భూమిధర్ బర్మన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమిధర్​
భూమిధర్ బర్మన్


పదవీ కాలం
22 ఏప్రిల్ 1996 – 14 మే 1996
గవర్నరు లోకనాథ్ మిశ్రా
ముందు హితేశ్వర్ సైకియా
తరువాత ప్రఫుల్ల కుమార్ మహంత

రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ మంత్రి
పదవీ కాలం
22 జనవరి 2015 – 24 మే 2016

రెవెన్యూ, విపత్తుల నివారణశాఖ మంత్రి
పదవీ కాలం
2006 - 2011

ఆరోగ్య శాఖ మంత్రి
పదవీ కాలం
2001 - 2006

పంచాయత్ రాజ్, విద్య, ఆరోగ్యశాఖ మంత్రి
పదవీ కాలం
1991 - 22 ఏప్రిల్ 1996

ఆర్ధిక & విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
1973 - 1978

శాసనసభ్యుడు
పదవీ కాలం
2001 - 2016
నియోజకవర్గం బార్ఖేత్రి
పదవీ కాలం
1991 - 1996
నియోజకవర్గం బార్ఖేత్రి
పదవీ కాలం
1983 - 1985
Constituency ధర్మపురి

వ్యక్తిగత వివరాలు

జననం (1931-10-12)1931 అక్టోబరు 12
బెల్సర్, నల్బరి జిల్లా, అస్సాం
మరణం 2021 ఏప్రిల్ 18(2021-04-18) (వయసు 89)[1]
డిస్పూర్ హాస్పిటల్, గువాహటి, అస్సాం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు భకట్ రామ్ బర్మన్, మధుప్రియ బర్మన్
జీవిత భాగస్వామి మాలతి బర్మన్
సంతానం 4

భూమిధర్ బర్మన్​ అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఏడుసార్లు అసోం శాసనసభకు ఎన్నికై, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

భూమిధర్ బర్మన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 1967లో రాజకీయాల్లో ప్రవేశించాడు. అతను తొలిసారి 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్బరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నల్బరి వెస్ట్, ధర్మపూర్, బర్ఖేట్రీ నియోజకవర్గాల నుండి మొత్తం ఏడుసార్లు అసోం శాసనసభకు ఎన్నికై హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగోయ్ మంత్రివర్గాలలో ఆరోగ్యం, విద్య, రెవెన్యూ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

భూమిధర్ బర్మన్ 1996 ఏప్రిల్ 22న అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హితేశ్వర్ సైకియా అనారోగ్య కారణాలతో మరణించగా ఆయన స్థానంలో బర్మన్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1996 ఏప్రిల్ 22 నుంచి 1996 మే 14 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2010లో అప్పటి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్లిన సమయంలో బర్మన్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన 2015లో తరుణ్ గొగోయ్ మంత్రివర్గంలో రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ మంత్రిగా పనిచేశాడు.

మరణం[మార్చు]

భూమిధర్ బర్మన్ 2021 ఏప్రిల్ 18న అనారోగ్యంతో బాధపడుతూ గువాహటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య విషమించడంతో మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Veteran Cong Leader Bhumidhar Barman Passes Away". Pratidintime. 18 April 2021. Retrieved 18 April 2021.
  2. TV9 Telugu (19 April 2021). "అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్ బర్మన్ కన్నుమూత.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 10TV (18 April 2021). "అసోం మాజీ సీఎం భూమిధర్ బర్మన్ కన్నుమూత" (in telugu). Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)