భూమా శేఖర్‌రెడ్డి
భూమా శేఖర్ రెడ్డి | |
|---|---|
| ఆళ్లగడ్డ శాసనసభ సభ్యుడు | |
| నియోజకవర్గం | ఆళ్లగడ్డ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1 జనవరి 1955 ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| మరణం | 7 జూన్ 1991 |
| మరణ కారణం | గుండెపోటు |
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
| బంధువులు | భూమా నాగిరెడ్డి (సోదరుడు) |
భూమా శేఖర్ రెడ్డి ( 1955 జనవరి 1– 1991 జూన్ 7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కి చెందిన ప్రముఖ నాయకుడు. ఆయన దివంగత నేత భూమా నాగిరెడ్డి సోదరుడు.
రాజకీయ జీవితం
[మార్చు]భూమా శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రాంతీయంగా మంచి గుర్తింపు పొందారు.
మరణం
[మార్చు]1991 జూన్ 7న భూమా శేఖర్ రెడ్డి ఆకస్మికంగా గుండెపోటు తో మరణించారు. ఆయన మరణంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరిగింది.
వారసత్వం
[మార్చు]భూమా శేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉపఎన్నిక ద్వారా ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు.
భూమా శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మనంద రెడ్డి కూడా రాజకీయాల్లో ప్రవేశించి నంద్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
సినీ రంగం
[మార్చు]భూమా శేఖర్ రెడ్డి సినీ నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ దాదా (1990) చిత్రాన్ని ఆయన నిర్మించారు.