భారతీయ దర్శనాలు
స్వరూపం
దర్శనాలు అంటే దృష్టి, వీక్షణం లేదా తాత్విక వ్యవస్థ అని అర్థం. భారతీయ తత్వశాస్త్రంలో, ముఖ్యంగా హిందూమతంలో, ప్రపంచం, జీవుడు, పరమాత్మ మరియు జీవితం యొక్క లక్ష్యం వంటి క్లిష్టమైన తాత్విక సమస్యలకు సమాధానాలు చెప్పే ఆరు ప్రధాన తాత్విక పాఠశాలలను సూచిస్తాయి. వీటిని "షడ్దర్శనాలు" అని కూడా అంటారు.
మానవుడు ఐహికమగు సుఖాల నుండి విముక్తిను పొందుటకు, పరమ ఉత్కృష్టమయిన శాంతిని ఏ విధంగా పొంద వలయునో, దారి చూపునది, తెలియ జేయునది ఏదియో అదే దర్శనములు, అవియే వైదికంలనియు, అవైదికంలను రెండు వర్గాలుగా విడదీసారు.
వైదిక దర్శనాలు
[మార్చు]- న్యాయ దర్శనం, : గౌతమ ఋషిచే స్థాపించబడింది, ఇది తర్కం, జ్ఞానం మరియు వాటి పద్ధతులపై దృష్టి సారిస్తుంది.
- వైశేషిక దర్శనం : కాణాద ఋషిచే ప్రతిపాదించబడింది, ఇది ప్రపంచంలోని అన్ని వస్తువుల స్వభావాలను, వాటి నిర్మాణాన్ని విశ్లేషిస్తుంది.
- సాంఖ్య దర్శనం : కపిల ఋషిచే రూపొందించబడింది, ఇది పురుషు (ఆత్మ) మరియు ప్రకృతి (భౌతిక ప్రపంచం) రెండూ సృష్టిలో ప్రాథమిక సూత్రాలని సూచిస్తుంది.
- యోగ దర్శనం : పతంజలి ఋషిచే బోధించబడింది, ఇది మనస్సును నియంత్రించడం, శరీరం మరియు మనస్సును నియంత్రించే మార్గాలను వివరిస్తుంది.
- పూర్వ మీమాంసా దర్శనం : జైమిని ఆచార్యులచే స్థాపించబడింది, ఇది వేదాల కర్మాకాండ (కర్తవ్యాలు)పై దృష్టి పెడుతుంది.
- ఉత్తరమీమాంసా దర్శనం (వేదాంతదర్శనం) : బాదరాయణాచార్యులచే ప్రతిపాదించబడింది, ఇది వేదాల జ్ఞానకాండ (ఉపనిషత్తులు)పై దృష్టి సారిస్తుంది, పరమాత్మ మరియు మోక్షానికి సంబంధించినది.
వీటినే షడ్దర్శనాలుఅని అంటారు.
అవైదిక దర్శనాలు
[మార్చు]- లోకాయుత దర్శనం లేదా చార్వాక దర్శనం అంటారు. (1) జైన దర్శనం, (2) బౌద్ధ దర్శనం