భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఆంగ్లం: International Film Festival of India) ఇది 1952లో స్థాపించబడింది.[1][2] ఆసియా ఖండంలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది.

లక్ష్యం[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా కళ, చలనచిత్రాలు, సంస్కృతుల సమ్మిళిత శక్తి, స్ఫూర్తిని కూడగట్టుకుని నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ప్రముఖులను ఒక వేదిక పైకి తీసుకు వస్తుంది. దీనిద్వారా పలు దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది. అలాగే ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్, గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని ప్రతీయేటా నిర్వహిస్తాయి.[3]

ఉత్తమ చిత్రానికి బంగారు నెమలి, అలాగే వెండి నెమలి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకులకు బహుకరిస్తారు. ఇవి కాకుండా ప్రత్యేక జ్యూరీ అవార్డు, జీవితకాల సాఫల్యం, ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురష్కారాలు కూడా అందచేస్తారు.

మూలాలు[మార్చు]

  1. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  2. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  3. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.