మంకీపాక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంకీపాక్స్
4 సంవత్సరాల బాలికలో మంకీపాక్స్ వ్యాధి దద్దుర్లు
Specialtyఇన్ఫెక్షియస్ డిసీజ్
Symptomsజ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, పొక్కులు, దద్దుర్లు
Usual onsetఎక్స్పోజర్ తర్వాత 5-21 రోజులు
Duration2 నుండి 4 వారాలు
Causesమంకీపాక్స్ వైరస్
Diagnostic methodవైరల్ DNA కోసం పరీక్ష
Differential diagnosisచికెన్‌పాక్స్, మశూచి
Preventionమశూచి వ్యాక్సిన్
Medicationటెకోవిరిమాట్
Frequencyఅరుదైన
Deaths3.6% వరకు (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్),
10.6% వరకు (కాంగో బేసిన్ క్లాడ్, చికిత్స చేయబడలేదు)

మంకీపాక్స్‌ (ఆంగ్లం: monkeypox) ఇది 2022లో గుర్తించబడిన వ్యాధి. మొదటిసారిగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2022 మే 6న మంకీపాక్స్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారించబడింది. అయితే అప్పటికే ఈ వ్యాధి నైజీరియాలో వ్యాప్తి చెందింది. నైజీరియాకు వెళ్ళిన బ్రిటిష్ నివాసికి 2022 ఏప్రిల్ 29న మంకీపాక్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలను కనుగొనడం జరిగింది. అతను మే 4న యునైటెడ్ కింగ్‌డమ్‌కు తిరిగి వచ్చాడు. అందుకని మంకీపాక్స్ వ్యాప్తి చెందుతున్న దేశంగా తొలి కేసు ఇక్కడే నమోదుఅయింది.[1]

యునైటెడ్ కింగ్‌డమ్‌లో మంకీపాక్స్ వ్యాధికి మూలాలు తెలియదు. 2022 మే నెల మధ్యలో లండన్ ప్రాంతంలో ఈ వ్యాధి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతున్నట్టు తెలిసింది.[2] నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌తో పాటు స్కాట్లాండ్‌[3]లో కూడా వైరస్ కేసులు నమోదయ్యాయి.[4] UK వెలుపల ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లో కేసులు నిర్ధారించబడ్డాయి.[5][6][7]

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ వైరల్ వ్యాధి. స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 6 రోజుల నుంచి 13 రోజులు ఉంటుంది. మరికొంతమందిలో 5 నుంచి 21 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది.

మంకీపాక్స్ వైరస్

[మార్చు]

ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్‌ వైరస్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అని పేరు వచ్చింది. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్‌ కనిపించింది. మంకీపాక్స్ వ్యాధికి కారణమైన ఈ మంకీపాక్స్ వైరస్ (MPV లేదా MPXV) అనేది డబుల్ స్ట్రాండెడ్ DNA జూనోటిక్ వైరస్. అనగా ఇది మానవులు, ఇతర జంతువులలో ఈ వ్యాధికి కారణమవుతుంది. ఇది పోక్స్విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. వేరియోలా (VARV), కౌపాక్స్ (CPX), వ్యాక్సినియా (VACV) వైరస్‌లను కలిగి ఉన్న మానవ ఆర్థోపాక్స్ వైరస్‌లలో ఇది ఒకటి. అయితే ఇది మశూచికి కారణమయ్యే వేరియోలా వైరస్‌కు ప్రత్యక్షంగా సంబంధించినది కాదు. మంకీపాక్స్ వ్యాధి మశూచిని పోలి ఉంటుంది, కానీ తక్కువ దద్దుర్లు ఉంటాయి. మరీ అంత ప్రాణాంతకం కాదు.[8][9][10]

టీకా

[మార్చు]

మశూచి (smallpox) వ్యాక్సిన్ మంకీపాక్స్‌కు 85 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది.[11] యుకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలిగిన వారికి ఈ వ్యాక్సీన్ (Imvanex) ని పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్‌గా ఉపయోగించడం ప్రారంభించింది.[12] అయితే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని ఈ టీకా ప్రభావవంతంగా అరికట్టగలదని ఎటువంటి ఆధారాలులేవు.[13]

చికిత్స

[మార్చు]

మంకీపాక్స్ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ వాడతారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా పనిచేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు.

భారత్ కి ముప్పు

[మార్చు]

మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. 2022 మే మొదటి వారంలో బయటపడి రెండు వారాల వ్యవధిలోనే 14 దేశాలకు మంకీపాక్స్ పాకింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు సంక్రమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కలవరపెడుతోంది. ప్రస్తుతానికి దేశంలో మంకీపాక్స్‌ సోకినట్లు ఎలాంటి నివేదికలు లేనప్పటికి, అనుకోని పరిస్థితి తలెత్తితే ఎదుర్కోడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తం అవుతున్నాయి.[14]

మూలాలు

[మార్చు]
 1. "Monkeypox – United Kingdom of Great Britain and Northern Ireland". World Health Organization. 16 May 2022. Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
 2. Pinkstone, Joe (17 May 2022). "Monkeypox 'spreading in sexual networks'". The Telegraph. Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
 3. "First case of monkeypox confirmed in Scotland". Retrieved 23 May 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "We've detected 2 additional cases of #Monkeypox, one in London and one in the South East of England". Twitter (in ఇంగ్లీష్). Retrieved 20 May 2022.
 5. "Monkeypox confirmed in Melbourne and Sydney". Australian Broadcasting Corporation. 20 May 2022. Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
 6. Efrati, Ido. "Israel Confirms First Case of Monkeypox Virus". Haaretz (in ఇంగ్లీష్). Retrieved 21 May 2022.
 7. "Morocco Detects Three Suspected Monkeypox Virus Cases". Morocco World News. Retrieved 23 May 2022.
 8. Breman JG, Kalisa R, Steniowski MV, Zanotto E, Gromyko AI, Arita I (1980). "Human moneypox, 1970-79". Bull World Health Organ. 58 (2): 165–182. PMC 2395797. PMID 6249508.
 9. Alkhalil Abdulnaser; Hammamieh Rasha; Hardick Justin; Ichou Mohamed A; Jett Marti; Ibrahim Sofi (2010). "Gene expression profiling of monkeypox virus-infected cells reveals novel interfaces for host-virus interactions". Virology Journal. 7: 173. doi:10.1186/1743-422X-7-173. PMC 2920256. PMID 20667104.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
 10. Shchelkunov SN, Totmenin AV, Safronov PF, Mikheev MV, Gutorov VV, Ryazankina OI, Petrov NA, Babkin IV, Uvarova EA, Sandakhchiev LS, et al. (2002). "Analysis of the monkeypox virus genome". Virology. 297 (2): 172–194. doi:10.1006/viro.2002.1446. PMID 12083817.
 11. Liu, Angus (2022-05-19). "As monkeypox cases emerge in US and Europe, Bavarian Nordic inks vaccine order". Fierce Pharma (in ఇంగ్లీష్). Retrieved 2022-05-23.
 12. Rigby, Jennifer (2022-05-19). "Britain offers smallpox shot as monkeypox cases spread in Europe". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2022-05-23.
 13. Kozlov, Max (2022-05-20). "Monkeypox goes global: why scientists are on alert". Nature (in ఇంగ్లీష్). doi:10.1038/d41586-022-01421-8.
 14. "ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మంకీపాక్స్‌.. ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసిన బీఎంసీ". web.archive.org. 2022-05-24. Archived from the original on 2022-05-24. Retrieved 2022-05-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)