Jump to content

భావన (నటి)

వికీపీడియా నుండి
భావన
భావన
కార్తీక మీనన్

(1986-06-06) 1986 జూన్ 6 (వయసు: 40)
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
వృత్తి
  • నటి
  • దర్శకురాలు
క్రియాశీలక సంవత్సరాలు2002 – ప్రస్తుతం
Spouse
నవీన్
(m. 2018)

భావన (జననం 1986 జూన్ 6), ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. ఆమె అసలు పేరు కార్తికా మీనన్. మలయాళంలో దర్శకుడు కమల్ తీసిన నమ్మళ్(2002) సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు భావన. ఈ సినిమాలోని నటనకు ఆమె మంచి ప్రశంసలు అందుకున్నారు. దశబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్ లో దాదాపు 70 సినిమాల్లో నటించిన భావన, రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఆమె జన్మించింది. ఆమె తండ్రి జి.బాలచంద్రన్ సినిమాల్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, తల్లి పుష్ప గృహిణి. ఆమె త్రండ్రి 2015 సెప్టెంబరు 24న మరణించాడు. ఆమెకు ఒక అన్నయ్య జయదేవ్.[1] ఉన్నాడు. ఆమె త్రిస్సూర్ లోని చెంబుక్కవులో హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హై స్కూల్ లో చదువుకుంది. భావన అన్నయ్య జయదేవ్ తమిళ సినిమా పట్టినప్పాక్కంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.[2]

తనకు చిన్నప్పటినుంచీ నటి కావాలని కోరిక ఉండేదని భావన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.[3] తన ఐదేళ్ళ వయసు నుంచి అమలకు అభిమాని అని, మలయాళ చిత్రం ఎంటె సూర్యపుత్రిక్కులో అమల నటనను అద్దంలో చూస్తూ అనుకరిస్తుండేదని తెలిపింది. ఆ సినిమాలో అమల ఒక సీన్ లో బిల్డింగ్ పైనుంచీ దూకడం చూసి, భావన కూడా అలాగే దూకి, చేయి విరగ్గొట్టుకున్నానంది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె 16వ ఏట[3] మలయాళ చిత్రం నమ్మాళ్ తో వెండితెరకు పరిచయమయింది. ఈ సినిమా సమయంలోనే తన పేరు భావనగా ఆమె మార్చుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకుంది. ఆ సినిమాలో నటించేప్పుడు ఆమె 11వ తరగతి చదువుతోంది. మలయాళ సినీ రంగంలో ఆ సమయంలో ఉన్న దాదాపు అందరి నటులతోనూ ఆమె కలిసి చేసింది. తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది. తమిళ ప్రముఖ హీరోలైన అజిత్ కుమార్మాధవన్జయం రవిభరత్జీవాశ్రీకాంత్ వంటి  వారి  పక్కన హీరోయిన్ గా నటింంచింది.[4]

2010లో పునీత్ రాజ్‌కుమార్ సరసన జాకీ అనే కన్నడ సినిమాలో ఆమె నటించింది. ఇది ఆమె మొట్టమొదటి కన్నడ చిత్రం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయవంతం కావడంతో తెలుగు, మలయాళ భాషల్లోకి కూడా డబ్ చేశారు.[5] ఇమ్రాన్ హష్మి, అమితాబ్ బచ్చన్ వంటి హీరోలతో బాలీవుడ్ సినిమాలనూ ఆమె నటిస్తానని ప్రకటించింది.[6] విష్ణువర్ధన్, సుదీప్ లతో కలసి ఆమె తన రెండో కన్నడ సినిమా చేసింది. ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. 2012లో హనీ బీ, 2013లో ఎళమతే వరవు అనే మలయాళ చిత్రాల్లో నటించింది. తరువాత శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ఇవిడేలో ఐటీ కంపెనీలో పనిచేసే సింగిల్ మదర్ పాత్రలో ఆమె నటించిమెప్పించింది. ఈ సినిమాలో అమెరికాలో వరుసగా ఐటి ప్రొఫెషనల్స్ ను చంపుతుంటారు. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[7][8]

అపహరణ, లైంగిక దాడి

[మార్చు]

ఫిబ్రవరి 2017లో, షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె అపహరణకు గురయ్యారు.[9] ఒక ముఠా ఆమెపై లైంగిక దాడికి పాల్పడింది. ఏప్రిల్ 2017లో, దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల ప్రకటనల ఆధారంగా వచ్చిన మీడియా కథనాలు, ప్రధాన నిందితుడైన సునీల్ ఎన్. ఎస్. (పల్సర్ సుని)తో నటుడు దిలీప్‌ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించాయి.[10] జూలై 2017లో దర్యాప్తు బృందం దిలీప్‌ను అరెస్టు చేసింది;[11] ఇతర నిందితులతో కలిసి దిలీప్ కుట్ర పన్నారనడానికి పరోక్ష ఆధారాలు ఉన్నాయని ఆ బృందం తమ చార్జ్ షీట్‌లో పేర్కొంది.[12] అక్టోబర్ 2017లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.[13] 2022లో, దర్యాప్తు అధికారిని భయపెట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు దిలీప్ మరియు మరో ఐదుగురిపై అదనపు కేసు నమోదు చేశారు.[14]

దాడి జరిగిన తర్వాత, భావన ఐదు సంవత్సరాల పాటు మలయాళ చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంది. [15] భావన 2022లో ఈ కేసు గురించి తన మొదటి వ్యాఖ్యను చేసింది. [16] తనను "అవమానించడానికి, నోరు మూయించడానికి, ఒంటరి చేయడానికి" జరిగిన ప్రయత్నాల గురించి ఆమె మాట్లాడుతూ, "బాధితురాలిగా ఉన్న స్థితి నుండి ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా మారిన" ప్రయాణం సులభం కాదని అన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాస్తూ, మరెవరూ ఇలాంటి కష్టాన్ని అనుభవించకుండా ఉండేలా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. [16] [17]

భావనపై జరిగిన దాడి, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఏర్పాటుకు, హేమ కమిటీ ఏర్పాటుకు పాక్షికంగా దోహదపడింది. [18] భావన మాట్లాడిన కొన్ని నెలల తర్వాత, మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలను రక్షించడానికి చట్టాన్ని అమలు చేసే ప్రణాళికలను కేరళ రాష్ట్ర శాసనసభ ప్రకటించింది. [19]

దిలీప్‌తో సహా 10 మంది నిందితులపై అభియోగాలతో, ఈ విచారణ 8 మార్చి 2018న ఎర్నాకుళంలోని సెషన్స్ కోర్టులో ప్రారంభమై ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగింది. [20] 8 డిసెంబర్ 2025న, ఎర్నాకులం ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు దిలీప్ మరియు మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ, ప్రధాన నిందితుడు పల్సర్ సునీ మరియు మరో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. [21] సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర మరియు ఇతర నేరాలకు పాల్పడిన దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జరిమానాలుగా వసూలు చేసిన ₹5 లక్షలను భావనకు చెల్లించాలని కోర్టు ఇంకా ఆదేశించింది. [22]

తెలుగు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tamil Actress Bhavana Balachandran Photo Gallery | Bhavana's Latest Movie in Telugu is Ontari with P.Gopichand". Actress.telugucinemastills.com. 1986-06-06. Retrieved 2011-01-02.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-21. Retrieved 2017-01-06.
  3. 1 2 3 Y. Sunita Chowdhary (2011-07-16). "Arts / Cinema : New-look Bhavana's dream comes true". The Hindu. Retrieved 2011-10-03.
  4. "Bhavana going glamorous in film". Times of India. Archived from the original on 2013-04-04. Retrieved 2017-01-06.
  5. "Bhavana debuts in Kannada today – Tamil Movie NEWS". IndiaGlitz. Archived from the original on 2011-09-04. Retrieved 2011-10-03.
  6. cinema (2011-09-03). "Actress bhavana is all set to make her bollywood debut. | Kottaka.com Blog". Kottaka.com. Archived from the original on 2011-10-04. Retrieved 2011-10-03.
  7. "Watch Making of Prithviraj, Nivin Pauly, Bhavana Starrer 'Ivide' [VIDEO]". International Business Times, India Edition. 30 March 2015.
  8. "Shyamaprasad gives artistes their space". The Times of India.
  9. "Bhavana Menon breaks her silence on sexual assault case; Mammootty, Mohanlal, Konkona show solidarity". The Economic Times. No. 11 January 2022. Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022. For the uninitiated, Menon was reportedly kidnapped, attacked and molested in Kochi in 2017 and she had named actor Dileep as the main accused ... the case happened in 2017, and actor Dileep was released from jail within two months
  10. Babu, Ramesh (10 July 2017). "Actress kidnapping case: Kerala superstar Dileep arrested on conspiracy charges". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022.
  11. Hiran, U. (10 July 2017). "Actor Dileep arrested in Malayalam actress abduction case". The Hindu (in Indian English). Archived from the original on 12 January 2022. Retrieved 23 January 2022.
  12. Tom, Disney (23 November 2017). "Dileep news: Exposing Dileep's affair led to actor's rape, says SIT". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022.
  13. Varier, Megha (3 October 2017). "After four attempts and 85 days in custody, Dileep gets bail in actor assault case". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022.
  14. "Actor Dileep, others appear before Crime Branch". The Indian Express (in ఇంగ్లీష్). Press Trust of India. 23 January 2022. Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022.
  15. "After Actor Bhavana's Sexual Assault Complaint, Kerala Mulls Law for Protecting Women in Cinema". Theswaddle.com. 17 March 2022. Archived from the original on 17 March 2022. Retrieved 7 April 2022.
  16. 1 2 "Survivor Bhavana Menon speaks out in alleged sexual assault case involving Malayalam actor Dileep". Gulf News. 10 January 2022. Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
  17. "Instagram". Instagram.com. Retrieved 25 June 2026.
  18. "Survivor Bhavana Menon speaks out in alleged sexual assault case involving Malayalam actor Dileep". Gulf News. 10 January 2022. Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
  19. "After Actor Bhavana's Sexual Assault Complaint, Kerala Mulls Law for Protecting Women in Cinema". Theswaddle.com. 17 March 2022. Archived from the original on 17 March 2022. Retrieved 7 April 2022.
  20. Bar & Bench (8 December 2025). "Kerala actress sexual assault case verdict today: LIVE UPDATES". Bar and Bench. Retrieved 8 December 2025.
  21. Pratap, Giti (8 December 2025). "Kerala court acquits Dileep in actress assault case but convicts Pulsar Suni, five others". Bar and Bench. Retrieved 8 December 2025.
  22. The Hindu Bureau (12 December 2025). "Actor rape case convicts get 20 years rigorous imprisonment". The Hindu. Retrieved 13 December 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=భావన_(నటి)&oldid=4914660" నుండి వెలికితీశారు