Jump to content

భారత అటార్నీ జనరల్

వికీపీడియా నుండి
Attorney General for India
Emblem of The Government of India
ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి
R. Venkataramani
రకంJudiciary of India
సంక్షిప్త పదంAGI
అధికారిక నివాసంNew Delhi, India
నియమించినవారుPresident of India
on advice of the Union Cabinet
కాలవ్యవధిper discretion of the President
ఏర్పరచిన చట్టంArticle 76 of the Constitution
ఏర్పాటు28 January 1950
చేపట్టిన మొదటి వ్యక్తిM. C. Setalvad
ఉపపదవిSolicitor General of India
జీతం
  • 2,25,000 (US$2,800) (per month)
  • 27,00,000 (US$34,000) (Annual)

భారత అటార్నీ జనరల్, భారతదేశ అత్యున్నత న్యాయాధికారి. అటార్నీ జనరల్. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని 76వ అధికరణ అటార్నీ జనరల్ గురించి తెలుపుతుంది.

నియామకం, జీతభత్యాలు

[మార్చు]

అటార్నీ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తారు. వేతనాలు, ఇతర సౌకర్యాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే వేతనాన్ని అటార్నీ జనరల్ పొందుతారు. వేతనం కేంద్ర సంఘటిత నిధినుండి చెల్లిస్తారు.

అర్హతలు, పదవీకాలం

[మార్చు]

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడానికి కావలసిన అన్ని అర్హతలు అటార్నీ జనరల్ కు ఉండాలి. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకూ అధికారంలో కొనసాగవచ్చు. సాధారనంగఅ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సం. వయస్సు పూర్తయ్యేవరకూ. అయినప్పటికీ మధ్యలోనే రాష్ట్రపతి తొలగించవచ్చు. అటార్నీ జనరల్ పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలనూ స్వీకరించరాదు. ఇతర కమిషన్లకు ఛైర్మన్ గా వ్యవహరించవచ్చు.

అధికారాలు

[మార్చు]

పార్లమెంటు ఉభయ సభల సమావేశాల్లో, దేనిలోనైనా జరిగే చర్చల్లో పాల్గొనే అధికారం అటార్నీ జనరల్ కు ఉంటుంది. కానీ ఓటు వేసే అధికారం ఉండదు. దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా ప్రభుత్వం తరపున వాదించే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలను అటార్నీ జనరల్ ద్వారానే తీసుకుంటారు. శాసన, రాజ్యాంగ సంబంధమైన విషయాలు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రి మండలి అప్పగించే వివిధ అంశాలపై తన అభిప్రాయాలు, న్యాయ సలహాలు తెలియజేస్తారు. అటార్నీ జనరల్ కు సహాయ సహకారాలందించటానికి ప్రభుత్వం సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ ను నియమించవచ్చు.

అటార్నీ జనరల్

[మార్చు]

The Attorneys General of India since independence are listed below:[1]

అటార్నీ జనరల్ పదవీకాలం ప్రధాన మంత్రి
ఎం. సి. సేతల్వాద్28.01.1950 - 01.03.1963జవహర్ లాల్ నెహ్రూ
సి. కె. దఫ్తరీ02.03.1963 - 30.10.1968జవహర్ లాల్ నెహ్రూ
నిరెన్ డే01.11.1968 - 31.03.1977ఇందిరా గాంధీ
ఎస్.వి. గుప్తే01.04.1977 - 08.08.1979మొరార్జీ దేశాయ్
ఎల్.ఎన్. సిన్హా09.08.1979 - 08.08.1983ఇందిరా గాంధీ
కె. పరాశరన్09.08.1983 - 08.12.1989ఇందిరా గాంధీ; రాజీవ్ గాంధీ
సోలి సొరాబ్జీ09.12.1989 - 02.12.1990వి.పి.సింగ్; చంద్రశేఖర్ సింగ్
జి. రామస్వామి03.12.1990 - 23.11.1992చంద్రశేఖర్ సింగ్; పి.వి. నరసింహారావు
మిలోన్ కుమార్ బెనర్జీ21.11.1992 - 08.07.1996పి.వి. నరసింహారావు
అశోక్ దేశాయ్09.07.1996 - 06.04.1998హెచ్.డి.దేవెగౌడ; ఐ.కే.గుజ్రాల్
సోలి సొరాబ్జీ07.04.1998 - 04.06.2004అటల్ బిహారీ వాజపేయి
మిలోన్ కుమార్ బెనర్జీ05.06.2004 - 07.06.2009మన్మోహన్ సింగ్
జి.ఇ.వాహన్వతి08.06.2009 - 07.06.2012మన్మోహన్ సింగ్

మూలాలు

[మార్చు]
  1. "Attorney General of Independent India". Archived from the original on 2012-06-25. Retrieved 2011-01-05.