భీశెట్టి వెంకట సత్యవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీశెట్టి వెంకట సత్యవతి
పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు ముత్తంసెట్టి శ్రీనివాసరావు
నియోజకవర్గం అనకాపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-04-28) 1966 ఏప్రిల్ 28 (వయసు 57)
ఎస్.రాయవరం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జగన్నాధరావు , దేముళ్ళమ్మ
జీవిత భాగస్వామి డాక్టర్‌ కాండ్రేగుల విష్ణుమూర్తి
సంతానం డా.యశ్వంత్‌ , డా.పావని
నివాసం అనకాపల్లి
పూర్వ విద్యార్థి ఆంధ్ర మెడికల్ కాలేజీ , విశాఖపట్నం
వృత్తి వైద్యురాలు, రాజకీయ నాయకురాలు

భీశెట్టి వెంకట సత్యవతి (కాండ్రేగుల సత్యవతి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎంపీగా గెలిచింది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

భీశెట్టి వెంకట సత్యవతి 1966 ఏప్రిల్ 28న విశాఖపట్నం జిల్లా, యస్. రాయవరంలో జగన్నాధరావు, దేముళ్ళమ్మ దంపతులకు జన్మించింది. ఆమె విశాఖపట్నం లోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ (గైనకాలజిస్ట్‌) పూర్తి చేసింది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

భీశెట్టి వెంకట సత్యవతి 2019 జనవరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అనకాపల్లి నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అడారి ఆనంద్ పై 89192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయింది. ఆమె ప్రస్తుతం పార్లమెంట్ లో బొగ్గు గనుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, కేంద్ర విదేశాంగ శాఖ కాన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలిగా ఉంది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Anakapalli Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.