భారతీయ భాషల కంప్యూటర్ ప్రక్రియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ భాషల కంప్యూటర్ శాస్త్రం కంప్యూటర్లను భారతీయభాషలలో వాడటానికి కావాలసిన ప్రామాణికాలు మరియు ప్రక్రియ/ పద్ధతులను వివరిస్తుంది. దీనికొరకు కేంద్ర ఎలెక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలో భారతీయ భాషల కొరకు సాంకేతికాభివృద్ధి (టిడిఐఎల్ (TDIL) విభాగం ప్రత్యేకంగా పనిచేస్తున్నది.

ప్రామాణీకరణ[మార్చు]

పరిశోధన మరియు అభివృద్ధి[మార్చు]

ఇది ఇతర పరిశోధన సంస్థలతో కలసి ఒక సమితిని ఏర్పాటు చేసింది. దానిలో సభ్యులు సిడాక్ పూనా, ఐఐటి ముంబయి, సిడాక్ ముంబయి, జాదవ్ పూర్ విశ్వ విద్యాలయం, ఐఐఎస్సి, బెంగుళూరు, ఉత్కల్ విశ్వవిద్యాలయం, బణస్థలి విద్యాపీఠ్, అమృత విశ్వవిద్యాలయం, ఐఐఐటి అలహాబాద్, ఐఐఐటి, హైద్రాబాద్. ఇప్పటివరకు అభివృద్ధి పరచిన వాటిలో తెలుగుకు సంబంధించినవి.ఇవన్నీ వాణిజ్యేతర వినియోగానికి వుచితంగా అందుబాటులో ఉన్నాయి.

  • భారతీయ భాషల యాంత్రిక అనువాద వ్యవస్థ (తమిళం-తెలుగు) ( ఇంగ్లీషు-తెలుగు ఇంకా అభివృద్ధి పరచబడలేదు)
  • అనుసారిక, హిందీలోకి అనువాద వ్యవస్థ, హైదరాబాదు విశ్వవిద్యాలయము వారిచే అభివృద్ధి పరచబడింది.[2]
  • బహుళ భాషలలో సమాచార అందుబాటు ( హిందీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, తెలుగు, పంజాబీ)
  • పది భాషలలో ఆప్టికల్ కేరెక్టర్ రికగ్నిషన్ (OCR)
  • ఆరు భాషలలో ఆన్లైన్ లో చేతిరాత గుర్తింపు వ్యవస్థ
  • భాష ఇంజిన్ ద్వారా యాంత్రిక భాష. ఉచ్ఛారణ పద్ధతిలో రాసిన ఇంగ్లీషు విషయాన్ని యూనికోడ్ లోకి మార్చి ఆ తరువాత యాంత్రిక మాటగా మారుస్తుంది.[3]

డాటా సెంటర్[మార్చు]

భారతీయ భాషల డాటాసెంటర్ [4] ద్వారా భారతీయ భాషల ఫాంట్లు, సాఫ్టవేర్ ఉచితంగా పొందవచ్చు. వీటిలో చాలా వాటికి నకలు హక్కులు నియంత్రణ ఉత్పత్తి దారుల చేతిలోనే ఉంది. కొన్ని స్వేచ్ఛా మూలాలు నకలు హక్కుల నియంత్రణ లేని సాఫ్ట్వేర్ కూడా జతచేయబడి ఉన్నాయి. తెలుగు భాష ఉపకరణాలు వివరాల సిడి[5]లో వివిధ రకాల ఖతులు, భారతీయ ఓపెన్ ఆఫీస్, ఫైర్‌ఫాక్స్, టైపు నేర్పు సహాయకాలు, అక్షర దోష దిద్దు సాఫ్ట్వేర్ ఉన్నాయి.

ఆర్థిక గణాంకాలు[మార్చు]

టిడిఐఎల్ శాఖ బడ్జెట్ 2009-10 లో 12 కోట్ల రూపాయలు వుండగా 2010-11 కు 31కోట్ల రూపాయలకు చేరుకుంది [6] పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ శాఖ పనులకు ఫథకాలకు 400 కోట్ల రూపాయల ప్రణాళిక తయారుచేయబడింది.[7]

మూలాలు[మార్చు]