భారతదేశ జిల్లాల జాబితా

జిల్లా అనేది భారతదేశంలోని రాష్ట్రాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భాగము. భారతదేశాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. గవర్నరు అనే ఇంకో పదవి కూడా రాష్ట్రంలో ముఖ్యమైనదే, కానీ ఈ పదవికి అధికారాలు ఏమీ ఉండవు. కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టనెంట్ గవర్నరు చేతిలో అన్ని ముఖ్య అధికారాలు ఉంటాయి. అలా కాకుండా కేంద్రప్రభుత్వం ఒక శాసనం జారీచేసి నియమిత అధికారాలున్న ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ మరియు పుదుచ్చేరి) మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.
ప్రతీ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని అధికార వికేంద్రీకరణకై జిల్లాలుగా విభజించడమైంది. ప్రతీ జిల్లాకు ప్రభుత్వం ఒక ఐ.ఏ.ఎస్. ఆఫీసరును కలక్టరుగా నియమిస్తుంది. ఈ అధికారి జిల్లాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటారు. కలెక్టరును జిల్లా మెజిస్ట్రేటు అని కూడా పిలుస్తారు, జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతలను కూడా ఈ అధికారే పర్యవేక్షిస్తారు. పెద్ద పెద్ద రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక విభాగం సృష్టించి, దానికి ఒక కమీషరుని నియమిస్తారు. ముంబాయి లాంటి నగరాలు జిల్లాలు కాకపోయినా కూడా వాటికి ప్రత్యేకంగా కలెక్టరులను నియమిస్తారు.
జిల్లా కేంద్రాలలో అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది జిల్లా నిర్వహణ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తుంది. జిల్లాలను కూడా తాలూకాలు లేదా తెహసిల్లు, మండలాలుగా విభజిస్తారు. వీటిని పాశ్చాత్య దేశాలలో కౌంటీలుగా వ్యవహరించే పాలనా విభాగాలకు సమాంతరమైనవిగా భావించవచ్చు.
అవలోకనం
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
భారతదేశ జిల్లాల జాబితా/అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ జిల్లాల జాబితా/ఆంధ్ర ప్రదేశ్ భారతదేశ జిల్లాల జాబితా/అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ జిల్లాల జాబితా/అసోం భారతదేశ జిల్లాల జాబితా/బీహార్ భారతదేశ జిల్లాల జాబితా/చండీగఢ్ భారతదేశ జిల్లాల జాబితా/చత్తీస్‌గఢ్ భారతదేశ జిల్లాల జాబితా/డామన్ డయ్యు భారతదేశ జిల్లాల జాబితా/ఢిల్లీ భారతదేశ జిల్లాల జాబితా/దాద్రా నగర్ హవేలీ భారతదేశ జిల్లాల జాబితా/గోవా భారతదేశ జిల్లాల జాబితా/గుజరాత్ భారతదేశ జిల్లాల జాబితా/హిమాచల్ ప్రదేశ్ భారతదేశ జిల్లాల జాబితా/హర్యానా భారతదేశ జిల్లాల జాబితా/జార్ఖండ్ భారతదేశ జిల్లాల జాబితా/జమ్మూ కాశ్మీర్ భారతదేశ జిల్లాల జాబితా/కర్ణాటక భారతదేశ జిల్లాల జాబితా/కేరళ భారతదేశ జిల్లాల జాబితా/లక్షద్వీపాలు భారతదేశ జిల్లాల జాబితా/మహారాష్ట్ర భారతదేశ జిల్లాల జాబితా/మేఘాలయ భారతదేశ జిల్లాల జాబితా/మణిపూర్ భారతదేశ జిల్లాల జాబితా/మధ్య ప్రదేశ్ భారతదేశ జిల్లాల జాబితా/మిజోరం భారతదేశ జిల్లాల జాబితా/నాగాలాండ్ భారతదేశ జిల్లాల జాబితా/ఒడిషా భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్ భారతదేశ జిల్లాల జాబితా/పుదుచ్చేరి భారతదేశ జిల్లాల జాబితా/రాజస్థాన్ భారతదేశ జిల్లాల జాబితా/సిక్కిం భారతదేశ జిల్లాల జాబితా/తమిళనాడు భారతదేశ జిల్లాల జాబితా/త్రిపుర భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తర ప్రదేశ్ భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తరాంచల్ భారతదేశ జిల్లాల జాబితా/పశ్చిమ బెంగాల్
ఇవి కూడా చూడండి
వనరులు
- మనోరమ ఇయర్ బుక్ 2003, పేజీలు 649–714, ISBN 81-900461-8-7
- భారతదేశపు జిల్లాల అధికారిక జాబితా
- భారతదేశ జిల్లాలు
- సాధారణ పరిపాలన
