భ్రాంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hallucination
వర్గీకరణ & బయటి వనరులు
The real shadow of the hallucinating person transforms into the corporeal image.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 19769
MeSH {{{m:en:MeshID}}}

భ్రాంతి అను పదం చూచాయగా చెప్పాలంటే ఉద్దీపన లేని స్థితిలో కలిగే మానసిక దృక్కోణం. నిక్కచ్చిగా చెప్పాలంటే భ్రాంతులు అనేవి బాహ్యమైన ఉద్దీపన లేని మానసిక స్థితిలో మనిషి ఉన్నపుడు, స్పష్టంగా, వాస్తవంగా బాహ్య ప్రదేశాలలో కనపడే విధంగా గోచరించే వాటి కాల్పనిక దృష్టి కోణాలు. ఈ తర్వాతి నిర్వచనం భ్రాంతులకు దాని సంబంధపు ప్రక్రియ అయిన కలలకు భేదము తెలియజేస్తుంది. కలల్లో నిద్ర లేని స్థితి, మాయ, మనఃకల్పన, అబద్దపు భ్రాంతి, ఇవేవి ఉండవు. మనఃకల్పన నిజమైన దృష్టిని అనుకరించదు కానీ స్వచ్ఛంద నియంత్రణ సాధ్యం. అబద్దపు భ్రాంతి కూడా నిజమైన దృష్టిని అనుకరించదు కానీ స్వచ్ఛంద నియంత్రణ అసాధ్యం.[1] భ్రాంతులను అవాస్తవ నమ్మకాలను కలిగించే దృష్టి నుండి కూడా విభేదించవచ్చు. సరిగ్గా గ్రహించబడిన మరియు అర్థవంతమైన శుద్ధమైన దృష్టికి విపరీతార్థము కల్పించడాన్ని అవాస్తవ నమ్మకాలు అంటారు. అవి భ్రాంతులు కావు.

భ్రాంతులు ఏ రకమైన ఇంద్రియ సంబంధమైన రీతిలోనైనా సంభవించవచ్చు. ఆ రీతులు దృష్టికి సంబంధమైనవి, శ్రవణ సంబంధమైన, ఘ్రాణ సంబంధమైన, రుచి సంబంధమైన, స్పర్సేంద్రియ సంబంధమైన, ప్రోప్రియోసేప్టివ్, ఈక్విలిబ్రియోసేప్టివ్, నోసిసేప్టివ్, ధర్మోసెప్టివ్, మరియు క్రోనోసేప్టివ్ కావచ్చు.

ఒక చిన్న తరహా భ్రాంతిని కలత గా గుర్తించవచ్చు అది పైన సూచించిన ఏ రీతిలోనైనా సంభవించవచ్చు. అది పరిసీమ దృష్టి లోని చలనం కావచ్చు, బలహీనమైన శబ్దాలు, స్వరాలు వినపడటం లాంటివి కావచ్చు. తీవ్ర భయాందోళనకు గురి చేయు స్కిజోఫ్రేనియాలో శ్రవ్య సంబంధమైన భ్రాంతి చాలా సాధారణం. అవి ఉదారపూరితమైనవి కావచ్చు (తన గురించి తనకు మంచి విషయాలు చెప్పేవి) అపకారపూరితమైనవి కావచ్చు, అంటే చెడు చెప్పేవి కావచ్చు. శ్రవ్య సంబంధమైన భ్రాంతులు రోగికి తన వెనుక మనుషులు తన గురించి తరచు చెడు మాట్లాడుతున్నారన్న భ్రాంతిని కలగజేస్తాయి. స్రవ్యసంబంధమైన భ్రాంతుల లాగానే దృశ్య సంబంధమైన భ్రాంతుల ప్రతిరూపం కూడా రోగి వెనుకే ఉండచ్చు. వాటి దృశ్య సంబంధమైన ప్రతిరూపం, సాధారణంగా రోగి వైపుకు అపకారపూరితమైన భావంతో చూస్తున్న భ్రాంతి కలగజేస్తుంది. తరచుగా, శ్రవ్యసంబంధమైన భ్రాంతులు, వాటి దృశ్య సంబంధమైన ప్రతిరూపం - ఈ రెండు రోగికి ఒకే సమయంలో భ్రాంతికి సంబంధించిన అనుభవం కలగచేస్తాయి.

హిప్నాగాగిక్ భ్రాంతులు మరియు హిప్నోపోంపిక్ భ్రాంతులు చాలా సాధారణమైన ప్రక్రియగా గుర్తిస్తారు. హిప్నాగాగిక్ భ్రాంతులు నిద్ర పోబోయే సమయంలోను, హిప్నోపోంపిక్ భ్రాంతులు నిద్ర లేచే సమయంలోను సంభవిస్తాయి.

ఔషధాల ఉపయోగం (ముఖ్యంగా మత్తుని కలిగించేవి), నిద్ర లేమి, మానసిక రుగ్మత, నరాల సమస్యలు, డెలిరియం ట్రెమెన్స్ వలన కూడా భ్రాంతి కలగవచ్చు.

విషయ సూచిక

వర్గీకరణ[మార్చు]

భ్రాంతులు వివిధ రూపాలలో వ్యక్తమవవచ్చు.[2] వివిధ రకాలైన భ్రాంతులు వివిధ ఇంద్రియాలని ప్రభావితం చేయవచ్చు. కొన్నిసార్లు ఒకే సారి, ఒకే సమయంలో సంభవించి అనేక రకమైన ఇంద్రియ సంబంధమైన భ్రాంతులు వాటిని అనుభవించే వారికి కలగా చేయచ్చు.

విజువల్ (దృష్టి సంబంధమైన)[మార్చు]

లేని వస్తువులని చూసే ప్రక్రియ, చేతనాత్మక యదార్ధంతో సరితూగని దృశ్య సంబంధమైన దృష్టి - ఇవి మనుషులు అతి సాధారణంగా మాట్లాడుకునే భ్రాంతులు. వాటిని సైకోఫిజియలాజిక్ (మెదడు ఆకృతి లోని తేడాలు), సైకో బయోకెమికల్ (నరాల ద్వారా ప్రసారమయ్యే సంకేతాలలో తేడాలు), మానసికమైన (చేతనావస్థ లోకి చొచ్చుకు వచ్చే అర్థవంతమైన అనుభవాలు) విగా వర్గీకరించవచ్చు. సాధారణమైన రుగ్మతలు మొదలుకుని, డిమెంషియా, మైగ్రేయిన్ వరకు అనేక రకాలైన దృశ్య సంబంధమైన భ్రాంతులు ఉండవచ్చు. కానీ, దృశ్య సంబంధమైన భ్రాంతి అనుభవించినంత మాత్రాన దానిని రుగ్మత అనలేము.[3]

ఆడిటరి (శ్రవణ సంబంధమైన)[మార్చు]

స్కిజోఫ్రేనియా లేదా మేనియా (వెర్రి) లాంటి మానసిక రుగ్మతలు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకటి రెండు స్వరాలు వినపడటం లాంటివి శ్రవ్య సంబంధమైన భ్రాంతుల (పారాక్యుసియా [4] అని కూడా తెలియబడినది) తో నిర్దిష్టముగా సంబంధం కలిగి ఉన్నాయి. శ్రవ్య సంబంధమైన భ్రాంతులు అటువంటి రోగ నిర్ధారణ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఏమయినప్పటికీ రోగ నిర్ధారణ చేయకలిగిన మనోరోగం లేని మనుషులు కూడా కొన్ని సార్లు స్వరాలు వినవచ్చు. తీవ్ర భయాందోళనకి గురి చేసే స్కిజోఫ్రేనియాలో జీవసంబంధం లేని శ్రవ్య సంబంధమైన భ్రాంతులు కలుగుతాయి. తనవైపుకి ఎవరో చూసినట్లుగా తేరిపార దృష్టి పెట్టినట్లుగా యదార్ధం లేని భావనకు గురి కావడం వీటి దృశ్య సంబంధమైన ప్రతిరూపం.

తలపగిలినట్లుగా ఉండే వ్యాధిసూచకం, సంగీతం వినపద్దట్లుగా ఉండే వ్యాధిసూచకం ఇతర రకాలైన శ్రవ్య సంబంధమైన భ్రాంతులు నిద్ర పక్షవాతంలో సంభవించవచ్చు. సంగీతం వినపడ్డట్లుగా ఉండే వ్యాధిలో మనుషులు తమకి మనసులో సంగీతం వినపడ్డట్లుగా ఉంటుంది, ఆ సంగీతం తమకు తెలిసినది, పరిచయమైనదై ఉంటుంది. ఇటీవలి కథనాలో ప్రకారం, సంగీతం చాలా సేపు తరచు వినడం వాళ్ళ సంగీతపరమైన భ్రాంతులు కలగా వచ్చని తేలింది.[5] ఇది మెదడు మొదలు మీద కలిగే గాయాల వాళ్ళ (ఎక్కువగా పక్షవాతం వల్ల), ఇంకా ట్యూమర్స్, ఎన్సిఫాలిటిస్, అబ్సేసెస్ వల్ల కలుగుతుంది.[6] మూర్ఛ, చెవుడు కూడా కారణాలు కావచ్చు.[7] స్పష్టమైన కలలను నిద్రపోని స్థితిలో ఆరంభించడం తలపెట్టడం వలన కూడా శ్రవ్య సంబంధమైన భ్రాంతులు కలగవచ్చు.

ఆల్ఫాక్టారి (ఘ్రాణ సంబంధమైన)[మార్చు]

లేని వాసనలు వాసన చూసే ప్రక్రియని ఫాంటోస్మియా అంటారు. తరచుగా వచ్చే వాసనలు, అప్రియమైనవి - కుళ్ళిపోయిన మాంసము, వాంతి, ఉచ్చ, దొడ్డి, పొగ లేదా ఇతరములు. ఘ్రాణ సంబంధమైన వ్యవస్థలో నెర్వస్ టిస్యు దెబ్బ తినడం వల్ల తరచుగా ఫంటోస్మియా అనే జబ్బు వస్తుంది. ఈ విధంగా దెబ్బ తినడం సూక్ష్మ క్రిముల వల్ల కలిగే వ్యాధుల వల్ల, బ్రెయిన్ ట్యూమర్ వల్ల, ట్రౌమా (తీవ్ర ఆవేశం వల్ల కలిగిన మనోఘాతం) వల్ల, శస్త్ర చికిత్స వల్ల, మరియు విష పదార్థాల వల్ల, ఔషధాల వల్ల జరగవచ్చు.[8] మూర్ఛ వ్యాధి ఘ్రాణ సంబంధమైన వల్కలం (ఆల్ఫాక్టారి కార్టెక్స్) పై ప్రభావం చూపడం వల్ల కూడా ఫాంటోస్మియా కలగవచ్చు. మనో వైద్య శాస్త్రానికి సంబంధించిన మూలాలతో కూడా ఇది సంబంధం కలిగి ఉంది.[ఉల్లేఖన అవసరం] వాసన ఉంది దానిని వేరే వాసనగా గుర్తించే జబ్బుని పారోస్మియా అంటారు, దానికి ఫాంటోస్మియాకి తేడా ఉంది.

ఘ్రాణ సంబంధమైన భ్రాంతులు మైగ్రేయిన్లో కూడా ఉన్నట్లు గుర్తించారు అయితే అవి ఎంత తరచుగా సంభవిస్తాయో చెప్పలేము.[9][10]

టాక్టైల్ (స్పర్శ కు సంబంధించిన)[మార్చు]

ఇతర రకాలైన భ్రాంతులు స్పర్సేంద్రియాలకు సంబంధించిన అనుభూతి కలిగిస్తాయి. చర్మము, ఇతర అవయవాల పై వత్తిడి కలగా జేసినట్లుగా అనుభూతిని కలిగిస్తాయి. కొకెయిన్, యామ్ఫిటమీన్ చాలా కాలంగా ఉపయోగించడం వల్ల రోగి తన చర్మం పైన నల్లులు పాకుతున్నట్లుగా (దీనినే ఫోర్మిసేషన్ అంటారు) భ్రాంతి చెందుతాడు.[11]

భ్రాంతి యొక్క దశలు[మార్చు]

 1. ఊహా జనితమైన చిత్రాలు, తప్పిందుకునే, ఆశ్చర్య పరిచే జ్ఞాపకశక్తీ తెరమీదకు రావడం.[12]
 2. తరచు యదార్ధాన్ని పరీక్షించడం.
 3. భ్రాంతి నిజమగునపుడు సూక్ష్మ బుద్ది యొక్క అడుగుజాడ.[12]
 4. కల్పన, వక్రీకరణం అతిగా అయి యదార్ధమైన దృష్టి పై ప్రభావం లోపించడం.[12]
 5. అంతర్గత, బహిర్గత సరిహద్దులు చెరిగిపోయి అన్నింట్లా భగవంతుడే ఉన్నాడన్న భావనని కలగజేయు అనుభూతి కలగడం.[12]

కారణం[మార్చు]

భ్రాంతులు అనేక రకాలైన కారణాల వలన కలగవచ్చు.

హిప్నాగాగిక్ (నిద్ర కలిగించునది) భ్రాంతి[మార్చు]

ఇవి నిద్ర పోబోతున్న సమయానికి కొంత ముందు సంభవించి, చాలా ఎక్కువ శాతం జనాభాని ప్రభావితం చేస్తాయి. ఇవి క్షణాల నుండి నిముషాల పాటు సంభావించవచ్చు. ఇవి సంభావిన్చినంత సేపు మనిషికి తాను చూస్తున్న చిత్రాల నిజ స్వరూపం తెలుస్తూనే ఉంటుంది. ఈ భ్రాంతులు నార్కోలేప్సి (అడ్డగింప నశక్యమైన నిద్రావస్థ) తో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. ఇవి కొన్ని సార్లు బ్రెయిన్స్టెం (వెన్నుపాము కలయు సంధి) అసామాన్యతలతో సంబంధం కలిగి ఉంటాయి కానీ చాలా అరుదు.[13]

పెడన్క్యులార్ హాలూసినోసిస్[మార్చు]

పెడన్క్యూలార్ అంటే పెడన్కుల్ (రెంటి నడుమ నున్న సంధి కాడ) కి సంబంధించింది. బ్రెయిన్స్టెం యొక్క ఫోన్స్ నుండి, వరకు పరుగిడే న్యూరల్ ట్రాక్ట్ ను పెడన్కుల్ అంటారు. ఈ భ్రాంతులు సాధారణంగా సాయం సమయాలలో సంభవిస్తాయి. కానీ హిప్నాగాగిక్ భ్రాంతి లాగా మైకం కలిగించే సమయాల్లో ఇవి కలగవు. మనిషి పూర్తి చేతనావస్థలో ఉండి భ్రాంతి కలిగించే పాత్రలతో చాలా ఎక్కువగా పంపర్కం చేస్తూ ఉండకలడు. హిప్నాగాగిక్ భ్రాంతి లాగా, చిత్రాల యొక్క స్వభావానికి సంబంధించిన సూక్ష్మ బుద్ది క్రమంలో ఉంటుంది. దృశ్య క్షేత్రంలో ఎలాంటి చోటైనా ఈ అబద్దపు చిత్రాలు కనపడవచ్చు. ఇవి చాలా అరుదుగా బహురీతులు కలిగి ఉంటాయి.

డెలీరియం ట్రెమెన్స్[మార్చు]

అతి చిక్కిన దృశ్యసంబంధమైన భ్రాంతులలో ఒకటి అతిగా మార్పు చెందు పోలిమోడల్ డెలిరియం ట్రెమెన్స్. ఈ వ్యాధి సోకిన మనుషులు ఆందోళనగా, తికమకగా ఉంటారు - ముఖ్యంగా వ్యాధి చివరి దశలలో. వ్యాధి ముదిరే కొద్దీ సూక్ష్మ బుద్ది క్రమ క్రమంగా అంతరించి పోతూ ఉంటుంది. నిద్ర చెదిరి పోతూ ఉంటుంది, మళ్ళా కొంత సేపు నిద్ర పడుతూ ఉంటుంది. అలా నిద్ర పట్టిన కొద్ది సేపు కన్ను అతిగా కదులుతూ ఉంటుంది.

పార్కిన్సన్స్ రోగం మరియు లూవీ బాడి డిమెంషియా[మార్చు]

ఒకే రకమైన భ్రాంతి లక్షణాలు కలిగి ఉండటం వల్ల పార్కిన్సన్స్ రోగానికి లూవీ బాడి డిమెన్షియాతో దగ్గర సంబంధం ఉన్నది అని భావిస్తారు. ఈ లక్షణాలు సాయంకాలంలో దృశ్య క్షేత్రంలో ఏదైనా చోట సంభవించవచ్చు, అవి అరుదుగా బహు రీతులు కలిగి ఉంటాయి. ఇంద్రియ సంబంధమైన దృష్టి అతిగా చెదిరి పోవటం వల్ల, భ్రాంతి ప్రక్రియ మాయతో [14] మొదలవచ్చు, కానీ, కాల్పనికమైన ఇంద్రియ సమాచారం ఏమి ఉండదు. ఈ భ్రాంతులు కొన్ని నిముషాల పాటు ఉంటాయి. ఈ సమయంలో మనిషి చేతనావస్థలో, సహజంగానైనా ఉండచ్చు లేదా మైకంగా, ఇతరుల మాటలు అర్థం చేసుకోలేని స్థితి (ఇనాక్సేసిబుల్) లోనైనా ఉండచ్చు. ఈ భ్రాంతుల పట్ల సూక్ష్మ దృష్టి సాధారణంగా రోగికి కలిగి ఉంటుంది. ఇంకా REM నిద్ర సాధారణంగా తగ్గిపోతుంది. పార్కిన్సన్స్ రోగానికి సాధారణంగా డిగ్రేడెడ్ సబ్స్టాన్షియా నిగ్రా పార్క్ కంపాక్టాతో సంబంధం ఆపాదిస్తారు. కానీ ఈ మధ్య లభించిన సాక్ష్యం, PD మెదడులోని చాలా భాగాలని ప్రభావితం చేస్తుందని తెలుపుతోంది. మీడియన్ రాఫే న్యుక్లెఇలొ, లోకస్ కోరులస్ లోని నోరాడ్రేనేర్జిక్ భాగాలలో, టగ్మెంటం లోని పారాబ్రాకియల్, పెడన్కులోఫోన్టయిన్ న్యూక్లెఇ లోని కొలినేర్జిక్ న్యూరాన్స్ లో ఈ నిమ్నీకరణ ప్రక్రియ (డిగ్రాడేషన్) ను గుర్తించారు.[13]

మైగ్రెయిన్ కోమా[మార్చు]

సాధారణంగా ఈ రకమైన భ్రాంతి కోమా (స్పృహ, స్మృతి తప్పిన) స్థితిలోంచి పునరారోగ్యప్రాప్తి పొందేపుడు అనుభవంలోకి వస్తుంది. మైగ్రెయిన్ కోమా రెండు రోజుల వరకు ఉండవచ్చు, ఈ కోమా వల్ల కొన్ని సార్లు మనోవ్యాకులత (డిప్రెషన్) కలగవచ్చు. ఈ భ్రాంతులు పూర్తి స్పృహలో సంభవిస్తాయి, చిత్రాల భ్రాంతి స్వభావానికి సంబంధించిన సూక్ష్మ బుద్ది రోగికి ఉంటుంది. మైగ్రెయిన్ కోమాతో అటాక్సిక్ లీసియన్స్ కలసి ఉంటాయని గుర్తించారు.[13]

చార్ల్స్ బోనెట్ సిండ్రోం[మార్చు]

గుడ్డి రోగుల్లో అనుభవానికి వచ్చే దృశ్య సంబంధమైన భ్రాంతులకు చార్ల్స్ బోనెట్ సిండ్రోం అని పేరు పెట్టారు. దృశ్య చిత్రాలు మాయమయ్యే వరకు కను రెప్పలను మూయటం, తెరవటం ద్వారా ఈ రకమైన భ్రాంతులని చెదరగొట్టవచ్చు. ఈ భ్రాంతులు సాధారణంగా సాయంకాలం, లేదా సంధ్యా సమయాలలో కలుగుతాయి, కానీ ఎక్కువ వెలుతురు ఉండటం వీటిని ప్రభావితం చేయదు. రోగులకు తాము భ్రాంతి చెందుతున్నామన్న జ్ఞానం ఉండటం వల్ల అవి రోగులకు ఎక్కువగా హాని చేయవు.[13] ఆఫ్తాల్మోపథిక్ భ్రాంతులను డిఫరెన్షియల్ దయాగ్నశిస్ (భేదాత్మక రోగ నిర్ధారణ పరీక్ష) అనవచ్చు.[15]

ఫోకల్ ఎపిలేప్సి[మార్చు]

ఫోకల్ ఎపిలేప్సి వల్ల కలిగే దృశ్య సంబంధమైన భ్రాంతులు సంక్షిప్తంగా, మార్పు లేని విధంగా అంటే ఒకే రకంగా ఉంటాయి. అవి సాధారణంగా దృశ్యక్షేత్రంలోని ఒక భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి కొన్ని సెకన్ల పాటు ఉంటాయి. దృశ్య ఘటనల మధ్య ఇతర మూర్ఛ లక్షణాలు కనపడవచ్చు. చేతనావస్థ (స్పృహ) కొద్దిగా క్షీణించినా భ్రాంతికి సంబంధించిన సూక్ష్మ దృష్తి మనిషికి ఉంటుంది. పోజిటీరియర్ టెంపోరోపరీటల్లో గాయం వల్ల ఫోకల్ ఎపిలేప్సి సంభవిస్తుంది.[13]

స్కిజోఫ్రేనిక్ హాలూసినేషన్[మార్చు]

స్కిజోఫ్రేనియా (తీవ్ర భయాందోళన) వల్ల భ్రాంతి కలుగుతుంది.

ఔషధాల ఉపయోగం వల్ల కలుగు భ్రాంతి[మార్చు]

సైకోఆక్టివ్ సబ్స్టాన్సస్ (మనసుని ఉత్తేజ పరిచే పదార్థాలు) సేవించడం వల్ల కలిగే భ్రాంతులు.

వ్యాధివిజ్ఞాన శరీరధర్మశాస్త్రం[మార్చు]

భ్రాంతులు సంభవించడానికి కారణాలు వివరించడానికి అనేక రకాల సిద్ధాంతాలు ముందుకు వచ్చాయి. సైకియాట్రి (మనో రోగ చికిత్సా శాస్త్రము) లో ఫ్రాయిడ్ (సైకో డైనామిక్) సిద్ధాంతాలు చాలా ప్రసిద్ధి గాంచినవి. వీటిలో భ్రాంతులని అచేతనావస్థలో ఉండే కోరికలు, ఆలోచనలు, మరియు తలపులుగా చూపించారు. జీవశాస్త్ర సిద్ధాంతాలు ప్రామాణికంగా మారటంతో, (కనీసం సైకాలజిస్టులు) భ్రాంతులు, మెదడులో ఉండే క్రియాత్మకమైన లోటుపాట్ల వల్ల కలుగుతాయని అనుకోవడం మొదలెట్టారు. మనో రోగానికి సంబంధించినంత వరకు, న్యూరో ట్రాన్స్మీటర్స్గా గుర్తించిన గ్లూటామేట్ ఇంకా డొపామీన్ల క్రియాత్మకత (లేదా అక్రియాత్మకత) చాలా ముఖ్యమైనవిగా గుర్తించారు.[16] ఫ్రాయిడ్ వ్యాఖ్యానంలో నిజం ఉండవచ్చు ఎందుకంటే జీవశాస్త్ర పరికల్పన మెదడులోని భౌతిక పరస్పర చర్యలను వివరిస్తుంది. మెటాకోగ్నిటివ్ సామర్ధ్యాలలో పక్షపాత ధోరణుల వల్ల భ్రాంతులు కలగవచ్చని మనోవిజ్ఞాన పరిశోధన వాదించింది. మనలోని అంతర్గత మనో విజ్ఞాన స్థితులని (ఉద్దేశాలు, జ్ఞాపకాలు, నమ్మకాలు మరియు ఆలోచనలు) పర్యవేక్షించడానికి, తర్కజనితమైన హేతువులు కనిపెట్టడానికి ఈ సామర్ధ్యాలు ఉపయోగపడతాయి. అంతర్గత (స్వయంగా ఉత్పత్తి చేయబడిన) సమాచారానికీ, బహిర్గత (ప్రేరేపిత) సమాచారానికీ సంబంధించిన మూలాలని వివేచించే సామర్ధ్యాన్ని ఒక ముఖ్యమైన మెటాకోగ్నిటివ్ చాతుర్యంగా గుర్తించారు, కానీ అది భ్రాంతికి సంబంధించిన అనుభవాలు కలిగించడం కోసం విచ్ఛిన్నం అయిపోవచ్చు. అంతర్గత స్థితి (మరొకరి చర్యకు ప్రతి చర్య) యొక్క ప్రక్షేపము భ్రాంతి రూపంలో కలగవచ్చు, ముఖ్యంగా శ్రవ్య సంబంధమైన భ్రాంతులు. ఆమోదం పొందుతూ ఉన్న ఇటీవలి పరికల్పన అతి క్రియాశీల టాప్ డౌన్ ప్రాసెసింగ్ లేదా బలమైన దృష్టి జనితమైన ఆకాంక్షల యొక్క పాత్రకు సంబంధించింది. అవి అయత్నకృతమైన పర్సెప్షుఅల్ అవుట్పుట్ (దృష్టి సంబంధమైన ఉత్పాదన) ను ఉత్పత్తి చేస్తాయి.[17]

చికిత్సలు[మార్చు]

చాలా రకాలైన భ్రాంతులకి కొన్ని రకాల చికిత్సలు మాత్రమే ఉన్నాయి. అయితే మనోరోగం వల్ల కలిగే భ్రాంతులకి మనోవిజ్ఞాన వైద్యుడిని (సైకాలజిస్ట్) లేదా మనో రోగ చికిత్సా వైద్యుడిని (సైకియాట్రిస్ట్) సంప్రదించాలి. దాని చికిత్స ఆ వైద్యుల పరిశీలనల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోగాలకు చికిత్స చేయడానికి ఆంటీ సైకోటిక్ మందులు వాడవచ్చు.[18] ఇతర రకాల భ్రాంతులకు ఏదో ఒక శాస్త్రీయమైన పద్ధతి చికిత్సగా అవలంబించా వచ్చని రుజువు కాలేదు, యదార్థమైన సాక్ష్యాలు లేవు. తగినంతగా నిద్ర పోవటం, ఆరోగ్యంగా జీవించడం, పని ఒత్తిడిని అధిగమించడం, భ్రాంతి కలిగించే మందుల నుండి దూరంగా ఉండడం వల్ల భ్రాంతులను వాటి ప్రభావాన్నీ నివారించవచ్చు. అన్ని రకాల భ్రాంతులకు వైద్యులని సంప్రదించి వారికి నిర్దిష్టమైన రోగ లక్షణాలు వివరించడం మంచిది.

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

1895[19]లో జరిగిన అధ్యయనం ప్రకారం సుమారు 10 శాతం జనాభాకి భ్రాంతులు అనుభవంలోకి వచ్చాయి. 1996-99 లో 13000 మందిలో[20] జరిపిన సర్వేక్షణ ప్రకారం 39 శాతం మనుషులకి భ్రాంతికి సంబంధించిన అనుభవాలు కలిగినట్లు తెలిసింది. అందులో 27 శాతం మంది రోగాలకు, మందుల వాడకానికీ అతీతంగా పగటి పూట భ్రాంతులకి లోనయ్యారు. ఈ సర్వేక్షనని బట్టి ఆల్ఫాక్టరీ (వాసన) మరియు గస్టేటరీ (రుచి) కి సంబంధించిన భ్రాంతులు సర్వ సాధారణంగా ఉంటాయని తెలుస్తోంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

]]

మరింత చదవడానికి[మార్చు]

 • జాన్సన్ FH (1978).
ది అనాటమీ ఆఫ్ హాలూసినేషన్స్. షికాగో : నెల్సన్ - హాల్ కం. ISBN ౦-88229-155-6.
 • బెంటాల్ RP, స్లేడ్ PD (1988 ). సెన్సరి డిసెప్షన్ : ఎ సైంటిఫిక్ అనాలిసిస్ అఫ్ హాలూసినేషన్. లండన్ : క్రూం హెం. ISBN O-7099-3961-2
 • ఎల్మన్ FH (1978). హాలూసినేషన్స్ : ది సైన్స్ ఆఫ్ ఇడియోసిన్క్రాటిక్ పర్సె ప్షన్ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (ఎపిఎ). ISBN 1-4338-0311-9.

టిప్పనములు[మార్చు]

 1. Leo P. W. Chiu (1989). "Differential diagnosis and management of hallucinations" (PDF). Journal of the Hong Kong Medical Association. 41 (3): 292–7.
 2. చెన్ E . అండ్ బెర్రిఆస్ G.E. (1996) రికగ్నిషన్ ఆఫ్ హాలూసినేషన్స్ : ఎ మల్టిడైమెన్షనల్ మాడల్ అండ్ మెథడలోజి సైకోపాతాలజి 29: 54-63.
 3. విజుఅల్ హాలూసినేషన్స్ : డిఫరెన్షిఅల్ దైఆగ్నసిస్ అండ్ ట్రీట్మెంట్ (2009)
 4. "Medical dictionary". Cite web requires |website= (help)
 5. Young, Ken (July 27, 2005). "IPod hallucinations face acid test". Vnunet.com. మూలం నుండి 2007-12-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-10. Cite web requires |website= (help)
 6. "Rare Hallucinations Make Music In The Mind". ScienceDaily.com. August 9, 2000. Retrieved 2006-12-31. Cite web requires |website= (help)
 7. ఇంగ్మన్, బిర్క్ ; రాయిటర్, మైక్: స్పాన్టెనిఅస్ పర్సెప్షన్ ఆఫ్ మెలోడీస్ - హాలూసినేషన్ ఆర్ ఎపిలేప్సి? నార్వన్హీల్కుండ్ 2009 Apr 28: 217-221. ISSN 0722-1541
 8. "ఫాన్టం స్మెల్ల్స్". మూలం నుండి 2010-10-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-12. Cite web requires |website= (help)
 9. Wolberg FL, Zeigler DK (1982). "Olfactory Hallucination in Migraine". Archives of Neurology. 39 (6): 382.
 10. Sacks, Oliver (1986). Migraine. Berkeley: University of California Press. pp. 75–76. ISBN 9780520058897.
 11. బెరిఆస్ G E (1982) టాక్టైల్ హాలూసినేషన్స్. జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రి 45: 285-293
 12. 12.0 12.1 12.2 12.3 Horowitz MJ (1975). "Hallucinations: An Information Processing Approach". In West LJ, Siegel RK (సంపాదకుడు.). Hallucinations; behavior, experience, and theory. New York: Wiley. ISBN 0-471-79096-6.
 13. 13.0 13.1 13.2 13.3 13.4 Manford M, Andermann F (1998). "Complex visual hallucinations. Clinical and neurobiological insights". Brain. 121 ((Pt 10)): 1819–40. doi:10.1093/brain/121.10.1819. PMID 9798740. Unknown parameter |month= ignored (help)
 14. మార్క్ డేర్ర్ (2 006) మారిలిన్ అండ్ మి, "ది న్యూ యార్క్ టైమ్స్" ఫిబ్రవరి 14, 2006
 15. Engmann, Birk (2008). "Phosphenes and photopsias - ischaemic origin or sensorial deprivation? - Case history". Z Neuropsychol. (German లో). 19 (1): 7–13. doi:10.1024/1016-264X.19.1.7.CS1 maint: unrecognized language (link)[permanent dead link]
 16. Kapur S (2003). "Psychosis as a state of aberrant salience: a framework linking biology, phenomenology, and pharmacology in schizophrenia". Am J Psychiatry. 160 (1): 13–23. doi:10.1176/appi.ajp.160.1.13. PMID 12505794. Unknown parameter |month= ignored (help)
 17. Grossberg S (2000). "How hallucinations may arise from brain mechanisms of learning, attention, and volition". J Int Neuropsychol Soc. 6 (5): 583–92. doi:10.1017/S135561770065508X. PMID 10932478. Unknown parameter |month= ignored (help)
 18. హాలూసినేషన్స్: ట్రీట్మెంట్: ఇన్ఫర్మేషన్ ఫ్రం ఆన్సర్స్.కాం ఆన్సర్స్.కాం: వికీ క్యు అండ్ ఎ కంబైన్డ్ విత్ ఫ్రీ ఆన్లైన్ డిక్షనరీ, తేసారాస్, అండ్ ఎంసైక్లోపీడియాస్. http : //www.ఆన్సర్స్.కాం/టాపిక్/హాలూసినేషన్స్-ట్రీట్మెంట్(ఆక్సేస్ద్ జాన్యూఅరి 20, 2010).
 19. Francis Nagaraya, Myers FWH; et al. (1894). "Report on the census of hallucinations". Proceedings of the Society for Psychical Research. 34: 25–394. Explicit use of et al. in: |author= (help)
 20. Ohayon MM (2000). "Prevalence of hallucinations and their pathological associations in the general population". Psychiatry Res. 97 (2–3): 153–64. doi:10.1016/S0165-1781(00)00227-4. PMID 11166087. Unknown parameter |month= ignored (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Bipolar disorder మూస:Cognition, perception, emotional state and behaviour symptoms and signs

"https://te.wikipedia.org/w/index.php?title=భ్రాంతి&oldid=2809550" నుండి వెలికితీశారు