మంగని లాల్ మండల్
| మంగని లాల్ మండల్ | |||
బీహార్ రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 జూన్ 19 | |||
| ముందు | జగద నంద్ సింగ్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2009 — 2014 | |||
| ముందు | దేవేంద్ర ప్రసాద్ యాదవ్ | ||
| తరువాత | బీరేంద్ర కుమార్ చౌదరి | ||
| నియోజకవర్గం | ఝంఝార్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1948 జూలై 1 మధుబని జిల్లా , బీహార్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతాదళ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మంగని లాల్ మండల్ (జననం 1 జూలై 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝంఝార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మంగని లాల్ మండల్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝంఝార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి దేవేంద్ర ప్రసాద్ యాదవ్‌పై 72709 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బీరేంద్ర కుమార్ చౌదరి చేతిలో 55408 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మంగని లాల్ మండల్ 2025 జూన్ 19న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Mangani Lal Mandal poised to take charge as Bihar RJD chief" (in Indian English). The Hindu. 14 June 2025. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.
- ↑ "Former MP Mangani Lal Mandal Elected Bihar RJD President Unopposed" (in ఇంగ్లీష్). ETV Bharat News. 14 June 2025. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.
- ↑ "Key EBC face set to take over as new Bihar RJD chief: Who is Mangani Lal Mandal?" (in ఇంగ్లీష్). The Indian Express. 14 June 2025. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.