భైరవకొన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భైరవకొన
—  రెవిన్యూ గ్రామం  —
భైరవకొన is located in ఆంధ్ర ప్రదేశ్
భైరవకొన
అక్షాంశరేఖాంశాలు: 15°24′12″N 79°30′09″E / 15.403293°N 79.50247°E / 15.403293; 79.50247
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
శాసనసభా నియోజకవర్గo కనిగిరి
మండలం చంద్రశేఖరపురం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

భైరవకొన ప్రకాశం జిల్లా, కనిగిరి శాసనసభా నియోజకవర్గం లోని చంద్రశేఖరపురం మండలం లోని గ్రామము.[1]

ఈ వూళ్ళో సుప్రసిద్ధమైన శివాలయం ఒకటి ఉంది. ఈ శివాలయంలో ఒకే రాతిపై చెక్కిన పలు శివలింగాలు దర్శనము ఇస్తాయి.

దగ్గర వున్న వూర్లు: చంద్రశేఖరపురం, కనిగిరి, పామూరు, సీతారామపురము.

ఉపస్థితి[మార్చు]

నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దులలో పచ్చని అటవీ ప్రాంతంలో ఉన్నది అధ్యాత్మిక మరియు విహార కేంద్రమైన భైరవకొన. పచ్చని చెట్లతో నిండిన కొండలు, జలపాతాలు, కొండ గుహలు కలిగిన భైరవకొన యాత్రికులకు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రదేశాన్ని పార్వతీ పరమేశవరులు సందర్శించారని ఈ ప్రదేశ ప్రశాంతతకు ఆనందించి ఇక్కడ అమరనాధ లింగాన్ని ఉంచి వెళ్ళారని ఒక కథనం. ఇక్కడ కొండ మీద నూట పదకొడు కోనేర్లు ఉన్నాయని వాటి నుండి నీరు నిరంతరం స్రవిస్తుందని మరొక కథనం. కొండలను మలచి ఆలయాలను నిర్మించడం వలన ఇవి సహజ సిద్ధమైన గుహాలయాలు. ఇది ప్రఖ్యాత శివ క్షేత్రం.

ఇక్కడ ఉన్న శివరూపాలు[మార్చు]

భైరవకొన గుహాలయ సముదాయము

దాదాపు 250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఎక్కడ చూసినా దేవీ దేవతల రూపాలు దర్శనం ఇస్తారు. ఈ గుహాలయంలో ఉన్న ప్రధాన దైవం భర్గేశ్వరుడు. భైరవకొన లోని శివాలయాలకు పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్థ్యం ఉంది. ఇక్కడ ఉన్న ఎనిమిది శివాలయాలలో ఏడు శివాలయాలు తూర్పు ముఖానికి ఒక్క శివాలయం పడమర ఉత్తర ముఖంగా నిర్మించబడ్డాయి. వీటన్నింటిలో గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ కొండలోనే మలచడం మరొక విశేషం. అయితే ఈ ఆలయాలలో శివలింగాలను మాత్రం గ్రానైట్ రాయితో మలిచి ప్రతిష్ఠించారు. భర్గేశ్వరుడు ప్రధాన దైవం అయిన ఈ ఆలయాలకు క్షేత్రపాలకుడు కాల భైరవుడు కనుక భైరవకొన అని పిలబడిందని ఒక కథనం మరొక కథనం ప్రకారం ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన కాలభైవుడి పేరు మీద ఇది భైరవ కొనగా పిలువబడుతుందని మరొక కథనం ప్రచారంలో ఉంది. శివరాత్రి లాంటి పర్వదినాలలో తప్ప మిగిలిన సమయాలలో ఇక్కడ జన సంచారం తక్కువే. కొంచంగా ఉన్న స్థానికులు తమకు తెలిసినంతలో మాత్రమే ఇచ్చే సమాచరమే యాత్రికులకు లభ్యమౌతున్నాయి కనుక నిర్ధుష్టమైన సమాచారం అంతుపట్టడం కష్టమే. ఇక్కడ ఉన్న శివలింగాలు దేశంలోని ప్రసిద్ధమైన శివలింగాలను పోలి ఉండి ఆ పేర్లతో పిలువబడుతుంటాయి. మధ్యపెరదేశ్ లోని అమరనాధ్‌లో కనిపించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుద్రలింగం. కాశీగంగా తీరంలో ఉన్న విశ్వేశ్వర లింగం, తిరుమల గిరులలోని లోని నగరికేశవర లింగం, రామనాధపుర సముద్రతీరం లోని రామలింగేశ్వర లింగం, మందరపర్వతంలోని పక్షఘాత లింగం మరియు ఇక్కడి ప్రధాన దైవమైన భ్ర్ఘేశ్వర లింగం పేర్లతో పూజింపబడుతున్నాయి. ఉత్తర ముఖంగా ఉన్న శివాలయం ఎదురుగా నంది ఆశీనమై ఉంటుంది. ఈ ఆలయానికి తలపాగాలు ధరించిన ద్వారపాలకులు ఉండడం ప్రధాన ఆకర్షణ. ఏడో గుహాలయం మరింత ఆకర్షణీయమైనది. ఎనిమిదో గుహాలయంలో శివుడే కాక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండడం మరొక ప్రత్యేకత. ఈ ఆలయం త్రిమూర్తులు ఒక చోట ఉన్న ప్రత్యేక ఆలయాలలో ఒకటిగా ప్రాచుర్యం పొంది ఉంది.

భైరవకొన[మార్చు]

  • ఇక్కడ ఉన్న దుర్గమ్మ ఆలయం మీద ప్రతి కార్తిక పౌర్ణమి రోజున వెన్నెల పడడం ఇక్కడి ప్రత్యేక విశేషం. చుట్టు పక్కల ఉన్న ఊళ్ళ నుండి ఆ రోజున భక్తులు అనేకులు ఇక్కడకు తరలి వస్తుంటారు.
  • శివరాత్రికి భక్తుల సందోహం ఎక్కువ. ఆ సమయంలో భక్తులు పక్కనే ఉన్న జలపాతపు సెలఏటిలో స్నానం చేసి శివదర్శనం చేసుకుటారు.
  • ఈ ఆలయంలో అడుగడుగునా పల్లవ శిల్పకళ తాండవం ఆడుతుంది.
  • అంబవరం, కొత్తపల్లి నుండి ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు బస్సులు లభ్యం ఔతాయి.
  • అంతగా సౌకర్యాలు లేని గెస్ట్ హౌస్ మాత్రమే ఇక్కడ ఉన్న సదుపాయం.
  • అటవీ ప్రాంతం కనుక ఇక్కడ నిర్వాహకులు అన్నదానం నిర్వహిస్తుంటారు.

చరిత్ర[మార్చు]

క్రీ శ 600 నుండి 630 సంవత్సరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయిదో గుహలోని స్తంభాల మీద ఉన్న నరేంద్రుడు, త్రిభువనాదిత్యం వంటి పదాలు చూస్తుంటే ఏడో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు ఈ గుహల నిర్మాణం జరిగి ఉండ వచ్చని ఊహిస్తున్నారు. ఇక్కడ గుహలతో పాటు చుట్టుపక్కల గుండాలను, దోనలను చూడ వచ్చు. సోమనాధ, పాల, కళింగ దోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు దర్శనీయ స్థలాలు. ఇవన్నీ కాలి నడకనే చూడవలసి ఉంది.

భైరవ కోన లోని ఆలయాలు మహాబలి పురం లోని శిల్ప కళను పోలి వుంటుంది. ప్రొపెసర్ లాంగ్ హర్ట్స్ అభిప్రాయం ప్రకారం దక్షిణ్ భారాత దేశంలో మొట్ట మొదట కనుగొన్న ప్రాచీన హిందు దేవాలయాలు ఈ భైరవ కోన లోనివె. పర్వ దినల్లో చుట్టుపక్కల నుండి సుమారు ముప్పై వేల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ బస చేయడానికి సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో సినీ నటుడు కట్టించిన వసతి గృహం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇక్కడే ఒక పురాతన కోట శిథిలావస్థలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


"https://te.wikipedia.org/w/index.php?title=భైరవకొన&oldid=2141141" నుండి వెలికితీశారు