భారతీయ వెయ్యి రూపాయల నోటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:1000 Rupee Indian Currency Note - Tanjai.jpg
భారతీయ రిజర్వ్ బ్యాంక్1954వ సంవత్సరం ఏప్రిల్ 1న విడుదల చేసిన వెయ్యి రూపాయల నోటుపై యునెస్కో వరల్డ్ హెరీటేజ్ సైట్ గుర్తించిన తమిళనాడు రాష్ట్రంలోని బృహదీశ్వరాలయం

భారతీయ కరెన్సీ యొక్క బ్యాంకునోటు నామవర్గీకరణ (డినామినేషన్) లో వెయ్యి రూపాయల నోటు ఒకటి. మొట్టమొదటి సారి 1954వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టింది. లెక్కలోనికి రానట్టు వంటి నల్లధనంను నియంత్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు తయారు చేసిన నోట్లలో నామవర్గీకరణ ప్రకారం అత్యధిక విలువ కలిగిన వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల విలువ కలిగిన నోట్లను 1978 జనవరిలో చలామణి కాకుండా రద్దు చేసింది. త్వరితగతిన ద్రవ్య సప్లయ్ కి అవసరమయిన పెద్దనోట్లను చలామణిలో ఉంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుంచి గట్టెకవచ్చని భావించిన భారతీయ రిజర్వ్ బ్యాంకు 2000 సంవత్సరంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది.


ఇవి కూడా చూడండి[మార్చు]

భారతీయ ఒక రూపాయి నోటు

బయటి లింకులు[మార్చు]