మంగళగిరి శ్రీనివాసులు
మంగళగిరి శ్రీనివాసులు | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | మంగళగిరి శ్రీనివాసులు 1985 జనవరి 10 బోయిన్‌పల్లి, మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా |
వృత్తి | సహాయ ఆచార్యుడు |
పౌరసత్వం | భారతీయుడు |
సంతానం | 2 కుమారులు |
మంగళగిరి శ్రీనివాసులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన, కవి, రచయిత, సాహిత్య పరిశోధకుడు,విమర్శకుడు. వృత్తిరీత్యా పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతను సాహిత్యానికి సంబంధించి జాతీయ,అంతర్జాతీయ సదస్సులలో 30కి పైగా పత్ర సమర్పణలు చేశాడు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి.సెమినార్లలో, అనేక కవిసమ్మేళనాలలో పాల్గొన్నాడు. ఇతని కవితలు, గేయాలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక,వార్షిక పత్రికలలో వెలువడ్డాయి.
కుటుంబ నేపథ్యం[మార్చు]
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం , బోయిన్‌పల్లి ఇతని స్వగ్రామం. 1985 జనవరి 10 వ తేదిన జన్మించాడు. తల్లిదండ్రులు మంగళగిరి శంకర్ బాయి, మంగళగిరి రామచందర్ జీ. ఈ దంపతులకు ఇతను 5వ సంతానం.
విద్యాబ్యాసం[మార్చు]
ప్రాథమిక విద్య బోయిన్ పల్లి లో,ఉన్నత పాఠశాల విద్య మిడ్జిల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మిడ్జిల్‌లో, డిగ్రీ విద్య కల్వకుర్తి లో,తెలుగు పండిత శిక్షణ ఉపాధ్యాయ విద్యను SVTPT మిర్యాలగూడలో, వీటితో పాటు స్నాతకోత్తర విద్య ఎం.ఏ తెలుగును ఉస్మానియ విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశాడు. UGC NET కూడా సాధించాడు.
సాహిత్య పరిశోధన[మార్చు]
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'ఆంధ్ర సారస్వత పరిషత్తు - తెలుగు భాషా సాహిత్య సేవ ' (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేసి
2018లో డాక్టరేట్ పట్టాను పొందాడు. ఇతను పలు సాహిత్య సాంస్కృతిక సంస్థలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.
ఉద్యోగ జీవితం:[మార్చు]
తెలుగు పండిత శిక్షణ అనంతరం తెలుగు ఉపాధ్యాయుడిగా 2009-2010లో నవ్య గ్రామర్ ఉన్నత పాఠశాలలో , హైమవతి ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశాడు. ఇతనికి పోటీపరీక్షలకు తెలుగు బోధకుడిగా పలు విద్యాసంస్థలలో పనిచేసి అనుభవం ఉన్నది. ప్రస్తుతం స్నాతకోత్తర కేంద్రం,గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు(సి)గా పనిచేస్తున్నాడు.
రచనలు[మార్చు]
ఇతను కవితలు, కథలు, పాటలు, పద్యాలు, వ్యాసాలు మొదలగు ప్రక్రియలలో రచనలు చేశాడు. ఇప్పటికి నాలుగు పుస్తకాలు ముద్రించాడు. అవి
1.ఆరెకటిక కులగోత్ర వృత్తి పురాణం[1]
2.సంగడి (సాహిత్య వ్యాసాల సంపుటి)[2]
3.ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా సాహిత్య సేవ (సిద్ధాంత గ్రంధం)[3]
4.వివేచన (సాహిత్య వ్యాస సంపుటి)[4]
పురస్కారాలు[మార్చు]
కులసాహిత్యరత్న 2015,
బంగి బాలయ్య స్మారక సాహిత్య అవార్డు 2016,
ఉత్తమకవి సత్కారం 2016,
జాతీయ ఎక్సలెన్స్ అవార్డ్ కటిక్ శిరోమణి 2016,
ప్రపంచ తెలుగు మహాసభలు కవిపండిత సన్మానం 2017,
ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం 2018 ,
సేవభారతి పురస్కారం 2019,
మూలాలు[మార్చు]
- ↑ ఆరెకటిక కులగోత్ర వృత్తి పురాణం-మంగళగిరి శ్రీనివాసులు, ఆకాష్ ప్రచురణలు,ఆగస్టు,2015
- ↑ సంగడి-మంగళగిరి శ్రీనివాసులు, ఆకాష్ ప్రచురణలు,ఫిబ్రవరి,2019
- ↑ ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా సాహిత్య సేవ-మంగళగిరి శ్రీనివాసులు, అపర్ణా ప్రచురణలు, జనవరి,2020
- ↑ వివేచన-మంగళగిరి శ్రీనివాసులు, బాలాజీ ప్రచురణలు,జూలై,2021