భారతీయ జనసంఘ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
1968 నుండి 1973 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి
ప్రముఖ జనసంఘ నేతలలో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ

సంక్షిప్తంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.

ప్రారంభం[మార్చు]

1951 అక్టోబర్ 21న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా దీపం గుర్తు లభించింది. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోక్‌సభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించింది. 1967 తరువాత ఈ పార్టీ బలపడింది.

హిందూ జాతీయ వాదం[మార్చు]

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. 1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్తు ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.

దేశంలో అత్యవసర పరిస్థితి కాలం[మార్చు]

1975లో దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. 1977లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్‌తో పాటు భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించింది. మురార్జీ దేశాయ్ నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఘ్ నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం[మార్చు]

జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో 1980 లోక్‌సభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీకు తొలి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1989 తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టినాడు.

ప్రముఖ జనసంఘ్ నాయకులు[మార్చు]

శ్యాంప్రసాద్ ముఖర్జీ
1901, జూన్ 6న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ప్రముఖుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953న మరణించేవరకు కొనసాగినాడు.
అటల్ బిహారీ వాజపేయి
1924లో గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి 1968 నుండి 1973 వరకు జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రివ్త శాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.
లాల్ కృష్ణ అద్వానీ
1927లో కరాచిలో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. మహాత్మా గాంధీ హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భారతీయ జనతా పార్టీలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అధ్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.

ఆచార్య బలరాజ్ మధోక్ :

స్వతంత్ర భారతదేశంలో విలక్షణమైన రాజకీయ, ఆర్థిక సైద్ధాంతిక భూమిక ఏర్పడటం కోసం విశేషంగా పోరాడిన, కోట్లాది మంది యువతను దేశభక్తి భావనతో ఉర్రూతలూగించిన, నేడు ఢిల్లీలో అధికారంలో ఉండిన భారతీయ జనతాపార్టీకి సైద్ధాంతిక పునాది ఏర్పరచిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు ఆచార్య బలరాజ్ మధోక్ మే 2న ఢిల్లీలో మృతి చెందారు. నమ్మిన విలువలు, ఆదర్శాలకోసం రాజీలేని పోరాటాలు జరిపిన ఆయన రాజకీయంగా గత మూడున్నర దశాబ్దాలుగా తెరమరుగు కావలసి వచ్చింది. అయినా భారతదేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువరానివి.

ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉన్న స్కర్దులో 1920, ఫిబ్రవరి 25న జన్మించిన ఆయన శ్రీనగర్, లాహోరుల్లో చదువుకున్నారు. 1940లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి 1942లో ప్రచారక్‌గా వెళ్లారు. జమ్మూకశ్మీర్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి ఒక దశలో షేక్ అబ్దుల్లా ప్రయత్నించాడు. జమ్మూలో ప్రజాపరిషత్ స్థాపకులలో ఒకరైన ఆయన 1949లో ఢిల్లీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ప్రారంభించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి, వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1921లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీలో జరిపిన మొదటి సదస్సుకు కన్వీనర్‌గా ఉన్నారు. ఇద్దరు ఉద్దండులైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత దీన దయాళ్ ఉపాధ్యాయలతో కలిసి పనిచేశారు. వారిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం గమనార్హం. జనసంఘ్‌కు విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక భూమికను ఏర్పరచడం కోసం ప్రయత్నించారు. పార్టీ మొదటి ఎన్నికల ప్రణాళికను ఆయన తయారుచేశారు. రెండుసార్లు ఢిల్లీనుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసంఘ్ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో 35 స్థానాలు గెలుచుకొని వివిధ రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగింది. దేశవిభజన సమయంలో విద్రోహానికి గురయి, మారణహోమానికి గురయిన హిందువులు, సిక్కుల పక్షాన నిలబడి వారి భద్రతకోసం అవిరామంగా పోరాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆయనను ప్రముఖంగా పేర్కొనవచ్చు. అయితే వౌలిక అంశాలపై రాజీలేని ధోరణిని అవలంబించడం, ప్రజాకర్షణ విధానాలకు దూరంగా ఉండటంతో ఆయన సొంతపార్టీలోనే నెగ్గుకురాలేకపోయారు. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ఉద్యమకారుడిగా పాకిస్తాన్ సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ భారతీయ సైన్యానికి అందజేస్తూ ఉండేవారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా పిలువబడుతున్న ప్రాంతంలో మిర్పూర్‌లో చిక్కుకుపోయిన లక్షలాది మంది హిందువులను, సిక్కులను కాపాడటం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన నిర్లక్ష్య ధోరణే అందుకు కారణం. ఈ మారణహోమం నుండి బయటపడిన బాల్ కె. గుప్తా అనే వ్యక్తి కథనం ప్రకారం నవంబరు 23న ప్రేమనాధ డోగ్రా, బలరాజ్ మధోక్‌లు కలిసి జమ్మూలో భారతీయ సైన్య అధిపతి బ్రిగేడ్ కమాండర్ పరంజపిని కలిసి కశ్మీర్‌పై పాకిస్తాన్ జరిపిన మొదటి దాడిలో వ్యూహాత్మకంగా కీలకమైన మిర్పూర్ వద్ద చిక్కుకుపోయిన లక్షమందికి పైగా హిందువులు, సిక్కులను కాపాడమని కోరారు. అయితే అందుకు బ్రిగేడియర్ నిస్సహాయతను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్‌లో షేక్ అబ్దుల్లాను సంప్రదించకుండా భారతీయ సైన్యం కదలడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. అయితే ఆ మరుసటి రోజు శ్రీనగర్‌కు వస్తున్న నెహ్రూను కలవమని సూచించాడు. ఆ మరుసటిరోజుశ్రీనగర్‌లో నెహ్రూను కలిశారు. పరిస్థితి తీవ్రతను వివరించారు. అయినా ఆయన స్పందించకుండా షేక్ అబ్దుల్లాతో మాట్లాడమని కోరారు. జమ్మూ ప్రాంతం పట్ల అబ్దుల్లా ఉదాసీనంగా ఉన్నారని, నెహ్రూ మాత్రమే వారిని కాపాడగలరని మధోక్ స్పష్టం చేసినా ఆయనలో కదలికలేదు. అదే రోజున మిర్పూర్‌పై పాక్ బుల్లెట్ల వర్షం కురిపించి అత్యంత అమానుషమైన నరమేధానికి పాల్పడింది. జమ్మూకశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజించాలని డా.బిఆర్ అంబేద్కర్ చేసిన సూచనను మధోక్ గట్టిగా సమర్ధించారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇవ్వాలని లడఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ చేసిన డిమాండ్‌ను బలపరిచారు. జాతీయ భద్రతా ప్రయోజనాలకోసం ఇది చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించడాన్ని డాక్టర్ అంబేద్కర్ వ్యతిరేకించారని మొదటగా వెలుగులోకి తెచ్చిన నాయకుడు మధోక్. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనసంఘ్, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (జె) కలసి ఒక కూటమిగా ఏర్పడి షాడో మంత్రివర్గాన్ని ఏర్పరచాయి. దాంట్లో మధోక్ రక్షణమంత్రిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో మీసాకింద అరెస్టయి 18 నెలల పాటు జైలు జీవితం గడిపారు. నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ‘సాంస్కృతిక జాతీయవాదం’ గురించి మొదటగా ఒక పత్రం రూపొందించిన నాయకుడు మధోక్. 1952లో‘్భరతీరుూకరణ’పై జనసంఘం ఆమోదించిన తీర్మానం నుండి, 1969లో అమోదించిన తీర్మానం వరకు ఈ అంశంపై లోతైన అధ్యయనం, ప్రతిపాదనలు చేశారు. ‘్భరతీరుూకరణ’పై మధోక్ ప్రతిపాదనలను ఎం.సి. ఛాగ్లా రాజ్యసభలో ప్రస్తావించారు. మధోక్ దృష్టిలో ‘కులం, వర్గం, భాష, ప్రార్థనామార్గం ఏదైనా భారతీయులందరికీ దేశం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతనుండి వారందరికి హక్కులు ఏర్పడతాయి. దేశాన్ని తమ గృహంగా భావించి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానాన్ని గౌరవించేవారంతా, ఒక ప్రజ, ఒక జాతి.’’ ‘ఒకరి రంగు, కులం, భాష, ప్రార్థనాపద్ధతి, రాజకీయ పార్టీలను బట్టి భరతమాతను నిర్ణయించరాదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఒక గొప్ప పోరాట యోధుడు, మేధావి, రాజకీయ-జాతీయ నాయకుడు అయిన మధోక్ పూర్తి సామర్ధ్యాలను దేశం ఉపయోగించుకోలేకపోయింది. అందుకు కారణాలు ఏవైనా కారకులు ఎవరైనా ప్రస్తుతం అవసరం లేదు. ‘‘దేశంలోని ప్రతి పౌరుడిని మంచి భారతీయుడిగా, ఒక మంచి దేశభక్తి కలవాడిగా, ఒక జాతీయవాదిగా చేయడం భారతీరుూకరణ’’ అని ఆయన తెలిపారు. 1960-70 దశకాలలో ‘్భరతీరుూకరణ’ అని ఆయన వ్రాసిన గ్రంథం దేశంలోని యువతను దేశభక్తి భావనతో ఉర్రూతలూలగించింది. జనసంఘ్‌కు స్పష్టమైన ఆర్థిక విధానం రూపొందించడం కోసం ఆయన ప్రయత్నించారు. నేడు ఆర్థిక సంస్కరణల పేరుతో 1991 నుండి భారతీయులపై తప్పనిసరి పరిస్థితుల్లో రుద్దబడుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలను ఆయన 1960 దశకంలోనే ప్రతిపాదించారు. అయితే అందుకు హిం దూత్వ జాతీయ, భావన ప్రాతిపదికగా ఉండాలని స్పష్టం చేశారు. అందుకనే స్వతంత్ర పార్టీ, జనసంఘ్ పార్టీలు విలీనమై కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడం కోసం తీవ్ర కృషి సలిపారు. 1967లో ఈ రెండు పార్టీలు కలిసి లోక్‌సభలో సుమారు 80 సీట్లతో ఇందిరాగాంధీకి బలమైన ప్రతిపక్ష కూటమిగా పనిచేశారు. స్వాతంత్య్రం అనంతరం ఇంతటి బలమైన ప్రతిపక్ష పార్లమెంటు అప్పుడే అవతరించింది. అయితే అదే సమయంలో ఇందిరాగాంధీ అధికారం కాపాడుకోవడానికి వామపక్ష భావనలవైపు మొగ్గు చూపి ‘గరీబీ హటావో’, బ్యాంకుల జాతీరుూకరణ, రాజభరణాల రద్దు వంటి విధానాలు చేపట్టి ఎంతో ప్రచారం పొందారు. మధోక్ ప్రతిపాదించిన సరళీకృత విధానాలు ‘రాజకీయంగా ప్రయోజనకారి కావని’ భావించిన వాజ్‌పేయి వర్గం తీవ్ర ప్రతిఘటనకు పూనుకుంది. మధోక్‌ను మితవాద హిందూత్వ వాదిగా చిత్రీకరించి వాజ్‌పేయిని ఉదారవాదిగా ప్రచారం చేశారు. ఈ విషయాలు ఆర్‌ఎస్‌ఎస్ విశ్వాసం పొందలేకపోయిన మధోక్ అనుసరించిన రాజీలేని ధోరణులు 1973లో పార్లమెంటు నుండి బహిష్కరణకు దారితీశాయి. అప్పటి పార్టీ అధ్యక్షుడిగా ఉండిన ఎల్‌కె అద్వానీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అత్యవసర పరిస్థితి అనంతరం భారతీయ జనసంఘ్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలను చేసినా మధోక్ విజయం సాధించలేకపోయారు. ఒకవిధంగా జాతీయ జీవన స్రవంతి నుండి వేరుపడవలసి వచ్చింది. అయినా జీవితాంతం స్పష్టమైన సైద్ధాంతిక నిష్ట, దేశం, ప్రజల పట్ల నిఖార్సయిన అంకిత భావం గల ఒక గొప్ప జాతీయ వాది మధోక్ అని చెప్పవచ్చు. ఒకవైపు ఆర్యసమాజ్, హిందూ మహాసభ, మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఒకరి ఆదేశాల మేరకు నడచుకొనే తత్వం లేకపోవడం, స్వతంత్రంగా వ్యవహరించే అలవాటు ఉండటంతో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనల మేరకు హిందూవాద రాజకీయ పక్షంగా జనసంఘాన్ని అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రయత్నాలకు పార్టీలోపలినుంచే ప్రతిఘటనలు ఎదుర్కొనాల్సి వచ్చింది. స్వతంత్ర భారత్‌లో సంకీర్ణ రాజకీయాకు అంకురార్పణ చేసిన కొద్దిమంది నాయకుల్లో మధోక్ ఒకరని చెప్పవచ్చు. 1967 ఎన్నికలలో ఈ ప్రయత్నం ఘన విజయం సాధించింది. జనసంఘ్‌ను జాతీయ రాజకీయ స్రవంతిలో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా నిలబెట్టింది. ఏనాడూ పదవులకోసం, హోదాలకోసం ఆరాటపడలేదు. అందుకోసం రాజీ ధోరణులు అవలంబించలేదు. దేశం, దేశ ప్రజల కోసం మాత్రమే ఆరాటపడ్డారు. సైద్ధాంతికంగా ఏమాత్రం రాజీధోరణి అవలంబించినా, హోదాలకోసం సర్దుబాటు ధోరణులను ప్రదర్శించినా, ఎన్నో ఉన్నత పదవులలోకి వచ్చి ఉండేవారు. పదవులు రాలేదని ఏనాడూ ఆవేదన చెందలేదు. ఒకవిధంగా రెండు-మూడు దశాబ్దాలుగా స్థిత ప్రజ్ఞుడి వలె జీవించారని చెప్పవచ్చు.

పి.వి.ఎన్.రాజు
ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ భారతీయ జనసంఘ్ నేతలలో ఒకడైన పి.ఎన్.వి.రాజు 1973 నుండి 1976 వరకు జనసంఘ్ రాష్ట్ర శాఖను అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అత్యవసర పరిస్థితి కాలంలో 18 నెలలు జైలు జీవితం గడిపిన రాజు మే 15, 2008 న మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. హిందూ దినపత్రిక, తేది మే 16, 2008