Jump to content

భిన్నేక తుంగ్గల్ ఇకా

వికీపీడియా నుండి
(భిన్నేక తుంగల్ ఇకా నుండి దారిమార్పు చెందింది)
గరుడ పంచశీలపై రాయబడిన భిన్నేక తుంగల్ ఇకా(భిన్నత్వంలో ఏకత్వం)

భిన్నేక తుంగల్ ఇకా(భిన్నత్వంలో ఏకత్వం) ఇండోనేషియా యొక్క అధికారక జాతీయ నినాదం. ఇది పాత జావా భాషకు సంబంధిచిన వాక్యం. దీని అర్థం భిన్నత్వంలో ఏకత్వం.[1] ఇది ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ పంచశీల పై రాసి ఉంటుంది.  ఇది ఇండోనేషియా రాజ్యాంగపు 36ఎ(36A) అధికరణలో ప్రత్యేకంగా గుర్తించబడింది. గరుడ అనే పేరు విష్ణుమూర్తి యొక్క వాహనము, భౌద్ధ మత బంగారు పక్షి రాజం అయిన గరుడ(గరుత్మంతుడు) నుండి తీసుకోబడింది.

ఇది పాత జావా భాషలో రాసిన సుతసోమ కావ్యం(జావా: సుతసోమ కకావిన్) నుండి తీసుకోబడిన ఒక వాక్యం. ఇది ఎంపు తంత్యులర్(ఎంపు ఒక గౌరవ వాచకం[2]) చే రచించబడింది. ఇది 14వ శతాబ్ధపు మజాపహిత్ రాజ్యంలో, రాజసానగార హయాం లో రచించబడింది. ఈ కావ్యం ఇతిహాస పద్యాలు ఛందస్సు లో ఉంటాయి.

హిందువుల (ముఖ్యంగా శైవులు), బౌద్ధుల మధ్య సహనాన్ని ప్రభోదించడం చేత ఇది ముఖ్యమైన కావ్యంగా భావించబడుతుంది.[3]

పూర్తి వచనము

[మార్చు]

అసలు పద్యం

[మార్చు]

ఇది 139 అధ్యాయంలోని, 5వ పద్యము

(తెలుగు లిప్యంతరీకరణ)

ర్వనేక ధాతు వినువుస్ బుద్ధ విశ్వా,
భిన్నేకి రక్వ రింగ్ అపన్ కేన పర్వానొసేన్,
మణ్గ్కా న్గ్ జీనాత్వ కలవాన్ శివతత్వ తుంగ్గల్,
భిన్నేక తుంగల్ ఇకా తన్ హనా ధర్మ మంగ్ర్వా.

(జావా లిపి)

Rwâneka dhâtu winuwus Buddha Wiswa,
Bhinnêki rakwa ring apan kena parwanosen,
Mangka ng Jinatwa kalawan Siwatatwa tunggal,
Bhinnêka tunggal ika tan hana dharma mangrwa.

అనువాదం

[మార్చు]

ప్రసిద్ధమైన శివుడు, బుద్ధుడు ఇరువురని అంటారు.
వారు ఇద్దరే, కానీ వారి మధ్య బేధంబొక చూపుతో గుర్తించనేల సాధ్యం,
బుద్ధతత్త్వం శివత్వం ఒకటే కాబట్టి.
వారు ఇద్దరే, కానీ ఒక్కలాంటివారే, సత్యంబుబేధములేదు

సోయ్విటో సంతోసో యొక్క ఆంగ్ల వ్యాఖ్యానం యొక్క తెలుగీకరణ.[4]

ఇవి కుడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Santoso, Soewito Sutasoma, a Study in Old Javanese Wajrayana 1975:578.
  2. http://www.wordsense.eu/mpu/
  3. Depkumham.go.id Archived 12 ఫిబ్రవరి 2010 at the Wayback MachineWayback MachineArchived 12 ఫిబ్రవరి 2010 at the Wayback Machine
  4. Santoso, Soewito Sutasoma, a Study in Old Javanese Wajrayana 1975:578. New Delhi: International Academy of Culture