భువన్ షోమ్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువన్ షోమ్
Bhuvan Shome Movie DVD Cover.jpeg
భువన్ షోమ్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంమృణాళ్ సేన్
నిర్మాతమృణాళ్ సేన్ ప్రొడక్షన్
రచనబాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్
నటులుఉత్పల్ దత్
సుహాసిని ములే
వ్యాఖ్యానంఅమితాబ్ బచ్చన్
సంగీతంవిజయ్ రాఘవ్ రావు
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
విడుదల
12 మే 1969 (1969-05-12)
నిడివి
96 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

భువన్ షోమ్ 1969, మే 12న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్ రచించిన బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఉత్పల్ దత్, సుహాసిని ములే నటించారు. 1969 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్), ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.[1]

నటవర్గం[మార్చు]

  • ఉత్పల్ దత్
  • సుహాసిని ములే
  • శేఖర్ ఛటర్జీ
  • సాధు మెహర్
  • పున్య దాస్
  • రోచక్ పండిట్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: మృణాళ్ సేన్
  • నిర్మాత: మృణాళ్ సేన్ ప్రొడక్షన్
  • రచన: బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్
  • వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్
  • సంగీతం: విజయ్ రాఘవ్ రావు
  • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్

అవార్డులు[మార్చు]

  • 1969 జాతీయ చలనచిత్ర అవార్డులు
  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్)
  3. ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్)

ఇతర వివరాలు[మార్చు]

  1. ఇది మృణాళ్ సేన్ తొలి హిందీ చిత్రం.
  2. ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గాత్రాన్ని అందించాడు.[2][3]
  3. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇండియన్ ఆర్ట్ సినిమా లేదా న్యూవేవ్ సినిమాకు నాంది పలికింది.
  4. దైనందిన జీవితంలో తారసపడే పాత్రలు, సంఘటనలతో కూడా సినిమాలు నిర్మించి వాటిని కేవలం అవార్డులకే పరిమితం చేయకుండా ప్రేక్షకుల మన్ననలు పొందేలా తీర్చిదిద్దవచ్చని ఈ చిత్రం నిరూపించింది.[1]
  5. ఆధునిక భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా గుర్తించబడింది.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (31 December 2018). "సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం". మూలం నుండి 7 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2019. Cite news requires |newspaper= (help)
  2. ఆంధ్రజ్యోతి, సంపాదకీయం (2 January 2019). "వెండితెరపై సామాజిక వ్యాఖ్యాత". మూలం నుండి 7 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2019. Cite news requires |newspaper= (help)
  3. "Before stardom: Amitabh Bachchan's drudge years are a study in perseverance and persona building". Cite web requires |website= (help)
  4. Mrinal Sen ucla

ఇతర లంకెలు[మార్చు]