Coordinates: 25°21′N 74°38′E / 25.35°N 74.63°E / 25.35; 74.63

భిల్వార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భిల్వార
భిల్వార is located in Rajasthan
భిల్వార
భిల్వార
భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్ర పటం
భిల్వార is located in India
భిల్వార
భిల్వార
భిల్వార (India)
Coordinates: 25°21′N 74°38′E / 25.35°N 74.63°E / 25.35; 74.63
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాభిల్వార
Area
 • Total69 km2 (27 sq mi)
 • Rank7
Elevation
421 మీ (1,381 అ.)
Population
 (2011)[1]
 • Total3,59,483
 • Density5,200/km2 (13,000/sq mi)
భాషలు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
311001
ISO 3166 codeRJ-IN
Vehicle registrationRJ-06
లింగ నిష్పత్తి1000:915[3]

భిల్వార, భారతదేశంలోని, రాజస్థాన్ రాష్ట్రం, మేవార్ విభాగంలోని ఒక నగరం. భిల్వార జిల్లాకు ఇది ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది వస్త్రపరిశ్రమకు పేరొందిన నగరం.[4] దీనిని 'టెక్స్‌టైల్ సిటీ' అని పిలుస్తారు.[5]

చరిత్ర[మార్చు]

సా.శ. 5,012 నుండి సా.శ.పూ 200,000 సంవత్సరాల నాటి రాతి యుగం సాధనాలు రాష్ట్రంలోని బుండి, భిల్వారా ప్రాంతంలో కనుగొనబడ్డాయి.ఆధారాల ప్రకారం, భిల్వార నగరంలో ఒక టంకశాల ఉంది.ఇక్కడ 'భిలాడి' అని పిలువబడే నాణేలు ముద్రించబడ్డాయి.దీనికి ఒక తెగ నుండి భిల్వార అనే పేరు వచ్చింది.మొఘల్ సామ్రాజ్యం రాజు అక్బర్ భిల్వార ప్రాంతంలో నివసించిన భీల్ అని పిలువబడే ఒక తెగ మహారాణా ప్రతాప్కు సహాయం చేసింది.ఈ ప్రాంతం భీల్ + బద (భీల్ ప్రాంతం) భిల్వారా అని పిలువబడింది.ఇది రాజస్థాన్ ప్రధాన నగరాల్లో ఒకటి. దేశంలో భిల్వారా వస్త్ర నగరంగా గుర్తింబడింది.

11 వ శతాబ్దం మధ్యలో కృష్ణ రాధా మందిరం (ఆలయం) ను నిర్మించడం ద్వారా ఈ పట్టణ పురాతన భాగం స్థాపించబడింది.దీనిని బద మందిరం అని పిలుస్తారు.పురాణ భిల్వారా (పట్వారీ మొహల్లా, జునావాస్, మాణిక్య నగర్ మలిఖేరా) అని పిలువబడే ప్రాంతం.

చిత్ర‌గఢ్ పై దాడి చేసినప్పుడు భిల్వరకు దగ్గరగా ఉన్న మండలం అనే పట్టణం, మొఘలులకు సైనిక స్థావరంగా పనిచేసినట్లు చారిత్రక రికార్డులు చూపిస్తున్నాయి.వారి సైనిక స్థావర శిథిలాలు చూడవచ్చు.మండలం పట్టణం లోని ఒక చిన్న మట్టిదిబ్బపై నిర్మించిన పహారా గోపురం ప్రదేశంలో దేవి ఆలయం నిర్మించబడింది.

భౌగోళికం[మార్చు]

భిల్వారా 25°21′35″N 74°39′10″E / 25.359854°N 74.652791°E / 25.359854; 74.652791 వద్ద ఉంది.[6] ఇది 421 మీటర్లు (1381 అ.లు) సగటు ఎత్తులో ఉంది. దీనికి ఉత్తరాన అజ్మీర్, దక్షిణాన చిత్రగఢ్, ఉదయపూర్ సరిహద్దులగా ఉన్నాయి.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం,[7] భిల్వారా నగర జనాభా 359,483. మందికాగా, వారిలో పురుష జనాభా 52%మంది ఉన్నారు.48% మంది స్త్రీల జనాభా ఉన్నారు. ఆరు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు భిల్వార మొత్తం జనాభాలో 13%మంది ఉన్నారు.[8]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

ఇక్కడి ప్రధాన పరిశ్రమ దుస్తులు లేదా వస్త్రాలు తయారీ. పట్టణంలో 850 కి పైగా తయారీ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ప్యాంటులో ఉపయోగించే కృత్రిమ వస్త్రాలు తయారీ ప్రధాన వస్త్ర ఉత్పత్తి. ఇది పారిశ్రామికవేత్త సంపత్మల్ లోధా యాజమాన్యంలోని మేవార్ టెక్స్‌టైల్ మిల్స్ అనే స్పిన్నింగ్ సంస్థతో అల్లడం ప్రారంభమైంది.ఆ తరువాత శ్రీ లక్ష్మి నివాస్ జూన్ జూన్వాలా 1961 లో భిల్వారలో కృత్రిమ వస్త్ర తయారీ కోసం తన మొదటి విభాగాన్ని ప్రారంభించాడు.

మౌళిక సదుపాయాలు[మార్చు]

రహదారుల అనుసంధానం[మార్చు]

జాతీయ రహదారి 79 నాలుగు వరసలతో ఉన్నమరొక జాతీయ రహదారి 76 తూర్పు, పశ్చిమ కారిడార్ (నాలుగు వరసలగల) భిల్వార జిల్లా గుండా వెళుతుంది.దీని మొత్తం పొడవు 120 కి.మీ. ఉంది

జాతీయ రహదారి 758 (కోట-లాడ్పురా-భిల్వార-గంగాపూర్-రాజ్‌సమంద్-ఉదయపూర్) జిల్లాల గుండా వెళుతుంది.ఈ రహదారి పొడవు 146 కి.మీ.ఇతర జాతీయ రహదారి 148 డి (భీమ్-గులాబ్‌పురా-యునియారా) కూడా గుండా వెళుతుంది

నగరం నడిబొడ్డున గల ప్రభుత్వ బస్సు డిపో నుండి, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల అన్ని ముఖ్యమైన నగరాలకు అనుసంధానించబడి ఉంది. చాలా ప్రైవేట్ సర్వీసు ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. భిల్వార నుండి రాజధాని నగరం జైపూర్‌కు రహదారి ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. దీని దూరం 253 కి.మీ.[9]

రైలు రవాణా[మార్చు]

ఒక బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ అజ్మీర్, జోధ్పూర్, జైపూర్, కోటా, ఇండోర్ జంక్షన్, ఉజ్జయినీ, ఢిల్లీ,, ఆగ్రా, లక్నో, కాన్పూర్, అలహాబాద్, పాట్నా, కోలకతా, ఉదయపూర్, రత్లాం, వడోదర, సూరత్, ముంబై, హైదరాబాద్ మొదలగు జిల్లాల గుండా వెళుతుంది. (160 కి.మీ) దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలకు ప్రయాణించటానికి కనెక్టివిటీని అందించడానికి 160 కి.మీ దూరంలో ఉన్న కోట అనుకూలమైన రైల్వే స్టేషన్. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానం కోసం సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ / జంక్షన్లలో అజ్మీర్ (130 కి.మీ) దూరంలో ఉంది.

వాయు రవాణా[మార్చు]

సమీప విమానాశ్రయం డాబోక్ - ఉదయపూర్ (165 కి.మీ) దూరంలో ఉంది.రహదారి ద్వారా సుమారు గం. 2.50ని.ల సమయం పట్టింది.ఇతర సమీప విమానాశ్రయం జైపూర్ (251 కి.మీ) దూరంలో ఉంది. రహదారి ద్వారా దీనికి పట్టే సమయం సుమారు 4 గంటలు పట్టింది.జైపూర్‌కు ముందు కిషన్‌గఢ్ విమానాశ్రయం అనే పేరుతో కొత్త విమానాశ్రయం ప్రారంభమైంది.

సంస్కృతి[మార్చు]

గ్రేట్ ఇండియన్ సూక్ష్మ కళాకారుడు బద్రి లాల్ చిత్రకర్ భారతీయ సూక్ష్మ కళ కోసం అంతర్జాతీయ పటాలలో నగరాన్ని హైలైట్ చేశారు. భిల్వార 'ఫాడ్ పెయింటింగ్స్' కు పేరొందింది.ఇవి సహజంగా లభ్యమయ్యే రంగులను ఉపయోగించి వస్త్రంపై సాంప్రదాయక కథల వర్ణన చేస్తారు భిల్వార ఫడ్ ఆర్టిస్ట్ శ్రీ లాల్ జోషి భారతదేశం మొత్తంలో ఫడ్ పెయింటింగ్ తయారీ, నిల్వ చేయడంలో ఎంతో కృషి చేశారు.భిల్వారలోని ఆకర్షణలలో బాద్నోర్ కోట, హర్ని మహాదేవ్ ఆలయం, జోగానియా మాతా ఆలయం, క్యారా కే బాలాజీ, సంగనేర్ కోట, మేజా ఆనకట్ట, పూర్ ఉడాన్ ఛత్రి ఉన్నాయి.[10]

చదువు[మార్చు]

భిల్వారలో రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల ఉంది.దీనిని ఎంఎల్ఇ టెక్స్‌టైల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ అని పిలుస్తారు. ఇది టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌తో సహా ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుంది. రాజ్‌మాతా విజయ రాజే సింధియా మెడికల్ కాలేజీ అనే పేరుగల వైద్య కళాశాల కూడా ఉంది.[11]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Bhilwara City" (PDF).
 2. Bhilwara-Rajasthan. "Location & Area". bhilwara.rajasthan.gov.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-11-17.
 3. Bhilwara city population Census, 2011
 4. Bhilwara-Rajasthan. "Home". www.bhilwara.rajasthan.gov.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-07-15.
 5. kindness, walls of (20 December 2015). "Iranians spontaneously created 'walls of kindness' to help the homeless". BBC Trending. No. What's popular and why. BBC UK. BBC. Retrieved 1 January 2016.
 6. Falling Rain Genomics, Inc – Bhilwara
 7. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
 8. 2011 Census information for Bhilwara, Population Census India
 9. http://www.roaddistance.in/rajasthan/jaipur-to-bhilwara-distance/by-road/
 10. Sengar, Resham. "Exploring the hidden treasures of Bhilwara in Rajasthan". Times of India Travel. Retrieved 2020-03-22.
 11. "Churu Medical College named after Deendayal, to start from Aug 28". The Times of India. 21 April 2018. Retrieved 24 April 2020.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=భిల్వార&oldid=3149317" నుండి వెలికితీశారు