక పారిస్ ఒప్పందం లక్ష్యమైన 2°C గ్లోబల్ వార్మింగుకు అనుగుణంగా ఉంది. కానీ భారతదేశం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ఆపివేస్తే అది 1.5°C కే పరిమితమవ్వాలనే ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నారు.[37] 2030 నాటికి 40% శాతం శిలాజ ఇంధన రహిత విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. [9]

ఫిబ్రవరిలో సమర్పించిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుపై ముసాయిదా సమావేశానికి (UNFCCC) ఇచ్చిన ద్వైవార్షిక నవీకరణ నివేదికలో, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల నుండి ఆర్థిక వృద్ధిని క్రమంగా విడదీయడం కొనసాగిస్తున్నట్లు భారతదేశం తెలిపింది. 2005 - 2016 మధ్య భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఉద్గార తీవ్రత 24% తగ్గింది. అంటే, భారతదేశం 2020 నాటికి GDP యొక్క ఉద్గార తీవ్రతను 2005 స్థాయిల నుండి 20–25% తగ్గించాలనే స్వచ్ఛంద ప్రకటనను నెరవేర్చే దిశగా పయనిస్తోంది. తద్వారా వాతావరణ లక్ష్యాలను చేరుకున్న ఏకైక G20 దేశంగా భారతదేశం నిలిచింది.[38]

2030 నాటికి ఉద్గార తీవ్రతను మూడో వంతు తగ్గించడం భారతదేశం ఉద్దేశించిన జాతీయంగా నిర్ణయించబడిన సహకారంలో ఉంది. [39] నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి భారతదేశంలో బయోమాస్, పవన, సౌర, పంప్డ్ స్టోరేజ్‌తో సహా జల విద్యుత్ వంటి తగినంత కార్బన్ తటస్థ వనరులు ఉన్నాయి. [40]

బొగ్గు ఆధారిత ప్లాంట్లను సత్వరంగా మూసివేయడం, పునరుత్పాదక ఇంధన వనరులను పెంచడం చేస్తే 2027 నాటికి భారతదేశం అంతటా స్థాపిత సామర్థ్యంలో థర్మల్ విద్యుత్ వాటా 42.7% మాత్రమే ఉంటుందని అంచనా. ఇది 2017 లో ఉన్న 66.8% నుండి ఇది పెద్ద తగ్గింపు అవుతుంది.[41]

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం వలన, అందువల్ల భారతదేశంలో వాయు కాలుష్యం తగ్గించడానికి అయ్యే ఖర్చు కంటే 4 నుండి 5 రెట్లు విలువైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒనగూడే ప్రయోజనాలతో పోలిస్తే, ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన ఉద్గారాల తగ్గింపు చర్య అవుతుంది.[8]

భారతదేశం ఇంధన రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. దేశం ఇప్పుడు పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ అగ్రగామిగా ఉంది. [42]

విధానాలు, చట్టాలు

[మార్చు]

భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ ఇంధన విధానానికి, పారిస్ ఒప్పందానికీ అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకున్నాయి. వాటిలో కొన్ని:

  • 2030 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని రెట్టింపు చేసి, 450 గిగావాట్లకు (GW) చేర్చడం [43]
  • జాతీయ సౌర మిషన్
  • భారతదేశంలో పవన శక్తి

2008 లో భారతదేశం తన జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక (NAPCC)ను ప్రచురించింది. దీనిలో దేశం కోసం అనేక లక్ష్యాల్లో ఇవి కొన్ని (కానీ వీటికే పరిమితం కాదు): దేశంలోని మూడింట ఒక వంతు భాగాన్ని అడవులు, చెట్లతో కప్పడం, 2022 నాటికి మొత్తం శక్తి మిశ్రమంలో పునరుత్పాదక ఇంధన సరఫరాను 6%కి పెంచడం, విపత్తు నిర్వహణను మరింతగా సమర్థంగా నిర్వహించడం. ఈ చర్యలన్నీ దేశం మొత్తం మీద స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి పనిచేస్తాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దాని సహజ వనరులతో పొఎనవేసుకుని ఉంది. వ్యవసాయం, నీరు, అటవీ వంటి వాతావరణ-సున్నితమైన రంగాలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నందున ఇది చాలా ముఖ్యమైనది.[44]

ఒడిశా రాష్ట్ర 2020-2021 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి వాతావరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[45] వాతావరణ బడ్జెట్ అనేది వాతావరణ మార్పుల కోసం ప్రభుత్వం చేసే ఖర్చులను ట్రాక్ చేయడం లేదా వాతావరణ మార్పులను పరిష్కరించడానికి తగ్గింపు, అనుసరణ చర్యలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పత్రం ప్రకారం, వాతావరణ మార్పుపై వాటి ప్రభావాన్ని చూడటం ద్వారా ప్రస్తుత ప్రాజెక్టులను తిరిగి రూపొందించాలా లేదా రక్షించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇది ప్రభుత్వానికి సహాయపడుతుంది.[46] భారతదేశంలో వాతావరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.[47]

ఆర్థిక కార్యకలాపాల యూనిట్‌కు గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశంలో కార్బన్ సంగ్రహణ, వినియోగం లేదా నిల్వ (CCUS) కోసం ఒక విధాన చట్రాన్ని, దాని విస్తరణ యంత్రాంగాన్ని రూపొందించే ప్రక్రియపై నీతి ఆయోగ్ పనిచేస్తోంది.[48]

"వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందే హక్కు" 2024లో సుప్రీంకోర్టు ద్వారా భారతదేశంలో ప్రాథమిక హక్కుగా చట్టబద్ధంగా గుర్తించబడింది. ఈ నిర్ణయం భారతదేశంలో వాతావరణ చట్టాలను మరింత ప్రభావితం చేస్తుంది. [49]

పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించాలంటే భారతదేశం 2026 నాటికి విద్యుత్ రంగ ఉద్గారాలను గరిష్ట స్థాయికి చేర్చాలి. ఇటీవలి వరకు దేశం ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని భావించారు గానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిపై పెడుతున్న శ్రద్ధ కారణంగా అది దెబ్బతింది.[50]

కార్బన్ ఉద్గార వ్యాపారం, ధర నిర్ణయం

[మార్చు]

భారతదేశంలో కార్బన్ ఉద్గార వ్యాపారం ఇంకా అమలు కాలేదు. అయితే, సంబంధిత సాధనాలు, ఇంధన ఆదా సర్టిఫికేట్లు (PAT), వివిధ పునరుత్పాదక కొనుగోలు బాధ్యతలు (RPO), పునరుత్పాదక ఇంధన సర్టిఫికేట్లు (REC) విద్యుత్ ఎక్స్ఛేంజీలలో క్రమం తప్పకుండా వర్తకం చేయబడతాయి. [51] [52]

భారతదేశానికి కార్బన్ పన్ను లేదు, కానీ 2010 నుండి దేశంలో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన, దిగుమతి చేసుకున్న బొగ్గుపై పన్ను విధించబడింది. ఇది దాని విద్యుత్ ఉత్పత్తిలో సగానికి పైగా శక్తినిస్తుంది. [53] మొదట 50 (63¢ US) గా నిర్ణయించబడింది టన్ను బొగ్గుకు, దీనిని 2014లో ₹100కి [54] 2015లో ₹200కి పెంచారు. 2020 నాటికి బొగ్గు పన్ను టన్నుకు 400 (US$5.00) గా ఉంది. [55]

అంతర్జాతీయ సహకారం

[మార్చు]
2009 కోపెన్‌హాగన్ శిఖరాగ్ర సమావేశం తరువాత వాతావరణ మార్పు సమస్యలపై చర్చించడానికి బేసిక్ దేశాల పర్యావరణ మంత్రులతో జైరామ్ రమేష్ సమావేశం.

పారిస్ ఒప్పందంలో ఒక పార్టీగా భారతదేశం 2024 నాటికి తన మొదటి ద్వైవార్షిక పారదర్శకత నివేదికను, ప్రామాణిక ఆకృతిలో జాబితా గణాంకాలను UNFCCC కి సమర్పించనుంది. [56] 2021 సెప్టెంబరులో COP26 కి ముందు భారతదేశం కొత్త జాతీయంగా నిర్ణయించబడిన సహకారాన్ని సమర్పిస్తామని ప్రకటించింది. [57] COP26 వద్ద భారతదేశం 2070 నాటికి నికర-సున్నాగా ప్రణాళిక వేసే తాజా లక్ష్య తేదీని నిర్ణయించింది. [58] [59] [60] భారతదేశ వాతావరణ విధానంలో భాగంగా కార్బన్ తటస్థతకు తేదీ ఇవ్వడం ఇదే మొదటిసారి. [61]

COP26 లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంచామృతం - ఇది "ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి" అని ప్రకటించారు- అనే 5 ప్రధాన నిబద్ధతలను ప్రకటించారు

  • 2070 నాటికి కార్బన్ తటస్థతను చేరుకోవడం.
  • 2030 నాటికి శిలాజేతర ఇంధనాల నుండి వచ్చే శక్తి సామర్థ్యాన్ని 500GWకి పెంచడం.
  • 2030 నాటికి ఆర్థిక వ్యవస్థలో ఉన్న కార్బన్ తీవ్రతను 45% తగ్గించడం.
  • 2030 నాటికి శక్తి అవసరాలలో సగం పునరుత్పాదక వనరుల నుండి పొందడం.
  • 2030 నాటికి అంచనా వేసిన GHG ఉద్గారాల మొత్తం లోంచి 100 కోట్ల టన్నులు తగ్గించడం.

ప్రధానమంత్రి కొత్త ఎజెండాను కూడా ముందుకు తీసుకురావాలని ప్రతిపాదించారు: లైఫ్ - లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే జీవనశైలిని మార్చడం.[62]

నికర సున్నా తేదీ చైనా, అమెరికాల కంటే చాలా వెనుకబడి ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం బొగ్గు వాడకాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నప్పటికీ, భారత పర్యావరణవేత్తలూ, ఆర్థికవేత్తలూ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు, దీనిని సాహసోపేతమైన వాతావరణ చర్యగా అభివర్ణించారు.[63]

అనుసరణ

[మార్చు]

సోనమ్ వాంగ్‌చుక్ రూపొందించిన ఒక మంచు స్తూపం లడఖ్‌లోని హిమాలయ ఎడారిలో ఉన్న రైతులకు హిమానీనదాల నీటిని అందుబాటు లోకి తెస్తుంది.[64]

ఒడిశాలోని మహానది డెల్టాలోని ఐదు జిల్లాలు (పూరి, ఖోర్ధా, జగత్సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్), పశ్చిమ బెంగాల్‌లోని డెల్టాలోని రెండు జిల్లాలు - ఉత్తర, దక్షిణ 24 పరగణాలు (భారతీయ సుందర్‌బన్‌లతో సహా) లలో 2014 - 2018 మధ్య నిర్వహించిన పరిశోధన ప్రాజెక్టు డెల్టా నివాసులు ఆచరించే అనుసరణల గురించి వివరాలను ఇస్తుంది. పొలంలో ఉపయోగించే ఎరువుల పరిమాణాన్ని మార్చడం, రుణాల వాడకం, ఇళ్ల చుట్టూ చెట్లను నాటడం అనేవి మహానది డెల్టాలో అనుసరించే మూడు ప్రధానమైన పద్ధతులు. పశ్చిమ బెంగాల్ డెల్టాలో, పొలంలో ఉపయోగించే ఎరువుల పరిమాణాన్ని మార్చడం, నీటిపారుదల పద్ధతుల్లో మార్పులు చేయడం, రుణాల వినియోగం అనేవి అనుసరిస్తారు. ఈ రెండు డెల్టాల్లోనూ వలసలు కూడా ఒక అనుసరణగా ఉంది. కానీ దీనిని విజయవంతమైన అనుసరణగా పరిగణించరు.[65]

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో, రైతులు ఉప్పును తట్టుకోగల వరి రకాలను సాగు చేస్తున్నారు. చవుడు నేలల్లో ఉండే లవణీయతను తట్టుకునేలా ఈ వంగడాలను రూపొందించారు. మిశ్రమ వ్యవసాయం, పంటలలో వైవిధ్యం, వర్షపు నీటి సేకరణ, బిందు సేద్యం, వేప ఆధారిత పురుగుమందుల వాడకం, "పారుదలకి సహాయపడేలా సాళ్ళు దున్నడం, ఉప్పదనం తక్కువగా ఉండే మెరక భూముల్లో కూరగాయలను పండించడం" వంటి మెరక, మాగాణి సాగు పద్ధతులూ ఇతర వ్యవసాయ అనుసరణ పద్ధతులు. ఇవి రైతులకు వర్షాకాలంలో వరి పంటతో పాటు రెండవ పంట కూరగాయలు పండించడానికి సహాయపడ్డాయి.[66]

ఒడిశాలోని పూరి జిల్లాలో, నీరు నిలిచిపోవడం ప్రతి సంవత్సరం ప్రజలను ప్రభావితం చేసే ప్రమాదం. తోటాషి గ్రామంలో, చాలా మంది మహిళలు నీటితో నిండిన పొలాల్లో కూరగాయలు పండించడం ద్వారా, వారి కుటుంబ ఆదాయాన్నీ, పోషకాహారాన్నీ పెంచుకుంటూ, "పొలాల్లో నీరు నిలిచిపోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు".[67]

వాతావరణ మార్పులను అరికట్టడానికి తీసుకున్న చర్యలను అనుసరించడంలో విద్య ఒక సమగ్ర సాధనం. వాతావరణ మార్పులను అరికట్టడానికి ఏర్పాటు చేసిన చర్యల అనుసరణను పరిగణనలోకి తీసుకునేటప్పుడు, విద్యా వ్యవస్థను అటువంటి ప్రాజెక్టులో చేర్చడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పుపై ప్రజల జ్ఞానాన్ని మెరుగుపరచడం ద్వారా, వారు వివిధ ఉపశమన చర్యలను అవలంబించడం సులభం అవుతుంది. అలాగే, పర్యావరణ విషయాల విషయానికి వస్తే ఉత్తమ పద్ధతులపై యువతరంలో ఒక సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అభ్యసనానికి మద్దతు ఇచ్చే వ్యవస్థలు, అనుసరణను పెంపొందించడానికి మద్దతు ఇచ్చేలా చూసుకోవాలి.

సమాజం, సంస్కృతి

[మార్చు]

మీడియా కవరేజ్

[మార్చు]

IPCC 4వ అసెస్‌మెంట్ రిపోర్టు విడుదల సమయంలోను, అల్ గోర్, IPCC నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న సమయంలోనూ కొన్ని ప్రధాన స్రవంతి భారతీయ వార్తాపత్రికలపై (ముఖ్యంగా అభిప్రాయాలు, సంపాదకీయాల్లో) చేసిన గుణాత్మక విశ్లేషణలో, వాతావరణ మార్పుల గురించి రాయడంలో భారతీయ మీడియా శాస్త్రీయతను బలంగా అనుసరిస్తుందని తేలింది. ఆ సమయంలో అమెరికన్ వార్తాపత్రికలు ప్రదర్శించిన సందేహాత్మకతకు ఇది విరుద్ధంగా ఉంది. దానితో పాటు, భారతీయ మీడియా ఇంధన సవాళ్లు, సామాజిక పురోగతి, ప్రజా జవాబుదారీతనం, పొంచి ఉన్న విపత్తులను హైలైట్ చేస్తుంది. ఈ విధమైన కవరేజీ యూరోపియన్ మీడియాలో కూడా ఉంటుంది. వాతావరణ మార్పుపై అంతర్జాతీయ, ప్రపంచీకరణ చర్చను నిర్మించడంలో ఇది దోహదపడుతుంది. భారతీయ మీడియా ఉత్తర-దక్షిణ, రిస్క్-బాధ్యత చర్చల తరహాలో విభజించబడిందని మరొక అధ్యయనం కనుగొంది.

క్రియాశీలత

[మార్చు]
న్యూఢిల్లీలో పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ తో పాఠశాల విద్యార్థులు

2021లో జరిగిన లెక్కల ప్రకారం, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో 2 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదలను నివారించాలనే లక్ష్యంలో కనీసం 50 శాతమైనా సాధించాలంటే, భారతదేశం వాతావరణంపై తన నిబద్ధతలను 55% దాకా పెంచాలి. : Table 1 ఆ లక్ష్యాన్ని 95% సాధించాలంటే, భారత నిబద్ధతలు 147% పెరగాలి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల లోపు నియంత్రించే అవకాశం కనీసం 50 శాతమైనా ఉండాలంటే, భారతదేశం తన నిబద్ధతలను 191% పెంచాలి.[68]

దిశా రవి వంటి కార్యకర్తలు వాతావరణ పరిరక్షణ కోసం పాఠశాలలో సమ్మెలు చేయించారు.[69]

మారుమూల ఈశాన్య ప్రాంతంలోని గిరిజన ప్రజలు 2007లో మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్‌ను వాతావరణ మార్పులపై అవగాహనను పెంపొందించినందుకు అవార్డుతో సత్కరించాలని ప్రణాళిక వేశారు. వాతావరణ మార్పు తమ మాతృభూమిపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని వారు అంటున్నారు. [70]

మేఘాలయలో అధిక వర్షపాతం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రదేశాలుగా పరిగణించబడుతున్న చిరపుంజీ, మాసిన్రామ్ పట్టణాలు ఈ రాష్ట్రం లోనే ఉన్నాయి. కానీ ప్రపంచ వాతావరణ మార్పు కారణంగా ఈ ప్రాంతాలలో వర్షపాతం క్రమంగా తగ్గుతూ పొడిగా ఉండే రోజులు పెరుగుతూ ఉన్నాయి.[71] వరి, మొక్కజొన్నలను పండించే వేలాది మంది గ్రామస్తుల జీవనోపాధిని ఇది ప్రభావితం చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలు నీటి కొరతను కూడా ఎదుర్కొంటున్నాయి.

గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. మహారాష్ట్రలోని సంగంనేర్ (షిర్డీ సమీపంలో) ప్రజలు తమ సొంత ప్రయత్నాలపై చొరవ తీసుకొని దండకారణ్యం-హరిత ఉద్యమం అనే చెట్లు నాటే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని 2005 లో స్వాతంత్ర్య సమరయోధుడైన దివంగత భౌసాహెబ్ థోరట్ ప్రారంభించాడు. ఈ రోజు వరకు, వారు 1.2 కోట్లకు పైగా విత్తనాలను, 5 లక్షల మొక్కలనూ నాటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం
  • వాతావరణ మార్పు తగ్గింపు
  • వాతావరణ ఆర్థిక సహాయం
  • భారతదేశంలో ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ వాహనాలు
  • దక్షిణాసియాలో వాతావరణ మార్పు

మూలాలు

[మార్చు]
  1. "Greenhouse Gas Emissions in India" (PDF). September 2018. Archived (PDF) from the original on 2020-02-14. Retrieved 10 June 2021.
  2. "Emissions Gap Report 2019". UN Environment Programme (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 2019-11-20. Retrieved 10 June 2021.
  3. 3.0 3.1 "How climate change hits India's poor". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 1 Feb 2007. Retrieved 10 June 2021.
  4. 4.0 4.1 "Warmer Tibet can see Brahmaputra flood Assam | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-11.
  5. "Climate Change Performance Index" (PDF). November 2022. Retrieved 15 November 2022.[permanent dead link]
  6. ● Emissions data source: "Territorial (MtCO₂) / 1) Emissions / Carbon emissions / Chart View". Global Carbon Atlas. 2024. (archive on Our World in Data)

    ● Country population data source: "Population, total / All Countries and Economies / Most Recent Value (Thousands)". World Bank. 2024.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  7. "CO2 Emissions in 2023 – Analysis". IEA (in బ్రిటిష్ ఇంగ్లీష్). March 2024. Retrieved 2024-03-22.
  8. 8.0 8.1 (2020-03-01). "Health co-benefits and mitigation costs as per the Paris Agreement under different technological pathways for energy supply".
  9. 9.0 9.1 9.2 9.3 9.4 "Greenhouse Gas Emissions Factsheet: India". Climatelinks (in ఇంగ్లీష్). 31 January 2019. Archived from the original on 2021-02-17. Retrieved 2020-04-23.
  10. Roche, Elizabeth (2021-09-05). "India, US to focus on financing green technologies during John Kerry's visit". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-09-17.
  11. "Emissions Gap Report 2019". UN Environment Programme (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 2019-11-20. Retrieved 10 June 2021.
  12. "Report: China emissions exceed all developed nations combined". BBC News. 2021-05-07.
  13. "Power Sector at a Glance: All India | Government of India | Ministry of Power". Powermin.gov.in. Retrieved 2022-08-11.
  14. "India, World's No. 2 Coal Buyer, Plans to Cut Imports by a Third". Bloomberg.com. August 2019. Retrieved 2019-09-27.
  15. "How Long Will Coal Remain King in India?". www.greentechmedia.com. Retrieved 2021-01-21.
  16. Balsara, Sachin; Jain, P. K.; Ramesh, Anbanandam (2020). "Analyzing Enablers of Emission Reduction Strategies of Cement-manufacturing Industry of India under Fuzzy Environment". In Shunmugam, M. S.; Kanthababu, M. (eds.). Advances in Simulation, Product Design and Development. Lecture Notes on Multidisciplinary Industrial Engineering (in ఇంగ్లీష్). Singapore: Springer. pp. 571–581. doi:10.1007/978-981-32-9487-5_47. ISBN 978-981-329-487-5.
  17. 17.0 17.1 17.2 2nd biennial report (2018).
  18. "India's Industrial Sector GHG Emissions". www.ghgplatform-india.org. Retrieved 2020-04-20.
  19. "Standards for a net zero iron and steel sector in India – Analysis". IEA (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-04-26. Retrieved 2024-05-05.
  20. Sharma, Vibha (15 June 2020). "Average temperature over India projected to rise by 4.4 degrees Celsius: Govt report on impact of climate change in country". Tribune India. Retrieved 30 November 2020.
  21. Rowlatt, Justin (18 May 2022). "Climate change swells odds of record India, Pakistan heatwaves". BBC. Retrieved 20 May 2022.
  22. "How climate change hits India's poor" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2007-02-01. Retrieved 2021-03-11.
  23. Sethi, Nitin (February 3, 2007). "Global warming: Mumbai to face the heat". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-11.
  24. "New study finds incredibly high carbon pollution costs – especially for the US and India". The Guardian. 1 October 2018.
  25. "India may lose 3-10% GDP annually by 2100 due to climate change, says report". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-09. Retrieved 2021-07-01.
  26. "The costs of climate change in India: a review of the climate-related risks facing India, and their economic and social costs". Overseas Development Institute (in బ్రిటిష్ ఇంగ్లీష్). 7 June 2021. Archived from the original on 2021-06-08. Retrieved 2021-07-01.
  27. UNDP. "India and Climate Change Impacts". Archived from the original on 2011-03-17. Retrieved 2010-02-11.
  28. "Effect of Climate Change on Agriculture". PIB.GOV.IN. Retrieved 26 July 2023.
  29. (2018). "Extreme heat in India and anthropogenic climate change".
  30. "2018 Was Sixth Warmest Year in India's Recorded History: IMD". The Wire. Retrieved 2020-10-30.
  31. Alexander, Usha. "Ecological Myths, Warming Climates and the End of Nature". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2019-07-17.
  32. Sethi, Nitin (3 February 2007). "Global warming: Mumbai to face the heat". The Times of India. Archived from the original on 23 October 2012. Retrieved 2007-03-18.
  33. Murali Krishnan. "India: Migration from climate change getting worse". DW. Retrieved 26 July 2023.
  34. "Meghalaya body's Shylla wary of refugee influx". www.telegraphindia.com. Retrieved 2020-11-30.
  35. Islam, Md. Nazrul; van Amstel, André, eds. (2018). Bangladesh I: Climate Change Impacts, Mitigation and Adaptation in Developing Countries. Springer Climate (in బ్రిటిష్ ఇంగ్లీష్). Bibcode:2018bicc.book.....I. doi:10.1007/978-3-319-26357-1. ISBN 978-3-319-26355-7. ISSN 2352-0698.
  36. "Carbon stock in forests: Kerala tops among south Indian states". Mathrubhumi (in ఇంగ్లీష్). 23 April 2020. Retrieved 2020-04-23.
  37. "Climate change report card: These countries are reaching targets". Environment (in ఇంగ్లీష్). 2019-09-19. Archived from the original on 2019-09-20. Retrieved 2019-09-26.
  38. "'India only G20 nation to meet climate goals'". 16 August 2021.
  39. "The Carbon Brief Profile: India". Carbon Brief (in ఇంగ్లీష్). 2019-03-14. Retrieved 2019-09-25.
  40. "Renewable Methanol" (PDF). Retrieved 19 May 2021.
  41. "IEEFA India: New National Electricity Plan Reinforces Intent Toward 275 Gigawatts of Renewables-Generated Electricity by 2027". 19 April 2018. Archived from the original on 2019-09-26.
  42. "India ranks 3rd in the 'Renewable Energy Country Attractiveness Index' released by EY". www.ey.com (in Indian English). Retrieved 2021-07-01.[permanent dead link]
  43. Jai, Shreya (25 September 2019). "Govt to ease land acquisition, finance for renewables to meet 450 GW target". Archived from the original on 2019-09-26.
  44. King et al. 2012. "The Response of China, India, and Brazil to Climate Change." Archived 2014-05-09 at the Wayback Machine Smith School of Enterprise and the Environment. University of Oxford.
  45. "Odisha first state to have 'climate, nutrition budgets' – OrissaPost". Odisha News, Odisha Latest news, Odisha Daily – OrissaPost. 18 February 2020.
  46. "Odisha Becomes First State To Introduce Climate Budget". OdishaTV. 18 February 2020. Archived from the original on 19 ఫిబ్రవరి 2020. Retrieved 4 మే 2025.
  47. Suffian, Mohammad (February 19, 2020). "Odisha govt presents Rs 1.5 lakh crore budget for FY21". India Today (in ఇంగ్లీష్).
  48. "Carbon Capture, Utilization and Storage (CCUS) – Policy Framework and its Deployment Mechanism in India" (PDF). Niti Aayog. November 2022. Retrieved 11 December 2022.[permanent dead link]
  49. Sinha, Amitabh (22 April 2024). "How Supreme Court's verdict on climate change can push climate litigation in India". The India Express. Retrieved 22 April 2024.
  50. Kumar Singh, Rajesh (6 September 2024). "India power emissions must peak by 2026 to meet Paris pact". Bloomberg. The Economic Times. Retrieved 8 September 2024.
  51. "Renewable energy: The undoing of RECs and ESCerts". 17 June 2022. Retrieved 2 October 2022.
  52. "To price or not to price? making a case for a carbon pricing mechanism for India" (PDF). Archived from the original (PDF) on 2 అక్టోబరు 2022. Retrieved 2 October 2022.
  53. Pearson, Natalie Obiko (1 July 2010). "India to Raise $535 Million From Carbon Tax on Coal". Bloomberg Businessweek. Archived from the original on 4 July 2010. Retrieved 14 May 2011.
  54. Dogra, Sapna (3 July 2010). "India sets $1/mt clean coal tax for domestic producers/importers". Platts International Coal Report. Archived from the original on 21 February 2021. Retrieved 4 September 2016.
  55. "Controlling emissions: Explicit carbon taxation needed, indirect taxation doesn't help". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-04. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-06.
  56. "Reporting and Review under the Paris Agreement". unfccc.int. Retrieved 2020-04-20.
  57. "Climate change: Whisper it cautiously... there's been progress in run up to COP26". BBC. 25 September 2021. Retrieved 10 October 2021.
  58. Webster, Ben; Burgess, Kaya; Philp, Catherine (1 November 2020). "Cop26: India puts off net zero to 2070 and deals blow to climate hopes". The Times.
  59. Vittozzi, Katerina (1 November 2021). "COP26: India has given a distant net-zero target and is now asking the world for cash". Sky News.
  60. "COP26: India PM Narendra Modi pledges net zero by 2070". BBC News. 2 November 2021.
  61. Vaughan, Adam (2 November 2021). "COP26: Why India's 2070 net zero pledge is better news than it sounds". New Scientist.
  62. Shrivastava, Rahul (1 November 2021). "Push for renewable by 2030, net-zero emissions by 2070: PM Modi's 5 commitments at COP26 summit". India Today. Retrieved 21 November 2021.
  63. "India pledges net-zero emissions by 2070 — but also wants to expand coal mining". NPR. 3 November 2021.
  64. Krug, Teresa (7 May 2018). "Sonam Wangchuk: An Ice Fountain Brings Water to the Himalayan Desert". Guernica Magazine. Retrieved 7 June 2018.
  65. "Climate change, migration and adaptation in deltas: Key findings from the DECCMA project". weADAPT | Climate change adaptation planning, research and practice (in ఇంగ్లీష్). 2018-10-31. Retrieved 2020-11-29.
  66. "Salt-tolerant rice, innovations help farmers deal with salinity in Sundarbans". Mongabay-India (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-07-14. Retrieved 2020-11-29.
  67. "Women Adapting to Climate Change by undp india on Exposure". undp-india.exposure.co. Retrieved 2020-11-29.
  68. Liu, Peiran R.; Raftery, Adrian E. (9 February 2021). "Country-based rate of emissions reductions should increase by 80% beyond nationally determined contributions to meet the 2 °C target". Communications Earth & Environment. 2 (1): 29. Bibcode:2021ComEE...2...29L. doi:10.1038/s43247-021-00097-8. PMC 8064561. PMID 33899003.
  69. "'Key conspirator, collaborated with pro-Khalistani body': Delhi Police on Disha Ravi, arrested in toolkit case". The Indian Express (in ఇంగ్లీష్). 2021-02-14. Retrieved 2021-02-14.
  70. Das, Biswajyoti (2007-08-29). "India tribe to honour Gore on global warming". Reuters. Retrieved 2007-09-08.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  71. Kharmujai RR (3 March 2007). "Wet Desert Of India Drying Out". Retrieved 2007-12-01.