అక్షాంశ రేఖాంశాలు: 17°36′37″N 78°48′56″E / 17.6101927°N 78.8156113°E / 17.6101927; 78.8156113

భువనగిరి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువనగిరి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
భువనగిరి పురపాలకసంఘం is located in తెలంగాణ
భువనగిరి పురపాలకసంఘం
భువనగిరి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°36′37″N 78°48′56″E / 17.6101927°N 78.8156113°E / 17.6101927; 78.8156113
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం భువనగిరి
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ అన్నబోయిన ఆంజనేయులు
 - వైస్ చైర్‌పర్సన్‌ చింతల కిష్టయ్య
జనాభా (2011)
 - మొత్తం 59,844
 - పురుషుల సంఖ్య 30,265
 - స్త్రీల సంఖ్య 29,579
 - గృహాల సంఖ్య 12,165
పిన్ కోడ్ - 508116
ఎస్.టి.డి కోడ్ - 08685
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

భువనగిరి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం భువనగిరి పట్టణం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయితీ.[2]

చరిత్ర, ఏర్పాటు

[మార్చు]

ఈ పట్టణం 1910వ సంవత్సరంలో నగరపాలక సంస్థగా ఏర్పడింది. తదనంతరం 1952 సంవత్సరంలో పురపాలకసంఘంగా ఏర్పడింది.

భౌగోళికం

[మార్చు]

ఇది 17° N 78° E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాయగిరి, పగిడిపల్లి, బొమ్మాయిపల్లి గ్రామాలు పురపాలకసంఘంలో విలీనం అయ్యాయి. దీని విస్తీర్ణం 76.537 చదరపు కిలోమీటర్లు ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 48 కిలోమీటర్ల దూరంలో, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో మొత్తం 12,165 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరిధిలో ఉన్న జనాభా మొత్తం 59,844 మంది కాగా, అందులో 30,265 మంది పురుషులు, 29,579 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 35 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం అన్నబోయిన ఆంజనేయులు చైర్‌పర్సన్‌గా, చింతల కిష్టయ్య వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
 1. కుశంగల ఎల్లమ్మ
 2. అన్నబోయిన ఆంజనేయులు (చైర్‌పర్సన్‌)
 3. చింతల కిష్టయ్య (వైస్ చైర్‌పర్సన్‌)
 4. నాయిని అరుణ
 5. అబోతుల కిరణ్ కుమార్
 6. తుమ్మల అనురాధ
 7. దిడ్డికాడి భగత్
 8. పంగరెక్క స్వామి
 9. సుమ నల్లమాస
 10. పోత్నాక్ ప్రమోద్ కుమార్
 11. జిట్టా వేణుగోపాల్ రెడ్డి
 12. ఉదారీ లక్ష్మి
 13. గుండెగల్ల అంజమ్మ
 14. నాజియా రహమాన్
 15. కడారి ఉమాదేవి వినోద్ కుమార్
 16. చెన్న స్వాతి
 17. అందె శంకర్
 18. వడిచర్ల లక్ష్మి
 19. పచ్చల హేమలత
 20. ఉదయగిరి విజయ్ కుమార్
 21. బొర్రా రాకేష్
 22. పడిగెల రేణుక
 23. రత్నపురం బలరాం
 24. మాయ దశరథ
 25. ఈరపాక నర్సింహ
 26. నజీమా నస్రీన్
 27. కైరంకొండ వెంకటేశం
 28. పోతంశెట్టి వెంకటేశ్వర్లు
 29. ఖాజా అజీమ్ ఉద్దీన్
 30. వెంకట్ నర్సింగ్ నాయక్ బనోత్
 31. గోమారి సుధాకర్ రెడ్డి
 32. అవంచిక క్రాంతి
 33. కొల్ల దుర్గాభవాని
 34. తంగళ్ళపల్లి శ్రీవాణి

మూలాలు

[మార్చు]
 1. Bhongiri Municipality. "Bhongiri Municipality". www.bhongirmunicipality.telangana.gov.in. Retrieved 3 March 2021.
 2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 3 March 2021.
 3. Bhongiri Municipality. "Basic Information of Municipality, Bhongiri Municipality". bhongirmunicipality.telangana.gov.in. Retrieved 3 March 2021.
 4. Bhongiri Municipality. "Council, Bhongiri Municipality". www.bhongirmunicipality.telangana.gov.in. Retrieved 3 March 2021.
 5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 3 March 2021.
 6. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 3 March 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]