భూపతిరాజు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పరిచయం[మార్చు]
భూపతిరాజు ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రం వారి ఇంటి పేర్లలో ఒక ఇంటి పేరు. చంద్రవంశానికి చెందిన ధనుంజయ గోత్రీకులకు పూర్వీకులు గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో ఉన్న ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని పలు ప్రాంతాల్ని పాలించిన ధరణికోట రాజులు అని, తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు ధరణికోట సామ్రాజ్యాన్ని స్థాపించాడని ప్రముఖ చరిత్రకారుడైన శ్రీ బుద్ధరాజు వరహాలరాజు వ్రాసిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అను పుస్తకంలో వ్రాయబడినది. ఈస్ట్ ఇండియా కంపెనీవారు పరిపాలించు కాలంలో భూపతిరాజు వారు జమిందార్లుగా విశాఖపట్నం తాలూకా గోలుగొండ, రెవిడి, మద్గోలు వంటి ప్రాంతాలను పాలించారు. గోత్ర ప్రవర ప్రకారం ధనుంజయ మహారాజు విశ్వామిత్రుడి వంశంలో జన్మించినవాడు. కొన్ని పుస్తకాల్లో మధ్యయుగంలో మధ్యదేశాన్ని పాలించిన ధనుంజయ మహారాజు వీరి పూర్వీకుడు అని చెప్పబడియున్నది.
గృహనామ చరిత్ర[మార్చు]
ఈ గృహనామ పుట్టుకకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో భూపతివారిపాలెం అను గ్రామంలో నివసించిన ధనుంజయగోత్రపు రాజులను భూపతిరాజులు అని పిలిచేవారని ఒక సిద్ధాంతం. భూపతిరాజు అనే సుప్రసిద్ధ పూర్వీకుడు ఉండేవాడని, అతని పేరే గృహనామంగా మారినదని మరో సిద్ధాంతం కలదు. విజయనగరం జిల్లా వీరవల్లి తాలూకా చోడవరం గ్రామంలో కేశవస్వామి ఆలయపు స్థంభంపై వున్న శిలాశాసనం (No. 741. A. R. No. 54 of 1912) లో భూపతిరాజు వల్లభరాజు అనే పేరు వ్రాయబడియున్నది.
సుప్రసిద్ధ వ్యక్తులు[మార్చు]
- భూపతిరాజు విస్సంరాజు (బి.వి రాజు), సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, దాత.
- భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు, స్వామి జ్ఞానానందగా సుప్రసిద్ధులు.
- భూపతిరాజు రామకృష్ణంరాజు (బి.ఆర్.కె రాజు) ఆంధ్ర క్షత్రియులలో మొట్టమొదటి APPSC సభ్యులు, రాజకీయ, సామాజిక, విద్యా వేత్త.
- భూపతిరాజు సోమరాజు, ప్రముఖ వైద్యులు, కేర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు.
- భూపతిరాజు తిరుపతిరాజు, ప్రముఖ ప్రజా సేవకులు.
- భూపతిరాజు వెంకట లక్ష్మీనరసింహరాజు
- భూపతిరాజు సుబ్బరాజు, భీమవరం శాసనసభ్యులు.
- భూపతిరాజు విజయకుమార్ రాజు, భీమవరం శాసనసభ్యులు.
- భూపతిరాజు రవిశంకర్ రాజు, రవితేజగా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడు.
- భూపతిరాజు సుబ్బరాజు స్వాతంత్రసమరయోథులు