Jump to content

భూల్ భూలయ్యా 3

వికీపీడియా నుండి
భూల్ భూలయ్యా 3
దర్శకత్వంఅనీస్ బాజ్మీ
రచనఆకాష్ కౌశిక్
నిర్మాతభూషణ్ కుమార్

క్రిషన్ కుమార్

మురాద్ ఖేతాని
తారాగణంకార్తీక్ ఆర్యన్

విద్యా బాలన్
మాధురీ దీక్షిత్

ట్రిప్తి డిమ్రీ
ఛాయాగ్రహణంమను ఆనంద్
కూర్పుసంజయ్ సంక్లా
సంగీతం
నిర్మాణ
సంస్థలు
టి-సిరీస్ ఫిల్మ్స్
సినీ1 స్టూడియోస్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
1 నవంబర్ 2024 (2024-11-01)
సినిమా నిడివి
158 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹150 కోట్లు
బాక్సాఫీసుఅంచనా ₹423.85 కోట్లు[2]

భూల్ భూలయ్యా 3 2024లో విడుదలైన భారతీయ హిందీ భాషా హార్రర్ సినిమా. టీ -సిరీస్ ఫిల్మ్స్, సినీ1 స్టూడియోస్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మించిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. ఇది భూల్ భూలయ్యా (2007), భూల్ భూలయ్యా 2 (2022) తర్వాత ఫ్రాంచైజీ మూడవ విడతగా విడుదలైంది. కార్తీక్ ఆర్యన్ , విద్యాబాలన్ , మాధురీ దీక్షిత్, ట్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 2023లో అధికారికంగా ప్రకటించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ మార్చి నుండి సెప్టెంబర్ 2024 వరకు ముంబై , కోల్‌కతా , ఓర్చా, లేహ్‌లలో జరిగింది, దీనికి మను ఆనంద్ సినిమాటోగ్రఫీ అందించాడు.

భూల్ భూలయ్యా 3 దీపావళి సందర్భంగా 2024 నవంబర్ 1న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మిశ్రమ-సానుకూల సమీక్షలను అందుకుంది, ప్రపంచవ్యాప్తంగా ₹423.85 కోట్లకు పైగా వసూలు చేసింది, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ హిందీ సినిమాగా, ఆరవ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాగా నిలిచింది.

నటీనటులు

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. "Bhool Bhulaiyaa 3 (12A)". British Board of Film Classification. 31 October 2024. Retrieved 31 October 2024.
  2. "Bhool Bhulaiyaa 3 Box Office". Bollywood Hungama. Retrieved 20 November 2024.
  3. "అలా చేయకపోతే.. మంజులిక మిమ్మల్ని వెంబడిస్తుంది: విద్యాబాలన్‌". Eenadu. 9 October 2024. Retrieved 26 October 2025.

బయటి లింకులు

[మార్చు]