భాష్యం రామకృష్ణ
| భాష్యం రామకృష్ణ | |||
| నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1969 మార్చి 1 ఎనికపాడు, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
| తల్లిదండ్రులు | రామారావు, పేరమ్మ | ||
| నివాసం | ఆంధ్రప్రదేశ్ | ||
| వృత్తి | విద్యావేత్త, రాజకీయ నాయకుడు | ||
భాష్యం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయనను 2026 జూన్ 6న తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు.[1][2][3][4][5][6]
బాల్యం
[మార్చు]పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎనికపాడు ఆయన స్వగ్రమాం. సామాన్య రైతు కుటుంబంలో భాష్యం రామారావు, పేరమ్మ దంపతులకు 1969 మార్చి 1న రామకృష్ణ జన్మించారు.[7]
విద్య,కెరీర్
[మార్చు]బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి గుంటూరులోని ప్రైవేటు స్కూలులో లెక్కల మాస్టారిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 1983 గుంటూరులోనే భాష్యం విద్యాసంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. భాష్యం విద్యాసంస్థలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 163 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 1.60 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యా రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ పాఠశాల అవార్డు, టీవీ 5 లీడర్‌షిప్ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆయన్ను వరించాయి.[8]
సామాజిక సేవ
[మార్చు]తన తల్లి భాష్యం పేరమ్మ జ్ఞాపకార్థం 2009లో ఒక చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నదాన కార్యక్రమానికి పలు దఫాలుగా కోట్లాది రూపాయలు విరాళంగా అందించారు. 2017లో రూ. 1 కోటి, 2025-26 సంవత్సరానికి గాను రూ. 1.32 కోట్లు విరాళంగా ప్రకటించి తన భక్తిని, దాన గుణాన్ని చాటుకున్నారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "లెక్కల మాస్టారు పెద్దల సభలోకి." Eenadu. 7 June 2026. the original నుండి 7 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2026.
- ↑ "రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులు ఖరారు". Andhrajyothy. 7 June 2026. the original నుండి 7 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2026.
- ↑ "బీసీల నుంచి విజయ్‌కి". Eenadu. 7 June 2026. the original నుండి 7 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2026.
- ↑ "TDP announces three candidates for Rajya Sabha elections" (in Indian English). The Hindu. 7 June 2026. the original నుండి 7 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2026.
- ↑ "TD Clears Three as Party's Rajya Sabha Candidates" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 7 June 2026. the original నుండి 7 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2026.
- ↑ "Sana Satish, Bhashyam Ramakrishna, Chintakayala Vijay are TDP's Rajya Sabha picks". The Times of India. 7 June 2026. the original నుండి 7 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2026.
- ↑ TeluguOne (2026-06-07). "పెద్దల సభకు లెక్కల మాస్టారు భాష్యం రామకృష్ణ". TeluguOne News (in Telugu). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-06-07.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - 1 2 "తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!". ap7am.com. 2026-06-07. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-06-07.