భారతదేశ నౌకాదళ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశములో నౌకాదళ దినోత్సవం(అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు[1] . దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.

భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో మరియు ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు.ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధనౌకలు, 8 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 24 కొర్వెట్టెలు, 13 సంప్రదాయ జలాంతర్గాములు, 1 అణు దాడి జలాంతర్గామి, 30 పెట్రోల్ ఓడలు, వివిధ సహాయక నౌకలు మొదలైనవి భారత నావికాదళంలొ భాగం.

మూలాలు[మార్చు]

  1. Mehta, Sulogna (November 26, 2016). "Naval ships showcase their strength during Day at Sea". The Times of India.