Jump to content

భావనా ​​గౌర్

వికీపీడియా నుండి
భావనా ​​గౌర్

పదవీ కాలం
2015 ఫిబ్రవరి 11 – 2025 ఫిబ్రవరి 7
ముందు ధరమ్ దేవ్ సోలంకి
నియోజకవర్గం పాలం

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-02) 1970 డిసెంబరు 2 (age 54)
ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ
తల్లిదండ్రులు మంగత్ రామ్ గౌర్
నివాసం ఢిల్లీ
పూర్వ విద్యార్థి మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు

భావనా ​​గౌర్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ శాసనసభకు పాలం శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

భావనా ​​గౌర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997లో మధు విహార్ నుండి బీజేపీ టికెట్‌పై మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కౌన్సిలర్‌గా పని చేసి అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. ఆమె 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పాలం శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధరమ్ దేవ్ సోలంకి చేతిలో 8,372 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

భావనా ​​గౌర్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పాలం శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధరమ్ దేవ్ సోలంకిపై 30,849 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2] ఆమె 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పాలం శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విజయ్ పండిట్​పై 32,765 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]

భావనా ​​గౌర్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పాలం శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ టికెట్ దక్కకవడంతో జనవరి 31న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  2. "Meet the six women MLAs of Delhi" (in ఇంగ్లీష్). The Indian Express. 12 February 2015. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  5. "కేజ్రీవాల్‌కు బిగ్ షాక్‌.. ఎన్నికల వేళ ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా". 31 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 31 January 2025.
  6. "Seven outgoing AAP MLAs resign ahead of Delhi polls" (in Indian English). The Hindu. 31 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 31 January 2025.