భారతీయ రిజర్వ్ బ్యాంక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) భారతదేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారం స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావరం కోల్‌కతలో ఉండేది. తర్వాత ముంబాయి నగరానికి మార్చబడింది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్. ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంగా ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమిస్తారు.మన్‌మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ గా పనిచేసాడు. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత గవర్నరు శక్తికాంత దాస్, ఊర్జిత్ పటేల్ నుండి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
చరిత్ర
[మార్చు]1935–1950
[మార్చు]భారతీయ రిజర్వు బ్యాంకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక సమస్యల ప్రతిస్పందనకు 1935 ఏప్రిల్ 1న స్థాపించబడింది. రిజర్వు బ్యాంకు జారీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా మార్గదర్శకాల ఆధారంగా జరిగింది ఆర్బిఐ చట్టం 1934గా ఈ మార్గదర్శకాలను ఆర్బిఐ పని శైలి, క్లుప్తంగ తన పుస్తకంలో డా బి ఆర్ అంబేద్కర్ సమర్పించారు, మార్గదర్శకాల మేరకు అంబేద్కర్ గారు అన్నది. ఇది "రూపాయి సమస్య - దీని మూలం , దాని పరిష్కారం" అనే పేరు పెట్టారు, హిల్టన్ యంగ్ కమిషన్ సమర్పించారు. బ్యాంకు భారతీయ కరెన్సీ, ఫైనాన్స్, కూడా హిల్టన్ యంగ్ కమిషన్ అని పిలుస్తారు 1926 రాయల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఏర్పాటు చేశారు. ఆర్బిఐ ముద్ర అసలు ఎంపిక లయన్, పామ్ ట్రీ యొక్క స్కెచ్ పొంది, తూర్పు భారతదేశం కంపెనీ డబుల్ Mohur ఉంది. అయితే ఇది పులి, భారతదేశం జాతీయ జంతువు సింహం మార్చడానికి నిర్ణయించుకున్నారు. ఆర్బిఐ నివేదిక, బ్యాంకు నోట్ల సమస్య నియంత్రించేందుకు దేశం యొక్క ఉత్తమ ప్రయోజనాలకు కరెన్సీ, క్రెడిట్ వ్యవస్థ ఆపరేట్ భారతదేశం ద్రవ్య స్థిరత్వం సాధించేందుకు,, సాధారణంగా నిల్వలు ఉంచాలని దాని ప్రాథమిక విధులు వివరిస్తుంది. ఆర్బిఐ సెంట్రల్ ఆఫీసు కలకత్తా (ఇప్పటి కోలకతా) లో స్థాపించబడింది, కానీ 1937 ఆర్బిఐ బర్మా జపనీస్ ఆక్రమణ కాలంలో మినహా, బర్మా కేంద్ర బ్యాంకు వ్యవహరించారు బాంబే (ప్రస్తుతం ముంబై) (1942-45 కు మార్చారు ), 1947 ఏప్రిల్ వరకు, బర్మా 1947లో భారతదేశం విభజన తర్వాత 1937లో భారతదేశ కూటమితో నుండి విడిపోయినపుడు అయినప్పటికీ, బ్యాంకు పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు 1948 జూన్ వరకు పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది.
డీమానిటైజేషన్
[మార్చు]రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు
[మార్చు]- ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937)
- జేమ్స్ టేలర్ (1937-1943)
- సి.డి.దేశ్‌ముఖ్ (1943-1949)
- బెనెగల్ రామారావు
- కె.జి.అంబెగాంకర్ (1957)
- హెచ్.వి.జి.అయ్యంగార్ (1957-1962)
- పి.సి.భట్టాచార్య (1962-1967)
- ఎల్.కె.ఝా (1967-1970)
- బి.ఎన్.అదార్కర్ (1970)
- ఎస్.జగన్నాథన్ (1970-1975)
- ఎన్.సి.సేన్‌గుప్తా (1975)
- కె.ఆర్.పూరి (1975-1977)
- మైదవోలు నరసింహం (1977)
- ఐ.జి.పటేల్ (1977-1982)
- మన్‌మోహన్ సింగ్ (1982-1985)
- ఏ.ఘోష్ (1985)
- ఆర్.ఎన్.మల్హోత్రా (1985-1990)
- ఎస్.వెంకట్రామన్ (1990-1992)
- సి.రంగరాజన్ (1992-1997)
- బిమల్ జలాన్ (1997-2003)
- వై. వేణుగోపాల రెడ్డి (2003- 2008)
- దువ్వూరి సుబ్బారావు (2008 - 2013)
- రఘురాం గోవింద్ రాజన్ (2013 - 2016)
- ఉర్జిత్ పటేల్ (2016 - 2018 dec 11)
- శక్తికాంత దాస్ (2018- ప్రస్తుతం)
డైరెక్టర్ల బోర్డు
[మార్చు]2006 జూన్ 27 న, భారత ప్రభుత్వము కేంద్ర బోర్డు డైరక్టర్ల నియామకాలను జారీచేసింది, ఇందులో 13 సభ్యులున్నారు, అజీం ప్రేమ్ జీ, కుమారమంగళం బిర్లాలు ఉన్నారు.
ఇతర సభ్యులు:
- సురేష్ టెండూల్కర్, ఆర్థికవేత్త, సభ్యుడు, ప్రధానమంత్రి సలహా మండలి.
- యూ. ఆర్. రావు, మాజీ ఛైర్మన్, ఇస్రో (ISRO), ఛైర్మన్ శోధనా మండలి, భౌతిక పరిశోధనాలయం, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్.
- లక్ష్మీ చంద్, రిటైర్డ్ IAS ఆఫీసరు.
- శశిరేఖ రాజగోపాలన్, కన్సల్టెంట్, సహకారాలు.
- సురేష్ కుమార్ నియోతియా, ఛైర్మన్, అంభుజా సిమెంట్.
- ఏ. వైద్యనాథన్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్.
- మన్‌మోహన్ శర్మ, FRS, మాజీ డైరెక్టరు, ముంబై విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నలజీ.
- డి. జయవర్థనవేలు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు, లక్ష్మీ మెషీన్ వర్క్స్ లిమిటెడ్.
వీరు నామినేట్ చేయబడ్డారు
- వై.హెచ్. మాలెగం, ఛార్టర్డ్ అకౌంటెంటు.
- హెచ్.పి. రానియా, సుప్రీంకోర్టు న్యాయవాది.
- అశోక్ ఎస్. గంగూలీ, సభ్యుడు, ఇన్వెస్ట్ మెంట్ కమిషన్, ఛైర్మన్, ICICI OneSource.
పదవీ విరమణ పొందిన డైరెక్టర్లు
2006 జూలై 1, వినియోగదారులకు మెరుగైన సేవల కొరకు ఒక ప్రత్యేక డిపార్ట్ మెంటును (CSD) ఏర్పాటు చేసింది.
ప్రధాన ఉద్దేశ్యాలు
[మార్చు]ద్రవ్య అధికారం
[మార్చు]- ద్రవ్య పాలసీలను సూత్రీకరిస్తుంది, అమలు చేస్తుంది, పర్యవేక్షిస్తుంది.
- ఉద్దేశం: రూపాయి విలువను స్థిరీకరిస్తుంది, తయారీ సెక్టారులకు రుణప్రవాహ సౌకర్యాలు కలుగజేస్తుంది
- ఆర్థికంలో ఆప్టిమమ్ లిక్విడిటీను మెయింటైన్ చేస్తుంది.
ఎక్స్ ఛేంజి కంట్రోల్ మేనేజరుగా
[మార్చు]- విదేశీ మారకద్రవ్యాన్ని, ఫారిన్ ఎక్స్ ఛేంజి ఆక్ట్ 1999 ను మేనేజ్ చేస్తుంది.
- ఉద్దేశం: బాహ్య వాణిజ్యం, చెల్లింపులు,, భారత్ లో విదేశీ మార్కెట్ ను అభివృధ్ధి చేయుటకు పాటుపడుతుంది
కరెన్సీల విడుదల
[మార్చు]- కరెన్సీను విడుదల చేస్తుంది లేక కరెన్సీను, నాణేలను నాశనం చేసి సర్కులేషన్ ను క్రమబద్దీ
- ఉద్దేశం: ప్రజలకు నాణ్యమైన కరెన్సీని అందుబాటు చేస్తుంది, వాణిజ్య బ్యాంకులకు రుణాలిస్తుంది, జి.డి.పి.ని అభివృద్ధి పరుస్తుంది.[1]
అభివృద్ధి పాత్ర
[మార్చు]- జాతీయ ఉద్దేశ్యాలను సాధించేందుకు అభివృద్ధి పథకాలను అమలుపరుస్తుంది,
రెపో రేటు - రివర్స్ రెపో రేటు
[మార్చు]కమర్షియల్ బ్యాంకులు సెక్యూరిటీలు లేదా బాండ్లను విక్రయించడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి నగదును తీసుకున్నప్పుడు ఆ నగదుపై ఆర్‌బీఐ విధించే వడ్డీ రేటును రెపో రేటు (Repo Rate) అంటారు. అదే కమర్షియల్ బ్యాంకులు నగదు నిల్వలు పేరుకున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాయి. ఆ నగదుపై బ్యాంకులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేటు (Reverse Repo Rate) అంటారు. సాధారణంగా రివర్స్ రెపో రేటు కంటే రెపో రేటు ఎక్కువగా ఉంటుంది.
ద్రవ్యోల్బణం (Inflation) అంతకంతకూ పెరుగుతుండడంతో ఆర్‌బీఐ అప్రమత్తమై సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించే దిశగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ 2022 మే 4న ప్రకటించారు. దీంతో తక్షణమే అమల్లోకి వచ్చే రెపోరేటు 4.40 శాతానికి చేరింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం 2018 ఆగస్టు తర్వాత ఇదే మొదటిసారి.[2] కాగా రివర్స్ రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా 3.35 శాతంగానే కొనసాగిస్తోంది.
వాణిజ్య బ్యాంకుల పెద్ద లయబిలిటీలు
[మార్చు]క్రింది లెక్కలు మిలియన్ రూపాయలలో. చూడుము [1], [2]
సంవత్సరం | డిపాజిట్లు, ఇతర ఖాతాలు[3] | బిల్లుల చెల్లింపులు |
---|---|---|
1950 | 9,983 | 173 |
1955 | 11,592 | 262 |
1960 | 20,218 | 317 |
1965 | 32,897 | 446 |
1970 | 64,793 | 923 |
1975 | 156,665 | 2,254 |
1980 | 439,869 | 10,995 |
1985 | 1,032,134 | 24,556 |
1990 | 1,820,468 | 38,656 |
1995 | 3,984,352 | 116,622 |
వాణిజ్య బ్యాంకుల మేజర్ ఆస్తులు
[మార్చు]క్రింది లెక్కలు మిలియన్ రూపాయలలో. చూడుము [3], [4]
సంవత్సరం | పెట్టుబడి [4] | అడ్వాన్సులు [5] |
---|---|---|
1950 | 4,330 | 5,353 |
1955 | 4,600 | 7,037 |
1960 | 7,241 | 12,458 |
1965 | 9,884 | 21,954 |
1970 | 18,148 | 46,850 |
1975 | 45,999 | 106,167 |
1980 | 126,642 | 272,673 |
1985 | 303,378 | 623,553 |
1990 | 687,151 | 1,095,412 |
1995 | 1,750,206 | 2,243,308 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ redtt
- ↑ "RBI Repo Rate: ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం.. కీలక వడ్డీరేట్ల పెంపు". web.archive.org. 2022-05-09. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ - ఫిక్సెడ్, సేవింగ్స్, కరెంట్, చిట్టా ఖాతాలు, కూడుకొని.
- ↑ - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలు, ట్రస్టీ సెక్యూరిటీలు, షేర్లు, డిబెంచర్లు, బంగారం, కూడినవి
- ↑ - లోన్లు , అడ్వాన్సులు, రొక్కం అప్పులు , ఓవర్ డ్రాఫ్టులు, కొనకాల , డిస్కౌంటుల బిల్లులు, కూడినవి.