భీమా ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం-2, కాలువ
రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం-2 కేంద్రం

భీమా ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులలో ఒకటి. దీనికే ' రాజీవ్ ఎత్తిపోతల పథకం ' అని కూడా పేరు.

పూర్వరంగం[మార్చు]

నిజాం రాష్ట్రంలో అప్పటి గుల్బర్గా జిల్లాలోని, ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా, మాగనూర్ మండలంలోని తంగిడి గ్రామం దగ్గర భీమా నది పై ప్రాజెక్టు నిర్మించాలని యోచించారు. కాని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం, తదనంతర పరిణామాలతో కర్ణాటక ప్రభుత్వం అంగీకరించకపోవటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయినప్పటికి కృష్ణానది నుండి 20 టి.ఎం.సి.ల నీటిని వాడుకోవడానికి మాత్రం కేంద్ర జలవనరుల సంఘం అనుమతిని ఇచ్చింది. ఆ అనుమతితో రూపుదాల్చినదే ఈ భీమా ప్రాజెక్టు[1]

ప్రాజెక్టు స్వరూపం[మార్చు]

ఈ ప్రాజెక్టు కింద రెండు లిఫ్టులు, ఐదు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటుచేశారు.

  • ' మొదటి లిఫ్ట్  : దీనిని మఖ్తల్ మండలం, పంచదేవుపాడు గ్రామం దగ్గర ఏర్పాటుచేశారు. జూరాల జలాశయం నుండి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లలోకి నీటిని తరలిస్తున్నారు. ఈ లిఫ్ట్ కింద రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. అవి...
  1. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 64,200 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఏర్పాటుచేశారు.
  2. భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 46,800 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఏర్పాటుచేశారు.
  • ' రెండవ లిఫ్ట్  : దీనిని జూరాల ఎడమ కాలువ నీటిని వినియోగించి వనపర్తి ప్రాంతంలోని గ్రామమైన రామన్ పాడ్ దగ్గర ఏర్పాటుచేశారు. ఈ లిఫ్ట్ కింద మూడు రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. అవి...

1. ఎనుకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 14,000 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఏర్పాటుచేశారు. 2. శంకరసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 57,000 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఏర్పాటుచేశారు. 3. రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: ఈ రిజర్వాయర్ కింద 21,000 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఏర్పాటుచేశారు.

చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 17