భారత రక్షణ శాఖ మంత్రులు జాబితా
భారత రక్షణమంత్రి (భారతదేశం రక్షా మంత్రి | |
---|---|
![]() | |
![]() | |
![]() | |
విధం | గౌరవనీయుడు |
సభ్యుడు | కేంద్ర మంత్రిమండలి |
రిపోర్టు టు | ప్రధానమంత్రి భారత పార్లమెంటు |
నియామకం | రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మేరకు |
కాల వ్యవధి | 5 సంవత్సరాలు |
నిర్మాణం | 1947 ఆగష్టు 15 |
మొదట చేపట్టినవ్యక్తి | బలదేవ్ సింగ్ |
ఉప | అజయ్ భట్ రాష్ట్ర మంత్రి |
భారత రక్షణ శాఖ మంత్రి (రక్షా మంత్రి), భారతదేశ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఆధిపతిగా ఉంటాడు. భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ జాతీయ భద్రత, భారత సాయుధ దళాలకు సంబంధించిన సమాఖ్య విభాగాల అన్ని ఏజెన్సీలు విధులను సమన్వయపరచడం, అతిపెద్ద బడ్జెట్‌తో నిర్వహించడం, సంబంధం కలిగి ఉంటుంది.[1] భారత రక్షణ శాఖ మంత్రిని భారత ప్రభుత్వ ఉన్నత స్థాయి మంత్రిగా పరిగణిస్తారు. కేంద్ర మంత్రి మండలిలో, అత్యున్నత స్థాయి మంత్రిగా ఉంటాడు. రక్షణ మంత్రి కార్యాలయం అత్యంత ముఖ్య కార్యాలయాలలో ఒకటి.[2]
నిర్వహణ[మార్చు]
రక్షణ మంత్రి అదనంగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ అధ్యక్షుడిగా, డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తాడు.[2]
తోడ్పాటు[మార్చు]
భారత రక్షణ శాఖ మంత్రికి, రక్షణ శాఖ సహాయ మంత్రి, దిగువ స్థాయి రక్షణ శాఖ సహాయ మంత్రి తగిన మద్దతు, తోడ్పాటు అందిస్తారు.
మొదటి రక్షణ శాఖ మంత్రి[మార్చు]
స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రిగా బల్‌దేవ్ సింగ్ పనిచేసాడు. అతను 1947-52 సమయంలో నెహ్రూ మంత్రివర్గంలో పనిచేశాడు.
పదవి నిర్వహించిన మహిళలు[మార్చు]
ఇందిరా గాంధీ భారతదేశ మొట్టమొదటి మహిళా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసింది. మహిళలలో నిర్మలా సీతారామన్ రెండవ రక్షణ శాఖ మంత్రిగా 2017 సెప్టెంబరు 4 నుండి 2019 మే 30 వరకు పనిచేసింది.[3][4]
ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి[మార్చు]
2019 మే 30 నుండి భారత రక్షణశాఖ మంత్రిగా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణ బాధ్యతలు రాజ్‌నాథ్ సింగ్ నిర్వహిస్తున్నాడు.[4]
రక్షణ మంత్రుల జాబితా[మార్చు]
వ.సంఖ్య | పేరు (జననం-మరణం) |
చిత్రం | పదవీకాలం | రాజకీయపార్టీ లేదా కూటమి |
మంత్రివర్గం | |||
---|---|---|---|---|---|---|---|---|
పదవీ బాధ్యతలు స్వీకరించింది | కార్యాలయం నుండి నిష్క్రమించింది | పదవినిర్వహించిన కాలం | ||||||
1 | బలదేవ్ సింగ్ (1902–1961) |
![]() |
15 ఆగష్టు 1947 | 13 మే 1952 | 4 సంవత్సరాల 272 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | 1వ, 2వ నెహ్రూ మంత్రివర్గం | |
2 | ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ (1882–1953) |
![]() |
13 మే 1952 | 10 ఫిబ్రవరి 1953 | 273 రోజులు | 2వ నెహ్రూ మంత్రివర్గం | ||
3 | జవాహర్ లాల్ నెహ్రూ (1889–1964) |
![]() |
10 ఫిబ్రవరి 1953 | 10 జనవరి 1955 | 1 సంవత్సరం, 334 రోజులు | 2వ నెహ్రూ మంత్రివర్గం | ||
4 | కైలాష్ నాథ్ కట్జూ (1887–1968) |
![]() |
10 జనవరి 1955 | 30 జనవరి 1957 | 2 సంవత్సరాల 20 రోజులు | 2వ నెహ్రూ మంత్రివర్గం | ||
(3) | జవాహర్ లాల్ నెహ్రూ (1889–1964) |
![]() |
30 జనవరి 1957 | 17 ఏప్రిల్ 1957 | 2 సంవత్సరాల 97 రోజులు | 2వ, 3వ నెహ్రూ మంత్రివర్గం | ||
5 | వి. కె. కృష్ణ మేనన్ (1896–1974) |
![]() |
17 ఏప్రిల్ 1957 | 31 అక్టోబరు 1962 | 5 సంవత్సరాల 197 రోజులు | 3వ, 4వ నెహ్రూ మంత్రివర్గం | ||
(3) | జవాహర్ లాల్ నెహ్రూ (1889–1964) |
![]() |
31 అక్టోబరు 1962 | 14 నవంబరు 1962 | 14 రోజులు | 4వ నెహ్రూ మంత్రివర్గం | ||
6 | యశ్వంత్ రావ్ చవాన్ (1913–1984) |
![]() |
14 నవంబరు 1962 | 13 నవంబరు1966 | 3 సంవత్సరాల 346 రోజులు | 4వ నెహ్రూ మంత్రివర్గం, 1వ నందా మంత్రివర్గం, శాస్తి మంత్రివర్గం, 2వ నందా మంత్రివర్గం, 1వ ఇందిరా గాంధీ మంత్రివర్గం | ||
7 | స్వరణ్ సింగ్ (1907–1994) |
13 నవంబరు 1966 | 27 జూన్ 1970 | 3 సంవత్సరాల 226 రోజులు | 1వ ఇందిరా గాంధీ మంత్రి వర్గం | |||
8 | జగ్జీవన్ రాం (1908–1986) |
![]() |
27 జూన్ 1970 | 10 అక్టోబరు 1974 | 4 సంవత్సరాల 105 రోజులు | 1వ, 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం | ||
(7) | స్వరణ్ సింగ్ (1907–1994) |
10 అక్టోబరు 1974 | 1 డిసెంబరు 1975 | 1 సంవత్సరం 52 రోజులు | 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం | |||
9 | ఇందిరా గాంధీ (1917–1984) |
![]() |
1 డిసెంబరు 1975 | 20 డిసెంబరు 1975 | 19 రోజులు | 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం | ||
10 | బన్సీలాల్ (1927–2006) |
21 డిసెంబరు 1975 | 24 మార్చి 1977 | 1 సంవత్సరం, 94 రోజులు | 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం | |||
(8) | జగ్జీవన్ రాం (1908–1986) |
![]() |
24 మార్చి1977 | 28 జులై 1979 | 2 సంవత్సరాల 126 రోజులు | జనతా పార్టీ | మొరార్జీ దేశాయ్ మంత్రివర్గం | |
11 | సి.సుబ్రమణ్యం (1910–2000) |
![]() |
28 జులై 1979 | 14 జనవరి 1980 | 170 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | చరణ్ సింగ్ మంత్రివర్గం | |
(9) | ఇందిరా గాంధీ (1917–1984) |
![]() |
14 జనవరి 1980 | 15 జనవరి 1982 | 2 సంవత్సరాల ఒకరోజు | భారత జాతీయ కాంగ్రెస్ | 3వ ఇందిరా గాంధీ మంత్రివర్గం | |
12 | రామస్వామి వెంకట్రామన్ (1910–2009) |
![]() |
15 జనవరి 1982 | 2 ఆగష్టు 1984 | 2 సంవత్సరాల 200 రోజులు | |||
13 | శంకర్రావ్ చవాన్ (1920–2004) |
![]() |
2 ఆగష్టు 1984 | 31 డిసెంబరు 1984 | 151 రోజులు | 3వ ఇందిరా గాంధీ మంత్రివర్గం, రాజీవ్ గాంధీ మంత్రివర్గం | ||
14 | పి.వి.నరసింహారావు (1921–2004) |
1 జనవరి 1985 | 25 సెప్టెంబరు 1985 | 267 రోజులు | రాజీవ్ గాంధీ మంత్రివర్గం | |||
15 | రాజీవ్ గాంధీ (1944–1991) |
![]() |
25 సెప్టెంబరు 1985 | 24 జనవరి 1987 | 269 రోజులు | |||
16 | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ (1930–2008) |
![]() |
24 జనవరి 1987 | 12 ఏప్రిల్ 1987 | 78 రోజులు | |||
17 | కె.సి.పంత్ (1931–2012) |
![]() |
13 ఏప్రిల్ 1987 | 1 డిసెంబరు 1989 | 2 సంవత్సరాల 232 రోజులు | |||
(16) | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ (1930–2008) |
![]() |
2 డిసెంబరు1989 | 10 నవంబరు 1990 | 343 రోజులు | జనతాదళ్ (నేషనల్ ఫ్రంట్) |
వి.పి.సింగ్ మంత్రివర్గం | |
18 | చంద్రశేఖర్ (1927–2007) |
![]() |
10 నవంబరు 1990 | 21 జూన్ 1991 | 223 రోజులు | సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) | చంద్రశేఖర్ మంత్రివర్గం | |
(14) | పి.వి.నరసింహారావు (1921–2004) |
21 జూన్ 1991 | 26 జూన్ 1991 | 5 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | పి.వి.నరసింహారావు మంత్రివర్గం | ||
19 | శరద్ పవార్ (జననం 1940) |
![]() |
26 జూన్ 1991 | 6 మార్చి 1993 | 1 సంవత్సరం, 253 రోజులు | |||
(14) | పి.వి.నరసింహారావు (1921–2004) |
6 మార్చి 1993 | 16 మే 1996 | 3 సంవత్సరాల 171 రోజులు | ||||
20 | ప్రమోద్ మహాజన్ (1949–2006) |
16 మే 1996 | 1 జూన్ 1996 | 16 రోజులు | భారతీయ జనతాపార్టీ | 1వ వాజ్‌పేయి మంత్రివర్గం | ||
21 | ములాయం సింగ్ యాదవ్ (జననం 1939) |
![]() |
1 జూన్ 1996 | 19 మార్చి1998 | 1 సంవత్సరం, 291 రోజులు | సమాజవాదీ | దేవెగౌడ, గుజ్రాల్ మంత్రివర్గం | |
22 | జార్జ్ ఫెర్నాండెజ్ (1930–2019) |
![]() |
19 మార్చి 1998 | 16 మార్చి 2001 | 2 సంవత్సరాల
362 రోజులు |
సమతాపార్టీ | 2వ, 3వ వాజ్‌పేయి మంత్రివర్గం | |
23 | జశ్వంత్ సింగ్ (1938–2020) |
![]() |
16 మార్చి 2001 | 21 అక్టోబరు 2001 | 219 రోజులు | భారతీయ జనతాపార్టీ | 3వ వాజ్‌పేయి మంత్రివర్గం | |
(22) | జార్జ్ ఫెర్నాండెజ్ (1930–2019) |
![]() |
21 అక్టోబరు 2001 | 22 మే 2004 | 2 సంవత్సరాల
214 రోజులు |
జనతాదళ్ (యునైటెడ్) | ||
24 | ప్రణబ్ ముఖర్జీ (1935–2020) |
![]() |
22 మే 2004 | 26 అక్టోబరు 2006 | 2 సంవత్సరాల
157 రోజులు |
భారత జాతీయ కాంగ్రెస్ | 1వ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం | |
25 | ఎ.కె.ఆంటోనీ (జననం 1940) |
![]() |
26 అక్టోబరు2006 | 26 మే 2014 | 7 సంవత్సరాల
212 రోజులు |
1వ, 2వ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం | ||
26 | అరుణ్ జైట్లీ (1952–2019) |
![]() |
26 మే 2014 | 9 నవంబరు 2014 | 167 రోజులు | భారతీయ జనతా పార్టీ | 1వ మోడీ మంత్రివర్గం | |
27 | మనోహర్ పారికర్ (1955–2019) |
![]() |
9 నవంబరు 2014 | 13 మార్చి 2017 | 2 సంవత్సరాల
124 రోజులు | |||
(26) | అరుణ్ జైట్లీ (1952–2019) |
![]() |
13 మార్చి 2017 | 3 సెప్టెంబరు 2017 | 174 రోజులు | |||
28 | నిర్మలా సీతారామన్ (జననం 1959) |
![]() |
3 సెప్టెంబరు 2017 | 30 మే 2019 | 1 సంవత్సరాల
269 రోజులు | |||
29 | రాజ్‌నాథ్ సింగ్ (జననం 1951) |
![]() |
30 మే 2019 | ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్న వ్యక్తి | - | 2 మోడీ మంత్రివర్గం |
రాష్ట్ర మంత్రుల జాబితా[మార్చు]
వరుస సంఖ్య | మంత్రి పేరు | చిత్రం | రాజకీయ పార్టీ | పదవీకాలం | పదవినిర్వహించిన కాలం | ||
---|---|---|---|---|---|---|---|
1 | రావ్ ఇంద్రజిత్ సింగ్ | ![]() |
భారతీయ జనతా పార్టీ | 26 మే 2014 | 5 జులై 2016 | 2 సంవత్సరాల, 40 రోజులు | |
2 | సుభాష్ భామ్రే | ![]() |
5 జులై 2016 | 30 మే 2019 | 2 సంవత్సరాల, 329 రోజులు | ||
3 | శ్రీపాద్ నాయక్ | 30 మే 2019 | 7 జులై 2021 | 2 సంవత్సరాల, 163 రోజులు | |||
4 | అజయ్ భట్ | 7 జులై 2021 | ప్రస్తుతం ఆధికారంలో
కొనసాగుచున్న వ్యక్తి |
1 సంవత్సరం, 316 రోజులు |
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Ministry of Defence". www.mod.gov.in. Retrieved 2021-10-21.
- ↑ 2.0 2.1 "ABOUT THE MINISTRY | Ministry of Defence". www.mod.gov.in. Retrieved 2021-10-21.
- ↑ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మల[permanent dead link]|నమస్తే తెలంగాణా
- ↑ 4.0 4.1 "Ministry of Defence, List of Defence Ministers of India". web.archive.org. 2021-06-29. Archived from the original on 2021-06-29. Retrieved 2021-10-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)