భైరోన్ ప్రసాద్ మిశ్రా
| భైరోన్ ప్రసాద్ మిశ్రా | |||
| పదవీ కాలం 2014 సెప్టెంబర్ 1 – 2019 మే 23 | |||
| ముందు | ఆర్.కె. సింగ్ పటేల్ | ||
|---|---|---|---|
| తరువాత | ఆర్.కె. సింగ్ పటేల్ | ||
| నియోజకవర్గం | బందా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1958 September 7 హనువా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | రాజా భాయ్ మిశ్రా & సోనియా దేవి మిశ్రా | ||
| జీవిత భాగస్వామి | చింతా దేవి మిశ్రా | ||
| నివాసం | కార్వీ, చిత్రకూట్, ఉత్తరప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
భైరాన్ ప్రసాద్ మిశ్రా (జననం 1958 సెప్టెంబర్ 7) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బందా నియోజకవర్గం నుండి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]భైరోన్ ప్రసాద్ మిశ్రా భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1993 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కార్వీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఆర్.కె. సింగ్ పటేల్ పై 198 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1996 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అఖిల్ భారతీయ శివసేన - రాష్ట్రవాది నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
భైరోన్ ప్రసాద్ మిశ్రా ఆ తరువాత తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరి 2002 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కార్వి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఆర్.కె. సింగ్ పటేల్ చేతిలో 15,515 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004 లోక్‌సభ ఎన్నికలలో బందా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.
భైరోన్ ప్రసాద్ మిశ్రా ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 2009 లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి ఆర్.కె. సింగ్ పటేల్ చేతిలో 34593 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఆర్.కె. సింగ్ పటేల్ పై 115788 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
భైరోన్ ప్రసాద్ మిశ్రా ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 2009 లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి ఆర్.కె. సింగ్ పటేల్ చేతిలో 34593 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఆర్.కె. సింగ్ పటేల్ పై 115788 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-17.
- ↑ "BJP MPs top list of debaters in Lok Sabha, Left parties dominate Rajya Sabha" (in ఇంగ్లీష్). India Today. 11 April 2016. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
- ↑ "Meet Bhairon Prasad Mishra- India's most active MP" (in ఇంగ్లీష్). The New Indian Express. 19 May 2017. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
- ↑ "From Dimple Yadav to Hema Malini, here's how UP MPs fared in Parliament". The Times of India. 3 May 2019. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.