భారతీయ విశిష్ట సేవా పతకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian Distinguished Service Medal
Medal ribbon
TypeMilitary decoration
Awarded forDistinguished service
వివరణRibbon: blue and red ribbon

Medal: round silver medallion
Obverse:profile of reigning monarch

Reverse: inscribed 'For distinguished service', surrounded by a laurel.[1]
అందజేసినవారుBritish Empire
EligibilityIndian citizens in the armed forces and police
Post-nominalsIDSM
ClaspsNo clasps
StatusDiscontinued in 1947
Established25 June 1907[2]
Totalapprox 6,000 including bars[1]
Order of Wear
Next (higher)King's African Rifles Distinguished Conduct Medal[3]
Next (lower)Union of South Africa Queen's Medal for Bravery (Silver)[3]
భారతీయ విశిష్ట సేవా పతకం
పతకం రిబ్బను
Typeసైనిక పురస్కారం
Awarded forవిశిష్ట సేవ
వివరణరిబ్బను: నీలం, ఎరుపు రిబ్బను

పతకం: గుండ్రని వెండి మెడలియన్
బొమ్మవైపు: చక్రవర్తి బొమ్మ

వెనుకవైపు: 'విశిష్టమైన సేవకు గాను' అని రాసి ఉంటుంది.[1]
అందజేసినవారుబ్రిటిషు సామ్రాజ్యం
Eligibilityసైనిక దళాల్లో, పోలీసుల్లో పనిచేసే భారతీయులకు
Post-nominalsIDSM
ClaspsNo clasps
Status1947 లో నిలిపివేసారు
Established1907 జూన్ 25[2]
Totalసుమారు 6,000[1]
Order of Wear
Next (higher)King's African Rifles Distinguished Conduct Medal[3]
Next (lower)Union of South Africa Queen's Medal for Bravery (Silver)[3]

భారతీయ విశిష్ట సేవా పతకం (IDSM) అనేది భారత సాయుధ దళాల్లో పోలీసులలో పనిచేసిన భారతీయ పౌరులకు బ్రిటిషు సామ్రాజ్యం అందించిన సైనిక పురస్కారం. 1907 లో స్థాపించినప్పుడు ఇది, భారతీయులకు అందుబాటులో ఉన్న రెండవ అత్యున్నత పురస్కారం. ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అత్యున్నత పురస్కారం. అయితే, 1911 లో కామన్వెల్త్ ప్రజలందరినీ కవర్ చేయడానికి విక్టోరియా క్రాస్ అర్హతను విస్తరించారు. ఈ క్రమంలో IDSM, ప్రాధాన్యతలో మూడవ స్థానానికి వెళ్ళింది. IOM కి అవసరమైన ప్రమాణాలకు చాలని శౌర్య చర్యలను గుర్తించడానికి దీన్ని స్థాపించారు. [1] 1947 లో భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, ఈ పురస్కారాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. [2]

స్థాపించిన సమయంలో ఈ పతకం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ స్టేట్ ఫోర్సెస్, మిలీషియాకు, లెవీ సభ్యులకూ మాత్రమే అందుబాటులో ఉండేది. 1917 తర్వాత దీన్ని క్యారియర్‌లకు, శిక్షణలో ఉన్న 'పోరాటేతర' అనుచరులకు కూడా విస్తరించారు. 1929 లో, రాయల్ ఇండియన్ మెరీన్‌కు, 1940 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కూ దీన్ని విస్తరించారు. [1]

పతకానికి నాలుగు రూపులున్నాయి. వాటిలో ఉన్న తేడా అల్లా ఒక్కటే - చక్రవర్తి బొమ్మ. [2] పతకంపై గ్రహీత పేరు, సేవ నంబరు, రెజిమెంటు పేర్లూ చెక్కి ఉండేవి. [1]

బార్‌లతో సహా కేవలం 6,000 పతకాలను మాత్రమే ప్రదానం చేసారు. ఈ అంచేత ఈ పతకాన్ని అరుదైనదిగా భావిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సుమారు 3,200 మందికి, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం నుండి 1947 వరకు 1,200 మందికీ ఈ పురస్కారాలు అందించారు. మిగిలిన 1600 మంది సరిహద్దు పోరాట సమయంలో యుద్ధాల మధ్య కాలంలో ప్రదానం చేసారు. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Duckers 2001, pp. 40–41.
  2. 2.0 2.1 2.2 2.3 Robertson, Megan. "Medals of the United Kingdom". Medals of the World. Medals.org. Retrieved 2009-05-27. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "medals" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 3.3 "No. 56878". The London Gazette (Supplement). 17 March 2003. p. 3352.

ప్రస్తావనలు

[మార్చు]
  • Duckers, Peter (2001). British Gallantry Awards, 1855–2000. London: Osprey Publishing. ISBN 978-0-7478-0516-8.

బయటి లింకులు

[మార్చు]