భూపతిరాజు రామకృష్ణంరాజు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
భూపతిరాజు రామకృష్ణంరాజు | |
---|---|
![]() | |
జననం | 1949 కుముదవల్లి |
ఇతర పేర్లు | బి.ఆర్.కె, శారదా రామకృష్ణంరాజు |
వృత్తి | సామాజిక, రాజకీయ, విద్యా వేత్త |
తండ్రి | సుబ్బరాజు |
తల్లి | చంద్రమ్మ |
భూపతిరాజు రామకృష్ణంరాజు (బి.ఆర్.కె.రాజు) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో కుముదవల్లి అనే గ్రామంలో భూపతిరాజు సుబ్బరాజు, చంద్రమ్మ దంపతులకు రెండవ కుమారునిగా 1949లో జన్మించాడు.
ఆంధ్రా యూనివర్శిటీ నుండి యం.ఎ ఇంగ్లీషు లిటరేచర్, యం.ఎ పబ్లిక్ ఎడ్మినిస్ట్రీషన్, ఎం.ఎ పాలిటిక్స్ డిగ్రీలు పొందాడు. 1979 లో బి.ఎ, బి.కామ్ వంటి డిగ్రీ ఎంట్రన్స్ పరీక్షల కొరకు, మరియూ ఇతర పోటీ పరీక్షల శిక్షణ కొరకు, శ్రీ శారదా కోచింగ్ సెంటర్, పిల్లల విద్యాబోధన కొరకు 1984 లో భీమవరం ప్రకృతి ఆశ్రమంలో శ్రీ శారదా రెసిడెన్సియల్ స్కూల్ అనే పేరుతో పాఠశాల స్ఠాపించి 1997 వరకూ నడిపాడు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, నందమూరి తారక రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై.యస్. రాజశేఖరరెడ్డివంటి ప్రముఖ రాజకీయ నాయకులతో సన్నిహితులుగా మెలిగాడు. విద్యారంగానికి చేసిన సేవకు గాను 2005లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యాడు. భారత దేశంలో మొట్ట మొదటిసారిగా 2006 లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష విధానంలో కామన్ సిలబస్ ప్రవేశబెట్టి విశేష మార్పులు తీసుకువచ్చాడు.[ఆధారం చూపాలి] 2011 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్-చార్జి ఛైర్మన్ గా పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం వీరు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ వ్యక్తిగా తన విశిష్ట సేవలు అందిస్తున్నారు. క్షత్రియ సేవా సమితి వారి 2012 గోల్డెన్ జూబ్లీ పుస్తకంలో ఈయన గురించి వ్యాసం ముద్రించబడింది.