భావురావు కృష్ణజీ గైక్వాడ్
కర్మవీర్ దాదాసాహెబ్ గైక్వాడ్ | |
|---|---|
2002లో గైక్వాడ్ జ్ఞాపకార్థం వెలువడిన భారత తపాలా బిళ్ళ | |
| లోక్‌సభ సభ్యుడు | |
| In office 1957–1962 | |
| మహారాష్ట్ర నుండి రాజ్యసభ సభ్యుడు | |
| In office 1962–1968 | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | భౌరావ్ కృష్ణాజీ గైక్వాడ్ 15 October 1902 అంబే, నాశిక్ జిల్లా, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మహారాష్ట్ర, భారత్) |
| మరణం | 29 December 1971 (aged 69) విల్లింగ్‌డన్ హాస్పిటల్, న్యూఢిల్లీ |
| జాతీయత | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా |
| జీవిత భాగస్వామి | సీతాబాయి (వివాహం 1912 – మరణం 1968) గీతాబాయి (వివాహం 1921) |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
| నైపుణ్యం | సామాజిక కార్యకర్త |
భావురావు కృష్ణజీ గైక్వాడ్ (15 అక్టోబర్ 1902 – 29 డిసెంబర్ 1971) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఈయన్నే దాదాసాహెబ్ గైక్వాడ్ అని కూడా పిలుస్తారు.[1] రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడైన ఈయన, లోక్‌సభ (1957 - 1962), రాజ్యసభ (1962 - 1968) రెండింటిలోనూ సభ్యుడిగా పనిచేశారు.[2] మానవ హక్కుల నాయకుడు బి.ఆర్. అంబేద్కర్ కు ఈయన సన్నిహిత సహచరుడు, అనుచరుడు. మహారాష్ట్ర ప్రజలు ఈయనను కర్మవీర్ (కార్యశూరుడు) అనే బిరుదుతో గౌరవించగా, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. == జీవితం ==

గైక్వాడ్ 15 అక్టోబర్ 1902న మహారాష్ట్ర, నాశిక్ జిల్లా, దిండోరి తాలూకాలోని అంబే గ్రామంలో ఒక మహార్ కుటుంబంలో జన్మించారు.[3][4]
మత మార్పిడి
[మార్చు]గైక్వాడ్ 14 అక్టోబర్ 1956న నాగ్‌పూర్ లోని దీక్షాభూమిలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమక్షంలో బౌద్ధమతం స్వీకరించారు.[5] ఆ తర్వాత 7 డిసెంబర్ 1956న ముంబై లోని చైత్యభూమిలో వేలాది మందికి బుద్ధ ధమ్మ దీక్షను అందించారు.[5]
గుర్తింపు
[మార్చు]సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈయన పేరు మీద 'కర్మవీర్ దాదాసాహెబ్ గైక్వాడ్ సబలీకరణ్ & స్వాభిమాన్ యోజన'ను అమలు చేస్తోంది.[6]
భారత ప్రభుత్వం ఈయన గౌరవార్థం 2002లో ఒక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ Kshirsagar, Ramchandra (1994). Dalit Movement in India and its Leaders. M.D. Publications Pvt. pp. 214–217. ISBN 81-85880-43-3.
- ↑ "Alphabetical list of Rajyasabha members since 1952". Government of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 మార్చి 2009.
- ↑ Nimbalkar, Waman (2011). Letters by Dr. Babasaheb Ambedkar to Dadasaheb Gaikwad (in మరాఠీ and ఇంగ్లీష్). Nagpur: Prabodhan Prakashan. p. 518.
- ↑ Kshīrasāgara, Rāmacandra (1994). Dalit Movement in India and Its Leaders, 1857-1956 (in ఇంగ్లీష్). M.D. Publications Pvt. Ltd. ISBN 978-81-85880-43-3.
- 1 2 Nimbalkar, Waman (2011). Letters by Dr. Babasaheb Ambedkar to Dadasaheb Gaikwad (in మరాఠీ and ఇంగ్లీష్). Nagpur: Prabodhan Prakashan. p. 522.
- ↑ "Karmaveer Dadasaheb Gaikwad Sabalikaran & Swabhiman Yojana".
- ↑ "Bhaurao Krishnarao Gaikwad". Indianpost.com. 26 ఆగస్టు 2002. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 ఆగస్టు 2022.
బయటి లింకులు
[మార్చు]మూస:సామాజిక సేవారంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు *"ఈయనపై తీసిన డాక్యుమెంటరీ సమాచారం". the original నుండి 24 నవంబరు 2006 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 మార్చి 2009.
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- March 2019 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- August 2016 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- CS1 మరాఠీ-language sources (mr)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహారాష్ట్ర వ్యక్తులు