భారత ఆదాయ పన్ను శాఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1964 జనవరి 1 నుంచి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) భారతదేశంలో ప్రత్యక్ష పన్నులన్నింటిని వసూలు చేస్తుంది. ఈ అధికారం దీనికి కేంద్ర బోర్డు 1963లో ఇచ్చింది. సిబిడిటి అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగంలో ఒక భాగం. ఒకవైపు సిబిడిటి భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల గురించి అవసరమైన అన్ని విధానాలను, ప్రణాళికలను తప్పనిసరిగా సూచిస్తుంది. అదే సమయంలో భారత ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యతను ఇది కలిగి ఉంది.

సంస్థ మరియు విధులు[మార్చు]

ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు ఒక రాజ్యాంగబద్దమైన సంస్థ. ఇది రెవెన్యూ చట్టం, 1963 యొక్క కేంద్ర బోర్డు కింద విధులు నిర్వహిస్తుంది. ఈ బోర్డు యొక్క అధికారులు ఎక్స్‌ అఫీషియో సామర్ద్యాన్ని కలిగి ఉంటారు. మరియు మంత్రిత్వ శాఖలో ఒక విభాగంగా ఉండి, లెవీ మరియు ప్రత్యక్షపన్నుల వసూళ్లు అంశాలను పరిశీలిస్తుంటారు. మరియు ఆదాయపు పన్ను శాఖ యొక్క సమర్ధ నిర్వహణకు అవసరమైన విధానాలను నిర్ణయిస్తుంటారు.

సి.బి.డి.టి. యొక్క చారిత్రక నేపథ్యం[మార్చు]

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ యాక్ట్‌, 1924 ఫలితంగా, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవన్యూ అనే విభాగం పన్నులకు సంబంధించిన ఒక పరిపాలన సంబంధ విభాగంగా ఏర్పడింది. ప్రారంభంలో ఈ బోర్డు ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల అంశాలను పరిశీలించేది. అయితే పన్నుల నిర్వహణ అనేది చాలా పెద్ద అంశంగా మారిన తర్వాత ఒక్క బోర్డు దీనికి సరిపోలేదు. దీంతో ఈ బోర్డును రెండుగా విభజించారు. వీటి పేర్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ మరియు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (ఎక్సైజ్‌ మరియు కస్టమ్స్‌ శాఖ). ఇది 1.1.1964 నుంచి అమలులోకి వచ్చాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూస్‌ చట్టం, 1963లో సెక్షన్‌ 3 ప్రకారం ఈ రెండు విభాగాల రాజ్యాంగం మరియు విభజన జరిగింది.

సి.బి.డి.టి. యొక్క కూర్పు మరియు విధులు[మార్చు]

దీని ఛైర్మన్‌, గతంలో భారత ప్రభుత్వానికి ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన ఎక్స్‌ అఫీషియో. సిబిడిటికి ఈయన హెడ్‌. దీనికి అదనంగా సిబిడిటిలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు కూడా భారత ప్రభుత్వానికి అదనపు కార్యదర్శుల స్థాయిలో ఎక్స్‌ అఫీషియోలు అయిఉంటారు. సిబిడిటి యొక్క ఛైర్మన్‌ మరియు సభ్యులు భారత రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) నుంచి ఎన్నికవుతారు. ఇది భారత దేశంలో ప్రీమియర్‌ సివల్‌ సర్వీస్‌. దీని సభ్యులు భారత ఆదాయపు పన్ను శాఖలో అత్యున్నత స్థాయి మేనేజ్‌మెంట్‌గా ఉంటారు. సిబిడిటి యొక్క సహాయక సిబ్బందిని కూడా ఐఆర్‌ఎస్‌తో పాటు దేశంలోని అనేక ప్రీమియర్‌ సివిల్‌ సర్వీస్‌లు మరియు అనేక అనుబంధ కార్యాలయాల నుంచి ఎన్నుకుంటారు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ఛైర్మన్‌తో పాటు కింది ఐదుగురు సభ్యులను కలగి ఉంటుంది: 1. ఛైర్మన్ 2. సభ్యుడు (ఆదాయపు పన్ను) 3. సభ్యుడు (విచారణలు) 4. సభ్యుడు (ఆడిట్‌మరియు జ్యుడిషియల్‌) 5. సభ్యుడు (లెజిస్లేషన్‌) 6. సభ్యుడు (పర్సనల్‌) 7. సభ్యుడు (రెవెన్యూ మరియు ఆడిట్‌)

ఈ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు యొక్క ఛైర్మన్‌ మరియు సభ్యులకు అనేక మంది సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటి సెక్రటరీలు, సెక్రటరీల కింద మంత్రిత్వ శాఖ సిబ్బంది అనేక మంది తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం సహాయ పడతారు. సిబిడిటి ఫీల్డ్‌ అధికారులు / ఫీల్డ్‌ ఏర్పాటును కింది విధంగా చేసింది:

1. చీఫ్‌ కమిషనర్స్‌ / ఆదాయపు పన్ను కమిషనర్లు 2. డైరెక్టర్‌ జనరల్‌ (విచారణ) / ఆదాయపు పన్ను డైరెక్టర్లు (విచారణ) 3. సాధారణ డైరెక్టర్లు (మినహాయింపులు) / ఆదాయపు పన్ను డైరెక్టర్లు (మినహాయింపులు) 4. డైరెక్టర్‌ జనరల్‌ (విదేశీ పన్ను) / ఆదాయపు పన్ను డైరెక్టర్‌ (విదేశీ పన్ను) 5. ఆదాయపు పన్ను కమిషనర్‌ (అప్పీల్స్‌) 6. ఆదాయపు పన్ను కమిషనర్‌ (జ్యుడిషియల్‌) 7. ఆదాయపు పన్ను కమిషనర్‌ (కంప్యూటర్‌ ఆపరేషన్స్‌) 8. ఆదాయపు పన్ను కమిషనర్‌ (ఆడిట్‌) 9. ఆదాయపు పన్ను కమిషనర్‌ (జుడిషియల్‌) 10. ఆదాయపు పన్ను కమిషనర్‌ (సిఐబి) 11. ఆదాయపు పన్ను కమిషనర్‌ (శాఖాపరమైన ప్రతినిధి), ఆదాయపు పన్ను సెటిల్‌మెంట్‌ కమిషన్‌ 12. ఆదాయపు పన్ను కమిషనర్‌ (శాఖా పరమైన ప్రతినిధి), ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, సిబిడిటికి కింద పేర్కొన్న కార్యాలయాలు /డైరెక్టరేట్‌లు తోడ్పడతాయి.

ఆదాయపు పన్ను సంచాలక కార్యాలయం (ఐటి)[మార్చు]

ఈ సంచాలక కార్యాలయంలో రెండు విభాగాలు ఉంటాయి. అవి. (ఎ) తనిఖీ - ఈ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను అధికారుల పనిని తనిఖీ చేస్తూ, సమర్ధంగా నియంత్రిస్తుంటుంది. (భి) పరీక్ష- ఈ బోర్డు శాఖా పరమైన పరీక్షలు నిర్వహిస్తుంటుంది. తనిఖీ సంచాలక కార్యాలయం (ఆడిట్‌) ఆడిట్‌ తర్వాత వచ్చే అడ్డుకోళ్లను సెటిల్‌మెంట్‌ చేయడంతో పాటు వాటిని ముగిస్తుంది. మరియు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమిషనర్ల పనితీరును సమీక్షిస్తుంది.

తనిఖీ సంచాలక కార్యాలయం (పరిశోధన, గణాంకాలు మరియు పౌర సంబంధాలు)[మార్చు]

ఈ సంచాలక కార్యాలయం యొక్క ప్రధాన విధి, పన్ను అంశాలకు సంబంధించిన పరిశోధన చేయడం, భారత రెవెన్యూ గణాంకాలను ముద్రించడం, పన్ను చెల్లింపుదారుల సమాచార సిరీస్‌ను తయారు చేయడం, శాఖపరమైన ప్రచురణలు, ప్రచారం మరియు పౌర సంబంధాలు

నిర్వహణ మరియు మేనేజ్‌మెంట్‌ సేవల సంచాలక కార్యాలయం[మార్చు]

ఈ సంచాలక కార్యాలయం నిర్వహణ ప్రణాళికను ఏర్పాటు చేయడం ప్రధాన కర్తవ్యంగా కలిగి ఉంటుంది. సంస్థాపరమైన అభివృద్ధి, మేనేజ్‌మెంట్‌ సమాచార వ్యవస్థ మరియు పని కొలమానాలను తయారు చేయడం.

తనిఖీ సంచాలక కార్యాలయం (విజిలెన్స్‌)[మార్చు]

దీని ప్రధాన విధి, శాఖాపరమైన విచారణలు చేపట్టడం, చార్జ్‌షీట్‌లను తయారు చేయడం, కేసును శాఖ తరఫున సమర్పించడం, విచారణల నివేదికను ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులపై తయారు చేసి, తుది ఉత్తర్వులు జారీ చేయడం

ఆదాయపు పన్ను సంచాలక కార్యాలయం (సిస్టమ్స్‌)[మార్చు]

ఈ సంచాలక కార్యాలయం మేనేజ్‌మెంట్‌ సమాచార వ్యవస్థను నిర్వహిస్తుంది. శాఖను కంప్యూటరీకరించడం, ఆదాయపు పనున శాఖలో ఒక యునిఫామ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని విధులు

ఆదాయపు పన్ను సంచాలక కార్యాలయం (మౌళిక వసతులు)[మార్చు]

ఈ సంచాలక కార్యాలయం సిబిడిటికి మౌలిక వసతుల అంశాలలో సహాయకారిగా ఉంటుంది.

డైరెక్టర్‌ జనరల్‌ (విజిలెన్స్‌) / ఆదాయపు పన్ను డైరెక్టర్‌ (విజిలెన్స్‌)[మార్చు]

ఈ సంచాలక కార్యాలయం యొక్క ప్రధాన విధి శాఖాపరమైన విచారణలు నిర్వహించడం, చార్జ్‌ షీట్‌లను తయారు చేయడం, శాఖ తరఫున కేసులను సమర్పించడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణ చేపట్టి, తుది ఉత్తర్వులు జారీ చేయడం.

ఆదాయపు పన్ను డైరెక్టర్‌ జనరల్‌ (శిక్షణ)[మార్చు]

ఆదాయపు పన్ను శాఖ యొక్క సిబ్బంది మరియు అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ప్రధాన సంస్థ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌, నాగ్‌పూర్‌లో ఉంది. దీని ప్రధాన కర్తవ్యం, నేరుగా తీసుకున్న ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారులకు శిక్షణ ఇవ్వడం. ఆదాయపు పన్ను శాఖకు ఉన్న ప్రాంతీయ శిక్షణ సంస్థలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవడం. ఈ ప్రాంతీయ కేంద్రాలు బెంగళూరు, కోల్‌కతా, హజారీబాగ్‌, లక్నో మరియు ముంబైలలో ఉన్నాయి.

సూచనలు[మార్చు]