భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ' (CII) అనేది పరిశ్రమచే నడిపించబడి పరిశ్రమచే నిర్వహించబడే ఒక ప్రభుత్వేతర లాభం-కోసం పనిచేయని సంస్థ. భారతదేశ అభివృద్ధిలో క్రియాశీల పాత్ర వహించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. సలహా మరియు సమాలోచనల ద్వారా పరిశ్రమ మరియు ప్రభుత్వం రెండిటిని భాగస్వామ్యం చేసి పద్ధతి ద్వారా భారత దేశంలో పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి దానిని కొనసాగించే దిశగా ఈ సమాఖ్య కృషి చేస్తుంది. సమాఖ్య ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో ఉంది. శ్రీ బి. ముత్తరామన్ సమాఖ్య అధ్యక్ష్యుడు గాను శ్రీ చంద్రజిట్ బనేర్జీ డైరెక్టర్ జనరల్ గాను ఉన్నారు.

విధి[మార్చు]

విశేష సేవల ద్వారాను ప్రపంచవ్యాప్త సంబంధాల ద్వారాను విధానపరమైన అంశాలలో ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తూ మార్పులు తేవడానికి, సమర్ధత మరియు పోటీతత్వాన్ని మెరుగుపరిచి పరిశ్రమకు వ్యాపార అవకాశాలను విస్తరించడానికి CII కృషి చేస్తుంది. ప్రతి విభాగములోను ఏకాభిప్రాయం సాధించడం మరియు నెట్వర్కింగ్ కు ఒక వేదికను ఇది అందిస్తుంది. వ్యాపారం పై సానుకూల వైకిరిని ఏర్పరచడం, పరిశ్రమకు సహాయపడడం, కార్పరేట్ సిటిజన్షిప్ కార్యక్రమాలను జరపడం వంటి అంశాల పై ప్రధానంగా కేంద్రీకరిస్తుంది. పరిశోధనలు జరపడం, కీలక ప్రభుత్వ అధికారులతో సంప్రదించడం, ప్రచురణలు, సమావేశాలు మరియు కార్యక్రమాల ద్వారా సమాచారాన్ని అందించడం వంటి పనులను CII చేపట్టుతుంది.

CII కు భారతదేశములో 64 కార్యాలయాలు, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చైనా, ఫ్రాన్సు, జర్మనీ, జపాన్, సింగపూర్, యుకె, యుఎస్ఎ మొదలగు దేశాలలో 9 కార్యాలయాలు ఉన్నాయి. 100 దేశాలలోని 223 ఇదే తరహా సమాఖ్యలతో సంస్థాగత భాగస్వామ్యం కలిగి ఉండి, భారత పరిశ్రమకు మరియు అంతర్జాతీయ వర్తక సమాజానికి ఒక కేంద్ర బిందువులా CII వ్యవహరిస్తుంది.

చరిత్ర[మార్చు]

CII 1895లో స్థాపించబడింది. మొట్టమొదటిగా ఐదు ఇంజనీరింగ్ సంస్థలు దీనిలో భాగస్వాములుగా చేరాయి, అన్ని కూడా బెంగాల్ చేంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి యొక్క సభ్య సంస్థలే. మొదట్లో, సంస్థ పేరు, ఇంజనీరింగ్ అండ్ ఐరన్ ట్రేడ్స్ అసోసియేషన్ (EITA) గా ఉండేది. ఇనుము మరియు స్టీలు మరియు ఇంజనీరింగ్ సరకులకు ప్రభుత్వ ఆర్డర్లను భారతదేశములో ఉన్న సంస్థలకు ఇవ్వటానికి బ్రిటిష్ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే EITA స్థాపించబడింది (అప్పట్లో ప్రభుత్వ ఆర్డర్లను యుకే సంస్థలకు ఇవ్వడమే ఆనవాయతీ). సంస్థ పేరు తరువాత ఇండియన్ ఇంజనీరింగ్ అసోసియేషన్ (IEA), ఇంజనీరింగ్ అసోసియేషన్ అఫ్ ఇండియా (EAI), అసోసియేషన్ అఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రి (AIEI), కాన్ఫెడరేషన్ అఫ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రి (CEI) లుగా మార్చబడి ఆఖరికి కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రి (CII) గా 1992లో మార్చబడింది.

సభ్యత్వం[మార్చు]

ఇది భారతదేశము యొక్క ప్రధాన వర్తక సంఘం. ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాల నుండి ఎస్ఎంఈలు మరియు ఎంఎన్ సి లతో కలిపి 8100 కు పైగా సంస్థలు ఈ సంఘంలో నేరుగా సభ్యత్వం కలిగి ఉన్నాయి మరియు 90,000 కు పైగా 400 వివిధ దేశీయ మరియు రాష్ట్ర స్థాయి రంగాలలోని సంఘాల నుండి పరోక్ష సభ్యత్వం ఉంది.

==

గ్రంథాలయం[మార్చు]

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) గ్రంథాలయం అనేది CII ప్రధాన కార్యాలయంలోని కేంద్ర గ్రంథాలయం & సమాచార కేంద్రం. సభ్యులకు సిబ్బంధులకు సహాయ పడే సమాచారాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉపయోగించే వారికి అవసరమైన వ్యాపార సంబంధిత పరిశోధనా సమాచారాలను ముద్రించిన మరియు ఇతర రూపాలలో అందుబాటులో ఉంచడమే గ్రంథాలయం యొక్క ప్రధాన లక్ష్యం.

గ్రంథాలయంలో భారతీయ పరిశ్రమకు చెందిన అనేక విభాగాలు ఉన్నాయి. ఈ సేకరణలో ముఖ్యంగా పుస్తకాలు, సంచికలు, సిడిలు, ఆడియో విజువల్ లు, చాయాచిత్రాలు మరియు గ్రే పత్రాలు ఉన్నాయి. CII ప్రచురణలు, సమావేశ విశేషాలు, దేశీయ & అంతర్జాతీయ గుణాంకాలు, దేశీయ & అంతర్జాతీయ డైరెక్టరీలు మరియు డేటాబేస్ లు, ఎక్జిబిటర్ కేటలాగ్లు, కార్పరేట్ చట్టాలు మరియు వర్కింగ్ పేపర్లు, ప్రభుత్వ నివేదికలు మరియు కంపెనీలు, మంత్రుత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల యొక్క వార్షిక నివేదికలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సమావేశ విశేషాలు, ప్రదర్శనలు, గణాంక డేటాబేస్ లు, పరిశ్రమ డైరెక్టరీలు, వార్షిక నివేదికలు మరియు ఆన్ లైన్ డేటాబేస్ లు డిజిటల్ రూపములో అందుబాటులో ఉన్నాయి.

రెఫెరన్స్, రెఫరల్, డాక్యుమెంట్ డెలివెరి, ప్రస్తుత అవగాహన మరియు డేటాబేస్ శోధన వంటి సేవలు అందించబడుతున్నాయి. వ్యాపారం మరియు పరిశ్రమలో ఆసక్తి ఉన్న అందరి అవసరాలను తీర్చే విధముగా సమాచారాన్ని గ్రంథాలయం అందిస్తుంది: ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, పరిశోధకులు. గ్రంథాలయకర్తలు, విశ్లేషకులు, మదుపుదారులు మరియు పాత్రికేయలకు ఈ గ్రంథాలయం సేవలు అందిస్తుంది. అభ్యర్తన మేరకు కావలసిన సమాచారం కావలిసిన రూపములో కూడా ఇవ్వబడుతుంది.

వ్యాపార సంత[మార్చు]

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) భారతీయ పరిశ్రమ యొక్క ఎదుగుదలకు వ్యాపార సంతలు నిర్వహిస్తుంది. ఈ వ్యాపార సంతలలో ముఖ్యమైనవి: ఐఈటీఎఫ్, ఆటో ఎక్స్పో, ఆగ్రోటేక్, ఐఎమ్ఎంఈ, మొదలగునవి. ఆటో ఏక్స్పో, ఆసియాలోనే అతి పెద్ద ఆటో ప్రదర్శన. IETF అనే ఒక వ్యాపార సంతను రెండు సంవత్సరాలకు ఒక సారి CII నిర్వహిస్తుంది.

భారతదేశ ఇంజనీరింగ్ పరిశ్రమ యొక్క పెరుగుతున్న సామర్ధ్యాన్ని ప్రదర్శించడం కొరకు, భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య (CII) మొదటి సారిగా 1975లో భారత దేశపు ఇంజనీరింగ్ వ్యాపార సంతను నిర్వహించింది. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత పరిశ్రమ యొక్క పెరుగుతున్న సామర్ధ్యాలను ఆ ప్రదర్శన వెలుగులోకి తెచ్చింది. ఈనాడు, అంతర్జాతీయ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక సంత, IETF అనే కొత్త పేరుతొ నిర్వహించబడే ప్రపంచవ్యాప్తంగా సంస్థలు పాల్గొనే ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి మరియు ఇంజనీరింగ్ మరియు సాంకేతికం అనే ప్రధాన అంశం క్రింద వివిధ పారిశ్రామిక వర్గాలు పాల్గొంటున్నాయి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరపబడే ఈ సంత, ఏశియలోనే అతి పెద్ద కార్యక్రమాలలో ఒకటిగా విస్తరించింది.

ఈ ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన అత్యుత్తమ నాణ్యత మరియు ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులు ప్రదర్శించబడుతాయి. పెద్ద మరియు చిన్న సంస్థలు దీనిలో పాల్గొంటాయి మరియు చిన్న మరియు మధ్య స్థాయి సంస్థలకు విశేష వేదిక ఉంటుంది. ప్రతి IETF ఉప రంగాలలో నూతన మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల పై పప్రత్యేక దృష్టి ఉంటుంది. గతములో ప్రత్యేక దృష్టి పెట్టబడిన పరిశ్రమలలో పర్యావరణ మరియు పచ్చదన ఉత్పత్తులు, నీటి మరియు పారిశుధ్యం సంబంధించిన పరికరాలు, భద్రతా మరియు రక్షణ పరికరాలు వంటి రంగాల ఉన్నాయి.

అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు పెద్ద సంఖ్యలో IETFలో పాల్గొని, తమ దేశాలకు చెందిన తయారీ సంస్థల బలాలు మరియు సామర్ధ్యాలని ప్రదర్శించడానికి ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తాయి. 1985 నుండి నిర్వహించబడిన ప్రతి IETFలో, ఒక విదేశీ భాగస్వామిని విశేష భాగాస్వామ్య దేశముగా గుర్తించి, ఆ దేశము యొక్క ఉత్పత్తులు, సాంకేతికాలు మరియు పెట్టుబడి అవకాశాలు ప్రత్యేకించి చూపించబడ్డాయి. భారత దేశముతో ఇరు-పక్షాల ఆర్థిక భాగస్వామ్యానికి కృషి చేయడానికి ఆ భాగస్వామి దేశానికి ఈ ప్రదర్శన ఒక మంచి అవకాశం. సాధారణంగా ఒక ఉన్నత స్థాయి మంత్రి ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. గంబీరమైన వ్యాపార వాతావరణానికి నడుమ ఆటవిడుపు కొరకు ఆ భాగస్వామ్య దేశం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. జర్మనీ, జపాన్, దక్షిణ ఆఫ్రికా, ఇటలీ మరియు అనేక ఇతర దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

భారత దేశం మరియు విదేశాల నుండి పరిశ్రమ, ప్రభుత్వం మరియు మీడియాకు చెందిన ఉన్నత ప్రతినిధులను IETF ఆకర్షిస్తుంది. IETF 2007లో 24 దేశాల నుండి ప్రభుత్వం మరియు వ్యాపార రంగాల నుండి సుమారు 55,000 వ్యాపార సందర్శకలు హాజరయ్యారు. పారిశ్రామిక సభ్యులు, తమ గురించిన సమాచారాలను ఇతరులకు తెలియజేయడానికి మరియు ఇతరుల గురించి తాము తెలుసుకోవడానికి మరియు తమ ప్రపంచవ్యాప్త విస్తరణ కొరకు ఇతర వ్యాపారాలతో సంప్రదింపులు జరపడానికి IETF అవకాశం కలిగిస్తింది. ప్రదర్శన జరిగే రోజులలో పలు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యపారా నెట్ వర్కింగ్ ఈ ప్రదర్శన యొక్క ప్రధాన అంశమయినప్పటికి, సాధారణ ప్రజలు కూడా ఈ ప్రదర్శనలో ఆసక్తి చూపి, ఇతర దేశాల గురించి మరియు వివిధ ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

IETF 1985లో మొదటి సారిగా భాగస్వామ్య దేశమనే పద్ధతిని ఇటలితో ప్రవేశపెట్టబడింది. అప్పటినుండి, కెనడా, యుఎస్ఎ, యునైటెడ్ కింగ్డం, జర్మనీ, ఇటలీ (రెండు సార్లు), జపాన్ (మూడు సార్లు), కొరియా, స్పెయిన్, చైనా, మరియు దక్షిణ ఆఫ్రికా (రండు సార్లు) భాగస్వామ్య దేశముగా ఇప్పటివరకు IETFలో పాల్గొన్నాయి.

కార్యక్రమం యొక్క 18వ ఎడిషన్ అయిన IETF 2009లో 17 దేశాల నుండి సుమారు 200 ప్రదర్శనకారులు పాల్గొన్నారు. దక్షిణ ఆఫ్రికా రెండవ సారిగా భాగస్వామ్య దేశముగా వ్యవహరించింది. ఏరోస్పేస్, మరైన్, రక్షణ, ఉక్కు, ఎలెక్ట్రో టెక్నికల్, మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీస్, ఆహారం & పానీయాలు, వైన్స్ వంటి రంగాలనుండి 70 దక్షిణాఫ్రికా కంపనీలు ఈ కార్యక్రమం యొక్క పవిలియన్ లో పాల్గొంమాయి. 17వ IETFలో "భాగస్వామ్య దేశం"గా ఉన్న జపాన్, 18వ IETFలో "అథితి దేశం"గా ఉండి, నూతన మరియు నాన్-రెన్యూవబెల్ ఇందన వనరులు పై ప్రధానంగా కేంద్రీకరించి, సుమారు 50 ప్రదర్శనకారులు ప్రత్యేక పెవిలియన్ లో పాల్గొన్నారు. IETF 2009లో, మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీస్, ఇందనం & పర్యావరణం, రోబోటిక్స్ & ఆటోమేషన్, భద్రతా& రక్షణ వంటి రంగాల పై అదే సమయములో ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి.

IETF 2011 – 19th edition of ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ఫెయిర్ యొక్క 18వ ఎడిషన్ – 10 నుండి 2011 ఫిబ్రవరి 12 వరకు భారతదేశం లోని న్యూ ఢిల్లీలో ప్రగతి మైదాన్ లో 25,000 చ.కిమీ విస్తీరణంలో జరిగింది. IETF 2011లో 11 దేశాల - చైనా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, మలేషియా, తాయ్ల్యాండ్, సింగపూర్, స్లోవక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAVE) - నుండి సుమారు 250 ప్రదర్శనకారులు పాల్గొని తమ సరికొత్త ఉత్పత్తులను సాంకేతికాలను ప్రదర్శించారు.

సిఐఐ-వైఐ[మార్చు]

భారతదేశం యొక్క ప్రధాన వ్యాపార సంఘమైన భారతీయ పరిశ్రమ సమాఖ్య యొక్క ముఖ్య భాగమే 2002లో స్థాపించబడిన యంగ్ ఇండియన్స్ (Yi) అనే సంస్థ. యువ భారతీయులకు తమ దేశం ఒక అభివృద్ధి చెందిన దేశముగా ఎదగాలి అనే వారి కలను నిజం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. Yi లో 25 నగర చాప్టర్ ల నుండి 1200 కు పైగా ప్రత్యక్ష సభ్యులు ఉన్నారు. ఫార్మర్ నెట్స్, స్టూడెంట్ నెట్స్ మరియు కార్పరేట్ చాప్టర్ ల ద్వారా Yiలో మరో 12,000 సభ్యులు ఉన్నారు. Yi లో సభ్యత్వం ఉన్నవారి యువ భారతీయుల వయస్సు 25 & 40 సంవత్సారాలు ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్, సాధించిన అభ్యుదయ వారు సభ్యులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువ భారతీయుల ప్రతినిధిగా ఉండడమే Yi యొక్క లక్ష్యం. భారత అభివృద్ధి బాటలో ఒక ముఖ్య భాగంగా ఉండడానికి యువ భారతీయులుకు ఒక వేదికను ఈ సంస్థ అందిస్తుంది. Yi సభ్యులకు వారు నేర్చుకునేందుకు పధకాలను అందించడం, భారతదేశం మొత్తం మీద పలు విద్యాసంస్థలలోని 4000 మంది విద్యార్థులను తన యొక్క 59 విద్యార్థి నెట్ ప్లాట్ఫార్మ్ల ద్వారా చేర్చుకుని, వారిని వివిధ కళాశాలలోనూ, పాఠశాలలోనూ అభివృద్ధి పరచి సభ్యులు నాయకత్వ నైపుణ్యాలను సంపాదించుకునేందుకు విశిష్టముగా కృషి చేస్తుంది. అంతే కాక యావత్ భారతదేశం నుండి 8500 యువత మరియు ఉత్సాహవంతులైన రైతులకు నెట్ ప్లాట్ఫార్మ్ ఏర్పరచి వారికి నిజమైన వ్యవసాయపు విషయ సేకరణ మరియు సమాచారము తెలియచేస్తారు. Yi ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యము మరియు ఉపాధి పధకము, ప్రకృతిని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుని దేశాని మంచి చేయడం వంటి కొన్ని అంశాలపై దృష్టి సారించి, సఫలీక్రుతంగా ప్రచారాలను మరియు పధకాలను నిర్వహించింది. అక్షర వంటి ప్రతిపాదనల ద్వారా, వైఐ 50 కేంద్రాల నుండి 15000 మంది విద్యార్థులను తీసుకుని, వారిలో 1300 మందికి పని నేర్పించి, వైఐ లాబ్స్ యొక్క ఉపాధి పధకం క్రింద వారి ఉద్యోగాలు ఇచ్చారు. ఆరోగ్య జాగ్రత్తలను తీసుకునే కార్యక్రమం క్రింద, 170000 పిల్లల కంటే ఎక్కువ మందికి కడుపులో పురుగులు పోయేటట్లు మందులు వేయటమేకాక, అనేక ఇతర ఆరోగ్య సమాచారము తెలిపే కార్యక్రమాలు వివిధ మహానగరాలలోని సమాజాలకు తెలిపేందుకు నిర్వహించారు.

వైఐ భారత దేశానికి, దాని యువతకు సంబంధించిన ఇతివృత్తాలతో ఒక వార్షిక జాతీయ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తుంది. ఈ జాతీయ శిఖరాగ్ర సమావేశంలో భారత దేశం మరియు ప్రపంచం మొత్తం లోని వివిధ అంశాలకు చెందిన కొద్దిమంది ఉత్తమ మరియు అతి ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు మరియు వారితో ముఖాముఖిలు ఉంటాయి. జాతీయ శిఖరాగ్ర సమావేశం యొక్క 6 ఎడిషన్లు నిర్వహించబడ్డాయి.

ఉన్నత కేంద్రాలు[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా పోకడ ఎలా ఉందని గ్రహించడం, సాంకేతిక సామర్ధయాన్ని పెంచుకోవడం, ఆ తరువాత, పరిశ్రములోని సభ్యులకు ఈ పోకడ వ్యాప్తి చెందేలా చూడడం CII యొక్క USPలలో ఒకటి. ఈ పప్రత్యేక ఉద్దేశంతోనే ఉన్నత కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విధముగా ఏర్పాటు చేయబడిన కేంద్రాలలో బెంగళూరు లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటి మొదటిది. "గ్రీన్ వ్యాపారం" - అనగా గ్రీన్ భవనాలు, ఇందన సామర్ధ్యం, పర్యావరణం మరియు ఇంక్యుబెషణ్ - పై కేద్న్రీకరించడానికి హైదరాబాదులో CII- సోహ్రబ్జి గాడ్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేయబడింది. ఢిల్లీ లోని CII ITC సెంటర్ ఫర్ ఎక్సలన్స్ ఫర్ సస్టైనబిల్ డెవెలప్మెంట్ ట్రిపిల్ బాటం లైన్ సిద్ధాంతం పై కేంద్రీకరిస్తుంది. చెన్నై లోని ఇన్స్టిట్యూట్ ఫర్ లాజిస్టిక్స్, ముంబై లోని నరోజి గాడ్రెజ్ సెంటర్ అఫ్ ఎక్సలన్స్ ఆన్ కార్పరేట్ గవేర్నన్స్, చండీగర్ లోని ఎల్ ఎం తపార్ సెంటర్ ఫర్ కాంపెటిటివ్నెస్, క్లస్టర్ ఇనిషియేటివ్స్, జైపూర్ లోని వాటర్ ఇన్స్టిట్యూట్ మరియు ఇతర సంటర్స్ అఫ్ ఎక్సలన్స్. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సాకేతిక పరిజ్ఞానం మరియు పరిశ్రమ సభ్యత్వం రెండూ కలిపి, ఈ సంస్థ పరిశరమకు చేరువవ్వడానికి సరైన మాధ్యమంగా చేస్తుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • CII [1] - చాలా కొత్తది కాని అదే సమయంయులో చాలా క్రియశేలమైనదైన, CII-సురేష్ నియోటియా సెంటర్ ఆఫ్ ఎక్సలన్స్ ఫర్ లీడర్షిప్, నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి వీలు కల్పించి ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించడానికి సాహాయ పడుతుంది, ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో, ప్రత్యేకించి దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాలలో ఉన్న పొరుగు దేశాలలో. CII-సురేష్ నియోటియా సెంటర్ అఫ్ ఎక్సలన్స్ ఫర్ లీడర్షిప్ (డిపుటి డైరెక్టర్ జనరల్ మరియు తూర్పు ప్రాంతం యొక్క మాజీ అధినేత అయిన శ్రీ సుబ్రత నియోగి యొక్క గొప్ప నేతృత్వంలో), CII యొక్క ఇతర ఎక్సలన్స్ కేంద్రాలతో కలిసి పనిచేస్తూ, అత్యధిక ప్రయోజనాల కోసం ఇదే తరహా సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్పరేట్ రంగమే కాక, ప్రభుత్వ రంగ సంస్థల మేనేజర్ లతో సహా ప్రభుత్వ అధికారులకు వారి ప్రత్యేక అవసరాల కొరకు పప్రత్యేక కార్యక్రామలను CII-సురేష్ నియోటియా సెంటర్ అఫ్ ఎక్సలన్స్ ఫర్ లీడర్షిప్ ప్రతిపాదిస్తుంది. కార్మిక సంఘాల నేతలు, షాప్-ఫ్లోర్ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, శిక్షణ ఇచ్చే అధికారులు వంటి ఇతర ప్రత్యేక బృందాలు ఉన్నాయి.

బాహ్య లింకులు[మార్చు]

http://www.cii-leadership.in/index.php