భారతీయ భూగర్భ సర్వేక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
దస్త్రం:Geological Survey of India Logo.png
కేంద్ర కార్యాలయం - జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఇండియన్ మ్యూజియం ఆవరణ - 27 జె ఎన్ రోడ్ కోల్‌కతా.
సంస్థ అవలోకనం
స్థాపనం 1851
అధికార పరిధి British India (1851-1947)
Republic of India (From 1947)
ప్రధాన కార్యాలయం Kolkata
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ మొండ్రేటి శ్రీధర్, C.G.S., ADG (G) Director General Additional Charge
మాతృ శాఖ గనుల మంత్రిత్వ శాఖ
వెబ్‌సైటు
https://www.gsi.gov.in/

భారతదేశంలో భూగర్భాన్ని భూమి పొరలనూ సర్వే చేసేందుకు నెలకొల్పిన సంస్థ, భారతీయ భూగర్భ సర్వే (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా -జిఎస్ఐ). 1851 లో స్థాపించబడిన ఈ సంస్థ, ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్థలలో ఒకటి. సర్వే ఆఫ్ ఇండియా (1767 లో స్థాపించబడింది) తరువాత, భారతదేశంలో రెండవ పురాతన సర్వే సంస్థ. ఇది భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. సంస్థ భారతదేశపు జియొలాజికల్ సర్వేలు, అధ్యయనాలను చెయ్యడంతో పాటు, ప్రభుత్వం, పరిశ్రమలు, సాధారణ ప్రజలకూ అవసరమైన ప్రాథమిక భూగర్భ విజ్ఞాన సమాచారాన్ని ఇది అందిస్తుంది. అలాగే ఉక్కు, బొగ్గు, లోహాలు, సిమెంట్, విద్యుత్ పరిశ్రమల వేదికల లోను, అంతర్జాతీయ భూగర్భ శాస్త్రీయ వేదికల లోనూ అధికారికంగా పాల్గొంటుంది.

GSI (జియాలజీ), ఏఎస్ఐ (ఆర్కియాలజీ), BSI (వృక్షశాస్త్రం), FiSI (మత్స్య), FSI (అడవులు), IIEE (ఎకాలజీ), nIO (ఓషనోగ్రఫీ), RGCCI (జనాభా సర్వే), లాంగ్వేజ్ సర్వే), SI (కార్టోగ్రఫీ), ZSI (జువాలజీ) లు భారతదేశంలోని ముఖ్య జాతీయ సర్వే సంస్థలు.

చరిత్ర

[మార్చు]
1870 లో జి.ఎస్.ఐ. నిలబడిన వారు: ఫెర్డినాండ్ స్టోలిజ్కా, రాబర్ట్ బ్రూస్ ఫుట్, విలియం థియోబాల్డ్, ఎఫ్ఆర్ మాలెట్, వాలెంటైన్ బాల్, విల్హెల్మ్ హెన్రిచ్ వాగెన్, డబ్ల్యూఎల్ విల్సన్; కూర్చున్నవారు: ఎ. ట్వీన్, డబ్ల్యూ. కింగ్, థామస్ ఓల్డ్‌హామ్, హెన్రీ బెనెడిక్ట్ మెడ్లికాట్, సిఎ హాకెట్.

వనరులను క్రమబద్ధంగా దోచుకుని,[1] భారతదేశంలో పరిశ్రమలు లేకుండా చేసి, బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి దోహదపడి,[2][3][4] భారతదేశాన్ని బ్రిటిష్ తయారీదారులకు ముడి సరుకుల సరఫరాదారుగా మార్చి, బ్రిటన్‌లో తయారైన వస్తువులకు భారత్‌ను పెద్ద మార్కెట్‌గా మార్చే ఉద్దేశాలతో బ్రిటిష్ వారు భారత్‌ను వలసరాజ్యంగా మార్చుకున్నరు.[5] 1851 లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన జిఎస్‌ఐకి మూలాలు 1836 లో ఉన్నాయి. అప్పుడు కంపెనీ వారు "బొగ్గు కమిటీ" వంటి మరిన్ని కమిటీలను ఏర్పరచి, భారతదేశపు తూర్పు ప్రాంతాలలో బొగ్గు లభ్యతను అధ్యయనం చేయడానికీ, అన్వేషించడానికీ ప్రయత్నాలు చేసారు. బ్రిటిష్ జియోలాజికల్ సర్వేకు మొదటి సర్వేయర్లలో ఒకరైన డేవిడ్ హిరామ్ విలియమ్స్‌ను 1845 డిసెంబరు 3 న 'బొగ్గు జిల్లాల సర్వేయర్, బొగ్గు పనుల సూపరింటెండెంట్' గా నియమించారు. తరువాతి ఫిబ్రవరిలో అతడు భారతదేశానికి వచ్చాడు. 1847 డిసెంబరు నాటి దామూదా, అడ్జి గ్రేట్ బొగ్గు క్షేత్రపు మ్యాపును, దాని [6] అడ్డుకోత [7][8], నిలువుకోతల మ్యాపులతో కలిపి తయారు చేసి, దానికి "జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా" అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడాడు.[9] 1848 ఫిబ్రవరి 4 న, అతన్ని "జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క జియోలాజికల్ సర్వేయర్"గా నియమించారు. కాని అతను తన ఏనుగు మీద నుండి పడిపోయాడు. తరువాత కొన్నాళ్ళకే, అతని సహాయకుడు ఎఫ్బి జోన్స్ తో సహా 'జంగిల్ ఫీవర్' తో 1848 నవంబరు 15 న మరణించాడు.[10] తరువాత 1851 మార్చి 5 న పదవీ విరమణ చేసే వరకు జాన్ మెక్‌క్లెల్లాండ్ "ఆఫీషియేటింగ్ సర్వేయర్"గా బాధ్యతలు నిర్వర్తించాడు.[11][12]

1852 వరకు, జియోలాజికల్ సర్వే ప్రధానంగా బొగ్గు అన్వేషణ (ప్రధానంగా ఆవిరి యంత్రాల కోసం), చమురు నిల్వలు, ఖనిజ నిక్షేపాల అంవేషణ పైనే దృష్టి పెట్టింది. రిచర్డ్ డిక్సన్ ఓల్డ్‌హామ్ (సర్ థామస్ ఓల్డ్‌హాం తండ్రి) జియోలాజికల్ సర్వే పరిధిని విస్తృతం చేసాడు. భారతదేశపు భూగర్భాన్ని ముందు మ్యాపింగ్ చేయకుండా బొగ్గును కనుగొనడం సాధ్యం కాదని ప్రభుత్వం వద్ద అతడు వాదించాడు. ఆ విధంగా, జియోలాజికల్ సర్వే వివిధ రకాలైన శిలల రకాలను, భౌగోళిక నిర్మాణాలను, సాపేక్ష వయస్సులనూ మ్యాప్ చేయడం మొదలుపెట్టింది. ఇండెక్స్ శిలాజాల ఉనికిని బట్టి రాతిపొరల వయస్సును అంచనా వేసేవారు. ఈ ఇండెక్సు శిలాజాలను కనుగొనడంలోనే భూవిజ్ఞాన శాస్త్రవేత్తల కృషీ సమయమూ ఖర్చైపోయేది. ఎందుకంటే రాతిపొరల వయస్సును అంచనా వేయడానికి ఆ రోజుల్లో రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతి ఇంకా అభివృద్ధి చేయలేదు.[11][12] రాంగడ్ బిలాన్ని మొదటగా 1869 లో ఫ్రెడరిక్ రిచర్డ్ మేలట్ సందర్శించాడు.[13][14] తరువాతి అధ్యయనాలలో ఆర్థర్ లెనాక్స్ కొల్సన్ చేసినవి ఉన్నాయి

19 వ శతాబ్దంలో GSI, గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే, 1869 కైలాష్ - మానసరోవర్ యాత్ర, 1871-1872 షిగాచే - లాసా యాత్ర, 1873-1874 యార్కండ్ - కష్గర్ యాత్ర, ఇదే ప్రాంతంలో సర్ థామస్ డగ్లస్ ఫోర్సిత్ చేసిన రెండవ యాత్ర, 1878-1882 డార్జిలింగ్ - లాసా - మంగోలియా యాత్ర మొదలైన వాటితో సహా అనేక సర్వేలు చేసింది.[15][16][17][18] స్థానిక సర్వేయర్లను పండిట్ అని పిలిచేవారు. వీరిలో నైన్ సింగ్ రావత్, కృష్ణ సింగ్ రావత్ కజిన్‌ సోదరులూ ఉన్నారు .[19]

19 వ శతాబ్దిలోను, 20 వ శతాబ్దం ప్రారంభంలోనూ జిఎస్ఐ అనేక భారతీయ భూకంపాలపై అధ్యయనాలు చేసి, వివరణాత్మక నివేదికలు వెలువరించి సీస్మాలజీకి ముఖ్యమైన తోడ్పాటు నందించింది. రిచర్డ్ డిక్సన్ ఓల్డ్‌హామ్ (అతని తండ్రి కూడా GSI కోసం పనిచేశారు) మొదట p- s- తరంగాలను సరిగ్గా గుర్తించాడు. భూమి కోర్ యొక్క వ్యాసాన్ని ఊహించి లెక్కించాడు.[11][12]

2017 ఏప్రిల్ 8 న, ప్రత్యేకంగా అమర్చిన విమానాలను ఉపయోగించి మొట్టమొదటి వైమానిక సర్వేను మిదలుపెట్టింది. 20 కి.మీ. లోతు వరకు ఖనిజ నిల్వలను మ్యాప్ చేయడానికి ఇది పైలట్ ప్రాజెక్టు.[20]

ఎస్.విజయ్ కుమార్ అధ్యక్షతన ఉన్న ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా, జిఎస్‌ఐని "బేస్లైన్ సర్వేలు"; "మినరల్ రిసోర్స్ అసెస్మెంట్స్"; "జియోఇన్ఫర్మేటిక్స్"; "మల్టీ-డిసిప్లినరీ జియోసైన్సెస్", "శిక్షణ, సామర్థ్యాల పెంపు"కు సంబంధించి 5 మిషన్లుగా పునర్వ్యవస్థీకరించారు.[21]

సీనియర్ నం. పేరు కాలం దేశం
1. డాక్టర్ థామస్ ఓల్డ్హామ్, సూపరింటెండెంట్ 1851-1876 డబ్లిన్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్
2. హెచ్ బి మెడ్లికాట్, సూపరింటెండెంట్ 1876-1885 లోగ్రియా, కౌంటీ గాల్వే, ఐర్లాండ్
3. హెచ్‌బి మెడ్లికాట్, డైరెక్టర్ 1885-1887 లోగ్రియా, కౌంటీ గాల్వే, ఐర్లాండ్
4. విలియం కింగ్ జూనియర్. 1887-1894 ఐర్లాండ్ ; ఒక ఆంగ్లో-ఐరిష్
5. సి ఎల్ గ్రీస్‌బాచ్ 1894-1903 వియన్నా, ఆస్ట్రియా
6. సర్ టిహెచ్ హాలండ్ 1903-1910 హెల్స్టన్, కార్న్‌వాల్, ఇంగ్లాండ్
7. సర్ హెన్రీ. హెచ్. హేడెన్ 1910-1921 డెర్రీ, ఐర్లాండ్
8. సర్ ఎడ్విన్ హాల్ పాస్కో 1921-1932 ఇంగ్లాండ్
9. సర్ ఎల్ ఎల్ ఫెర్మోర్ 1932-1935 పెక్కం, దక్షిణ లండన్, ఇంగ్లాండ్
10. డాక్టర్ ఎఎమ్ హెరాన్ 1935-1939 బ్రిటిష్, డడ్డింగ్స్టన్, ఎడిన్బర్గ్, స్కాట్లాండ్
11. డాక్టర్ సిరిల్ ఎస్ ఫాక్స్ 1939-1943 -
12. డాక్టర్ ఎడ్వర్డ్ లెస్లీ గిల్బర్ట్ క్లెగ్గ్ 1943-1944 మాంచెస్టర్, ఇంగ్లాండ్
13. హెచ్. క్రూక్‌శాంక్ 1944-1945 -
14. JA డన్ 1945 -
15. డాక్టర్ విలియం డిక్సన్ వెస్ట్ 1945-1951 బౌర్న్మౌత్, ఇంగ్లాండ్
16. డాక్టర్ ఎం.ఎస్.కృష్ణన్, మొదటి భారత డైరెక్టర్ 1951-1955 తంజావూరు, తమిళనాడు
17. వి.పి.సోంధి 1955-1958 -
18. డాక్టర్ బిసి రాయ్ 1958-1964 -

జిఎస్‌ఐ డైరెక్టర్ జనరల్

[మార్చు]
క్ర. సం పేరు కాలం శాఖ
1. డా. బి సి రాయ్ 1964–1965 జియాలజీ
2. అర్ ఎ జి జింగ్రాన్ 1965–1966 జియాలజీ
3. జి సి చటర్జీ 1966–1969 జియాలజీ
4. ఎం ఎస్ బాలసుందరం 1969–1972 జియాలజీ
5. డా. ఎం. కె రాయ్ చౌధురి 1972–1974 జియాలజీ
6. సి కరుణాకరన్ 1974–1975 జియాలజీ
7. డా. వి కె ఎస్ వర్దన్ 1976–1977 జియాలజీ
8. వి ఎస్ కృష్ణస్వామి 1978–1981 జియాలజీ
9. జె స్వామి నాథ్ 1981–1982 జియాలజీ
10. ఎస్ కె ముఖర్జీ 1982–1986 జియాలజీ
11. డి పి ధౌండియల్ 1986–1990 జియాలజీ
12. డా డి కె రాయ్ 1990–1991 జియాలజీ
13. సి పి వోహ్రా 1991–1992 జియాలజీ
14. ఎస్ ఎన్ చతుర్వేది 1992–1993 జియాలజీ
15. డి బి డిమ్రీ 1993–1996 జియాలజీ
16. డా ఎస్ కె ఆచార్య 1996–2000 జియాలజీ
17. కె కృష్ణన్ ఉన్ని 2000–2001 జియాలజీ
18. రవి శంకర్ (యాక్టింగ్) 01.04.2001–30.11.2001 జియాలజీ
19. పి సి మొండల్ 2001–2004 కెమిస్ట్రీ
20. డా కె ఎన్ మాథుర్ 2004–2005 కెమిస్ట్రీ
21. డా ఎం కె ముఖోపాధ్యాయ (యాక్టింగ్) 01.10.2005–31.12.2005 జియాలజీ
22. డా ఎస్ ఎన్ పాండే (యాక్టింగ్) 2006–2009 జియాలజీ
23. డా ఎన్ కె దత్తా (యాక్టింగ్) 2009–2010 జియాలజీ
24. 2010–2011 Engineering
25. ఎ సుందర మూర్తి 2011–2013 జియాలజీ
26. శిశిర్ చంద్ర రథ్ (యాక్టింగ్) 01.11.2013–31.12.2013 జియాలజీ
27. డా సుదేష్ కుమార్ వాధ్వాన్ (యాక్టింగ్) 01.01.2014–31.07.2014 జియాలజీ
28. హర్బన్స్ సింగ్ 31.07.2014–30.05.2016 జియాలజీ
29. ఎం రాజు (యాక్టింగ్) 01.06.2016–30.08.2017 జియాలజీ
30. ఎం రాజు 30.08.2017–31.08.2017 జియాలజీ
31. ఎన్. కుటుంబరావు 01.09.2017–31.05.2018 జియాలజీ
32. డా. దినేష్ గుప్తా (యాక్టింగ్) 01.06.2018–31.03.2019 Geophysics
33. బిపుల్ పాఠక్ (యాక్టింగ్) 01.04.2019–17.09.2019 IAS, Joint Secretary, Ministry of Mines, GoI
33. ఎస్. ఎన్ మేష్‌రాం (యాక్టింగ్) 18.09.2019–27.01.2020 జియాలజీ
33. మొండ్రేటి శ్రీధర్ (యాక్టింగ్) 28.01.2020–Till date జియాలజీ

జియోలాజికల్ పార్కులు

[మార్చు]

జిఎస్‌ఐ కొన్ని జియొలాజికల్ పార్కులను అభివృద్ధి చేసింది. 247 ఎకరాలలో విస్తరించి, వృక్ష శిలాజాలతో తొమ్మిది వేర్వేరు ఎన్క్లేవ్‌లు ఉన్న తిరువక్కరై నేషనల్ ఫాసిల్ వుడ్ పార్కు, 12 కోట్ల సంవత్సరాల నాటి, క్రెటేషియస్ కాలపు, 18 మీటర్ల వృక్ష శిలాజం ఉన్న సాతనూరు నేషనల్ ఫాసిల్ వుడ్ పార్క్, అసలు పరిమాణంలో ఉన్న T- రెక్స్,ఇతర డైనోసార్ల బొమ్మలున్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్, చండీగఢ్ సమీపంలో, ఆరు చరిత్ర-పూర్వ జంతువుల అసలు పరిమాణపు ఫైబర్గ్లాస్ నమూనాలతో ఉన్న సాకేటి శిలాజ పార్కు శిలాజ మ్యూజియాలు వీటిలో కొన్ని.

మూలాలు

[మార్చు]
  1. Rajat Kanta Ray (1998). "Indian Society and the Establishment of British Supremacy, 1765–1818". In P. J. Marshall (ed.). The Oxford History of the British Empire. Vol. II. Oxford University Press. pp. 508–29. ISBN 978-0-19-164735-2.
  2. Junie T. Tong (2016). Finance and Society in 21st Century China: Chinese Culture Versus Western Markets. CRC Press. p. 151. ISBN 978-1-317-13522-7.
  3. John L. Esposito, ed. (2004). The Islamic World: Past and Present. Vol. 1. Oxford University Press. p. 174. ISBN 978-0-19-516520-3.
  4. Indrajit Ray (2011). Bengal Industries and the British Industrial Revolution (1757-1857). Routledge. pp. 7–10. ISBN 978-1-136-82552-1.
  5. Henry Yule, A. C. Burnell (2013). Hobson-Jobson: The Definitive Glossary of British India. Oxford University Press. p. 20.
  6. Damoodah and Adji Great Coal Field Map, Bavarian State Library.
  7. GSI Map of horizontal sections 1 & 2, Bavarian State Library.
  8. GSI Map of horizontal sections 3 & 4, Bavarian State Library.
  9. GSI Map of vertical section 5, Bavarian State Library.
  10. Allen's Indian Mail, Vol VII, No 117 London, 22 January 1849, p41.
  11. 11.0 11.1 11.2 Kumar, Deepak (1982). "Economic Compulsions and the Geological Survey of India". Indian Journal of History of Science. 17 (2): 289–300.
  12. 12.0 12.1 12.2 Chakrabarty, S (2012). "Geological Survey of India". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
  13. Mallet, F. R., 1869, Memoir, Geological Survey of India, vol 7, page 129.
  14. BALASUNDARAM, M., DUBE, A. Ramgarh, 1973, "Structure, India", Nature (journal), 242, 40 doi:10.1038/242040a0.
  15. Clements R. Markham, 1878, "A Memoir on The Indian Surveys", 2nd Ed., W H Allen & Co., London, p.189.
  16. Charles E. D. Black, 1891, "A Memoir on The Indian Surveys (1875-90)", London, p.168.
  17. Derek J. Waller, 2004, "The Pundits: British Exploration of Tibet and Central Asia," University Press of Kentucky.
  18. Account of the Pundit's Journey in Great Tibet - Capt. H. Trotter, The Journal of the Royal Geographic Society (1877).
  19. Peter Hopkirk, 1982, "Trespassers on the Roof of the World: The Race for Lhasa", Oxford University Press.
  20. "In a first in India, GSI to use modern aircraft to map mineral stocks". 7 April 2017. Retrieved 6 April 2017.
  21. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-05. Retrieved 2020-04-29.