భీమ్స్‌ సిసిరోలియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమ్స్‌ సిసిరోలియో
Bheems Ceciroleo.jpg
భీమ్స్‌ సిసిరోలియో
వ్యక్తిగత సమాచారం
జననంజాలోర్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు
క్రియాశీల కాలం2003–ప్రస్తుతం

భీమ్స్‌ సిసిరోలియో తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు.[1][2] ఆయధం సినిమాలోని ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో పాటల రచయితగా గుర్తింపుపొందిన ఈయన 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు.

జననం[మార్చు]

భీమ్స్‌ సిసిరోలియో రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో జన్మించాడు.

సినిమారంగం[మార్చు]

2003లో వచ్చిన ఆయుధం సినిమాకోసం ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2011లో సీమ టపాకాయ్ సినిమాలో ధీరే ధీరే దిల్లే పాటలను రాశాడు. 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాకు తొలిసారిగా సంగీతం అందించాడు.

సంగీతం అందించిన చిత్రాలు[మార్చు]

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష
1 2012 నువ్వా నేనా తెలుగు
2 2013 కెవ్వు కేక తెలుగు
3 2014 గాలిపటం తెలుగు
4 2014 జోరు తెలుగు
5 2014 అలా ఎలా? తెలుగు
6 2015 మన కుర్రాళ్ళే తెలుగు
7 2015 బెంగాల్ టైగర్[3] తెలుగు
8 2017 ఏంజెల్ తెలుగు
9 2017 నక్షత్రం తెలుగు
10 2017 పిఎస్‌వి గరుడ వేగ తెలుగు
11 2018 పేపర్ బాయ్[4] తెలుగు
12 2019 క్రేజీ క్రేజీ ఫీలింగ్ తెలుగు
13 2019 సాఫ్ట్‌వేర్ సుధీర్ తెలుగు[5]

పాటలు రాసిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు భాష ఇతర వివరాలు
2014 జోరు తెలుగు కోడంటే కోడి
2014 ఆగడు తెలుగు జంక్షన్ లో భాస్కరభట్ల రవికుమార్ తో కలిసి[6]
2011 సీమ టపాకాయ్ తెలుగు ధీరే ధీరే దిల్లే
2003 ఆయుధం తెలుగు ఒయ్ రాజు పాట

మూలాలు[మార్చు]

  1. "Bheems Ceciroleo, music director". Movie Buff. 3 January 2017. Archived from the original on 23 December 2015. Retrieved 22 June 2019.
  2. "Bheems Ceciroleo Filmography". filmibeat. 3 January 2017. Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
  3. Times of India, Telugu (11 December 2018). "3 years of 'Bengal Tiger': Let's reminisce its glorious facts". Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
  4. The Hans India, Cinema (31 August 2018). "Paper Boy Movie Review & Rating". Vyas null. Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
  5. "I imitated both Rajinikanth and Pawan Kalyan in 'Software Sudheer': Sudigali Sudheer". Times of India. 8 November 2019. Retrieved 28 July 2020.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-21. Retrieved 2019-06-21.

ఇతర లంకెలు[మార్చు]