Jump to content

భోజ్‌పురి సినిమా

వికీపీడియా నుండి

భోజ్‌పురి సినిమా, ఇది బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లలో విస్తృతంగా మాట్లాడే భోజ్‌పురి భాష చలన చిత్రాల నిర్మాణానికి అంకితం చేయబడిన భారతీయ సినిమా విభాగం. ఇది పాట్నా కేంద్రంగా పనిచేస్తుంది.[1][2] గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సురినామ్, ఫిజీ, మారిషస్, దక్షిణాఫ్రికా వంటి వివధ దేశాలలో ఇప్పటికీ ఈ భాషను మాట్లాడే రెండవ, మూడవ తరం వలసదారులకు భోజ్‌పురి సినిమా సేవలు అందిస్తుంది.[3]

మొదటి భోజ్‌పురి టాకీ చిత్రం గంగా మైయ్యా తో పియారీ చద్దైబో 1963లో విశ్వనాథ్ ప్రసాద్ షహాబాదీ, జై నారాయణ్ లాల్ విడుదల చేశారు. 1980లలో బిటియా భెయిల్ సయాన్, చంద్వా కే టేక్ చకోర్, హమార్ భోజీ, గంగా కినారే మోరా గాంవ్, సంపూర్ణ తీర్థ యాత్ర వంటి అనేక ప్రముఖ చిత్రాలు విడుదలయ్యాయి.

సారాంశం

[మార్చు]

భోజ్‌పురి తూర్పు భారతదేశంలోని పశ్చిమ బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లలో ఉద్భవించింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫిజీ, గయానా, మారిషస్, దక్షిణాఫ్రికా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నెదర్లాండ్స్ లతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ బాష మాట్లాడేవారు కనిపిస్తారు. అలాగే, కరేబియన్, ఓషియానియా, ఉత్తర అమెరికాలలోనూ లక్షలాది మంది ప్రజలు భోజ్‌పురి భాషను స్థానిక, రెండవ భాషగా మాట్లాడతారు.[4]

జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న చిత్రాలు

[మార్చు]
  • కాబ్ హోయ్ గావ్నా హమార్ (2005)
  • ఉడేద్ బన్ (2008)

ప్రముఖ కథానాయికలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bhojiwood Losing Its Lustre". Archived from the original on 2017-11-17.
  2. Roy, Tasmayee Laha. "Bhojpuri film industry now a Rs 2000 crore industry". The Economic Times. Archived from the original on 2017-11-17.
  3. "Regional pride". Business standard. 24 June 2010. Archived from the original on 27 February 2014. Retrieved 22 February 2014.
  4. Mesthrie, Rajend (1991). Language in Indenture: A Sociolinguistic History of Bhojpuri-Hindi in South Africa. London: Routledge. pp. 19–32. ISBN 0-415-06404-X.