Jump to content

భాల్జీ ఫెండార్కర్

వికీపీడియా నుండి
భాల్జీ పెంధార్కర్
2013 భారత తపాలా బిళ్ళపై పెంధార్కర్
జననంభాల్జీ గోపాల్ పెంధార్కర్
(1897-05-03)1897 మే 3
కొల్హాపూర్, మహారాష్ట్ర, బ్రిటిష్ ఇండియా
మరణం1994 నవంబరు 26(1994-11-26) (వయసు: 97)
కొల్హాపూర్, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • నిర్మాత
  • రచయిత
పురస్కారాలుదాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1991)

భాల్జీ పెంధార్కర్ (1897 మే 3 - 1994 నవంబరు 26) ఒక భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

తొలి జీవితం, కుటుంబం

[మార్చు]

రాధాబాయి, గోపాల్ పెంధార్కర్‌ దంపతులకు ఆయన జన్మించారు.[1] ఆయన బంధువులు కూడా భారతీయ సినిమా పరిశ్రమలో చురుకుగా పనిచేశారు. వారిలో ఆయన అన్నయ్య బాబూరావ్ పెంధార్కర్, సవతి సోదరుడు మాస్టర్ వినాయక్ కర్ణాటకి, దాయాది వి. శాంతారామ్ ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భాల్జీకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరైన లీలా చంద్రగిరి 1930లలో మిస్ లీలా పేరుతో హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి పాడారు. లీలాబాయి మొదటిసారి భాల్జీని కలిసే సమయానికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భాల్జీ వారిద్దరినీ (అబ్బాయి జయసింగ్, ఒక అమ్మాయి) దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి తర్వాత నవలా రచయిత రంజిత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది, మాధవి దేశాయ్‌గా (2013లో మరణించారు) ఆమె సుపరిచితురాలు. ఆమె 'నాచా గా ఘుమా' అనే పుస్తకాన్ని రాశారు. ఆయన రెండవ కుమార్తె పేరు సరోజ్ చిందార్కర్.

భాల్జీ మొదటి భార్య కుమారుడు ప్రభాకర్ పెంధార్కర్ (1933-2010) 1950లలో దో ఆంఖే బారా హాత్ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆయన రారంగ్‌ఢాంగ్ అనే పుస్తకాన్ని రచించడంతో పాటు ఎన్నో ప్రముఖ డాక్యుమెంటరీలకు రచయిత, దర్శకుడిగా పనిచేశారు. లీలా కుమారుడు జయసింగ్ (భాల్జీ దత్తత తీసుకున్నాడు), తన స్వంత కుమారుడు ప్రభాకర్ పేర్లను కలిపి భాల్జీ తన స్టూడియోకు జయప్రభ అని పేరు పెట్టారు.

సినీ ప్రస్థానం

[మార్చు]

భాల్జీ మూకీ సినిమాల యుగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన తొలి టాకీ చిత్రాలతో ఆయనకు అనుబంధం ఉంది, తన స్వస్థలమైన కొల్హాపూర్‌లోని ఇతర స్టూడియోలలో కూడా పనిచేశారు. తర్వాత ఆయన జయప్రభ స్టూడియో[2] రూపంలో సొంత స్టూడియోను స్థాపించి సినిమా నిర్మాతగా, దర్శకుడిగా మారారు. ఆయన మరాఠీ భాషలో కొన్ని సినిమా పాటలకు సాహిత్యం కూడా రాశారు. ఆయన రూపొందించిన ప్రసిద్ధ చిత్రాలు: నేతాజీ పాల్కర్, తోరతంచి కమల, ఛత్రపతి శివాజీ, మోహిత్యాంచి మంజుల, మరాఠా తితుకా మేల్వావా, సాధీ మాన్స, తాంబడి మాటి.

భాల్జీకి భారత ప్రభుత్వం 1991లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది.

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
  • 1925 బాజీరావ్ మస్తానీ
  • 1927 వందే మాతరం ఆశ్రమ్
  • 1931 రాణి రూపమతి
  • 1932/II శ్యామ్ సుందర్
  • 1932/I శ్యామ్ సుందర్
  • 1934/I ఆకాశవాణి
  • 1934/II ఆకాశవాణి
  • 1934/II పార్థ కుమార్
  • 1934/I పార్థ కుమార్
  • 1935 కాళీయ మర్దన్
  • 1935 మురళీవాలా
  • 1936 రుక్మిణీ కళ్యాణం
  • 1936 సావిత్రి
  • 1937 కన్హోపాత్ర
  • 1938/II రాజా గోపీచంద్
  • 1938/I రాజా గోపీచంద్
  • 1939 నేతాజీ పాల్కర్
  • 1940 అలఖ్ నిరంజన్
  • 1940 గోరఖ్‌నాథ్
  • 1941 తోరతంచి కమల
  • 1942 భక్త దామాజీ
  • 1942 సూన్‌బాయ్
  • 1943 బహిర్జీ నాయక్
  • 1944 మహారథి కర్ణ
  • 1944 స్వర్ణ భూమి
  • 1946/I వాల్మీకి
  • 1946 సాసుర్వాస్
  • 1949 మీఠ్ భాకర్
  • 1950 మీ దారు సోడ్లీ
  • 1950 శిలంగణాచే సోనే
  • 1952 ఛత్రపతి శివాజీ
  • 1953 మఝీ జమీన్
  • 1954 మహారాణి ఏసుబాయి
  • 1955 యేరే మాఝ్యా మాగ్ల్యా
  • 1956 పావన్‌ఖింద్
  • 1957 నాయికినిచా సజ్జా
  • 1959 ఆకాశగంగ
  • 1963 మోహిత్యాంచి మంజుల
  • 1964 మరాఠా తితుకా మేల్వావా
  • 1965 సాధీ మాన్స
  • 1969 తాంబడి మాటి

స్క్రీన్ ప్లే రచయిత

[మార్చు]
  • 1939 నేతాజీ పాల్కర్ (రచయిత)
  • 1937 కన్హోపాత్ర
  • 1934/I ఆకాశవాణి (స్క్రీన్ ప్లే / కథ)
  • 1934/II ఆకాశవాణి (స్క్రీన్ ప్లే / కథ)
  • 1932/I శ్యామ్ సుందర్ (స్క్రీన్ ప్లే / కథ)
  • 1932/II శ్యామ్ సుందర్ (స్క్రీన్ ప్లే / కథ)
  • 1927 వందే మాతరం ఆశ్రమ్
  • 1925 బాజీరావ్ మస్తానీ

నిర్మాతగా

[మార్చు]

నటుడిగా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Patil, Kavita (2003). "Film industry of Kolhapur: A historical significance". Proceedings of the Indian History Congress. 64: 1197. JSTOR 44145547.
  2. "The autobiography of a film studio". The Times of India. 25 September 2009.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)

బయటి లింకులు

[మార్చు]