భూపేష్ బాఘేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూపేష్ బాఘేల్
Bhupesh Baghel, June 2018.jpg
ఛత్తీస్గఢ్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి
Assumed office
2018 డిసెంబర్ 17
Governorఆనందిబెన్ పటేల్
అనుసూయఉయికీ
Preceded byరమన్ సింగ్
ఛత్తీస్గఢ్ శాసన సభ సభ్యడు
Assumed office
2013
Preceded byవిజయ్ బాఘేల్
Constituencyపఠాన్ నియోజకవర్గం
Majority27,477 (2018)
In office
1993–2008
Succeeded byవిజయ్ బాఘేల్
మధ్యప్రదేశ్ రవాణా శాఖ మంత్రి
In office
1999–2003
ముఖ్యమంత్రిదిగ్విజయ్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1961-08-23) 1961 ఆగస్టు 23 (వయస్సు 60)
దుర్గ్, మధ్య ప్రదేశ్ (ప్రస్తుత ఛత్తీస్గఢ్)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిముక్తేశ్వరి బాఘేల్
సంతానం4

భూపేష్ బాఘేల్ (జననం 1961 ఆగస్టు 23) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇతను ఛత్తీస్గఢ్ లోని పఠాన్ నియోజకవర్గం నుండి 5 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[1][2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

భూపేష్ బాఘేల్ 1961 ఆగస్టు 23న దుర్గ్ జిల్లాలో జన్మించాడు. నంద్ కుమార్ బాఘేల్, బిందేశ్వరి బాఘేల్ ఇతని తల్లిదండ్రులు. ఇతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు.[3]

భూపేష్ బాఘేల్ భార్య పేరు ముక్తేశ్వరితో బాఘేల్. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

తొలినాళ్లలో[మార్చు]

భూపేష్ బాఘేల్ తన రాజకీయ జీవితాన్ని భారత యూత్ కాంగ్రెస్ నుండి ప్రారంభించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడు అయ్యాడు, అతను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అలాగే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ కూడా పనిచేశాడు. పఠాన్ నుండి మొదటిసారిగా 1993లో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు, తరువాత అదే స్థానం నుండి ఐదుసార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా[మార్చు]

2014 అక్టోబర్ నుండి 2019 జూన్ వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రెసిడెంటుగా వ్యవహరించాడు. 2018 ఛత్తీస్గఢ్ శాసన సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు.[6]

ముఖ్యమంత్రిగా[మార్చు]

బాఘేల్ పటాన్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షానికి 15 సంవత్సరాలు నాయకత్వం వహించిన తరువాత, ప్రత్యర్థ పార్టీ బిజెపికి చెందిన రమణ్ సింగ్ ను ఓడించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ 17న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]

మూలాలు[మార్చు]

  1. www.cgvidhansabha.gov.in http://www.cgvidhansabha.gov.in/hindi_new/bio/cm_current.htm. Retrieved 2021-06-09. Missing or empty |title= (help)
  2. "Official Website of Chhattisgarh Legislative Assembly". www.cgvidhansabha.gov.in. Retrieved 2021-06-09.
  3. Desk, The Hindu Net (2018-12-16). "Who is Bhupesh Baghel?". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-06-09.
  4. "छत्तीसगढ़ के होने वाले CM भूपेश वधेल के गांव में नहीं था स्कूल, वो पढ़ने के लिए रहने लगे थे 30 KM दूर, अपना पहला चुनाव ही एक वोट से हारे थे वो". Dainik Bhaskar (in హిందీ). 2018-12-17. Retrieved 2021-06-09.
  5. Desk, The Hindu Net (2018-12-16). "Who is Bhupesh Baghel?". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-06-09.
  6. "Chhattisgarh election results: Bhupesh Baghel front runner for CM's post". The Financial Express (in ఇంగ్లీష్). 2018-12-12. Retrieved 2021-06-09.
  7. July 12, Rahul Noronha Raipur; July 22, 2019 ISSUE DATE:; July 12, 2019UPDATED:; Ist, 2019 13:29. "All Power to the Tribe | Chhattisgarh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-09.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)