భాషా అభ్యాసన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనుష్యులు భాషా అభ్యసన (Language Acquisition) అను ప్రక్రియ ద్వారా ఒక భాషాను గ్రహించటం, అర్దం చేసుకోవటం, పదాలను ఉపయోగిచటం, వాక్యనిర్మాణం వంటివి చేయ్యటం నేర్చుకుంటారు.ఇతర ప్రాణులలా కాకుండా మానవులు భాషను అభ్యాసించటం, వాడటం, వ్యక్తీకరిచటం వంటీ విశిష్టమైన సామర్థ్యముగల వారు. సాధారణంగా మాతృభాష అభ్యసననే భాషా అభ్యాసం ప్రక్రియగా పరిగణిస్తారు; ఈ భాష అభ్యాసన పరిశోధనలో చిన్న పిల్లలు తమ మాతృభాష భాషను నేర్చుకునే తీరును పరిశోదిస్తారు.భాషా అభ్యాసన పరిశోధనలో ద్వితియ భాషా అభ్యాసనను (Second language Acquisition) వేరొక శాఖగా పరిగణిస్తారు. ఈ భాషా అభ్యాసనం అనే ప్రక్రియ మీద అనేకమైన పరిశోధనలు జరిగాయి. భాషాశాస్త్రం (Linguistics) భాషా అభ్యాసనను ఒక ప్రత్యేక విభాగాంగా పరిగణిస్తారు.

A child

చరిత్ర

[మార్చు]

మానవులకు వున్న ఈ భాషా అభ్యాసన సామర్ధ్యం దశాబ్దాలుగా అనేకులకు ఆసక్తికరమైన అంశం. క్రిస్తు పూర్వం 7 వ శతాబ్దానికి చెందిన Psammeticus అనే రాజు భాష మనుష్యులకు అంతర్గికంగా వుంటుందని, వారు తమ చుట్టూ ఉండే పరిసరాలకు దూరంగా ఎటువంటి భాషా పరమైన ప్రభావానికి దూరంగా వున్నట్లైతే వారు లోపలి అంతర్గిక భాష అభివ్రద్ది చేందుతుందని విశ్వసంచేవారు.ఈ నమ్మకాన్ని ఆధారం చేసుకుని ఆయన ఇద్దరు చిన్నపిల్లలను ప్రత్యకపరచి ఉంచారు. ఆ పిల్లలిద్దరిని ఎటువంటి భాషా ప్రభావం లేకుండా ఒక ప్రత్యక స్దలంలో ఉంచారు.ఆ పిల్లలు ఇద్దరు Phyrgian భాషాలోని కోన్ని పదాలను, ప్రస్తుత turkey భాషాలోని కొన్ని మాటలు ఉపయోగంచినదానిని బట్టి ఆ భాషే ఆదిమ భాషగా భావించారు.

భాషా అభ్యాసన - సిద్దాంతాలు

[మార్చు]

భాషాశాస్త్రవేత్తలు వివిధ భాషల చిన్న పిల్లలపై పరిశోధనలు జరిపి అనేక సిద్దాంతాలను ప్రతిపాదంచారు; ఈసిద్దాంతాలలో వేరు వేరు భిన్నాభిప్రాయలు ఉన్నాయి. నిదర్శనపుర్వక (Empiricists) ప్రతిపాదకులు భాష నర్చ్ర (nurture) ద్వారా అనగా పిల్లలు పుట్టిన అప్పుడు ఎటువంటి భాషా సంబంధిత జ్ఞానము లేకుండా పుట్టి తరువాత తమ పరిసరాల ద్వారా భాషాను నేర్చుకుంటారు అని నమ్ముతారు. బిహేవియర్జిం (Psychology) సిద్దాంత ప్రతిపాదకులైన బి.ఫ్.స్క్నిర్ (B.F.Skinner) భాష మనలో ఒక ప్రయోగ నియమం (operant conditioning) ఉంటుందని అది మనకు వచ్చిన ప్రేపకాన్ని అనగా ఒక పిల్లవాడు మాట్లాడగా వచ్చిన స్పందనను ఆధారం చేసుకుని భాషను నేర్చుకుంటాడఅని ప్రతిపాదించారు. ఈ సిద్దాంత ప్రకారం భాషా అభ్యాసనపై పరిసరాల ప్రభావం వుంటుంది అని అనగా వర్బ్ల్ బిహేవియర్ అయిన భాషా పరిసరాలలో మనకు లభించే ప్రేపకం (stimulus) ఆధారంగా వుంటుంది అనీ ప్రతిపాదంచారు.ఈ సిద్దాంతం ప్రయోగ-ఫలితాల-నిరుపణల పై నిర్మితమైనది కాక కేవలం ఒక సిద్దాంత యుక్తంగా వుండటం వల్ల అనేక భాషాశాస్త్రవేత్తలచే విమర్శకు గురిఅయింది. జెనరేటివ్ తత్వ భాషాశాస్త్రవేత్త నొమ్ చొంస్కి (Noam Chomsky) బి.ఫ్.స్క్నిర్ యొక్క బిహేవియర్జిం సిద్దాంతాన్ని తివ్రంగా విమర్శంచారు.ఈ ప్రయోగ నియమం (operant conditioning) బట్టి ఆలోచిస్తే మానవుల భాషా సామర్ద్య్లాలో అతి ముఖ్యమైన క్రియాశిలతత్వానికి ఎది కారణమొ నిరుపించలేము. నొం చొంస్కి సిద్దాంత ప్రకారం ప్రతి శిశూవు మస్తిష్కము/మెదడులో ఒక ప్రత్యేక సామర్థ్యముతో / అంతర్గిక జ్ఞానంతో (Innate knowledge) పుట్టతారని ప్రతిపాదంచారు; అనగా వారు మెదడులో ఏ జ్ఞానం లేకుండా కాక భాషను నేర్చుకొగల సమర్థతతో పుట్టి తమ పరిసరాలలో లభిస్తున్న భాషా సంభదిత వనరులను బట్టి ఆ భాషాను నేర్చుకుంటారని ప్ర్రతిపాదించారు. ఈ నొం చొంస్కీ సిద్దాతం భాషాశాస్త్త్ర్రంలో ప్రసిద్ధి చేందింది. ఇవే కాక మేచ్యురేషన్ (Maturation), కంటిన్యుటి (continuity) అను సిద్దాంతాలు కూడా ప్రతిపాదంచబడ్డాయి. విటిలో మేచ్యురేషన్ సిద్దాంతం నొమ్ చొంస్కి యొక్క సిద్దాంతంతో ఏకిభవించగా, కంటిన్యుటి సిద్దాంత ప్రతిపాదకుడైన పింకర్ మాత్రం ఆ సిద్దాంతాన్ని వ్యతిరేకంగా కంటిన్యుటి (continuity) ని ప్రతిపాదించారు.[1]

Child acquisition

మూలాలు

[మార్చు]
  1. Tomasello, Michael (2003). Constructing a language: a usage-based theory of language acquisition. Cambridge: Harvard University Press. ISBN 978-0-674-01030-7. OCLC 62782600.